*రక్తహీనత గురించి సంపూర్ణ వివరణ*
మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తి బలహీనం అవుతారు . ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉండును. ఇప్పుడు దీని గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.
* ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది.
* ఆయాసం , ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం , మతిమరుపు ఎక్కువుగా ఉండును. నాలుక మంటగా ఉండును.
* ఐరన్ లోపించటం వలన వచ్చే రక్తహీనత ఎక్కువుగా ఉండును.
* సరైన ఆహారం తీసుకోకపోవటం , సరైన వ్యాయామం చేయకపోవటం వలన కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవును .
* వ్యాధినిరోధక శక్తి తగ్గటం వలన అంటువ్యాధులు వీరికి త్వరగా వచ్చే అవకాశం కలదు. అందువలన ఆహారం నందు ఐరన్ ఎక్కువుగా ఉన్నవి తీసికొనవలెను.
* శరీరానికి కావలసిన ఐరన్ లభించుటకు పండ్లు , పుట్టగొడుగులు , ఆకుకూరలు , తీగకు కాసే కాయగూరలు , ఖర్జురము , తేనె , సోయాబీన్స్ , బీన్స్ సమృద్దిగా తీసుకోవాలి .
* వైట్ బ్రెడ్ , స్వీట్స్ , పంచదార , వేపుళ్లు , నిల్వపచ్చళ్ళు , మైదాపిండి మొదలగునవి వాడరాదు.
* కూరలలో నిమ్మకాయ పిండుకోవాలి. ఐరన్ శరీరం గ్రహించాలి అంటే C విటమిన్ అవసరం ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడటం కంటే ఆహారం ద్వారా సహజంగా ఐరన్ శరీరానికి అందించడం ఉత్తమం .
* తేనె వాడితే కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది. ఖర్జురములో ఐరన్ బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి.
* రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి వస్తుంది.
* మద్యపానం , ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువుగా చేస్తాయి .
రక్తహీనత కొరకు నేను ప్రయోగించిన అనుభవయోగం -
ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి ఉదయం మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు ఇవ్వడం జరిగింది . ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఒక ఆపిల్ పండు తినిపించడం చేశాను . కేవలం నలభై రోజులలోనే శరీరం నందు సంపూర్ణంగా రక్తం వృద్ది అయ్యినది. దానిమ్మ జ్యూస్ కొరకు ఉపయోగించే కాయలు తియ్యగా పెద్ద సైజు తో ఉండేవి తీసుకోండి . దానిమ్మ జ్యూస్ తాగలేనివారు ఆపిల్ జ్యూస్ నందు కూడా గోధుమగడ్డి చూర్ణం కలుపుకుని తాగవచ్చు .
No comments:
Post a Comment