Thursday, August 19, 2021

అన్నం rice

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (874)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
అన్నం (Rice)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మన మనుగడకు ఎంతో అవసరమయిన శక్తిని సమకూర్చి పిండి. పంలో అధికశాతం మనకు అన్నం ద్వారానే లభిస్తున్నది. ఆసియా ఖండంలో శాతం ప్రజలకు ముఖ్య ఆహారం వరి అన్నం. ఉత్తర హిందూస్థానంలో గోధుమ ఉపయోగించినట్లుగా దక్షిణభారతంలో బియ్యం ఎక్కువగా వాడతారు. వారిలో గానే ఎన్నో రకాలు ఉన్నా, అధిక దిగుబడికి చాలా రకాల సంకరజాతులను గంధర్మాల, పోషకాల పెంపుదలతో అభివృద్ధిపరుస్తున్నారు.

మనం వినియోగిస్తున్న బియ్యం సాధారణంగా బాగా పాలిష్ పెట్టినదే అయివుంటుంది. అంటే సూక్ష్మస్థాయిలో ఉండే అతివిలువయిన పొర (Britannius) పకించి కేవలం పిండిపదార్థం మాత్రమే మిగులుతుంది. అందువలన ఆరోగ్యరీత్యా పాలిష్ చేయని బియ్యాన్నే ఆహారంగా ఉపయోగించడం శ్రేయస్కరం. ఆస్ట్రేలియా, అమెరికా వంటి విదేశాలలో సహజంగా దొరికే అడవిబియ్యం ఎంతఖరీదయినా ని వినియోగించి లబ్దిపొందుతున్నారు.

బియ్యానికి అంటుకుని ఉండే తవుడు (Bran) పొరను సాధ్యమయినంతవరకు తొలగించకుండా ఉండడం మంచిది. అది ఎంతో విలువయిన పోషకాల గని. బాగా పాలిష్ చేసిన బియ్యం తినడం ఆధునికకాలంలో ఫ్యాషన్ అయినందువలన సరాల బలహీనత, రక్తహీనత, బెరిబెరి, అజీర్ణం, గ్యాస్ వంటి అనారోగ్యాలు ఎక్కువయిపోయాయి. ఈ విషయం అర్థం చేసుకొని అన్నం వండే బియ్యాన్ని ఎన్నుకుంటాం..

👉  వరిఅన్నం ప్రధానగుణం : పరిధాన్యం నుండి వచ్చే బియ్యం దంచినవి లేదా పట్టుతో ఆడించినవి, పాలిష్ చేయనివి మాత్రమే సకల గుణ ది. వీటిని బాగా కడిగి చక్కగా ఉడికించింది మాత్రమే మనకు అన్నం అని మనం గ్రహించాలి. ఇటువంటి అన్నం రెండు పూటలామనిషికి ఆయురవృద్ది, వీర్యపుష్టి, బలం లభించి శరీరం కాంతిమంత కుండలిక శ్రమ తొలిగిపోతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. గాయాలు,

👉పచ్చిబియ్యం కంటే ఉడికించిన అన్నంలో పోషకాల విలువ పెరిగి, అందులోని పదార్ధం సులభంగా జీర్ణమయే స్థాయికి మారుతుంది. డాక్టర్లు జ్వరపడి చిన వారికి బియ్యపు జావ, ఇడ్లీలను ఇవ్వమనడం మనకు తెలిసిన విషయమే. వేయించిన బియ్యపుజావ చాలా తేలికగా జీర్ణమై శరీరానికి హితవు చేస్తుంది. పాత బియ్యంలో పిండి పదార్థం తేలికగా జీర్ణమయ్యే స్థితిలో వుంటుంది.

👉 కొత్త బియ్యం కన్నా, బియ్యం పాతపడుతున్న కొద్దీ దానిలోని దుర్గుణాలు హరించి పోతాయి. అందుకని బియ్యం కనీసం 6 నెలలు పాతవిగా చూసి కొనడం శ్రేయస్కరం. పాత బియ్యం కడుగుతో 'లక్ష్మీచారు కూడా చేస్తారు. ఇందులో 'బి' విటమిన్లు అత్యధిక స్థాయిలో వుంటాయి.

👉అన్నం వండి వార్చడం కంటే, అత్తెసరు పెట్టి నీరు ఇగిరిపోయేలా చేయడం మంచిది. ఒకవేళ వార్చితే, ఆ వార్చిన గంజిని పారవేయకుండా త్రాగడం, అన్నంతో కలిపి తినడం కూడా మంచిదే. పల్లెల్లో బియ్యం కడిగిన నీటిని, మిగిలిపోయిన గంజి, అన్నాలను పశువులకు పెట్టడం చూస్తుంటాం. వాటి పోషకాలు, వృథాపోకుండా మనిషికి, పశువులకు కూడా వినియోగించడం. మన సంప్రదాయరహస్యం.

👉అన్నంలో మజ్జిగ లేదా పెరుగు కలిపి వాడితే ఎంతో మంచిది. శరీరంలో అతి ఉష్ణాన్ని ఇది నివారిస్తుంది. అన్నంలో పాలు కలిపి కొంచెం మజ్జిగతో ముందురాత్రి తోడుపెట్టిన అన్నాన్ని తోడంటు అన్నం అంటారు. అందులో ఒకటి రెండు ఉల్లిపాయలు తిరిగి చేర్చితే, దాని చలువచేసే గుణం మరింత ఇనుమడిస్తుంది. మరునాటి ఉదయం దీన్ని బ్రేక్ఫాస్ట్ ఇస్తే, ఎండకాలంలో పరీక్షలకు తయారవుతూ చదువులతో తలమునకలవుతున్న పిల్లలకు ఇది అమృతంగా పనిచేసి, వారికి కావలసిన పోషణను అందిస్తుంది.

👉కొంచెం గాలింపుగింజలు, కరివేపాకు, జీలకర్రను ఒక స్పూను నేతిలో వేయించి, కొంచెం తరిగిన అల్లం, పచ్చిమిర్చి చేర్చిన పెరుగు అన్నంలో కలిపి తరిగిన
కొత్తిమీదను జల్లి వడ్డిస్తే పిల్లలేకాదు, అందరూ ఎంతో అంటారు. ఇష్టపడి ఈ బాధపడేవారు, ముందు రోజు

👉 పార్వపు తలనొప్పి (మైగ్రేన్) తో అన్నం రెండుమూడు గుప్పెళ్ళు తీసుకుని అందులో తియ్యని పెరుగు కలిపి రోజులపాటు ఉదయాన్నే తింటుంటే, సతాయిస్తున్న పార్శ్వపునొప్పి తగ్గుతుంది. బియ్యం నానబెట్టి కడిగిన నీటిని ఎండకాలంలో పారవేయకుండా చెమటకాయలు ఏర్పడిన ప్రదేశాన్ని శుభ్రపరిస్తే, చెమట గుల్లలు (ప్రిక్లీ హీట్). వండిన
రాత్రినివారణ అవుతాయి. గర్భవతులయిన కొత్తలో వేవిళ్ళతో బాధపడుతున్న వారికో మంచి చిట్కా బాగా పిసికి, కలిపి పాతబియ్యం రెండుమూడు చెంచాలు తీసుకుని రోటిలో బరకగా నలగకొట్టి, ఓ పెద్ద గ్లాసు నీళ్ళలో కలిపి ఒకపూట బాగా నానబెట్టండి.
ఆ నీటిని ఒక పాత్రలోకి వడకట్టండి. ఆ నీటిలో ఒక చిన్నస్పూను ధనియాలపొడి, కొంచెం పటికబెల్లం గుండ చేర్చి బాగా కలపండి. పటికబెల్లం కరిగి, ధనియాల పొడి ఊరేలా ఓ గంటవుంచి దాన్ని వడకట్టి ఇస్తే వేవిళ వలన వచ్చే వికారం, వాంతులు నివారిస్తాయి. పిల్లల దగ్గు, జలుబు వలన ముక్కు కారడం కూడా దీనితో నివారించవచ్చు.

ఈ వాంతులు సహజప్రక్రియ. వీటిని నివారించేందుకు వైద్యులిచ్చే అల్లోపతి మందులు సేవించడం తల్లికి, బిడ్డకు ప్రమాదం అని మరువవద్దు. సహజమయిన ఈ విధానమే దాన్ని నివారించేందుకు శ్రేష్ఠం అని తెలుసుకోవాలి.

👉వేడి అన్నంతో నుదుటిమీద కాపడం పెడితే తలనొప్పి తగ్గుతుంది.
 👉వాతరోగం, వాతజ్వరాలున్న వారికి కొంచెం చిత్రమూలం, శొంఠి కలిపిన నీటిలో వండిన అన్నం అమృతంలా పనిచేస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది.

👉కొంచెం వేయించిన బియ్యంతో వండిన అన్నం మరింత సులభంగా

జీర్ణమవుతుంది. ఒంట్లో నలతగా వున్నవారు, జబ్బుపడి లేచినవారు ఈ అన్నంతింటే ఎంతో లాభకరం.

👉సన్నని బియ్యం వండి, గంజివార్చి, ఆ అన్నంలో వేడిచేసిన ఆవుపాలు కలిపి తింటే, ఇంద్రియ పుష్టి కలిగి ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది.
👉 శరీరంలో ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు ఏర్పడినప్పుడు, వాపులు ఏర్పడినప్పుడు, వేడి వేడి అన్నంలో పసుపు వేసి ముద్దలా చేసి, రాత్రి పడుకునేటప్పుడు కాటన్ బట్టతో కట్టుకట్టాలి.
👉 మధుమేహం ఉన్నవాళ్లు తెల్లటి పాలు బియ్యం తినకండి, మధుమేహం కి ఈనాడు ప్రత్యేకంగా కొన్ని రకాల బియ్యం మార్కెట్లో లభ్యమవుతోంది.
👉 మధు మెహం ఉన్నవాళ్లు అన్నం బదులు (మిల్లెట్స్) సిరి ధాన్యాలు తినడం ఉత్తమం.


No comments:

Post a Comment