👉మలబద్దకం అనేది అనేక రోగాలకు దారి తీస్తుంది.
👉ప్రతిరోజూ వేళ ప్రకారం, గడియారం గంట కొట్టినంత సరిగ్గా విరేచనం ఫ్రీగా అయ్యే అలవాటులేని వ్యక్తి పేగులు చాలా బలహీనంగా ఉన్నాయని అర్థం.
👉కొందరికి విరేచనం వచ్చినట్టే అన్పిస్తుంది. కానీ ఎంతో ప్రయత్నిస్తే తప్ప బైటకు రాదు. టాయిలేట్ కోసం ఎదురుచూస్తూ కాఫీలు తాగటం, చుట్ట, బీడి, సిగరెట్లు తాగటం, పేపరు చదవడం.... ఇలాంటి యుద్ధకార్యక్రమాలెన్నో చేస్తుంటారు. అయినా విరేచనం అవదు. ఆ యుద్ధం ముగియదు.
👉గంటల తరబడి మోకాళ్ళు నొప్పులు పుట్టేంతవరకూ టాయిలెట్లోనే గడిపే పరిస్థితి నడుస్తోందంటే, పేగులు చాలా బలహీనంగా ఉన్నాయనే అర్ధం చేసుకోవాలి.
✍️ *అసలు ఈ మలబద్ధత ఎందుకొస్తుంది?*
👉తీసుకున్న ఆహారం తిన్నట్టుగా అరిగిపోతే మలబద్ధత రాదు. జీర్ణశక్తి బలంగా ఉన్నా మలబద్ధత రాదన్నమాట. అందుకే “మిగలకుండా జీర్ణం అయ్యే ఆహారం” "Non- Residual Diet" తీసుకోమంటుంది వైద్యశాస్త్రం.
👉 మనకున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల రీత్యా తూకం తూచి ఆహారం తీసుకోవాలంటే అన్ని వేళలా అందరికీ సాధ్యపడక పోవచ్చు.
👉కాబట్టి కడుపులో అగ్నిని కాపాడుతూ పేగులనడకని క్రమబద్ధం చేస్తూ ఆహారాన్ని సక్రమంగా జీర్ణంచేస్తూ విరేచనం ఫ్రీగా అయ్యేలా చూసే ఔషధాన్ని రోజూ ప్రతి ఒక్కరూ విధిగా వాడమని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
👉కడుపులో మందంగా ఉంటోంది... ఓసారి విరేచనానికి వేసుకుందామను కొంటున్నాను అంటుంటారు చాలామంది. విరేచనాల మందు వేసుకుంటే కొద్దిగా మలం, ఎక్కువ నీళ్ళతో కొన్ని విరేచనాలు అవుతాయి.
👉ఒక్కోసారి విపరీతంగా కడుపు నొప్పి, వాంతులు రావడం కూడా జరుగుతుంటాయి. కొందరిలో కాళ్ళూ చేతులూ బలహీన పడినట్లవుతాయి కూడా!
👉 తరుచూ ఇలా నీళ్ళగా విరేచనాలు అయ్యేమందుని వాడుతూ ఉంటే పేగులు బలహీనబడి మరికొన్ని కొత్త ఉపద్రవాలకు దారితీయవచ్చు. కూడా. అంతేకాదు. నీళ్ళగా కొన్ని విరేచనాలు అయినంత మాత్రాన కడుపంతా క్లీన్ అయ్యిందని అనడానికి కూడా వీల్లేదు. ఈ విధంగా విరేచనాలకు వేసుకుంటే కడుపు క్లీన్ అవదు కూడా.
👉 ఒక పచ్చి మామిడికాయని పిండితే రసం ఎలా రాదో, దోషాలు పక్వం కాకుండా విరేచనానికి వేసినా అలానే బైటకి పోవని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది.
👉మాచే స్వయంగా తయారు చేయబడిన మా "మలశోధక చూర్ణం" మలాన్ని పక్వావస్థకు తీసుకొచ్చి మృదువుగా బైటకు పోయేందుకు సాయ పడ్తుంది. కడుపులో ఉండే అజీర్తి దోషాన్ని పోగొట్టి బలమైన జఠరాగ్నిని కల్గిస్తుంది.
✍️ *విరేచనం ఫ్రీగా అవటం అంటే ఏమిటి?*
👉ఫ్రీగా విరేచనం అయ్యిందంటే, అది మృదువుగా ఉంటుంది. అందులో ఆహార పదార్థాలేవీ కన్పించకూడదు. జిడ్డుగా ఉండి కడుక్కున్నప్పుడు వేళ్ళకు అంటుకొని పోవటం, ఎన్ని నీళ్ళు కొట్టినా లెట్రిన్ ప్లేట్కు అంటుకొని వదలకపోవటం ఇవి రెండూ జీర్ణశక్తి ఫెయిలయ్యిందనడానికి గుర్తులు.
👉జిగురు, బంక, చీము, రక్తం, రక్తపు చారలు కన్పిస్తే పేగుల్లో ఏదో వ్యాధి ఉందన్నట్లు, రోజూ సరిగ్గా సమయానికి వెళ్లగానే విరేచనం అయి, ఇంకా వస్తుందేమోననే అనుమానంతో ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరగా ఆపని పూర్తయి సుఖంగా బైటకు రాగలిగినప్పుడు విరేచనం ఫ్రీగా అయ్యిందని అర్థం. విరేచనంలో ఏమాత్రం మార్పు కన్పించినా పేగుల సంరక్షణ కోసం మనం తక్షణం జాగ్రత్త తీసుకోవాలని అర్ధం చేసుకోవాలి.
👉రోజూ ఒకసారిగాని, ఉదయం, రాత్రి రెండు సార్లుగానీ ఆరోగ్యవంతంగా విరేచనం కావాలి.
👉 కడుపులోకి ఆహారం తీసుకున్నపుడల్లా విరేచనం కావటం, ఎప్పుడు పడితే అప్పుడు విరేచనం కావటం, మంటగానో, పోటు పెడుతూనో, కడుపులో నొప్పితోనో, పుల్లటి వాసనతోనో, దుర్గంధంతోనో చీము వాసనతోనో, మలం లేకుండా, బియ్యపు కడుగునీళ్ళలానో విరేచనం అవుతోందంటే కడుపులో ఏదో జబ్బు ప్రవేశించిందని గ్రహించి వెంటనే మలాన్ని శోధించి, జీర్ణశక్తిని సరిచేసి, పేగుల్ని శక్తివంతం చేసే ఔషధం వాడవలసి ఉంటుంది. మా "మలశోధక చూర్ణం" ఈ క్రియకు చాలా ఉపయోగకరమైనది.
✍️ *ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ సమస్య :*
👉మలబద్ధత అనేది ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ వ్యాధిలో పరాకాష్టకు చేర్తుంది.
👉విరేచనం మేక పెంటికలు వెళ్ళినట్లు పిట్టంకట్టి గట్టిరాయిలాగా అయి బలవంతంగా ముక్కిముక్కి వెళ్ళవలసి వస్తుంది.
👉ఒక్కోసారి అసలే అవకపోవటం, ఇంకోసారి పల్చగా నీళ్ళలాగా అవటం ఇలా బాధిస్తూ ఉంటుంది. ఇది వాతం వలన వచ్చే వ్యాధి.
👉ఈ వ్యాధిలో మలబద్ధతని పోగొట్టడానికి కేవలం విరేచనాల మందులు వేయడం వలన పేగులు మరింత బలహీనమై వ్యాధి పెరుగుతుందే గానీ తగ్గదు. దీనికి తోడు మానసిక లక్షణాలు కూడా ఈ వ్యాధిలో తోడవుతాయి.
👉మా "మలశోధక చూర్ణం" ఈ వ్యాధిలో చక్కగా ఉపయోగపడ్తుంది. పేగులు శక్తిమంతం అయి, విరేచనం ఫ్రీగా అవుతుంది. ఇతర బాధలు కూడా తగ్గుతాయి.
✍️ *మొలల వ్యాధికి మలబద్ధత ముఖ్యకారణం:*
👉విరేచనం సరిగా అవక బలవంతంగా ముక్కవలసి రావడం, లోపల ఏదో బంధించినట్లు అతికష్టంమీద కొద్దిగా విరేచనం అవడం, ఇంకా లోపల చాలా విరేచనం మిగిలిపోయినట్టే అన్పించటం బాగా వత్తిడినిస్తే జిగురుగానీ, రక్తంగానీ పడటం... ఇవన్నీ మొలల వ్యాధిలో తరచూ కన్పించే లక్షణాలే!!
👉మొలలు వచ్చి తగ్గినవారూ, మొలల ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా విరేచనం విషయంలో సరయిన కేర్ తీసుకోకపోతే మొలలు తిరగబెడ్తుంటాయి.
👉మా "మలశోధక చూర్ణం" రోజూ వాడుతూ ఉంటే, మొలలు చెలరేగవు. తిరగబెట్టకుండా ఉంటాయి. త్వరగా తగ్గుతాయి.
✍️ *పేగు జారడానికి మలబద్ధతే కారణం:*
👉పేగు చివరి భాగాన మలాశయం ఉంటుంది. 'రెక్టమ్' అంటారు దీన్ని. విరేచనం కోసం అతిగా ముక్కడం వలన పేగులోపల వత్తిడి పెరిగి, ఏకంగా పేగు చివరి భాగమైన ఈ రెక్టమ్ విరేచన మార్గంలోంచి బైటకు జారి వస్తుంది. విరేచనం సరి అవకపోతే, ఇలా పేగుజారటం నిత్య వ్యవహారం అయిపోతుంది.
👉"మలశోధక చూర్ణం" వాడితే, మృదువుగా విరేచనం అయి, పేగుకండరాలు శక్తిమంతం అయి, జారకుండా అగుతాయి. ఇది ఆపకపోతే, ఆపరేషన్ అవసరం అవుతుంది.
👉గ్యాస్ట్రబుల్-మలబద్ధత అక్కాచెల్లెళ్ళు:
👉మలబద్ధతకి గ్యాస్ ట్రబుల్ కి అవినాభావ సంబంధం ఉంది. రెండూ ఒకదాన్ని ఒకటి పెంచుతుంటాయి.
కేవలం గ్యాస్ ట్రబుల్ని తగ్గించేందుకు వాడే మందులు ఒక్కోసారి మలబద్ధతని కల్గిస్తుంటాయి కూడా.
👉 విరేచనాలకు వాడితే, కడుపునొప్పి, వాంతి, వికారం వచ్చే అవకాశం ఉంది.
👉 "మలశోధక చూర్ణం" లోని మూలికలు జీర్ణశక్తిని పెంచడం ద్వారా కడుపులో పైత్యాన్ని, గ్యాస్ ని తగ్గిస్తాయి. విరేచనాన్ని ఫ్రీగా అయ్యేలా చేస్తాయి. ఈ విధంగా మలశోధక చూర్ణం నిరపాయకరంగా పనిచేస్తూ, పేగుల్ని, జీర్ణశక్తినీ బలసంపన్నంచేసి విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది.
✍️ *కీళ్ళవాతాన్ని మలబద్దతే తెచ్చిపెడ్తుంది.:*
👉రోజూ సక్రమంగా కడుపులోంచి బైటకు వెళ్ళిపోవలసిన మలాలు వెళ్ళకుండా ఆగిపోయినప్పుడు వెలువడే విషలక్షణాలు కీళ్ళలోపల చేరి వాపునీ, నొప్పినీ కల్గిస్తాయి.
👉 కడుపులో వాతం పెచ్చుమీరడం వలన ఈ స్థితి వస్తుంది. జీర్ణశక్తినీ, మలబద్ధతనీ సరిచేసి వాతాన్ని పోగొట్టే విధంగా 'మలశోధక చూర్ణం' ఉపయోగపడ్తుంది.
✍️ *మైగ్రేన్ తలనొప్పికి ఒక కారణం మలబద్దకం:*
👉విరేచనం ఫ్రీగా కాకపోవడానికీ, తలనొప్పికీ చాలా దగ్గర సంబంధం ఉంది.
👉కాలవిరేచనం అయి కడుపు ఉబ్బరం, మంట, గ్యాస్ ఇలాంటివి లేకుండా చక్కగా జీర్ణశక్తి నడుస్తూంటే తలనొప్పి తిరగబెట్టదు.
👉నడుంనొప్పి, మెడనొప్పి, దీర్ఘకాలంగా బాధ పెట్టే నొప్పులన్నింటికీ మలశోధక చూర్ణం చక్కటి నివారణగా ఉపయోగపడ్తుంది. మీరు వాడుకొంటున్న మందులకు అదనంగా మలశోధక చూర్ణం కూడా వాడితే మీ చికిత్స తక్షణం ఫలితాన్నిస్తుంది.
✍️ *అన్నహితవును కల్గిస్తుంది:*
👉మలబద్ధతకు పేగుల్లో జడత్వం ముఖ్యకారణం.
👉 పేగులు ఉత్సాహంగా పనిచేయక జీర్ణశక్తి మందగించి నాలికపైన జిగురుపేరుకొని తెల్లగా తయారౌతుంది. నాలుక ఎంత గీసినా ముఖం కడుక్కోలేదన్నట్లు ఉంటుంది.
👉నోటికి ఏదీ రుచి తెలియదు. ఆహారం తీసుకోబుద్ధికాదు. ఒకవేళ బలవంతంగా తిన్నా ఎగశ్వాస రావటం, సుఖంగా లేకపోవటం, కడుపు ఉబ్బరం, గొంతులో మంట... ఇలాంటి లక్షణాలు అదనంగా ఏర్పడుతుంటాయి. తిండి వంటబట్టకపోవటం వలన క్షీణించిపోతుంటారు.
👉 మలశోధక చూర్ణం వాడితే మళ్ళీ కోలుకుంటారు. శక్తిని పుంజుకుంటారు.
✍️ *మలశోధక చూర్ణం అంటున్నారు. అసలు ఈ మాలశోధక చూర్ణంలో ఏమి ఉన్నాయి? ఎంత మోతాదు తీసుకోవాలి?ఎలా తీసుకోవాలి?*
👉హరితాకి, పిప్పలి, శొంఠి, కలోంజి, నేల ఉసిరి, నాగర్మోత, నిషోత్, కాల నమక్, వాయు విడంగాలు, లవంగాలు, తేజ్ పత్తా, చిత్రాక్, హింగ్, కటుక రోహిణి లతో పాటు మరికొన్ని మూలికలను కలిపి తయారు చేయబడినది.
👉 ఈ చూర్ణం 1/4 చెంచా నుంచి 1 చెంచావరకూ మోతాదుతో దీన్ని వాడుకోవాలి. ఈ పొడిని వేణ్నీళ్ళలో కలిపి తాగితే చాలాబాగా పనిచేస్తుంది. లేదా మజ్జిగలో కలిపి తాగవచ్చు.
✍️ *ఇతర వ్యాధుల్లో మలశోధక చూర్ణం:*
షుగర్ వ్యాధి, బీపి, హృదయవ్యాధులు, పెప్టిక్ అల్సర్లు, కీళ్ళవాతం, నడుంనొప్పి ఎలర్జీ వ్యాధులు, దగ్గు, జలుబు, ఆయాసం వివిధ చర్మవ్యాధులు... చెలరేగి పెరగడానికి మలబద్ధత ముఖ్యకారణంగా కన్పిస్తుంటుంది.
ఈ వ్యాధులతో బాధపడేవారు మలశోధక చూర్ణాన్ని విధిగా వాడితే ఆయా వ్యాధుల్లో వాడే మందులు ఇంకా శక్తివంతంగా పనిచేస్తాయి..
No comments:
Post a Comment