ప్రపంచము నందలి వింత మొక్కలు మరియు వృక్షముల గురించి విశేషాలు -
ఈ భగవంతుని సృష్టిలో అనేకరకాలైన విచిత్రాలు ఎన్నో కలవు. అటువంటి వింతలలో వృక్షాలకు ప్రముఖ స్థానం ఉన్నది. అటువంటి వృక్షవింతలను మీకు తెలియచేయుటకు ఈ పోస్టు పెడుతున్నాను .
వృక్షవిచిత్రాలు -
* చెప్పులజతమొక్క అనే పేరుగల మొక్కలు హైతీలో పెరుగును వాని ఆకులు చూచుటకు చెప్పుల జత వలే ఉండును.
* కాంగోలో "లువాలబా " అనే నది పైన ఒక రకమైన గుబురులు తేలుచుండును . అవి చూచుటకు చిన్నచిన్న ద్వీపముల వలే ఉండును.
* పెరిగ్వే దేశములో ఒక రకమైన మొక్క విపరీతముగా పెరుగును . దీని నుండి అసామాన్యమైన కార్బోహైడ్రేట్స్ తయారుచేయుదురు. ఇది పంచదార కంటే మూడు వందల రెట్లు తియ్యగా ఉండును. అక్కడివారు కొన్ని శతాబ్దముల నుండి ఈ మొక్క పొడిని "టీ " లో కలుపుకుని తాగుచున్నారు.
* " కేపీవేర్టీ " ద్వీపములలో " ఓహ్ మెగ్డలేన్" అనే స్థలంలో " బోపాప్ " అనే వృక్షాలు భూమికి సమాంతరంగా పక్కవాటుగా పెరుగును . ఇవి మహావృక్షాలు .
* ఎడారులలో పెరిగే " saksoul " వృక్షాలకు ఆకులు ఉండవు. దీనికి ప్రధాన కారణం ఎడారిలో నీరు లేకపోవటం .
* ఆఫ్రికాకు ఆగ్నేయము నందు గల మడగాస్కర్ ద్వీపము నందు ఒక రకమైన చెట్లు కలవు. వానికి రంపపు ముళ్లు వంటి ముండ్లతో కూడిన పొడవయిన ఆకులు ఉండును. శాఖ చివరన ఒక పుష్పము దాని నిండా మధురమైన రసం ఉండును. ఆ వృక్షం ఆ రసమును ఆశించి వచ్చు కోతులు మొదలైన వాటిని వాటి ఆకులతో చుట్టి బిగించి ముండ్లతో శరీరం నందు ఉండు రక్తమును పీల్చి చంపును.
* జావా ద్వీపము నందలి జ్వాలాముఖి పర్వతము నందలి పెంగ్ రేంజ్ పర్వత శిఖరము పదివేల అడుగుల ఎత్తు ఉండును. ఈ శిఖరం నందు జ్వాలాముఖి విస్ఫోటన సమయము నందు " రాయల్ క్లావ్సిప్ "అను వృక్షం పుష్పించుచుండెను . అవి పుష్పించిన యెడల అచట వారికి జ్వాలాముఖి విస్ఫోటనం చెందును అని గుర్తు కనుక ఆ వృక్షములు పుష్పించు సమయమున ఆ స్థలమును వదిలి దూరంగా పోవుదురు.
* ఆర్కిటిక్ ప్రాంతమున "లైచెన్స్ " అను పురాతన వృక్ష సంతతి కలదు. ఆ వృక్షం మంచు పేర్కొను సమయమున గడ్డ కట్టుకుని మంచు కరుగు కాలమున చిగురించుచుండును.
* " ఆబ్ నూస్ " అను వృక్షము జమైకాలో ఆకుపచ్చగా , మస్కారిన్ ద్వీపములలో తెల్లగా మారిషస్ లో ఎరుపుగా , ఏంటిల్స్ లో పసుపురంగుగా , దక్షిణ అమెరికాలో నీలం రంగులో ఉండును.
* కాలిఫొర్నియా లో ఒక రకమైన చెట్లు కలవు. ఇవి 10 నుంచి 12 అడుగులు పెరుగును . పెద్దగాలి వీచినప్పుడు పెళపెళ శబ్దం చేయుచూ ఒక విధమైన దుర్వాసన వ్యాపింపచేయును .
* జపాన్ దేశము నందు అగ్నిపర్వత ప్రాంతము నందు కొన్ని వింత వృక్షాలు కలవు. ఇవి ప్రతిదినం సూర్యాస్తమయ సమయమునందు తెల్లని పొగను విరజిమ్మును. వీనిని జాగ్రత్తగా పెంచిన 50 నుంచి 60 అడుగుల ఎత్తు పెరుగును .
* హిమాలయముల యందు గల కొన్ని రకాల వృక్షాల కొమ్మలు ఒక దానికొకటి రాచుకొన్నప్పుడు విద్యుత్ స్పార్క్ వంటి వెలుగు వచ్చును.
* మెక్సికో దేశము కొన్ని చెట్ల శాఖల చివరలు యందు పచ్చని ఆకుల నడుమ పొడవైన సూదుల వంటి ముండ్లు పుట్టుచుండును. వాటిని పీకినప్పుడు చెట్టు బెరడు నుండి సన్నని పొడవైన దారం వచ్చును. స్థానికులు వానిని బట్టలు కుట్టుటకు ఉపయోగించుదురు .
* బాబిలోన్ అనే ప్రదేశములో "నెబుచాడ్నజార్" అనే అతడు 75 అడుగుల ఎత్తున 4 ఎకరాల మేర వనాలు ఏర్పాటు చేసెను . వాటిని వేలాడే తోటలు అని అంటారు . ప్రపంచవింతలలో ఇవి ఒకటి.
* ఆఫ్ఘనిస్తాన్ దేశము నందు హిందూకుష్ పర్వత పగుళ్లలో ద్రాక్షలు మొలిచి 20 అడుగులవరకు వేలాడుచుండును. వాటిని అక్కడివారు తలకింద తోటలు అని పిలుచుదురు.
* ప్రపంచములో ఎత్తయిన వృక్షం కాలిఫొర్నియా లోని ఒక పార్క్ లో ఉంది . దాని ఎత్తు 325 అడుగులు . ఈ చెట్టు పేరు "డగల్ సపర్ " .
* జపాన్ లో ఒక రేగుచెట్టు కలదు. దాని ఎత్తు మాత్రం మూడు అడుగులు కాని వయస్సు మాత్రం 500 సంవత్సరాలు .
* మధ్య ఆసియాలోని ఉగాండా దేశములో గల యూకలిఫ్టస్ చెట్లు రెండేళ్లలో 45 అడుగుల ఎత్తు పెరుగును .
* ప్రపంచములో ఖర్జురము చెట్లు అన్ని రకాల చెట్ల కంటే ఎక్కువ కాపు కాయును .

No comments:
Post a Comment