Monday, February 26, 2024

పురాణగ్రంధాల ప్రకారం భగవంతుడి ఆరాధనలో నిషేధించబడినవిఏమిటో చూద్దాం

పురాణగ్రంధాల ప్రకారం భగవంతుడి ఆరాధనలో నిషేధించబడినవి
ఏమిటో చూద్దాం

1. తులసిని వినాయకుడికి సమర్పించద్దు.
2. ఏ దేవతకూ దూర్వాపత్రం వద్దు.
3. తిలకంలో విష్ణుమూర్తికి అక్షతలు వద్దు.
4. ఒకే పూజాస్థలంలో 2 శంఖాలు వద్దు.
5. గుడిలో 3 గణేశ విగ్రహాలను ఉంచద్దు.
6. తలుపు దగ్గర Shoes, Chappals తలకిం దలుగా ఉంచద్దు.
7. భగవంతుడ్ని దర్శించుకుని తిరిగొచ్చేటప్పుడు గంట మోగించరాదు.
8. ఒక చేతితో హారతి తీసుకోరాదు.
9. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు.
10. తల్లికి తప్ప ఏ స్త్రీ కి కూడా నమస్కరించడం నిషేధం.
11. దక్షిణయివ్వలేనప్పుడు జ్యోతిష్యుడ్ని కలవద్దు. 
12. ఇంట్లో పూజకోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచద్దు.
13. తులసిచెట్టులో శివలింగం ఉండరాదు.
14. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకరాదు.
15. కుటుంబంలో సూతకముంటే, పూజా విగ్రహాలను తాకరాదు.
16. శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటరాదు.
17. ఒక చేత్తో నమస్కరించద్దు.
18. చరణామృతం తీసుకునేటప్పుడు, ఒక్క చుక్క కూడా కిందపడకుండా కుడిచేతి కిం ద రుమాలు ఉంచాలి. చరణామృతం తా గిన తర్వాత తలపై చేతులు తుడచద్దు, కానీ, కళ్లపై రాసుకోండి. గాయత్రి మన తల పై నివసిస్తుంది. కనుక ఎంగిలి చేతితో కలుషితం చేయరాదు.

19. పెళ్లికాని ఆడపిల్లల పాదాలు పెద్దలు తాకడం పాపం.
20. తాగుబోతులు భైరవుడు కాకుండా వేరే దేవాలయాల్లోకి ప్రవేశించడం నిషేధం.
21. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కుడిపాదం, బైటకెళ్లేటప్పుడు ఎడమ పాదం ఉంచాలి.
22. పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించరాదు.
23. గుడికెళ్లడానికి ఒక జత బట్టలు విడిగా ఉంచుకోండి.
24. దేవాలయం మీ యింటికి చాలా దగ్గర్లో ఉంటే కనుక పాదరక్షలు లేకుండా నడిచెళ్ళండి. 
25. గుడిలో కళ్లు తెరిచి దేవుడి దర్శనం చేసుకోండి. 
26. ఆరతి తీసుకున్న తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి.

ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో ఋషుల నుండి సాంప్రదాయబద్దంగా చెప్పబడ్డాయి...

No comments:

Post a Comment