ఆయుర్వేదము నందు పుష్పములతో కూడా వ్యాధిని నివారించు కొన్ని యోగములు ఉన్నాయి . ప్రస్తుతకాలంలో దీనినే "Flower theraphy "గా పిలుచుచున్నారు. పురాతనకాలంలో కొంతమంది ఆయుర్వేద వైద్యులు పువ్వులతో కొన్ని రకాల పరిమళ ద్రవ్యాలు తయారుచేసి వాటి సువాసనని ముక్కుద్వారా లోపలికి పీల్పిస్తూ రోగనివారణ చేసేవారు . అటువంటి వైద్యవిధానము గురించి ఇప్పుడు మీకు సవివరముగా తెలియచేస్తాను .
ఇజ్రాయిల్ దేశములో కుమ్రాన్ గుహలలో తవ్వకాలు సాగించిన " యొసిపాట్రీ " " చే " అను ఒక పురాతత్వ శాస్త్రజ్ఞునికి ఒక పాత సీసా కనిపించింది .దాని యందు ఒకరకమయిన నూనె ఉన్నది. ఆ సీసాను పరిశోధనకు పంపగా అది దాదాపు రెండువేల సంవత్సరముల నాటిదిగా తేలినది. అప్పటి మహారాజులు ఒక రకమైన సువాసన తో కూడిన ఔషధతైలాన్ని ఆ సీసా యందు నిలువ ఉంచి వాడుకొనేవారట . దాని యందలి సువాసనభరితమైన ఔషధతైలం ఇన్ని సంవత్సరాలు గడిచినను ఏ మాత్రం చెక్కుచెదరక గుమగుమలాడుచుండెను. ఈజిప్టు దేశములోను ఇప్పటికి ఇటువంటి సీసాలు బయటపడుతున్నాయి.
పువ్వుల నుంచి తీసిన పరిమళద్రవ్యాలు రోగనివారణలో ప్రముఖపాత్ర వహించుచును అని ఆయుర్వేద తంత్రకర్త చరకుడు తన చికిత్సాసారమున తెలియచేస్తూ గంధము , గోరింట, వట్టివేళ్లు , తామర , కలువ మున్నగు వాటితో సిద్ధముచేసిన తైలములతో చికిత్స చేయు విధానాన్ని వివరించాడు. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ వినయ గోగే పుష్పజాతులను గురించి అనేక పరిశోధనలు జరిపి ఎనిమిది సంవత్సరముల పాటు విస్కృతముగా పరిశోధించి పుష్పాల యొక్క అద్బుత సువాసనలతో అనేక రోగాలను నయం చేయవచ్చు అని తెలిపెను .
సుఖాంతి అను పరిమళము నిర్ణీత సమయమున నిత్యం పీల్చడం వలన ఉబ్బసం వంటి శ్వాశకోశ సంబంధ వ్యాధులు నయం అగును. చంద్రమోహ పుష్పముల సుగంధం మానసిక వ్యాధులకు విరుగుడుగా పనిచేయును . " పవనాలి " అను పువ్వులు రక్తపోటుకు దివ్యమైన ఔషధము కాని ఈ పువ్వులు హిమాలయ ప్రాంతమున మాత్రమే లభించును.
ఇప్పుడు మీకు ఇక్కడ లభ్యం అయ్యే పువ్వులద్వారా ఎటువంటి సమస్యలు నివారించుకోవచ్చో మీకు తెలియచేస్తాను .
* చేమంతి -
దీనిలో అడివి చేమంతి అని మరొక రకము కూడా కలదు. ఈ చెట్టు పువ్వుల నుంచి తీసిన అరకు మూర్చ , శ్వాస , తాపము , అరుచిని పోగొట్టును . దీని పువ్వులు మరియు ఆకులలో చామాజులెన్ , కుమారిక్ , కాంఫర్ , బోర్నియోల్ , టర్ఫేనిస్ మున్నగు ముఖ్యమైన చేదు తైలాలు కలవు . వానికి అలర్జీలు అరికట్టు గుణములు ఉన్నవి. కావున జేబురుమాలకు దీని నుంచి తీసిన అత్తరు అంటించి వాసన చూచుచున్న అలర్జీ ఉన్నవారికి రక్షణకవచముగా పనిచేయును .
* తులసి -
తులసి దళములను ఒక గుచ్ఛముగా కట్టి వాసన పీల్చుచుండిన యెడల తలబరువుగా ఉండటం , తలనొప్పి , పడిశెము , రొమ్ములో పేరుకున్న కఫ సమస్య , గొంతునొప్పి , తలతిరుగుడు , పైత్యవికారము , ముక్కులలో క్రిమి నశించును.
* నీలగిరి -
దీని ఆకులను , పువ్వులను నలిపి వాసన చూచుచుండిన యెడల వగర్పు , దగ్గు , తలనొప్పి , ముక్కుదిబ్బడ , చెవులదిబ్బడ , దంతశూల , పడిశము , ముక్కు వెంట నీరుకారు రోగము నశించును.
* కుంకుమపువ్వు -
నాలుగైదు గులాబి పువ్వు నుంచి తీసిన అరకులో పావుగ్రాము ప్రమాణం గల కుంకుమ పువ్వుని అరచేతిలో వేసుకొని బాగుగా రుద్ది వాసన చూచుచుండిన యెడల తీవ్రమైన తలనొప్పి , కంటి మంట , ముక్కు నుంచి వచ్చు దుర్గన్ధము , మతిలేకుండా ప్రవర్తించుట , జలుబు , మూర్ఛవ్యాధి నశించును.
* ఉల్లిపూవ్వు -
ఉల్లి పువ్వుని లేదా గడ్డను ముక్కలుగా తరిగి వాసన చూచిన యెడల తేలు , కందిరీగ , జెర్రి విషములు నశించును. దీనికి తోడుగా తాంబూలంలో వేసే సున్నం , నవాసారం శెనగ గింజ అంత వేసి కలిపి అరచేతిలో వేసుకొని నలిపి వాసన చూసిన తక్షణమె బాధ తగ్గును. జలుబు , దంతశూల , నేత్రశూల కూడా తగ్గును.
* వెల్లుల్లి -
దీనిలో సల్ఫర్ ఆక్సయిడ్ , సల్ఫర్ అయోడిన్ , గార్చిసిన్ మున్నగు రసాయనాలు , A , B1 , B2 విటమిన్లు కలవు. ఇది మిక్కిలి ఘాటైనది. ఇది ఎంతటి దుర్గన్ధము కలదియో అంతకు వందరెట్లు మేలు చేయును . దీనిని దంచి లేదా నలిపి వాసన చూసిన యెడల పడిశము , తలభారం ,మూర్చ , తలపోటు , నేత్రశూల నివారించును. తులసి , అల్లముతో కలిపి ముక్కులో పిండిన మూర్చరోగము యందు విశేష ఫలితాన్ని ఇచ్చును. దీనిని కడుపులొకి వాడిన కృమి , ఉదరశూల , గ్యాస్ , కీళ్ళపట్లు , ఆస్తమా , రక్తపోటు తగ్గును.
పుష్పములతో మరియు వాటి సువాసనలతో వైద్యం చేయు విధానం - 2 .
అంతకు ముందు పోస్టులో మీకు కొన్ని రకాల పుష్పాలు మరియు కొన్ని రకాల మూలికల సువాసనలతో వైద్యం చేయు విధానం గురించి చెప్పాను . ఇప్పుడు మరికొన్ని విషయాల గురించి తెలియచేస్తాను.
* పుదీన -
దీని ఆకులను నలిపి వాసన చూచుచున్న యెడల నోటికి రుచి లేకపోవటం , అగ్నిమాంద్యము , నోటి దుర్గన్ధము , తలభారం , దగ్గు , జలుబు నశించును. కూరలు మరియు పచ్చడులలో వాడిన మరింత రుచిని కలిగించును.
* కొత్తిమీర -
దీనిని నలిపి వాసన చూచుచుండిన వాంతులు అరికట్టును. తరచుగా వచ్చే ఎక్కిళ్లు నివారణ అగును. మనసుకు ప్రశాంతత కలగచేయును. తలనొప్పి హరించును .
* దాల్చినచెక్క -
శ్రీలంక యందు దీని చెట్లు ఉండును. దీని ఆకును లేదా చెక్కను బట్టి పద్ధతి ద్వారా తైలము తయారుచేస్తారు. దీని వాసన చూసిన లేదా తలకు ఈ తైలం పట్టించుట ద్వారా దీర్ఘ కాలం నుంచి పీడిస్తున్న తలనొప్పి , జలుబు , పొడిదగ్గు నివారణ అగును. కడుపులోకి ఇచ్చిన కడుపునొప్పి , కడుపుబ్బరం , అతిసారం , రక్తపిత్తం , తెల్ల కుసుమ తగ్గును. పాముకాటు దగ్గర రక్తం పిండి దీని అరకు అంటించిన యెడల విషము విరిగిపోవును .
కొన్ని శరీరానికి మత్తును ఇచ్చేటువంటి పుష్ప సువాసనలు కూడా ఉన్నాయి. వాటి గురించి వివరిస్తాను.
* గోరింట పూల గుత్తులను వాసన చూచుచుండిన లేదా తలకింద పెట్టుకుని నిద్రించిన యెడల గాఢనిద్ర పట్టును .
* వెలగచెట్టు యొక్క ఆకు వాసన చూసిన యెడల వాంతులు ఆగిపొవును . ఆ ఆకులను తలకింద వేసుకొని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .
* గసాలు ఒక స్పూన్ తీసుకుని నాలుగు చుక్కలు నెయ్యివేసి గంటె లో వేయించుకుని సన్నని బట్టలో పొట్లము కట్టి వాసన చూచుచున్న యెడల గాడనిద్ర పట్టును .
* దవనం , మరువం , జాజి , జాపత్రి , యాలకలు , చందనం , కురువేరు వాటి యొక్క తైలాలు గాఢనిద్రను తెచ్చును.

No comments:
Post a Comment