Sunday, February 9, 2020

వృక్షాయుర్వేదం అను అత్యంత ప్రాచీన గ్రంథ విశేషాలు -

వృక్షాయుర్వేదం అను అత్యంత ప్రాచీన గ్రంథ విశేషాలు  -

          ఈ వృక్షాయుర్వేద గ్రంధమును మొట్టమొదటిసారిగా "సురాపాలుడు " అనే అతను రాసాడు . ప్రస్తుత కాలంలో ఈ గ్రంథం యొక్క పూర్తి ప్రతులు దొరకడం లేదు . నాకు లభ్యం అయినంత వరకు మీకు తెలియచేస్తున్నాను . నాగర లిపిలో మాత్రం లండన్ లోని బాడ్లి యన్ గ్రంధాలయలంలో ఒక ప్రాచీన ప్రతి ఉన్నది. తెలుగులో కొన్ని బాగాలు మాత్రమే మిగిలాయి. అవే మీముందు ఉంచుతున్నాను.

 *    కొబ్బరి చెట్లకు ఎక్కువు గా కాయలు కాయలంటే ప్రతి రోజు " మరువం , పెసలు, మిణుములు" ఈ మూడింటి తో తయరు అయిన కషాయాన్ని చల్లార్చి పోస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ ముడింటి ముద్దను చెట్ల మొదళ్లకు పట్టించాలి. అలా చేయడం వలన కొబ్బరి చెట్టు కి విపరీతమైన బలం వస్తుంది. చాలా పెద్ద మొత్తం లొ కాయలు కాస్తూ యవ్వనం గా తయారు అవుతుంది.

 *    మల్లెపూలు తెల్లగా ఉంటాయని మనకు తెలుసు.వాటిని ఎరుపు రంగులో పూయించ వచ్చు. పారిజాతం ( పగడ మల్లె ) చెట్టు వేరుకు రంధ్రం చేసి ఆ రంద్రం లొ మల్లె తీగను తీసుకొచ్చి గుచ్చాలి.ఆ తరువాత దానిపై మట్టి కప్పాలి. రోజు నీళ్లు పొస్తూ ఉంటే పారిజాతం తో పాటు మల్లె చెట్టు కుడా కలిసిపోయి పెరుగుతుంది. ఆ తరువాత భూమిని తవ్వి మల్లె వేరుని పారిజాతం నుంచి వేరు చేసి విడిగా పాతి పెడితే కొద్ది రోజుల్లోనే తెల్ల మల్లె చెట్టు ఎర్ర మల్లె పూలు పూస్తుంది.మంచి సువాసన కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఏ చెట్టు విత్తనాలు అయినా నాటి వాటికి ఏ రంగు నీళ్లు అయితే పోస్తామో ఆ రంగు పువ్వులే పూస్తాయి.

 *   మునగ చెట్టుకి కాసిన మునగ కాయలు చెట్టు మీదే పండి ఎండిన తరువాత వాటిని సేకరించాలి. ఆ కాయలను సగం విప్పదీసి , అందులోని మునగ గింజలని తీసివేసి వాటి స్థానం లొ కాకర గింజల్ని పెట్టి , దారం తొ కాయని గట్టిగా చుట్టి భూమిలో పాతి పెట్టాలి. కొన్నాళ్ళకి చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టుకి ఒకవైపు మునగ కాయలు, మరోవైపు కాకరకాయలు పుడతాయి.

 *   విత్తనాలు లేని కాయలు కాయలంటే  వంకాయ,గుమ్మడి కాయ , పొట్ల కాయ మొదలయిన చెట్ల విత్తనలని వస రసం లొ నానబెట్టి భుమి లొ పాతి పెట్టాలి.చెట్లు మొలిచేవరకు ప్రతి రోజు వస నీళ్ళను పాదుల్లో పోయాలి.ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే చెట్లు ఆరోగ్యం గా పెరిగి గింజలు లేని పెద్ద కాయలు కాస్తాయి.

 *   కొన్ని పువ్వులు ఎంతో అందం గా ఉంటాయి.కాని వాటికి సువాసన ఉండదు.అలాంటి పూల చెట్టుకి ప్రతి రోజు " చెంగల్వ కోస్టు ,ఆకుపత్రి, సారాయి,తుంగ ముస్థలు , తగిరస, వట్టివేళ్ళు,"మొదలయిన ఔషధ చుర్ణముని నీళ్లలో కలిపి ఆ నీళ్లను చెట్ల పాదుల్లో పొస్తూ ఉంటే క్రమం గా ఆ చెట్లకి పూచే పూలకి అద్బుతమైన సుగంధం అబ్బుతుంది. ఒక నెల వరకు పూల సువాసనలు గుబాలిస్తునే ఉంటాయి.

 *   నేరేడు , పనస, మామిడి, దేవదారు, నిమ్మ  ఈ మొక్కల యెక్క బీజములను పాలలొ తడిపి నేయి , గోమయము, వాయు విడన్గాముల చూర్ణం వీటినన్నిటిని కలిపి బాగా మర్దన (పిసికి) నాటవలెను.

  *   పనస, అశోకము, అరటి, నేరేడు , దానిమ్మ,, జువ్వి , ఉశిరిక , మాదిఫలం, అడివి చేమంతి ఈ వృక్షములు గడ్డతో గాని , లేక వేరుతో గాని లేక కొమ్మలను గాని నాటినప్పుడు గోమయం పట్టించి నాటవలెను.

 *   అరిటి మొదలగు చెట్ల యెక్క గడ్డలకు గాని , తక్కిన చెట్ల వేళ్ళకు గాని వట్టివేళ్ళ చూర్ణం , నువ్వుల పొడి, తేనే , వాయు విడన్గాముల చూర్ణం , గోలిమిడి విత్తనాల చూర్ణం , నేయి , గోవు మలం వీనిని కలిపి పట్టించి నాటవలెను.

 *   బీజములకు వాయు విడంగాల కషాయం, నేయి చేర్చి పొగ వేసి , నేల ములక లేక వాకుడు చెట్టు సములంగా కాల్చిన బూడిదను , కురం అనెడి పక్షి మలమును కాల్చిన బూడిద ఈ రెంటిని పాలలొ కలిపి బీజములకి పట్టించి ఆ తరువాత 5 రోజులు ఎండబెట్టి అటు పిమ్మట ఆవు పెడ , ఆవు మూత్రం వీనితో పిసికి ఒక్క దినం నానబెట్టి నాటిన యెడల బీజములు త్వరగా వృద్దిని పొందును.

*   వాయు విడంగాల కషాయం, తేనే చేర్చి విత్తనాలకు పట్టించి నాటిన యెడల శీగ్రంగా మొలుచును. విత్తనములు వేసిన చోట గడ్డిచే కప్పి పాలును, నీళ్లను కలిపి చల్లుచుండ వలెను. విత్తనములు మొలచిన తరువాత ఆ గడ్డిని తీసివేసి ఎండ తగులు నట్టు చేయవలెను .

 *   వసుదేవి ! భవా ! పున్యదేవి ! వనే ! సుభగే ! అను మంత్రమును నమస్కార పూర్వకముగా జపించిన యెడల వృక్షములు వ్రుద్ధినొన్ధును .

 *   శాశాకరాయ ! ఇంద్ర ఈహ ! త్రయంబక అను మంత్రములలో నొక దానిచే మంత్రించిన బీజములును నాటిన యెడల చక్కగా ఫలించి మంగలమొసుగును .

 *   48 అంగుళముల లోతున, అంతే వెడల్పు గల పల్లమును ద్రవ్వి అందు ఇసుకను తీసివేసి అందులొ మెత్తని మన్ను వేసి చెట్ల మొదలలను నీటితో తడిపి నాటవలెను.

 *   చెట్లు నాటునప్పుడు ఒకదానికి ఒకటి ఉండవలసిన దూరం 20 మూరలు ఉత్తమం, 16 మూరలు మాధ్యమం, 12 మూరలు అధమం.అని తెలియును . ఈ విదంగా వృక్షములు నాటిన వ్రేళ్ళు,కొమ్మలు మొదలగునవి ఒకదానికి ఒకటి పెనవేసుకోకుండా చక్కగా పెరగడమే కాకుండ మంచి ఫలములు ఇచ్చును.

 *   దృవ నక్షత్రములు అనెడి రోహిణి , ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాబాధ్ర, మరియు మృదు నక్షత్రములు అనెడి చిత్త, రేవతి , మృగశిర, అనురాధ నక్షత్రములు, మూల , విశాఖ, పుష్యమి, శ్రవణం, అశ్విని, హస్త ఈ నక్షత్రాలు వ్రుక్షరోపనకి మంచివి. అనగా పంట వేయడానికి , మొక్కలు నాటుటకు మంచిది అని త్రికాలవేత్తలు ప్రవచించారు.

 *   మిడతలు, ఎలుకలు, పక్షులు , చీమలు మొదలగు వాని వలన చెట్లకు  నష్టం కలుగుతున్నప్పుడు పైన చెప్పిన మంత్రం 108 సార్లు జపించి ఆ చెట్లకు మంత్రం వ్రాయవలెను.

 *   పిడుగు పడి కాలిన చెట్టు యెక్క బూడిద లేక దావాగ్ని చేత కాలిన చెట్ల బూడిద నైనను చల్లినచో మంచు వల్ల ఎండిన చెట్ల దొషం నివృత్తి అగును.

 *   తెల్లని అన్నం లొ పెరుగు , ఉప్పు కలిపి చెట్లకు చల్లిన మనుజుల దృష్టి వలన కలిగిన దొషం నివృత్తి అగును.

 *   ఆషాడ, శ్రావణ, మాసముల యందు విత్తనములు వేయుటకు , చెట్లు నాటుటకు ప్రశస్తం .
గ్రీష్మ ఋతువు ( చైత్ర వైశాక మాసములు ) నందు తప్ప తక్కిన రుతువుల యందు లేత నారు నాటవచ్చు అని కొందరు చెప్పెదరు.

 *  మఖ, ఫాల్గుణ మాసములు యందు కొమ్మలు విడవని చెట్లు నాటవలెను. మార్గశిర, పుష్య మాసం యందు కొమ్మలు విడుచునట్టి నారు నాటవలెను. శ్రావణ , భాద్రపద మాసములు యందు పెద్ద చెట్లు నాటవలెను.

 *  చెట్లు ఫలించు నట్టి కాలం యందు ఉలవలు, మిణుములు, పెసలు , యవలు, నువ్వులు వీనిని చేర్చి కషాయం పెట్టి చల్లర్చిపోసిన యెడల మంచి ఫలములు ఇచ్చును. బాగుగా వృద్ది చెందును.

    

No comments:

Post a Comment