💐💐మనుష్యులు నిద్రించుటలో మరియు లేచుటలో పాటించవలసిన నియమాల గురించి వివరణ -💐💐
ప్రాచీన కాలంలో పెద్దలు తమ పిల్లలకు నిద్రించు సమయంలో ఎడమవైపుకు తిరిగి పడుకోమని లేచే సమయంలో కుడివైపుకు తిరిగి లేవమని చెప్పేవారు దీనికి ప్రధానకారణం భోజనం చేసిన తరువాత ఆహారం అంతయు జఠరకోశం నందు ఉండును. ఆ ఆహారం జీర్ణం అయ్యిన తరువాత జఠరకోశం నుండి చిన్నప్రేగులలోకి పోవుదారి కుడిపక్కనే ఉన్నది. జఠరకోశం నందు ఎంతకాలం జీర్ణక్రియ జరగవలెనో అంతే సమయం తీసికొనును గాని ఆ సమయం కంటే ముందుగా చిన్నప్రేగులలోకి పోయి జీర్ణక్రియ జరగదు. జఠరకోశంలో 2 నుంచి మూడు గంటల సమయం ఆహారం వచనం జరిగిన అనంతరమే అది చిన్నప్రేగుల్లోకి ప్రవేశించును . ఎప్పుడైతే తిన్న ఆహారం జీర్ణం కాదో అప్పుడు జీర్ణకోశంలో కొన్ని తొందరలు ఉత్పన్నం అగును. దీని పరిణామముగా సరిగ్గా నిద్రరాకపోవుట , పీడకలలు , చిన్నగా కడుపునొప్పి రావడం జరుగును.
అదేవిధంగా హృదయం శరీరానికి ఎడమవైపు ఉండును. హృదయము నుండి శుద్ధరక్తం దేహమునందలి అన్ని అంగములకు సరఫరా చేయు ముఖ్యరక్తనాళం "అయోర్టా" ఇది హృదయమునకు కుడిభాగం నుండి మొదలగును. మనం రాత్రి సమయం నందు కుడివైపుకు తిరిగి పరుండిన అయోర్టా నాళము నుండి ప్రవహించు శుద్ధరక్తం కొంచం ఎక్కువుగా స్రవించును. ఈ ఎక్కువ అయిన శుద్ధరక్తం రాత్రిపూట అనగా మనం రాత్రిపూట అనగా మనం నిద్రించు సమయంలో శరీరపు అంగాగములకు ఎక్కువ పరిణామములో అక్కరలేదు. మితముగా రక్తం సరఫరా అయినను చాలు . ఇందుచే ఈ అంగములకు ఎక్కువ పనిలేక కావలసినంత విశ్రాంతి చిక్కును. ఇది ఆరోగ్యముకు చాలా మంచిది .
మనము కుడివైపుకు తిరిగి నిద్రించిన మనం తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణంకాక మునుపే జఠరకోశం నుండి చిన్నప్రేగులలోకి బలవంతంగా ( ఒత్తిడి ) ప్రవేశించే అవకాశం ఉన్నది. దీనివలన కడుపులో వికారాలు కలిగే అవకాశం ఉన్నది. అందువలనే ఎడమవైపు తిరిగి మాత్రమే పడుకొనవలెను . అదేవిధంగా శరీరం నందలి కొన్ని అంగములు విశ్రాంతి లేకుండా పనిచేయును అందులో ముఖ్యమైనది హృదయం . మనం నిద్ర నుండి మేల్కొని లేచునప్పుడు ఎడమవైపు తిరిగి లేచిన శరీరపు కొద్ది భారం ఎడమవైపు ఉన్న హృదయంపైన పడును. ఇందుచే హృదయమునకు కొద్దిగా తొందర కలుగుటచే క్రమేణా హృదయం తన శక్తికి కోల్పొయి బలహీనంగా పరిణమిస్తుంది. అందుకే కుడిపక్కకు తిరిగి నిద్ర నుండి లేవవలెను
.
No comments:
Post a Comment