Sunday, February 9, 2020

లివర్ మరియు స్ప్లీన్ సమస్యలకు సులభ నివారణా యోగాలు - liver and spleen

లివర్ మరియు స్ప్లీన్ సమస్యలకు సులభ నివారణా  యోగాలు -

  ఆయుర్వేదంలో లివరు ని కాలేయం అనియు స్ప్లీన్ ని ప్లీహం అనియు అంటారు. ఇవి కొంచం సున్నితత్వవముతో కూడుకున్నవి వీటి సమస్య వచ్చినపుడు కడుపు ఉబ్బి పెద్దగా అవుతుంది. వీటి సంబంధించిన సమస్యలు నివారణ కొరకు కొన్ని సులభ యోగాలను ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను .

 నివారణా యోగాలు  -

 * కలబంద రసములో పసుపు చూర్ణం కలిపి ఇచ్చుచున్న కాలేయ మరియు ప్లీహ సంబంధ సమస్యలు నివారణ అగును.

 *  చన్నీళ్ళలో మూడు పిప్పళ్లు నూరి ముద్దచేసి పాతబెల్లంతో కలిపి ఇచ్చిన కాలేయ , ప్లీహ సంబంధ దోషాలు నివారణ అగును.

 *  సైన్ధవ లవణం , కరక్కాయలు సమభాగాలుగా తీసుకుని చూర్ణంచేసి పూటకు 3 గ్రాముల చొప్పున వేడినీరు తో కలుపుకుని లోపలికి తీసుకొనుచున్న కాలేయ మరియు ప్లీహ సంబంధ సమస్యలు నివారణ అగును.

 *  తెల్లతెగడ వేరు చూర్ణము 3 గ్రాములు వేడినీటితో కలిపి ఇచ్చుచున్న కాలేయ మరియు ప్లీహ సంబంధ దోషాలు నివారణ అగును.

 *  మోదుగ చెక్క రసం ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న కాలేయ మరియు ప్లీహ సంబంధ సమస్యలు నివారణ అగును.

 *  నేరెడు పండ్లు తరచుగా తినవలెను . మంచిగా పండిన బొప్పాయి కూడా దీనికి అద్భుతముగా పనిచేయును .

 *  ప్రతిరోజు నాలుగు ఉల్లిపాయలు ఉడకపెట్టి తింటూ ఉండవలెను .

 *  దానిమ్మకాయ తొక్క నుండి కషాయం తీసి పూటకు పావుకప్పు లేదా అరకప్పు తాగవలెను .

 కాలేయ సంబంధ సమస్యలు ఉన్నవారు తీసుకోవలసిన మరియు తీసుకొకూడని ఆహారాలు -

 తినవలసిన ఆహారపదార్దాలు  -

     పాతబియ్యపు అన్నం ,  పచ్చపెసరపప్పు కట్టు , బీరకాయ , పొట్లకాయ , చిర్రికూర , చుక్కకూర , పెరుగుతోటకూర , అవిసెకూర , మెంతికూర , పొన్నగంటికూర , చింతచిగురు , వేపపువ్వు , ద్రాక్షపండ్లు , ఆల్బుఖర పండ్లు , నేరేడుపండ్లు , తియ్యని దానిమ్మపండు , వెలగపండ్లు , అల్లం , కరివేపాకు , కొత్తిమీర , పుదీనా , ఉసిరికాయ , చింతకాయ , ఆవునెయ్యి , తేనె , పంచదార మేకమాంసం .

 తినకూడని ఆహారపదార్దాలు  -

        పెరుగు , బెల్లం , పాలు , ఎండకి తిరగర
కూడదు , కోపము , నిప్పుకు దూరంగా ఉండవలెను . కందులు , ఉలవలు , మినుములు , గోధుమలు , వేరుశనగపప్పు , శనగపప్పు , జీడిమామిడిపప్పు , బఠాణీలు , కల్లు , సారాయి , ఇతర మత్తుపదార్ధాలు , ఎండుచేపలు , ఉప్పు చేపలు , కోడి , పంది మాంసములు , పొద్దుటి ఎండకు ఉండరాదు , టీ , కాఫీ , ఫ్రిజ్ నీరు , పాతపచ్చళ్లు నిషిద్దం .

        కాలేయ మరియు ప్లీహ సంబంధ దోషాలు ఉన్నవారు పైన చెప్పిన ఔషధ యోగాలు వాడుకుంటూ ఆహారనియమాలు పాటించిన అనారోగ్య సమస్య నుంచి త్వరగా బయటకి రావడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు. పైన చెప్పిన ఆహారానియమాలు పాటించకుండా మీరు ఇంతగొప్ప ఔషథాన్ని తీసుకున్నను మీ సమస్య ఎప్పటికి తీరదు. కావున తగు పథ్యమును పాటిస్తూ ఔషధసేవన చేయగలరు .

No comments:

Post a Comment