Sunday, August 1, 2021

జీర్ణమండలం-జీర్ణక్రియ digestion

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో 
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
జీర్ణక్రియ (మనం తీసుకున్న ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుంది
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ఆహారం నోట్లో వేసుకోగానే అలా మన శరీరంలో ఒక భాగమై పోతుందా? ఎంత మాత్రం కాదు. ఇక్కడ ఒక అద్భుతకార్యకలాపం మొదలవుతుంది. మానవు శరీరనిర్మాణంలోని ఒక అద్భుత విభాగమయిన జీర్ణమండలంలో జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆహారం నోట్లో వేసుకున్న మరుక్షణమే మొదలవుతుంది..

మన శరీరంలో ఈ జీర్ణక్రియ కొన్ని అవయవాల కలయిక వలన ఏర్పడిన మండలంలో నిర్వహించబడుతుంది. నోట్లో వేసుకున్న ఆహారం నలిపి ముద్దచేయబడి, ఇక్కడ ఊరిన కొన్ని ద్రవాలు కలుపబడి ఇంకా ముందుకు నెట్టబడుతుంది. జీర్ణాశయం అనేచోట మరిన్ని ద్రవాలతో కలుపబడి ఇంకా పలుచన చేయబడి, చిన్న ప్రేవులు, పెద్దప్రేవులలో ఇందులోని పోషకపదార్థాలు పీల్చుకోబడి, లోకి చేర్చబడతాయి. పోషకాలు పోగా మిగిలిన వ్యర్థం మలరూపంలో మలద్వారం ద్వారాను, మూత్రద్వారం ద్వారాను బయటకు నెట్టబడుతుంది. ఇది స్థూలంగా మన శరీరంలో జరిగే జీర్ణప్రక్రియ. ఈ ప్రక్రియలో రెండు ప్రధాన విధానాలున్నాయి. మొదటిది యాంత్రికం. అంటే శక్తి నుపయోగించి ఆహారాన్ని పిండిముద్దగా చేయడం. ఇందుకు తగినట్లుగా శరీరంలో ఆయా ప్రదేశాలలో అందుకు అవసరమైన అమరిక వుంటుంది. ఇక రెండవది రసాయనిక విధానం. యాంత్రిక విధానంలో ముద్దచేయబడిన ఆహారంలోకి కొన్ని రసాయనాలు విడుదల చేయబడి, అందులోని పోషకపదార్థాలను విడగొట్టి, శరీరం పీల్చుకోగలిగే రూపానికి, మారుస్తాయి. అయితే యాంత్రికవిధానంలో సంపూర్ణంగా ముద్దచేయబడితేనే, రసాయనిక విధానంలో పోషకపదార్థాల విభజన సులభతరమవుతుంది. లేకపోతే పోషకాలు వ్యర్థరూపంలో బయటకు వెళ్ళిపోతాయి.

👉జీర్ణమండలం-జీర్ణక్రియ:---

జీర్ణప్రక్రియ అన్నవాహిక (Alimentary Canal) తో మెదలవుతుంది. నోటితో ప్రారంభమయి, మలద్వారంతో ముగిసిపోతుంది. ఈ వాహిక లోపలిభాగం మొత్తం - మ్యూకస్ అనే జిగట పదార్థం పూయబడి వుంటుంది, చిన్న చిన్న గ్రంథులతో నిండి.. వుంటుంది. ఈ గ్రంథులు రసాలు, ఎంజైములను విడుదల చేస్తుంటాయి. ఈ చిన్న గ్రంథులు, కాలేయం, పాంక్రియాస్ (క్లోమం) వంటి పెద్ద గ్రంథులు కూ జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములను విడుదల చేస్తుంటాయి. అయితే ఇవిజీర్ణవాహకకు వెలుపల వుండి, నాళాల ద్వారా దీనితో జత పరచబడి వుంటాయి. ఇవి కూడా జీర్ణమండలంలోని భాగాలే.

👉లాలాజలంతో జీర్ణక్రియ:--

జీర్ణక్రియ నోటితో మొదలవుతుంది. నోటిలోని దంతనిర్మాణం ఆహార పదార్థాలను ముక్కలుగా పగులగొట్టి, నలిపి చిన్న చిన్న కణాల ముద్దగా చేసేందుకు అనువైన రూపంలో వుంటుంది. ఇందుకు నాలుక వాటికి సహకరిస్తుంది. ఇది _యాంత్రికచర్య నోటిలో ఈ క్రియకు సహకరించే లాలాజలాన్ని విడుదల చేసే (Salivary glands) లాలాజల గ్రంథులుంటాయి. ఈ లాలాజలం నోటిలో మెదిపి ముద్దచేయబడిన ఆహారంతో కలిసి, అందులోని పిండి పదార్థాన్ని విరిచి, గ్లూకోజ్ (చక్కెర) మార్చడం మొదలుపెడుతుంది. ఇక్కడ ఈ క్రియ టయలిన్ (Ptyalin) అనే ఎంజైమ్ ద్వారా జరుగుతుంది. పిండి పదార్థం చక్కెరగా మారే ప్రక్రియ దాదాపు నోటిలోనే పూర్తయిపోతుంది. అందుకనే మన పెద్దలు, ఆహారాన్ని బాగా నమిలి నోటిలోని ద్రవరూపంలోకి మారిన తరువాతనే మింగమని చెబుతుంటారు.

మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు మాత్రం నోటిలో నమిలినప్పుడు మోనోశాకరైడ్ అనే సూక్ష్మ అణుపదార్థాలుగా విడిపోతాయి. లాలాజలం వాటిమీద ఏ విధమైన చర్యనూ తీసుకోలేదు. వాటికి ఆమ్లంతో కూడిన ఎంజైమ్ మాత్రమే చర్య జరుగుతుంది.

మనకో సామెత వుంది - 'సరైన విధానంలో పని మొదలు పెడితే, సగం పని పూర్తయిపోయినట్లే !" అని. ఇది ఇక్కడ చక్కగా అన్వయిస్తుంది. నోటిలో ఆహారాన్ని ఎంత చక్కగా నమిలితే జీర్ణాశయంలోకి వెళ్ళిన తరువాత అంత చక్కగా జీర్ణమయి, శరీరానికి పోషణ సంపూర్ణంగా లభిస్తుంది. మన ఆహారంలో పిండిపదార్థానికే ఎక్కువ స్థానం వుంటుంది. కాబట్టి అన్నం ఎంతగా నమిలితే అంతగా ఆ పిండి పదార్థం నోటిలోని లాలాజలంతోనే జీర్ణమయి, చక్కెరగా మారేందుకు అనుగుణమైన రూపాన్ని పొంది శరీరానికి మేలు జరుగుతుంది.

సృష్టిలోని ఒక అద్భుతవిచిత్రం ఏమంటే, మనం తింటున్న ఆహారపదార్థాలలో ఉన్న పిండిపదార్ధ పరిమాణానికి అనుగుణంగా మన నోటిలో లాలాజలం ఊరుతుందట! ఇంతటి నిపుణమైన నిర్మాణం మానవులకు సాధ్యమా? అందుకే మానవశరీరాన్ని దివ్యమైన సృజన అంటారు మరి.
. 👉జీర్ణాశయంలో జీర్ణక్రియ:---

నోటి ద్రవరూపంలోకి మారుతున్న ఆహారం అంగుటి ద్వారా గొంతులోకి ప్రవేశించి, ఆహారనాళం ద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. జీర్ణాశయం ఒక బలమైన సాగే గుణం గల కండరాల సంచి, ఇందులో ప్రవేశించిన ఆహారంలో రకరకాల రసాలు మేళవించబడి, ఈ సంచి కండరాలు బలంగా కదులుతూ, లోపల ఉన్న ఆహారం బాగా మిశ్రమం చేయబడుతుంది.

యాంత్రికపరమయిన రుబ్బడం, దంచడం, పిండిముద్ద చేయడం వంటి పనులు చేసేందుకు అనుగుణమైన, బలమైన, మందమయిన కండరాలతో ఈ సంచి నిర్మించబడి వుంటుంది.

జీర్ణరసాలలో ముఖ్యంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ వంటి ఎంజైములు వుంటాయి. ఇవి మనం తిన్న మాంసకృత్తులపై పనిచేస్తాయి. రెనిన్ అనే ఎంజైం పాల పదార్థాలపై పనిచేసి, దానిలోని పోషకాలను విడదీస్తుంది.

నోటితో పోలిస్తే జీర్ణాశయంలో జీర్ణక్రియ చాలా సమయం తీసుకుంటుంది. ఇది కూడా చాలా కారణాలను పరిగణనలోనికి తీసుకోవలసి వుంటుంది. మొదటిది శరీర ఆరోగ్యం, ఆరోగ్యవంతమయిన శరీరంలో జీర్ణాశయ కండరాలు సమర్థంగా పనిచేసినందువలన, జీర్ణక్రియ సరయిన సమయంలో సమర్థంగా జరుగుతుంది. రెండవది నోటిలో ఆహారాన్ని బాగానమిలిమ్రింగినందు వలన పిండిపదార్ధమంతా అక్కడే జీర్ణం చేయబడి, జీర్ణాశయంపై అదనపు భారాన్ని తప్పించినందు వలన జీర్ణక్రియ వేగవంతం, సమర్థవంతం అవుతుంది. మూడవది సరయిన పరిమాణంలో జీర్ణరసాల విడుదల. నాలుగవది మంచి నాణ్యత గలిగి సమతుల ఆహారపదార్దాలను ఆహారంగా తీసుకోవడం. అలాగే ఎంత అవసరమో అంతే ఆహారాన్ని భుజించడం. ఈ విషయాలన్నీ సమర్థమయిన జీర్ణక్రియకు దోహదపడే అంశాలు.

పైన చెప్పిన ప్రమాణాలన్నీ సక్రమంగా వుంటే మనం తీసుకునే ఆహారం జీర్ణమయ్యేందుకు ఈ పదార్థాలకు ఇంత సమయం పడుతుంది అనే ఈ పట్టికను చూడండి.

1.పప్పు కాయధాన్యాలు-5,1/2-6 గంట లు
2.ధాన్యము గోదాముల వంటి అన్న పదార్థాలు-4 గంటలు ( దాదాపు)
3. ఆకు కాయ కూరలు-3,1/2 గంటలు
4. పలుచని గంజి, సూప్ వగైరాలు-2-2,1/2 గంటలు
(ఇది సరాసరి లెక్క వేసిన పట్టిక వ్యక్తి వ్యక్తికి కొద్దిపాటి తేడాతో ఇది మారుతూ ఉండవచ్చు)
ఇలా అన్ని ప్రమాణాలు పాటించినపుడు సమర్థంగా జరిగే జీర్ణక్రియ ఆరోగ్యవంత మయింది. ఏ ప్రమాణంలో లోపం జరిగినా, అది మిగిలిన వాటిపై ప్రభావం చూ గుపించి అనారోగ్యానికి బీజం పడుతుంది. నోటిలో జీర్ణంకాని పిండిపదార్థం జీర్ణాశయంలో ఎక్కువసేపువుంటే పులిసిపోయి, ఆమ్లం, గ్యాస్ వంటి ఇబ్బందులు, మాంసకృత్తులు ఎక్కువసేపు వుంటే, కుళ్ళిపోయి అనేక అనారోగ్య సమస్యలకు నాంది పలుకుతాయి.

👉డియోడినమ్ జీర్ణక్రియ:-

జీర్ణాశయం తరువాత చిన్నప్రేవులకు ముందుగా సన్నటి గొట్టం అనుసంధానించి వుంటుంది. దీనిని డియోడినమ్ అంటారు. జీర్ణవ్యవస్థలో ఈ అంగానికి చాలా ప్రాముఖ్యం వుంది. పాంక్రియాస్ (క్లోమం) నుండి వచ్చే ట్రిప్సిన్, స్టియాప్సిన్. ఎనైలోప్సిన్, కాలేయం నుండి స్రవించే పైత్యరసం (బైల్ ద్రావణము) - ఇవన్నీ ఈ ప్రదేశంలోనే జీర్ణాశయంలో ద్రవరూపంలోకి మార్చబడి ఇక్కడకు ప్రవేశించిన చైమ్ అనే ద్రావణంతో కలుపబడుతుంది. ఆపైన అక్కడ ఈ క్రింది చర్యలు జరుపబడతాయి.

1. జీర్ణం కాకుండా మిగిలివున్న పిండిపదార్థం, మాంసకృత్తులు మొత్తం ఇక్కడ ప్రాథమిక పోషకాలుగా విడగొట్టబడి, శరీరం పీల్చుకునేందుకు అనువైన స్థితికి మార్చబడతాయి.

2. కొవ్వు పదార్థాలు ఇక్కడ జీర్ణం చేయబడతాయి. ఇక్కడి చర్య క్షారప్రధానమై జీర్ణక్రియ. ఎందుకంటే ఈ జీర్ణరసాలన్నీ ప్రాథమికంగా క్షారగుణ కల్గివుంటాయి. 

అరోగ్య మస్తుయూట్యూబ్ ఛానల్ లో మరిన్నిహెల్త్ టిప్స్ చూడండి

https://youtu.be/CXVd1YrQjVY

డాక్టర్. అశోక వర్ధన్ రెడ్డి
సికింద్రాబాద్
8500204522
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

No comments:

Post a Comment