👉ఒకప్పుడు కేశ సౌందర్యంలో మన భారత స్త్రీ మరియూ పురుషులు ప్రథమస్థానంలో ఉండేవారు.
👉కానీ కాలం మారిన తరువాత జీవనశైలి మారింది. క్రమంగా స్వదేశంలో విదేశీ రసాయన పదార్థాల వాడకం ఎక్కువ అయింది.
👉ఒకప్పుడు కుంకుడుకాయ, శీకాయ, మంగకాయ, చీకిరేణి పొడి, నల్ల రేగడి మన్ను లాంటి వాటితో తల స్నానం చేసే పద్ధతులను అనుసరించిన భారతీయులు క్రమ క్రమంగా విదేశీ షాంపూలు, సబ్బుల వాడకానికి బాగా అలవాటు పడ్డారు.
👉 వెంట్రుకలకు బలం కలిగించే ఆహారం తీసుకోవడం పూర్తిగా పక్కన పడేశారు.
👉జీవన విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం, సరైన ఆహార విధానాలు పాటించలేక పోవడం, వ్యాయామాలు అనే మాటే లేకపోవడం, మద్యపానం మరియు దూమపాన అధికంగా సేవించడం లాంటివి అలవాటు అయ్యాయి.
👉ఫలితంగా అతి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం, బట్టతలలు, ఉన్న జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
👉ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం మేము కొన్ని నియమాలను క్రింద ఇవ్వడం జరిగింది. ఆచరించి మీ కేశాలను ఆరోగ్యంగా చూసుకోగలరని మనవి.
✍️ *వెంట్రుకల ఆరోగ్యానికి ఏ ఆహారపదార్థాలు తీసుకోవాలి.*
👉 వంటల్లో మేలురకమైన నువ్వులనూనెని వాడాలి.
👉నల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, నల్ల బెల్లము, త్రిఫల రసాయణము కలిపి స్వీట్ లాగా తయారు చేసిన 'కేశామృతం' రెండు పూటలా ఒక చెంచా మోతాడుతో తినాలి.
👉వారనికి ఒకటి లేదా రెండు సార్లు గుంట గలగర ఆకుతో పచ్చడి చేసి తినాలి.
👉మెంతికూర, వెల్లుల్లి, సునాముఖి, నేల తంగేడు, పాలకూర మొదలైనవి బాగా తినాలి.
✍️ *ఇంట్లో తయారు చేసుకునే ఆయుర్వేద షాంపూ:*
కొత్త కుంకుడుకాయల పై పెచ్చుల పొడి 100గ్రా, శీకాయల పొడి 100గ్రా, ఉసిరికాయల పొడి 100గ్రా, మారేడు పండు గుజ్జు పొడి 100గ్రా, వీటిని అన్ని కలిపి నిలువ ఉంచుకోవాలి.
✍️ *వాడే విధానం:*
👉ఒక పెద్ద గ్లాసు వేడి నీటిలో మగవారికి మూడు చెంచాల పొడి, ఆడవారికి అయితే ఆరు చెంచాల పొడి వేసి అందులో ఒక నిమ్మపండు రసం పిండి మూత పెట్టి మూడు గంటలపాటు నిలువ పెట్టి ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తలకు పట్టిస్తూ స్నానం చేయాలి.
👉వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఇలా చేస్తూ ఉంటే పై పదార్థాల జీవగుణం కేశ మూలముల లోకి చొచ్చుకుని పోయి వెంట్రుకల కుదుళ్లను గట్టిపరుస్తుంది.
👉అంతేకాక తలలో కురుపులు, చుండ్రు, పుండ్లు, దురద మొదలైన సమస్యలను నివారిస్తుంది.
👉వెంట్రుకలకు చక్కటి నునుపు, మెరువు, నిగారింపు, దృఢత్వము ఇచ్చి ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
✍️ *లిక్విడ్ హెర్బల్ షాంపూ:*
👉కుంకుడుకాయల పొడి, గుంటగలగర ఆకు పొడి, నిమ్మకాయ చెక్కలు, టీ పొడి, రేగు ఆకుల పొడి అన్ని కలిపి ఒక గ్లాసు వేడి నీళ్లలో వేసి బాగా గిలకొట్టి వడగట్టి ఆ నీటిని షాంపూగా వాడుకోవచ్చు.
✍️ *తెల్ల వెంట్రుకలు లేకుండా నల్ల వెంట్రుకలు రావడానికి:*
👉కరక్కాయ, ఉసిరికాయ, తాడికాయ, లోహ చూర్ణం ఇవన్నీ సమ భాగాలుగా తీసుకొని నీటితో కలిపి రసంగా చేయాలి.
👉ఆ రసానికి సమ తూకంగా నల్ల నువ్వుల నూనె కలపాలి.
👉తరువాత ఆ రసం మరియూ ఆ నూనె ఎంత తూకం ఉందో అంతే తూకంతో పచ్చి గుంటగలగరాకు రసంతో కలిపి బాగా తిప్పాలి.
👉ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక మట్టి పాత్రలో పోసి కట్టెల పొయ్యి మీద సన్నటి మంట మీద మరిగించాలి.
👉క్రమంగా కుండలో ఉన్న నీరు అంతా ఇంకిపోయి ఆయిల్ మాత్రమే మిగులుతుంది.
👉ఆ నూనెని దించి వడపోసి వచ్చిన ఆయిల్ ని కుండలో పోసి పైన మూత పెట్టి బంకమట్టితో మెంతి బంధనం వేసి అది ఆరిన తర్వాత ఒక గుంత తవ్వి అందులో ఈ కుండను నెలరోజుల పాటు పాతి పెట్టాలి.
👉ఆ తరువాత ఆ ఆయిల్ ని తలకు బాగా పట్టించి మర్దనా చేయాలి. మూడు గంటల తర్వాత త్రిఫల కషాయం తో తలంటుకుని స్నానం చేయాలి.
👉ఇలా చేస్తూ ఉంటే క్రమంగా తెల్ల వెంట్రుకలు నల్లబడి, నల్ల వెంట్రుకలు మళ్ళీ తెల్లబడకుండా నల్లగా నిగనిగలాడుతాయి.
✍️ *కేశ సౌందర్య తైలం:*
👉మల్లెపూలు 25 గ్రా, మరువము 25 గ్రా, దవనము 25 గ్రా, మాచిపత్రి 25 గ్రా, గుంటగలగర సమూలం 50 గ్రా, గాడిదగడపాకు సమూలం 50 గ్రా, చందనం 10 గ్రా ఇవన్నీ కలిపి మెత్తగా నూరి దానికి 300 గ్రా నువ్వులనూనెని కలిపి కట్టెలపొయ్యి మీద సన్న మంటతో గంట గంటన్నర సేపు మరిగించాలి.
👉ఈ మిశ్రమం చల్లారిన తర్వాత వస్త్రంతో వడగట్టాలి.
👉ఈ ఆయిల్ ని తలకి పట్టిస్తూ ఉంటే కేశాలు చాలా ఒత్తుగా అందంగా ఉంటాయి. ఏ ఆయిల్ ని శరీరానికి కి పట్టిస్తే శరీర దుర్గంధం పోయి మంచిగా ఉంటుంది.
*పై సమస్యతో బాధపడుతున్న మిత్రులకు మా వద్ద అద్భుతమైన పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.*
No comments:
Post a Comment