Monday, February 10, 2020

కందలో ఏముంది అనుకునేరు kanda dumpa

కందలో ఏముంది అనుకునేరు.. కందలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కందలో పీచు, విటమిన్ సి, విటమిన్ బి, మాంగనీస్, పొటాషియం, ఇనుము వంటి ధాతువులు వున్నాయి. అజీర్తి సమస్యలను ఇది దూరం చేస్తుంది. ఉదర సంబంధిత రోగాలను ఇది నయం చేస్తుంది. పెద్ద పేగుకు ఇది మేలు చేస్తుంది. వాత సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది.

శరీరంలోని మలినాలను తొలగించడంలో కంద కీలక పాత్ర పోషిస్తుంది. వారంలో రెండు లేదా మూడుసార్లు కందను ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేస్తే హృద్రోగాలను దూరం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్ బరువు తగ్గాలనుకునేవారు.. వారానికి మూడుసార్లు కందను డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది.

రోజూ ఓ పూట కందను తీసుకుంటే.. మొలల వ్యాధి దరిచేరదు. పేగుల్లో రుగ్మతలకు చెక్ పెడుతుంది. మహిళలు కందను తీసుకోవడం ద్వారా నెలసరి సమస్యలను తొలగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment