Sunday, February 9, 2020

గర్భిణీ స్త్రీ పాటించవలసిన ఆహారనియమాలు pregnancy rules

  *  గర్భిణిస్త్రీ ప్రసవం అయ్యేంతవరకు హృదయానికి ఇంపుగా , బలకరంగా ఉండి ద్రవంగా ఉన్న ఆహారాన్ని తినవలెను .

 *  అన్ని రసాలలో మధురరసం మంచిది . ఆహరం చమురుతో కూడుకుని ఉండవలెను . ఎండిపోయినట్లు ఉండరాదు.

 *  ఆకలి మందగించకుండా ఆగ్నిదీప్తి కలిగించే ఆహారాలు తప్పకుండా తీసుకోవలెను . ప్రసవం అయ్యేవరకు ఇదే పద్దతి పాటించవలెను .

 *  రెండు , మూడు మాసాలలో తియ్యగా ఉండి ద్రవంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువుగా భుజించాలి . మూడోమాసంలో షష్ఠిక బియ్యముతో తయారైన అన్నమును పాలతో కలిపి ఎక్కువుగా తినవలెను .

 *  నాలుగోవ మాసము నందు షష్టిక బియ్యపు అన్నమును పెరుగుతో ఎక్కువ తీసుకొవలెను . ఐదో మాసములో మరలా పాలతో కలిపి ఎక్కువ తినవలెను . ఆరోవ మాసము నందు ఈ బియ్యపు అన్నమును నెయ్యితో కలిపి తీసికొనవలెను.

     పైన చెప్పిన శాస్త్రప్రవచనంలో ఆహారపు మూలద్రవ్యాలన్నీ ఉన్నాయి . వాటిలో ఒక్కొక దాన్ని  ఒక్కో మాసములో ప్రధానం చేసి విధించింది. మధురద్రవ్యాలను , పిష్టద్రవ్యాలను , మాంసకృత్తులను క్రమంగా కలిపి చెబుతూ అయా మాసాలలో లోపం రాకుండా పూర్తిచేయాలని శాస్త్రం యొక్క అభిప్రాయం .

          గర్భిణి స్త్రీకి ఎక్కువుగా రక్తలోపం రావటం , తెల్లబారి ఉండటం జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం తల్లి రక్తంలో ఉన్న ఐరన్ లోహాన్ని తన పోషణార్ధం గర్భస్థ శిశువు తీసుకుంటుంది. అందువలన తల్లి తెల్లబడిపోతుంది. ఈ కారణం వలన ఐరన్ అధికంగా ఉన్న ఆహారపదార్ధాలను గర్భవతికి ఇవ్వవలెను. మాంసం , కోడిగుడ్డు , లివరు , తోటకూర , బీరకాయ ఇవ్వవలెను . వీటిలో ఐరన్ ఎక్కువుగా ఉండును.

                 గర్భిణి స్త్రీ రక్తంలో అయోడిన్ అనే ద్రవ్యం సమప్రమాణంలో ఉండవలెను . ఇది తల్లి మరియు గర్భస్త శిశువుకు చాలా అవసరం . దీని లోపం వలన శరీరవికృతి , బుద్ధిమాంద్యం , గండమాల , మిక్సీడోమా వంటి వ్యాధులు సంభవించును . సరైన జాగ్రత్తలు తల్లి తీసుకోకుంటే ఆ స్త్రీకి ఎంతమంది సంతానం కలిగితే అంతమంది లోపముతోనే జనిస్తారు.  ఈ లోపము రాకుండా సముద్రపు చేపలు , కాడ్లివరు ఆయిల్ ఇవ్వడం మంచిది .

     గర్భవతి ఏ ఆహారాన్ని అయినా అతిగా తీసుకోకూడదు . అన్నిరకాల రసాలను సమానంగా తీసుకోవలెను . ఏదన్నా ఒకేరకమైన రసాన్ని ఎక్కువుగా తీసుకొనుచున్న కలిగే దుష్ప్రభావాలను ఆయుర్వేదంలో చక్కగా వివరించటం జరిగింది.

               గర్భవతి ప్రతిదినం తీపివస్తువులను అధికంగా తినుచున్న ప్రమేహరోగి , మూగవాడు , స్థూలకాయుడు పుడతాడు. పులుసు అధికంగా తింటే రక్తపిత్తరోగం కలవాడు , చర్మరోగం , నేత్రరోగం కలవాడు పుడతాడు . ఉప్పు అధికంగా తినుచున్న చిన్నవయస్సులోనే శరీరం ముడతలు పడి తలనెరిసినవాడు , బట్టతలవాడు పుడతాడు. చేదు పదార్ధాలు అతిగా తీసుకొనుచున్న క్షయరోగం కలవాడు , బలహీనుడు , పొట్టివాడు లేక శరీరవికృతి కలిగినవాడు పుడతాడు . కారం అధికంగా భుజిస్తే దుర్బలుడు , అల్పశుక్రం కలిగినవాడు , సంతానహీనుడు పుట్టును . వగరు అతిగా తీసుకొనుచున్న నల్లవాడు , ఆనాహారోగం , కడుపు సంబంధ సమస్యలు కలిగినవాడు జన్మించును . మత్స్య మాంస పదార్దాలు ఎక్కువుగా తీసుకొనుచున్న రెప్ప ఆలస్యముగా వేయువాడు లేదా అసలు రెప్పలు వేయనివాడు జన్మించును . మద్యం అధికంగా తీసుకొనుచున్న దప్పికరోగం కలవాడు , స్మరణశక్తి లేనివాడు , చంచల స్వభావం కలవాడు పుట్టును . చాలామంది గర్భిణి స్త్రీ ఆహారం తక్కువ మోతాదులో తీసుకోవాలి అని చెబుతుంటారు. ఇది చాలాపొరపాటు . దీనివలన తక్షణమే చాలారోగాలు జనియించును . తీసుకునే ఆహారం తక్కువ ఉన్నను మూలద్రవ్యాలు అన్ని ఆహరంలో ఉండవలెను . తిన్నదంతా సుఖంగా జీర్ణం కావలెను . గర్భం యొక్క ప్రారంభకాలంలో మరియు వాంతులతో అధికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు తైల సంబంధ ఆహారపదార్ధాలు పనికిరావు. అందుకే ఆరోమాసం వరకు నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పలేదు . అప్పటికి వాంతిదోషం తగ్గును. వాంతుల సమస్య ఉన్నవారు నెయ్యి , వెన్న తీసుకోకూడదు .

            గర్భిణి స్త్రీ కోరిన పదార్ధం ఇవ్వమని ఆయుర్వేదం చెప్తుంది . అది దోష సంబంధ పదార్థం అయితే మాత్రం ఇవ్వరాదు. గర్భిణి స్త్రీలలో చాలామంది మలబద్దకంతో బాధపడుతుంటారు. దీనివలన కొంతమందికి మొలల సమస్య కూడా వచ్చును. ఈ మలబద్దకం రావడానికి ప్రధానకారణం పేగులపైన గర్భం యొక్క ఒత్తిడి పడటమే ఇలాంటి స్థితిలో ద్రవ ఆహారాన్ని ఎక్కువుగా తీసికొనవలెను. ద్రవం ఎక్కువ కలిగిన ఫలాలను తీసుకోవడం మంచిది . బాగా పండిన అరటిపండు కూడా మలబద్ధకమును పోగొట్టును . పొట్లకాయ , బీరకాయ , వంకాయ , తొటకూర , దొగ్గలికూర , పొన్నగంటికూర , క్యాబేజి , కాలిఫ్లవర్ వంటివి మలబంధనాన్ని తొలగించును . గర్భిణి స్త్రీకి విరేచన ఔషదాలు ఇవ్వకూడదు.

No comments:

Post a Comment