Monday, February 10, 2020

శరీరం పైన ఏర్పడు మచ్చల నివారణ కొరకు సులభ యోగాలు - pimples and its cure

శరీరం పైన ఏర్పడు మచ్చల నివారణ కొరకు సులభ యోగాలు  -

       శరీరం పైన వివిధ కారణాల వలన అనేక రకాలైన మచ్చలు ఏర్పడును . అటువంటి మచ్చలు కొరకు ఇప్పుడు నేను చెప్పబోవు యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని పాటించి సమస్య నుంచి బయటపడగలరు.

 మచ్చల నివారణాయోగాలు  -

 *  పచ్చి బొప్పాయిని గిల్లినప్పుడు వచ్చే పాలను రాయుచున్న మచ్చలు తగ్గును.

 *  అవిసె గింజల నూనెను ప్రతిరోజు రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చలు మాయం అగును.

 *  గోధుమపిండిని పులియబెట్టిన కడుగులో కలిపి మచ్చలపైన ప్రతినిత్యం పూయుచున్న మచ్చలు హరించును .

 *  జీడిమామిడి గింజల పైపెచ్చులు నలగగొడితే వచ్చే నూనెని మచ్చలపైన రాయుచున్న త్వరగా మచ్చలు హరించును .

 *  కొంచం నీటిలో పసుపు వేసి చిక్కగా కలిపి రోజూ రాయుచున్న శరీర మచ్చలు తగ్గును.

 * మంచి నాణ్యమయిన కుంకుమపువ్వు నీటితో తడిపి మచ్చల పైన పూయుచున్న మచ్చలు తగ్గును.

 *  ప్రతినిత్యం జాజికాయ అరగదీసి ఆ గంధాన్ని రెండుపూటలా మచ్చల పైన రాయుచున్న మచ్చల నివారణ అగును.

 *  నేలతంగేడు వ్రేళ్ళను తీసుకొచ్చి నీడలో ఎండించి ఎండిన వేళ్ళను నీటితో అరగదీయగా వచ్చిన గంధాన్ని మచ్చలపైన రెండుపూటలా రాయుచున్న మచ్చలు నివారణ అగును.

         నేను పైన చెప్పిన యోగాలు మచ్చల నివారణలో అత్యద్భుతముగా పనిచేయును కొన్ని రొజులపాటు విడవకుండా పాటించండి. మచ్చలు పోవడం కొంచం కష్టసాధ్యముగా ఉండును. పైన చెప్పిన ఔషధయోగాలలో మీకు సులభమయినది విడవకుండా వాడండి. తప్పక ఫలితాన్ని పొందుతారు.

No comments:

Post a Comment