Sunday, February 9, 2020

about guava leaves

*ఇది చదివిన తర్వాత జామ కాయల కంటే జామ ఆకులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.* 

మనిషి జబ్బు బారిన పడ్డ తర్వాత మందులు వేసుకోవడం ప్రారంభిస్తాడు.

అయితే ఆ జబ్బులను రాకుండా చూసుకోమంటే మాత్రం అశ్రద్ద చేస్తారు.

ఎన్నో జబ్బులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు.క్యాన్సర్‌తో సహా ముందు నుండి జాగ్రత్తగా ఉంటే దూరంగా ఉంటాయి.

కాని ఈ బిజీ షెడ్యూల్స్‌, జీవితాల వల్ల ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం అనేది అసాధ్యం.

కాని మీరైనా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని హెల్త్‌ను కాపాడుకోండి.

జామ చెట్టుకు ఉండే లేత ఆకులను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలను ఇప్పుడు మీరు తెలుసుకోండి.

జామ ఆకుల్లో ట్యానిక్స్‌, ఆక్సలేట్‌ లు ఉంటాయి.అవి మంచి యాంటీ బయోటిక్స్‌గా పని చేస్తాయి.

అందువల్ల పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.నోట్లో పూత, పుండ్లు, గొంతు నొప్పి ఉన్న వారు లేత జామ ఆకుల్ని నమిలి కొద్ది సమయం నోట్లోనే ఆ పిప్పిని చప్పరించాలి.ఆ తర్వాత ఆ పిప్పిని ఉమ్మి వేసినా పర్వాలేదు, లేదంటే మింగేసినా పర్వాలేదు.రోజులో ఉదయం, సాయంత్రం ఇలా రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

లేత జామ ఆకుల్ని నీటిలో మరిగించి, ఆ తర్వాత నీటి నుండి ఆకుల్ని వేరు చేసి ఆ నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్యతో పాటు, జలుబు వెంటనే తగ్గుతుంది.కడుపులో సమస్య ఉన్నా కూడా ఈ నీటి వల్ల ఉపశమనం పొందవచ్చు.
వారంలో ఒకటి లేదా రెండు సార్లు జామ ఆకు కషాయం(జామ ఆకు చూర్ణంను వెడి నీటిలో వేయాలి)ను తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్‌లకు దూరంగా ఉండవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు.

జామ ఆకు కషాయం అనేది శరీరంలోని కొలెస్ట్రాల్‌ లెవల్‌ మోతాదులో ఉండేలా చూస్తుంది.జామ పండు తినడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి.అయితే జామ ఆకు ఇంకా ఎక్కువ ఉపయోగదాయకం.

అందుకే జామాకు గురించి అందరికి తెలిసేలా ఈ విషయాన్ని షేర్‌ చేయండి

No comments:

Post a Comment