*విజ్ఞప్తి:* అందరూ బాగుండాలని, పోస్టు ఎక్కువగా వున్నా... మిత్రులు ఓపికతో చదివి అర్థం చేసుకుంటారాని భావించి అందరికీ అర్థం అయ్యేలా పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. దయచేసి ఓపికతో మొత్తం చదివి అర్థం చేసుకుని , ఈ చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాము.
💊 *ఆడపిల్లలు సకాలంలో ఋతుక్రమం అవడానికి ఆయుర్వేద ఔషధాలు:*
✍️ *ఆయుర్వేద ఔషధం -1*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్ధాలు:-*
👉పల్లేరు కాయల చూర్ణం అర టీస్పూన్,
👉నల్లనువ్వుల చూర్ణం అరటీస్పూన్,
👉 బెల్లం అర టీస్పూన్,
👉ఎండు కొబ్బరి తురుము అరటీస్పూన్.
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉ఒక గిన్నెలో పైవాటిని తీసుకోండి. వీటిని బాగా కలపి నిమ్మకాయ సైజు వుండ చేసి తినిపించండి. ఇలాకొంత కాలం చేస్తే ఆడపిల్లలు సకాలంలో ఋతు క్రమం అవుతారు.
✍️ *ఆయుర్వేద ఔషధం- 2*
సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-
👉మందార పువ్వుల ముద్ద 1 టీస్పూన్,
👉బెల్లం తురుము 1 టీస్పూన్,
👉నల్లనువ్వుల ముద్ద 1 టీస్పూన్.
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉ఒక గిన్నెలో వీటిని తీసుకోని, బాగా కలిపి, నిమ్మకాయ సైజు వుండ చేయండి. బియ్యం కడుగు నీళ్లతో ఇవ్వండి.
ఇలా కొంత కాలం చేస్తే ఆడపిల్లలు సకాలంలో ఋతుక్రమం అవుతారు.
✍️ *ఆయుర్వేద ఔషధం - 3*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-*
👉మోదుగ గింజల చూర్ణం అరటీస్పూన్,
👉బెల్లం టీస్పూన్.
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉ఒక చిన్న రోలులో 1 టీస్పూన్ బెల్లాన్ని, అర టీస్పూన్ మోదుగ గింజల చూర్ణాన్ని కలిపి నూరండి.
వుండగా చేసి మింగండి..
👉దీనిని క్రమం తప్పకుండా కొంతకాలం తీసుకుంటే అడపిల్లలు త్వరలోనే ఋతుక్రమం అవుతారు.
💊 *బహిష్టులో అపక్రమం, బహిష్టు ఆలస్యం కావటం:*
✍️బహిష్టులో అపక్రమంకు కారణాలు:
👉ఒత్తిడి
👉శారీరక బరువు తక్కువగా ఉండటం.
👉మరీ ఎక్కువగా వ్యాయామం చేయటం
👉pcod
👉థైరాయిడ్ గ్రంథి పనితీరులో తేడాలు.
👉 త్వరగా రజోనివృత్తి (మెనోపాజ్) జరగటం.
👉గర్భాశయంలో నిర్మాణపరమైన లోపాలు.
👉కుటుంబ ఇతివృత్తం.
👉ఎథ్లెటిక్స్ ట్రయినింగ్.
👉ఆహార సేవనకు సంబంధించిన వ్యాధులు (ఎవరెక్సియా) ఉండటం.
✍️ *ఆయుర్వేద ఔషధం - 1*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-*
👉మందార పువ్వుల ముద్ద ఒక టేబుల్ స్పూన్ (4-5 తాజా మందార పువ్వులను తెచ్చి, కడిగి, ముద్దగా నూరాలి).
👉అరగ్లాసు నీళ్లు (అనుపానానికి),
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉1 టేబుల్ స్పూన్ మందార పువ్వుల ముద్దను ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లతో తీసుకోండి.
👉బహిష్టు వస్తుందనుకున్న తేదికి 5-7 రోజుల ముందునుంచి వాడటం మొదలెట్టండి.
👉మందారలో యాంటి ఈస్ట్రోజన్ అంశాలుంటాయి. ఇవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ మధ్య సమతుల్యతను కాపాడుతాయి.
👉దీంతో బహిష్టుక్రమం గాడిలో పడుతుంది.
✍️ *ఆయుర్వేద ఔషధం - 2*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-*
👉ఉడకబెట్టిన కలబంద గుజ్జు 1 టీస్పూన్ (కలబంద ఆకు మీద తోలు తొలగించి, గుజ్జును గోధుమ రంగులోకి మారేంత వరకూ ఉడికించి చల్లార్చి పేస్టుగా చేయండి.)
👉యాపిల్ జ్యూస్ లేదా నీళ్లు 1 కప్పు, (అనుపానానికి)
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉ఉడికించిన 1 టీస్పూన్ కలబంద గుజ్జును ఖాళీ కడుపుతో అరగ్లాసు నీళ్లకు కలిపిగాని లేదా యాపిల్ జ్యూసికి కలిపిగాని తాగండి.
👉ఇది కాస్త చేదుగా ఉంటుంది..దీనికి విరేచనాలను కలిగించే లక్షణం ఉంటుంది. అందుకే డోస్ ని అవసరాన్ని బట్టి. మార్చుకోండి.
👉దీనిని బహిష్టు వస్తుందనుకున్న తేదీకి 5-7 రోజుల ముందునుంచి మొదలెట్టి తీసుకోండి.!
✍️ *ఆయుర్వేద ఔషధం - 3*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్ధాలు:-*
👉తులసి ఆకుల రసం 1 టీస్పూన్
👉తేనె 1 టీస్పూన్
👉మిరియాలు 1 చిటికెడు.
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉ఒక టీస్పూన్ తులసి ఆకుల రసానికి ఒక టీస్పూన్ తేనెను కలపండి. దీనికే ఒక చిటికెడు మిరియాల పొడిని కలపి తీసుకోవాలి.
👉 ఇలా రెండు పూటలా తయారుచేసి తీసుకోండి.
👉ఈ ఔషధాన్ని ఒకటి రెండు నెలలు వరుసగా తీసుకోండి... దీంతో బహిష్టు క్రమం గాడిలో పడుతుంది.
✍️ *జాగ్రత్తలు:*
👉ఒత్తిడిని తగ్గించుకోండి.
👉 పనిని ప్రణాళిక వేసుకొని చేసుకోండి.
👉అర్ధశక్తిగా వ్యాయామం చేయండి.
👉మంచి ఆహారం తీసుకోండి.
👉 తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోండి.
👉మలబద్దకం లేకుండా చూసుకోండి.
👉ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహారాలు మానండి.
💊 *బహిష్టు స్రావాధిక్యత:*
✍️ *లక్షణాలు:-*
👉ప్రతి గంటకూ ఒక శానిటరీ ప్యాడ్ ని మార్చాల్సి రావటం.
👉రాత్రిపూట నిద్ర మేల్కొని ప్యాడ్ ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడటం.
👉ఒక వారానికి మించి బ్లీడింగ్ జరగటం.
👉బహిష్టు రక్తంలో రక్తపు గడ్డలు పడటం.
👉రక్తహీనత లక్షణాలు కనిపించటం.
👉రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడటం.
✍️ *కారణాలు:-*
👉హార్మోన్ తేడాలు,
👉అండాశయాల పనితీరులో మార్పులు.
👉గర్భాశయంలో కంతులు పెరగటం.
👉గర్భాశయంలో పిలకలు పెరగటం.
👉ఎడినోమయోసిస్ (గర్భాశయం లోపలి పొర గోడల్లోకి పెరగటం)
👉సంతాననిరోధక సాధనం అమర్చటం.
👉గర్భధారణలో ఇక్కట్లు.
👉మందుల వాడకం.
👉థైరాయిడ్ సమస్యలు.
👉ఎండోమెట్రోయోసిస్.
✍️ *ఆయుర్వేద ఔషధం - 1*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్ధాలు:-*
👉అత్తిపత్తి (టచ్మీనాట్) మొక్క ఆకుల రసం 2 టేబుల్ స్పూన్లు (ఆకులను కడిగి, ముద్దగా దంచి, గుడ్డలో వేసి రసం పిండండి)
👉తేనె 1 టేబుల్ స్పూన్
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉2 టేబుల్ స్పూన్ల తాజా అత్తిపత్తి ఆకుల రసానికి అవసరాన్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తీసుకోండి.
👉దీనిని రోజుకు 3 సార్లుగా 3 - 4 రోజులపాటు తీసుకోండి.
👉దీంతో అధిక బహిష్టుస్రావం ఆగుతుంది.
✍️ *ఆయుర్వేద ఔషధం - 2*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-*
👉బాదం గింజల పేస్టు ఒక టీస్పూన్ (రాత్రంతా చన్నీళ్లలో నానబెట్టి, పై తోలు తీసి గ్రైండ్ చేయండి.)
👉మారేడు ఆకుల ముద్ద ఒక టీస్పూన్.
👉 తగినంత తేనె (అనుపానానికి).
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉ఒక చిన్న బౌల్ లో టీస్పూన్ బాదం గింజల పేస్టును, టీస్పూన్ మారేడు ఆకుల పేస్టును, ఒక టీస్పూన్ తేనెనూ కలిపి తీసుకోండి.
👉తరువాత ఒక కప్పు వేడి పాలు తాగండి.
👉ఇలా ప్రతి రోజూ ఉదయం తీసుకోండి.!
✍️ *ఆయుర్వేద ఔషధం - 3*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-*
👉నాగకేసరాలు చూ. 10గ్రా
👉ఉసిరి వలుపు చూ. 10 గ్రా
👉తుమ్మచెక్క చూ. 10 గ్రా
👉రావిచెక్క చూ. 10 గ్రా
👉మిశ్రీ 80గ్రా
👉బియ్యం కడుగు నీళ్లు
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉ఒక పాత్రలో వీటిని వరుసగా తీసుకొని బాగా కలపండి.
👉దీనిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి.
👉దీని మోతాదు 3 గ్రా.
👉అనుపానం బియ్యం కడుగు నీళ్లు.
👉అరటీస్పూన్ చూర్ణాన్ని అరకప్పు బియ్యం కడుగు నీళ్లతో కలిపి తీసుకోండి.
👉ఇలా మూడు వారాలపాటు తీసుకోండి.
✍️ *జాగ్రత్తలు:-*
👉బాగా విశ్రాంతి తీసుకోండి.
👉యాస్ప్రిన్ వంటి మందులు మానేయండి.
👉 కాళ్లవైపు ఎత్తులో పెట్టి పడుకోండి.
👉అరటి పువ్వును కూరగా వండుకొని తినండి.
👉ధనియాల కషాయం తాగండి.
💊 *రొమ్ముల్లో అసౌకర్యం, నొప్పి:-*
✍️ *కారణాలు:-*
👉హార్మోన్లలో తేడాలు
👉శరీరంలో నీరు చేరటం
👉రొమ్ములకు దెబ్బ తగలటం
👉గర్భధారణ
👉స్తన్యం గడ్డకట్టడం
👉రొమ్ములకు ఇన్ఫెక్షన్ సోకటం
👉 బరువులు ఎత్తటం
👉క్యాన్సర్
✍️ *ఆయుర్వేద ఔషధం - 1*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-*
👉శొంఠి కొమ్ముల గంధం, టీస్పూన్
👉వస కొమ్ముల గంధం టీస్పూన్
👉 సున్నం టీస్పూన్
👉బెల్లం టీస్పూన్
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉శొంఠి గంధాన్ని, వస గంధాన్ని, సున్నాన్ని, బెల్లాన్ని ఒక్కోటి ఒకో టీస్పూన్ తీసుకోండి.
👉 పేస్టుగా కలపండి.
👉దీనిని అరచేయి వెడల్పు కలిగిన ఒక గుడ్డమీద లేపనం చేయండి.
👉 మరో గుడ్డతో మూసి పేపర్ టేప్తో రొమ్ముమీద ప్లాస్టర్గా వేయండి.
👉దీనిని రెండు మూడు రోజులు రొమ్ముల్లో నొప్పి, అసౌకర్యం తగ్గేవరకూ ప్లాస్టర్గా వేయవచ్చు. (లేపనాన్ని నేరుగా పూస్తే చర్మం కమిలే రిస్కు వుంటుంది).
✍️ *ఆయుర్వేద ఔషధం - 2*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్ధాలు:-*
👉ఆవాలు చూర్ణం ఒక టీస్పూన్
👉గసగసాల చూర్ణం ఒక టీస్పూన్
👉కర్పూరం పొడి ఒక టీస్పూన్
👉పెరుగు తగినంత
✍️ *వాడాల్సిన పద్దతి:-*
👉ఒక పాత్రలో ఒక టీస్పూన్ ఆవాల పొడిని, ఒక టీస్పూన్ గసగసాల పొడిని, ఒక టీస్పూన్ కర్పూరం పొడినీ కలపండి.
👉ఈ మిశ్రమానికి కొద్ది కొద్దిగా పెరుగు కలుపుతూ పేస్టు మాదిరిగా తయారుచేయండి.
👉దీనిని అరచేయి వెడల్పు కలిగిన బ్యాండేజీ గుడ్డమీద పూయండి.
👉ఇదే సైజు కలిగిన మరో గుడ్డతో కప్పి స్యాండ్విచ్ లాగా తయారుచేయండి.
👉దీనిని రొమ్ములమీద పేపర్ టేప్తో అతికించండి. ఇలా 2-3 రోజులు చేయండి.
✍️ *ఆయుర్వేద ఔషధం - 3*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-*
👉కర్పూరం 1 టీస్పూన్
👉వెల్లిపాయ పేస్టు 1 టీస్పూన్
👉రాతి ఉప్పు (కాపడం పెట్టుకోవడానికి)
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉ఒక టీస్పూన్ కర్పూరాన్ని, ఒక టీస్పూన్ వెల్లిపాయ ముద్దను కలిపి మెత్తగా నూరండి.
👉దీనిని ఒక గాజు గుడ్డమీద పరిచి పట్టి వేసుకోండి.
👉తరువాత ఉప్పుతో కాపడం పెట్టుకోండి.
✍️ *జాగ్రత్తలు:-*
👉కాఫీ మానేయండి.
👉కెఫీన్ ఉత్పత్తులను మానేయండి.
👉ఉప్పును తగ్గించండి.
👉శ్రమను తగ్గించుకోండి.
👉మూత్రాన్ని జారీ చేసే ఆహారాలు తీసుకోండి (బార్లి, పల్చని టీ, ధనియాలు, కొబ్బరి నీళ్లు, సబ్జాగింజలు, చెరకురసం, పండ్ల రసాలు).
💊 *నీరసం, బలహీనత, నిస్త్రాణ:*
✍️ *కారణాలు:*
👉క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్
👉కిడ్నీ వ్యాధులు
👉 గుండె జబ్బులు
👉థైరాయిడ్ వ్యాధులు
👉 స్థూలకాయం
👉మధుమేహం
👉ఆల్కహాల్ తీసుకోవటం
👉కెఫీన్ వాడకం
👉ఎక్కువగా శ్రమ చేయటం
👉ఆందోళన, కుంగుబాటు, భయం.
✍️ *ఆయుర్వేద ఔషధం -1*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-*
👉ఎండు ఖర్జూరాలు 4
👉తేనె 1 టేబుల్ స్పూన్
👉1 గ్లాసు వేడి నీళ్లు (ఖర్జూరాలను నానబెట్టడానికి)
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉4 ఎండు ఖర్జూరాలను పరిశుభ్రంగా కడగండి.
👉ఒక గ్లాసు వేడి నీళ్లలో వేయండి.
👉రాత్రంతా నానబెట్టండి.
👉ఉదయం నానిన ఖర్జూరాలను తినండి. మిగిలిన నీళ్లకు 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగండి.
👉దీంతో మీ నీరసం తగ్గుతుంది. బలహీనత దూరమవుతుంది.!
✍️ *ఆయుర్వేద ఔషధం - 2*
*సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-*
👉 అశ్వగంధ వేరు చూర్ణం 20 గ్రా
👉చిల్లగింజల చూర్ణం 20 గ్రా
👉శతావరి వేరు చూర్ణం 20 గ్రా
👉బాదం పలుకులు 20 గ్రా
👉కలకండ పొడి 80 గ్రా.
✍️ *వాడాల్సిన పద్ధతి:-*
👉 ఒక పాత్రలో వీటిని వరుసగా తీసుకోండి.
👉అన్నిటినీ బాగా కలపండి.
👉ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి.
👉దీనిని పూటకు 1 టీస్పూన్ మోతాదుగా గోరు వెచ్చని పాలలో కలిపి తాగండి.
👉ఈ ఔషధాన్ని ఉదయం, సాయం కాలం రెండు పూటలా టానిక్ లాగా తీసుకోండి.
👉దీంతో ధాతునష్టం వల్ల కలిగిన నీరసం తగ్గుతుంది.
✍️ *జాగ్రత్తలు:-*
👉బాగా నిద్రపోండి
👉ఒత్తిడిని తగ్గించుకోండి.
👉మంచి ఆహారం తీసుకోండి.
👉పనులను ప్రణాళికా బద్ధంగా చేసుకోండి.
👉రోజువారీగా మర్రిపండ్లు, రావిపండ్లు, చక్రకేళి, అరటిపండ్లు, ఎండు ఖర్జూరాలు, ద్రాక్షపండ్లు, పెరుగు, పాలు, నెయ్యి తేనె వీటిని తీసుకోండి.
*పై సమస్యలతో బాధపడుతున్న వారికి మా వద్ద అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే సూచనలు మరియు మందులు కలవు. మీ యొక్క సమస్య తీవ్రతను మాకు వాట్సప్ ద్వారా తెలియజేసి మేము ఇచ్చే సలహాలను మరియు నియమాలను పాటించండి. అవసరాన్ని బట్టి మందులను తీసుకోండి.*
No comments:
Post a Comment