Sunday, February 9, 2020

ఆయుర్వేదం నందు ఔషధాల విభజన - about oushada in ayurveda

ఆయుర్వేదం నందు ఔషధాల విభజన  -

         ఆయుర్వేదం నందు కొన్ని రకాల ఔషధాలు శరీరం పైన అనేకరకాలుగా పనిచేయును . సాధారణంగా ఆయుర్వేద గ్రంథాలలో వాటి గురించి క్లుప్తంగా వివరిస్తారు. చరక మహర్షి వంటివారు అక్కడక్కడ కొంత వివరణ ఇచ్చారు . ఆయన ఔషధాలు పనిచేయు విధానాన్నిబట్టి యాభై గణాలుగా వర్గీకరించారు.

           అటువంటి వర్గీకరణలు అందరికి అర్ధమయ్యేవిధముగా మీకు తెలియచేస్తాను.

 ఔషధ వర్గీకరణలు  -

 *  జీవనీయము  -

           జీవమును వృద్ధిచెందించునవి.

 *  బృoహ్మణీయము -

           శరీరమును వృద్ధిపరచునవి.

 *  లేఖనీయము  -

          శరీరం నందు వ్యర్ధపదార్ధాలను నివారించునవి.

 *  బేధనీయము  -

          గడ్డకట్టుకు పోయిన మలాదులు వంటి వ్యర్దాలను విడగొట్టునవి.

 *  సంధానీయము -

          విడిపోయిన అవయవాలను అతుక్కొనే విధముగా చేయునవి .

 *  దీపనీయము -

          జఠరాగ్నిని వృద్దిచెందించునవి .

 *  బలీయము -

         బలమును వృద్దిచెందించునవి .

 *  వర్ణ్యము  -

          శరీరముకు కాంతిని కలిగించునవి.

 *  కంఠ్యము  -

         కంఠమునకు మేలుచేయునవి .

 *  హృద్యము  -

         హృదయమునకు మేలుచేయునవి .

 *  తృప్తిఘ్నము -

         శరీరంలో శ్లేష్మం వలన కలుగు వికారాలను నివారించునది.

 *   ఆర్షోఘ్నము  -

          మూలవ్యాధిని హరించునవి.

 *   కుష్ఠఘ్నము  -

          కుష్ఠు వ్యాధిని హరించునది.

 *   కండుఘ్నము -

          దురదని హరించునది.

 *   క్రిమిఘ్నము  -

          క్రిములను నశింపచేయునది .

 *   విషఘ్నము -

          విషాదోషములను హరించునది.

 *   స్తన్యజననము  -

          స్తన్యమును కలిగించునది.

 *   స్తన్య శోధనము  -

           స్తన్యమును శుభ్రపరచినది.

 *   శుక్ర జననము  -

           శుక్రమును అనగా వీర్యమును పుట్టించునది.

 *   శుక్ర శోధనము  -

          శుక్రమును శుద్ధిచేయునది .

 *   స్నేహోపగము  -

          తైలకర్మకు ఉపయోగించునది .

 *    స్వేదోపగము  -

         స్వేదకర్మ యందు ఉపయోగపడునది.

 *    వమనోపగము  -

         వమనకర్మ అనగా వాంతి చేయుటకు ఉపయోగపడునది .

 *   విరేచనోపగము -

         విరేచనం చేయుటకు ఉపయోగపడునది .

 *   ఆస్థానోపగము -

         వస్తికర్మ యందు ఉపయోగించబడునది .

 *   అనువాసనోపగము  -

         అనువాసనవ వస్తికర్మకు ఉపయోగపడునది .

 *   శిరోవిరేచనము  -

          దగ్గును హరించునది.

 *    ఛర్ధి నిగ్రహము  -

         శ్వాస కర్మ యందు ఉపయోగించునది .

 *  తృష్ణనిగ్రహము  -

          తృష్ణ కర్మ యందు ఉపయోగించతగినది.

 *   హిక్కా నిగ్రహము  -

         వెక్కిళ్ళను పోగొట్టునది.

 *    పురీష సంగ్రహాణీయము  -

         మలమును గట్టిపరుచునది.

 *   పురీషవిరజనీయము -

         మలాశయం నందలి దోషములను నివారించునది .

 *  మూత్రసంగ్రహనీయము  -

          మూత్రమును ఆపునది.

 *   ముత్ర విరజీయనీయము -

        మూత్రదోషములను పోగుట్టునది.

 *  మూత్రవిరేచనము -

        మూత్రమును విడుదల చేయునది .

 *  కాసహరము  -

         దగ్గును పోగొట్టునది .

 *  శ్వాసహరము  -

        శ్వాసను హరించునది .

 *  శోథ హరము -

       వాపును నాశనం చేయునది .

 *  జ్వర హరము  -

       జ్వరములను పోగొట్టునది .

 *  శ్రమ హరము -

       శరీరం అలసటను పోగొట్టునది .

 *  దాహ ప్రశమనము -

        తాపమును హరించునది.

 *  దాహప్రశమనము  -

        తాపమును హరించునది.

 *  శీత ప్రశమనము -

       శీతమును నివారించునది.

 *  ఉదార్ధ ప్రశమనము  -

       శరీరం పైన ఎర్రని దద్దుర్లను నివారించునవి.

 *  అంగమర్ద ప్రశమనము  -

        బడలిక నొప్పులను పోగొట్టునది .

 *  శూల ప్రశమనము  -

        శూలను హరించునది.

 *  శోణిత స్థాపనము  -

        రక్తమును నిలుపునది .

 *  వేదనాస్థాపనము  -

        భాధను తొలగించునది .

 *  సంజ్ఞా స్థాపనము  -

       స్మృతిని కలుగచేయునది అనగా మూర్ఛపోయిన వారికి తెలివితెప్పించునది .

 *  ప్రజాస్థాపనము  -

       సంతానమును కలిగించునది.

 *  వయస్దాపనము  -

       వయస్సును స్థాపించునది . అనగా వయస్సును నిలుపునవి.

        పైన చెప్పినటువంటి పద గణములు అన్నియు తరచుగా ఆయుర్వేద గ్రంథాలలో తరచుగా వినిపించును. కావున వీటిపైన అవగాహన కలిగి ఉండవలెను .

No comments:

Post a Comment