Monday, February 26, 2024

అల్సర్ - పేగుపూత సమస్యకి అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

✍️ *అల్సర్ - పేగుపూత సమస్యకి అద్భుతమైన ఆయుర్వేద నివారణా మార్గాలు:*

👉సున్నం ఎక్కువైతే తాంబూలం వేసుకొన్నప్పుడు నోరు పొక్కుతుంది చూశారా... అలా పేగుల లోపల ఉండే పల్చటి పొరకూడా ఒక్కోసారి పొక్కి పోతుంది.

👉 నోరు పూసినప్పుడు నాలుక మీద ఎలా చిన్న చిన్న పొక్కులు వస్తాయో అలా పేగు లోపలిపొర
కూడా పూస్తుంది. 

👉అందుకని ఈ వ్యాధిని 'పేగుపూత' అంటాం మనం. పెప్టిక్ అల్సర్ అనేది ఈ వ్యాధి పేరు. పేగులో పుళ్ళుపడటం ఈ వ్యాధి లక్షణం.

👉పేగుపూత ఎందుకొస్తుందనేది ముఖ్య విషయం. వచ్చిన తర్వాత తగ్గేందుకు మందులు, ఆపరేషన్లు చాలా ఉన్నాయి, వచ్చిన తరువాత తగ్గించుకోవడం ముఖ్యం కాదు. 

👉పేగుపూత రాకుండా చేసుకోవాలన్నా, వచ్చి తగ్గాక అది మళ్ళీ తిరగబెట్టకుండా ఉండాలన్నా పేగుపూత ఎందుకొస్తుందో కచ్చితంగా తెలిస్తేనే ఈ వ్యాధిలోంచి శాశ్వతంగా బైటపడగలరు. 

👉లేకపోతే జీవితంలో ఒకసారి అయినా పేగులో పుండుపడే అవకాశం తప్పకుండా ఉంటుంది. అంతటితో ఆగకుండా పదేపదే పుండు పడేలా చేస్తూనే ఉంటాయని గమనించండి.

👉పొగత్రాగే అలవాటు అల్సర్లు ఏర్పడడానికి ముఖ్యమైన మొదటి కారణం. పొగత్రాగే వారి వలన కలిగే కాలుష్యం పొగత్రాగని వారికి కూడా హానిచేస్తుంది.

👉మానసిక ఆందోళన దిగులు అనేవి పేగులో పుళ్ళు పడడానికి మాత్రమే కాదు, శరీరంలో అనేక రకాల వ్యాధులకు కారణం అవుతున్న సంగతి మనం మరిచి పోకూడదు.

👉కీళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు, తలనొప్పి పేరుతో నొప్పితగ్గే బిళ్ళల్ని అధికంగా వాడటం వలన, అవి కడుపులో ఆమ్లాలు అధికంగా ఉత్పన్నం అయ్యేలా చేసి పేగులోపల పుండు పడటానికి కారణం అవుతాయి. 

👉అసలు నొప్పులు తగ్గడం మాట అటుంచి, ఈ కొసరు “పేగుపూత” వ్యాధి మొదలౌతుంది ఈ బిళ్ళల వలన, కాబట్టి అదే పనిగా నొప్పుల బిళ్ళలు మింగకండి.

👉ఉబ్బసం, జలుబు, దురదలు, కొన్ని రకాల చర్మవ్యాధుల వంటి వాటిలో స్టిరాయిడ్ బిళ్ళలు అనేకం వాడవలసి వస్తుంది. అవికూడా ఇలానే పేగుపూతను తెచ్చిపెడ్తుంటాయి. వాటిని జాగ్రత్తగా డాక్టర్ గారి సలహా మీద మాత్రమే వాడవలెను.

👉హైపర్ పారాథైరాయిడిజం అనే వ్యాధిలో పేగుపూత గ్యాస్ ట్రబుల్ వంటివి తప్పకుండా ఉంటాయి.

👉అతిగా ప్రయాణం చేయడం, దుఃఖం, దిగులు, అతిగా మాట్లాడటం, తాజాగాలేని నిల్వ ఉంచిన, వడలిన, ఎండిన కూరగాయలను వండుకొని తినడం, ఎక్కువగా కారం, పులుపు గల్గిన వస్తువుల్ని బాగా తీసుకోవటం రాత్రిపూట అతిగా జాగరణలు
చేస్తూ మేల్కొని ఉండటం, భోజనం చెయ్యంగానే కొద్దిసేపైనా విశ్రాంతి లేకుండా సైకిల్ తొక్కడమో వేగంగా నడవటమో, పరిగెత్తటమో, బరువు పనులు చేయటమో... ఇలాంటి కారణాల వలనే పేగుపూత, గ్యాస్ ట్రబుల్లతో కూడిన కడుపునొప్పి వస్తుంది.

👉పేగుపూత ఏర్పడిందనటానికి ప్రధానమైన గుర్తు కడుపులో నొప్పి రావడం.

👉గ్యాస్ ట్రబుల్, కడుపులో మంటలతో పాటుగా కడుపునొప్పి కూడా వస్తున్నదంటే పేగు లోపల అల్సర్ ఏర్పడిందేమో పరీక్షచేయించి నిర్ధారించుకోవాల్సి వస్తుంది.

👉పేగుపూతని పెప్టిక్ అల్సర్ అంటాం. అది కడుపు (జీర్ణాశయం) లో వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. 

👉ఈ పుళ్ళు డ్యుయోడినమ్ అనే పేగుభాగంలో వచ్చినప్పుడు డ్యుయోడినల్ అల్సర్ అంటారు.

✍️ *గ్యాస్ట్రిక్ అల్సర్:* 

ఇది ఏర్పడినపుడు రెండు రొమ్ముల మధ్యభాగంలో క్రిందగా ఉన్న ప్రాంతాన్ని ఎపిగ్యాస్ట్రియం అంటారు. సరిగ్గా అక్కడ నొప్పి ఎక్కువగా వస్తుంది.

👉మధ్యాహ్నం భోజనం అరిగే సమయానికి అంటే సాయంత్రం అయ్యేసరికి కడుపునొప్పి మొదలౌతుంది. 

👉రాత్రిపూట కన్నా పగలు కడుపులో నొప్పి ఎక్కువగా వస్తుంది. 

👉ఆహారం తీసుకుంటే నొప్పిపెరుగుతుందేమోనని భయం ఏర్పడుతుంది. అందువలన రోగి
చిక్కిశల్యమైపోతాడు. బరువు తగ్గిపోతాడు.

✍️ *డ్యుయోడినల్ అల్సర్:*

👉ఇది ఏర్పడినప్పుడు కడుపునొప్పి పై కడుపుభాగానే వస్తుంది. కానీ వెనక్కి వెన్నులోకి తంతున్నట్లుగా ఉంటుంది.

👉ఈ నొప్పి వచ్చినప్పుడు కొద్దిగా మజ్జిగ అన్నం గానీ, నాలుగైదు గ్లూకోజు బిస్కట్లుగానీ, రెండు మూడు అరటిపళ్ళుగాని తింటే వెంటనే నొప్పి తగ్గిపోయినట్లే హాయిగా అన్పిస్తుంది.

👉జీర్ణాశయం నుంచి ప్రేగులు మొదలయ్యే చోట పేగులకూ జీర్ణాశయానికి సంధిగా ఈ 'డ్యుయోడినమ్' అనే అవయవం ఉంటుంది. ఇందులో పుండు పడినప్పుడు ఆ విధమైన కడుపునొప్పి వస్తుంటుంది.

👉వాంతులు అవటం, రక్తంకూడా పడటం అనేవి ఈ రెండు రకాల కడుపు నొప్పుల్లోనూ ఉంటూ ఉంటాయి.

👉లివర్లో రాళ్ళు (గాల్ స్టోన్స్) ఉన్నప్పుడు కూడా ఇలానే కడుపులో నొప్పి వస్తూ ఉండవచ్చు. అందుకని వైద్యునికి చూపించి, తగిన పరీక్షలు చేయించుకొని శ్రద్ధగా మందులు వాడవలసి ఉంటుంది.

👉పేగుపూత సమస్య మందులతో తగ్గిపోయే వ్యాధిగానే ఉన్నంతసేపూ ఎలాగోలా తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. కానీ, అది ముదిరి, పెద్దపుళ్ళు పడినట్లయితే, ఆపరేషన్ దాకా వెళ్ళవలసి వస్తుందని హెచ్చరిక!

👉బేరియమ్ ఎక్స్రేల ద్వారా కానీ, ఎండోస్కోపీ చేయించటం ద్వారాగానీ అల్సర్లు ఏర్పడ్డాయో లేదో కనుక్కోవడం సాధ్యం అవుతుంది.

👉గ్యాస్ట్రోఎంటరాలజిన్ని సంప్రదించి పరీక్ష చేయించుకొని పేగుపూత వ్యాధిని నిర్ధారింప చేసుకోవడం అత్యవసరం. కడుపులో నొప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి.

👉గుండుసూది తలకాయంత పుళ్ళు పేగుల్లోపల పడ్తుంటాయి. అవి కొద్దిపాటి చికిత్సతోనే “హీల్” అయి కడుపులో నొప్పి తగ్గిపోతుంటుంది.

👉 పుండుపడినప్పుడల్లా కడుపులో నొప్పి వస్తుంది. వుండు మాడగానే తగ్గిపోతుంది. 

👉మళ్ళీ మనం పచ్చిమిరపకాయ బజ్జీల బండి మీద దాడిచేసి ఉద్యమించి తినడం మొదలు పెట్టాము అనుకోండి.... మళ్ళీ మళ్ళీ పుళ్ళు ఇలానే పడ్తుంటాయి. 

👉ఇంతకీ అసలు విషయంఏమిటంటే, పేగుల్లో పుండు పడటానికి కారణం మనం తీసుకొనే ఆహారమే! 

👉ఆహారంలో పుండుపడే గుణం ఉన్న వాటిని మనం కొనసాగిస్తూ ఉన్నంతకాలం, పేగుపూత
చిరంజీవిలా వర్ధిల్లుతూ మనల్ని బాధిస్తూనే ఉంటుంది.

👉ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ వ్యాధి కడుపులోకి నోటి ద్వారా మాత్రమే ప్రవేశిస్తోంది. నోటిద్వారా వెళ్ళే ఆహారాన్ని కంట్రోల్ చేస్తే వ్యాధి తగ్గడం చాలా సులువుగా జరిగిపోతుంది. 

✍️ *రిఫ్లెక్స్ ఈసో ఫేగైటిస్:* 

👉ఈసోపేగస్ అనే అవయవం గొంతునుంచి జీర్ణాశయందాకా ఉండే గొట్టం వంటి అవయవం. ఈ అవయవంలో పూత ఏర్పడినప్పుడు వెనకాల
వెన్నులోకి నొప్పి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది.

👉 ముందుకు వంగినప్పుడు, పొట్ట మీద భారం పడినప్పుడు నొప్పి పెరుగుతుంది.

👉 సాధారణంగా పొగత్రాగే వారికి, ఆల్కహాల్ పుచ్చుకొనే వారికి ఈ జబ్బు ఎక్కువగా ఉంటుంది.

👉 పేగుపూత అనేది కడుపులో ఎక్కడ వచ్చినా మొదటగా పొగత్రాగే అలవాటుని మాని తీరాలి.

👉 గొంతుదగ్గర మంట, గ్యాస్ పైకి ఎగట్టినట్లుగా ఉండటం, గుటక మింగుతుంటే ఏదో లోపలకి దిగడం లేదన్నట్లుగా ఉండే పరిస్థితి కూడా ఈ వ్యాధిలో ఉంటుంది.

👉ఆయుర్వేదం ప్రకారం కడుపునొప్పి, పేగుపూత, గ్యాస్ట్రబుల్, పైత్యం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలతో బాధపడేవారికి చాలా సులువైన చికిత్సా సూత్రాలను ఇక్కడ కొన్నింటిని ఇస్తున్నాము.

👉వీటిలో ఎక్కువ భాగం మీరు చేసుకోగలిగినవిగానే ఉంటాయి. పేగు పూత వ్యాధిని శాశ్వతంగా
ఎదుర్కోవాలంటే మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

👉 'అతిమధురం' అనే వనమూలిక పొడిని గాని, చెరుకురసంగాని, పంచదార నీళ్ళు గానీ బాగా ఎక్కువ మోతాదులో త్రాగితే కాసేపటికి వాంతి అవుతుంది. ఆ వాంతి వలన కడుపులో పెరిగిన ఆమ్లాలు, జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహారం
అంతా బైటకుపోయి చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది కడుపులో!!

👉తరచూ విరేచనాలకు వేసుకొంటూ ఉంటే పైత్యరసాలన్నీ బైటకు కొట్టుకుపోతాయి.
పేగులోపల పుండు పడకుండా ఉంటుంది. పడినపుండు తేలికగా తగ్గుతుంది.

👉రాగులు మొలకెత్తించి ఎండించి దోరగా వేయించి మెత్తగా మరపట్టించండి. ఈ పొడిలో పెరుగు కలుపుకొని ప్రొద్దునే తినండి. రోజూ తింటే పేగుపూత త్వరగా తగ్గుతుంది. కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు. మజ్జిగలో కలిపి తాగవచ్చు
కూడా!!

👉రాత్రిపూట వేడి అన్నంలో పాలుపోసి, ఆ అన్నంతోసహా తోడుపెట్టి ఉదయాన్నే తింటే పేగుపూత చాలా త్వరగా తగ్గుతుంది. పైత్యం తగ్గుతుంది. కడుపులో ఉడుకు, వేడి చల్లారతాయి

👉త్రిఫలాచూర్ణం అనే పొడి ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. అతిమధురం మూలికా పౌడరు కూడా “యష్టిచూర్ణం" పేరుతో దొరుకుతుంది.
రెండింటిని 100గ్రా॥ చొప్పునకొని, రెండింటినీ కలిపేయండి. అలా కలిపేసిన పొడి 1/2 చెంచా మోతాదులో రోజూ రెండు మూడుసార్లు తేనెతో తీసుకుంటే పేగుపూత త్వరగా తగ్గుతుంది.

👉ఆయుర్వేద శాస్త్రంలో ఉధృతమైన కడుపులోనొప్పితో వచ్చే ఈ వ్యాధిని
పరిణామశూల, అన్నద్రవశూల అని రెండు రకాలుగా వర్గీకరించి వివరించారు.

👉ఆహారం జీర్ణం అయ్యేప్పుడు వచ్చే కడుపులో నొప్పిని పరిణామశూల అనీ, కడుపులో ఆమ్లాలు పైత్యం ఎక్కువైనందువలన వచ్చే కడుపునొప్పిని అన్నద్రవశూల అనీ అంటారు.

👉రకరకాల ఆహారపదార్థాలను తీసుకోవడం వలన అనేక దోషాలు పెరిగి కడుపులోనొప్పి కూడా రకరకాలుగా వస్తుంది.

👉వాతంచేసే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకొన్నప్పుడు అంటే పుల్లటి పదార్థాలు, పులిసినవి, గోంగూర, బచ్చలి, చుక్కకూర, దుంపకూరలు, శనగపిండి, పప్పుదినుసులు ప్రోటీన్లు అధికంగా గల్గిన చిక్కుడు గింజలు, గోరు చిక్కుడు వంటివి ఎక్కువగా తిన్నప్పుడు కడుపులో వాతం పెరుగుతుంది.

👉పేగుపూతతో బాధపడే వ్యక్తి ఈ రకమైన ఆహారపదార్థాలు తీసుకొన్నప్పుడు కడుపు ఉబ్బరం, పొట్టనరాలు బిగదీసినట్లుండటం, కడుపులో గడగడమని శబ్దాలు, పేగులు అరవటం, మలబద్ధత, బడలిక, అలసట, కడుపు నొప్పితోపాటు వొళ్ళంతా
నొప్పులు, శరీరం వణుకు... ఇలాంటి బాధలు కల్గుతాయి. నిద్రపట్టదు.

👉 ఇలాంటివి వచ్చినప్పుడు ఉప్పుగాని పంచదార గాని వేసుకొని వేడి నీటిని తాగితే వెంటనే తగ్గినట్లనిపించి కాసింత హాయిగా అనిపిస్తుంది. 

👉బాగా పులుపు, చింతపండు ఎక్కువగా వేసిన వంటలు, మషాలాలు, ఊరగాయలు, చేపలు, రొయ్యలు ఇలాంటివి అతిగా తిన్నప్పుడు పేగుపూత ఉన్న రోగికి బాగా దాహం వేస్తుంది. ఎన్ని నీళ్ళు త్రాగినా దాహం తీరదు. జ్వరం వచ్చినట్లు శరీరం మండిపోతున్నట్లనిపిస్తుంది. అదే పనిగా చెమటలు
పట్టి అయోమయం అయిపోతుంటుంది ప్రాణం.

👉చలవచేసే సొరకాయ, పొట్ల, బీర, తోటకూర, పాలకూర, మెంతికూర, క్యారెట్, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, ముల్లంగి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకొన్నప్పుడు ఒకింత ఉపశమనం కల్గిస్తుంది.

👉అతిగా తీపి పదార్థాలు తిన్నప్పుడు, నూనె పదార్థాలు వంటివి తిన్నప్పుడు పేగుపూత కల్గిన రోగికి త్రేన్పులు, నోట్లో నీళ్ళూరటం, శరీరం బరువుగా అన్పించటం, మత్తుగా బద్ధకంగా ఉండటం ఇలాంటి బాధలు కల్గుతాయి. 

👉అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు నాడిని పట్టి చూడడం ద్వారా, లక్షణాలను పరిశీలిం
చటం ద్వారా దోషాధిక్యతను నిర్ణయించగల్గుతారు. దాన్ని బట్టి వ్యాధికి కావలసిన సలహాలు, సూచనలు, మందులు ఇస్తే త్వరగా ఫలితం కన్పిస్తుంది!!

👉ఎక్కువమందిలో పేగుపూత వ్యాధి తీవ్రమైన కడుపునొప్పితో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రబుల్, నడుంనొప్పి తలనొప్పి, కడుపులో మంట... వంటి లక్షణాలతో కూడుకుని వస్తుంటుంది. 

✍️ *పేగుపూత వ్యాధి త్వరగా తగ్గాలన్నా, తిరిగి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలన్నా ఈ ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించండి.*

👉బాగా పాతబడిన బియ్యం మాత్రమే వాడండి.

👉మెత్తగా వండుకొని తినండి.

👉బార్లి, సగ్గుబియ్యం, జావకాచుకొని రోజూ త్రాగండి. కడుపులో ఉడుకుతగ్గి పేగులు
బలసంపన్నం అవుతాయి.

👉పులవకుండా తియ్యగా ఉన్న మజ్జిగ ఏ పూటవి ఆ పూట ఎక్కువగా తీసుకోండి.

👉మేక మాంసం (అల్లం, మిరియాలు, లవంగాలు లేకుండా తయారుచేసిన మషాలాలు వేసుకొని) తినండి. 

👉చేపలు, రొయ్యలు పూర్తిగా మానండి.

👉కారపు వస్తువులు బజ్జీలు, నూనె పదార్థాలు మీ ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొడతాయని గుర్తించండి.

👉బీర, పొట్ల, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, ముల్లంగి,
క్యారెట్ వంటి చలవచేసే కూరలు మాత్రమే తినండి.

👉గోంగూర, బచ్చలి, చుక్కకూర, చింతపండు వేసిన వంటలు పూర్తిగా వదిలేయండి.

👉శనగపిండి, శనగ పప్పుల్ని దూరంగా ఉంచాలి.

👉 కందిపప్పు, పెసరపప్పుల్ని దోరగావేయించి ఉత్తపప్పుగా వండుకొని తినండి.

👉నెయ్యి వేసుకోండి. నూనె తగ్గించి వాడండి.

👉ఉల్లిపాయలు, ఏలకులు, దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర, ధనియాలు వంటి సుగంధ ద్రవ్యాలను నిరభ్యంతరంగా వాడుకోండి.

👉ఉప్పు, సైంధవలవణం ఎక్కువగా వాడండి.

👉పులుపు పూర్తిగా వదిలేయండి. తప్పనిసరి అయితే కొద్దిగా నిమ్మరసం గాని, టమోటా పళ్ళరసం గాని కలుపుకోండి.

👉వెలగపండు, ఉసిరిక పండు, దానిమ్మ పండు, అరటిపండు.... ఇవి ఈ వ్యాధిలో మంచివి. ఉసిరికాయ తొక్కుడు పచ్చడి (నల్లపచ్చడి) మంచిది.

👉 తేలికగా అరిగేలా ఆహారం తీసుకోండి.

👉వేళకు భోజనం, వేళకు నిద్ర అలవాటు చేసుకోండి.

👉పెరుగు అన్నం తర్వాత టీ త్రాగడం వంటి విరుద్ధ ఆహారాలు తీసుకోవద్దు. పేగుపూత పెరుగుతుంది.

👉 అరగనివి, ఇబ్బంది పెట్టేవి, శరీరానికి సరిపడనివి పొరపాటున కూడా తినకండి.

👉పెరుగు కన్నా, పాలకన్నా ఈ వ్యాధిలో మజ్జిగే మంచిదని గుర్తించండి.

👉 పిండి వంటలు, శనగపిండితో వండిన స్వీట్లు తినకండి.

👉దిగుళ్లు, ఆందోళనలు, కోపం, భయం, ఆవేశం వంటివి వదిలేసి మానసిక ప్రశాంతతను అలవరచుకొంటే ఈ వ్యాధి త్వరగా తగ్గుతుంది.

👉యోగ, వ్యాయామం నేర్చుకుని పాటించండి.
వీలైతే “సిద్ధ సమాధియోగ” ప్రాక్టీస్ చేయండి.

👉 పచ్చికూరలు తినటం ఈ వ్యాధిలో ఒక మంచి అలవాటు.

No comments:

Post a Comment