Sunday, February 9, 2020

గరవిషము (పెట్టుడు మందు ) గురించి సంపూర్ణ వివరణ - దుషఫలితాలు - చికిత్సలు . pettudu mandu

గరవిషము (పెట్టుడు మందు ) గురించి సంపూర్ణ వివరణ  - దుషఫలితాలు  - చికిత్సలు .

   గరవిషమునకు మరొక పేరే పెట్టుడు మందు. ఇది కృత్రిమ విషము . ఈ గర విషమును స్వలాభపరులైన కొంతమంది స్త్రీలచేత పురుషులకు , పురుషుల చేత స్త్రీలకు ఇతర ఆహారపదార్థాలలో కలిపి పెట్టుచుందురు. దీనిని కృత్రిమంగా తయారుచేయుట వలన కృత్రిమ విషం అని అందురు. దీనిని చేతిగోళ్ళు , రజస్సు, వెంట్రుకలు , వివిధ జంతువుల అవయవములు , మలములు , కొన్ని ఔషధ భస్మములు , అల్పవీర్యములు కలిగిన స్థావర, జంగమ విషముల నుంచి కలిపి తయారుచేయును .

 కృత్రిమ విషము సేవించిన వానికి కలుగు ఉపద్రవములు  -

 *  పాండురోగం వచ్చి శరీరం నానాటికి కృశించిపోవును.

 *  అగ్నిమాంద్యం కలిగి జీర్ణశక్తి తగ్గును.

 *  దగ్గు, ఆయాసం , జ్వరం కలిగి దానివలన వాతము ప్రతిలోమముగా ఉండి అతినిద్ర, విచారం కలుగును.

 *  స్ప్లీన్ మరియు కాలేయం చెడి ఉదరరోగములు కలిగి కడుపుబ్బరం , కాళ్లుచేతులు సన్నగిల్లును. బలహీనత కలుగును.

 *  క్షయరోగం కలిగి దుస్వప్నములు కలుగును.

           ఒక్కోసారి ఈ ఉపద్రవములతో పాటు ఇతరవ్యాధులు కూడా సంభవించి రోగి మరణించవచ్చు. అందువలన కృత్రిమ విషములు సేవించినవానికి వెంటనే చికిత్స చేయవలెను .

 శరీరం నందు కృత్రిమ విషము ఉన్నదో లేదో తెలుసుకొనుటకు పరీక్ష  -

      కుడి అరచేతిని గుంటలా చేసి దాని యందు కాకరాకు పసరు కాని పత్తి చెట్టు ఆకు పసరు కాని పోసి కొంచం సేపు ఉంచి అరచేతిని వంచిన ఆ పసరు గడ్డలా మారి కిందపడును.

       పైన చెప్పిన విధముగా జరిగినచో ఆవ్యక్తి శరీరం నందు కృత్రిమవిషము ఉన్నట్టుగా పరిగణించి వెంటనే చికిత్స ప్రారంభించవలెను .

 చికిత్సలు  -

 *  కృత్రిమ విషము తినినవారికి వెంటనే వమనము చేయించి తామ్రభస్మమును తేనెతో కలిపి ఇచ్చినచో హృదయము శుద్ది అగును. తదుపరి స్వర్ణభస్మమును ఇవ్వవలెను. పథ్యకరమైన ఆహారములు ఇవ్వవలెను.

 *  హేమామాక్షిక భస్మము , స్వర్ణభస్మము తేనె మరియు పంచదారతో కలిపి నాకించవలెను.

 *  చాగ , తిప్పతీగ , గ్రంధితగరం , పిప్పళ్లు , చేదు పొట్ల , చవ్యము , చిత్రమూలం , వస , తుంగముస్తలు , వాయువిడంగములు వీటన్నింటిని సమానభాగాలుగా తీసుకుని చూర్ణం చేయవలెను . ఆ చూర్ణమును మజ్జిగతోగాని , గోరువెచ్చటినీటితో కాని , పెరుగు మీద తేటతోగాని , నిమ్మకాయ రసం వంటి పుల్లటి రసములతోగాని ఇచ్చిన విషము వలన అగ్నిమాంద్యం శమించును .

 *  పావురం యొక్క మాంసం , కచ్చోరములు , పుష్కరమూలం వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని ఒక పాత్రలో వేసి పైనచెప్పిన వాటి నాలుగు రెట్లు నీరుపోసి బాగా చిక్కగా అయ్యేంతవరకు కషాయం కాచి చల్లారిన తరువాత లోపలకు ఇవ్వవలెను . దీనివలన కృత్రిమ విషము , దప్పిక, దగ్గు, ఆయాసం , ఎక్కిళ్లు , జ్వరం హరించును .

 కృత్రిమ విషము తిన్నవారికి ఆయా లక్షణములకు స్వర్ణభస్మంతో చికిత్స -

 *  పాండురోగమునకు పునర్నవ , ద్రోణపుష్పి , కాకజంగల వీని చూర్ణ అనుపానములతో స్వర్ణభస్మం ఇవ్వవలెను .

 *  అగ్నిమాంద్యమునకు ఉత్తరేణి చెట్టు సమూలరసముతో స్వర్ణభస్మం ఇవ్వవలెను.

 *  దగ్గు, ఆయాసం , జ్వరములకు సరస్వతి , శంఖపుష్పి , అడ్డసరం  స్వరసముతో కలిపి స్వర్ణభస్మమును ఇవ్వవలెను.

 *  ఉదరరోగములకు వెంపలి , వావిలి , భృంగరాజ , పునర్నవ చెట్ల స్వరసముతో స్వర్ణభస్మం ఇవ్వవలెను .

 *  క్షయరోగమునకు అమృతపాశ ఘృతము , చ్యవనప్రాశ లేహ్యము , వాసవలేహ్యములలో స్వర్ణభస్మం కలిపి ఇవ్వవలెను.

          పైన చెప్పిన విధముగా చికిత్సలు అందించిన కృత్రిమ విషము తినినవాని ప్రాణములు రక్షించవచ్చు . ఇక్కడ ఒక్కటి ముఖ్యముగా గమనించవలసిన విషయం ఏమిటంటే నిత్యం స్వర్ణభక్షణ చేయువానికి ఎటువంటి విషాలు ఏమి చేయలేవు . స్వర్ణభస్మం అనుభవపూర్వక వైద్యులను సంప్రదించి వారి సూచనతోనే వాడవలెను. ఖరీదు ఎక్కువుగా ఉండును. కావున తగినంత స్థోమత కలిగినవారు తప్పక వాడండి.
 

No comments:

Post a Comment