Friday, August 6, 2021

వాణాపాముల ప్రత్యేకత

వానపాముల ప్రాముఖ్యత;

దేశీ వానపాములు నేలలో పైకి క్రిందకి పయనిస్తూ కోట్ల కొలది చిల్లులు చేస్తుంది. వీటి వల్ల వర్షపు నీరంతా భూమిలోకి చేరుతుంది. ఒక్క చుక్క కూడా నేలపై ప్రవహించదు. 

దేశీ వానపాములు నేల లోపలి పొరల్లోని పోషకాలను ఆహారంగా తీసుకోని పై పొరల్లో విసర్జించి మొక్కల వేర్లకు అందుబాటులో ఉంచుతుంది. 

 

భూమి లోపలి పొరల్లో ప్రాణవాయివు పై ఆధారపడని కొన్ని రకాల సూక్ష్మజీవుల నిరంతర క్రియా శీలత వల్ల కార్బన్ డై ఆక్సెడ్ ,అమోనియా,మిథేన్ వంటి విషవాయువులు వెలువడుతూ వుంటాయి అవి అన్నీ ఈ రంద్రముల ద్వారా పైకి ఆవిరి అవుతాయి.వీటి ద్వారా స్వచ్ఛమైన గాలి లోనికి చేరి మేలు చేసే ప్రాణ వాయువు ఆధారిత సూక్ష్మజీవులకు ఉపయోగపడుతుంది. 

 

కుండపోతగా రోజుకు రెండు వందల మిల్లీ లీటర్ల వరకు cloud burst వంటి వర్షం పడినా కూడా ఆ నీరంతా భూగర్భ జలాశయానికి చేరుతుంది. ఈ విధంగా ఇది ఉచిత వాటర్ షెడ్ మేనేజ్మెంట్. 

ఈ దేశీ వానపాములు ఎంతో చక్కగా 15 అడుగుల లోతుగా కూడా ఉచితంగా నేలను దున్నిగుల్లగా చేస్తాయి. ఋతుపవనాలు ముగుసిన తరువాత ఈ రంద్రాలగుండా భూగర్భ జలాశయంలోని నీరు కేశాకర్షణ శక్తి ద్వారా పైపొరలకు చేరుతూ మన పండ్ల తోటలకు తీవ్ర కరువు పరిస్థితులలో కూడా తేమ అందుబాటులో ఉండేలా చేస్తుంది. 

 

తవ్వే క్రమములో దేశీ వానపాములు ఆహారంగా మట్టిని,ముడి రాతిని,ఇసుకను,సున్నపు రాయిని , ప్రమాదకర సూక్ష్మజీవులని తింటా దీనితో పాటు పోషకాల బాండగారమయిన నేల లోపలి పొరల్లోని మట్టిని కూడా తింటాయి. ఇలా తినే క్రమంలో అవి పంటలకు హాని చేసే ప్రమాదకర సూక్ష్మజీవులని ఆహరంగా తీసుకుని తమ ప్రెగులలో అంతం చేస్తాయి. ఇలా మట్టిని తినే క్రమములో ఇవి నేలలోని బలహీనమైన మేలు చేసే సూక్ష్మజీవులని తిని కడుపులో వాటిని బలోపేతం చేసి నెల పై పొరలలో విసర్జిస్తాయి. వాటి కడుపులో వుండే పిండి మర వంటి బయో రియాక్టర్ లో ఇలా తీసుకున్న వాటి అన్నిటిని పిప్పిగా చేసి నేలపై విసర్జిస్తాయి. ఈ విధంగా ఇది మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే పోషకార బండాగారం. 

 

ఈ వానపాముల మలము లో నేలలో కంటే 7 రెట్లు ఎక్కువగా నత్రజని ఉంటుంది,9 రెట్లు ఫోస్పాట్ ఉంటుంది,4 రెట్లుపొటాషియం ఉంటుంది,6 రెట్లు కాల్షియమ్,8 రెట్లు మేగ్నిషియం,10 రెట్ల గదంకం(సల్ఫర్) నేలలో కంటే వానపాము మలములో ఎక్కువగా ఉంటాయి. దీని తో పాటు మొక్క ఎదుగుదలకు కావాల్సిన సూక్ష్మపోషకాలు కూడా ఎన్నో రెట్లు నేలలో కంటే ఎక్కువగా ఉంటాయి. 

 

మొక్క మీద పోషకాల బాండాగారామయిన ఈ వానపాము మలము నుంచి మీ పంటలకు తోటి మొక్కలకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి గనుక పై పాటి ఎరువులు అవసరమే లేదు. 

 

నేలను దున్ని పోషకాలను ,నీటిని అందించే నేలను వాతావరణాన్ని శుద్ది చేసి ఉచితంగా ఇవన్నీ చేస్తున్న దేశీ వానపాము రైతుకు ఆప్తమిత్రుడు. 

 

పంటలకు పోషకాలను అంధించే దేశవాళి వానపాము లేకుంటే త్రాగు,సాగు నీరు లబించేది కాదు.అడవులు మోలిచేవి కావు. 

 

వానపాము అంటే varmi compost తయారికి ఉపయోగించే (ఎసినో పేటిడ) కాదు. వానపాము అంటే మన దేశీ వానపాము. 

 

ఎందుకంటే దేశీ వాన పాములో ఉండే 16 ప్రతేక లక్షణాలలో ఒక్కటి కూడా ఎసినో పేటిడలో లేదు. ఎసినో పేటిడ నేల పై పనిచేసే ఒక ప్రమాదకర కీటకం. వానపాములో ఈ వేరు మట్టిని తినడం వల్ల దానికి ఎర్త్ వార్మ్ అని పేరు వచ్చింది.ఎసినో పేటిడ మట్టిని తినదు అది పేడను తింటుంది అందువల్ల దానిని ఎర్త్ వార్మ్ అని పిలవలేము. వానపాము నేలను 15 అడుగులవరకు తవ్వగలదు.ఎసినో పేటిడ నేల ఉపరితలం పైనే ఉంటుంది కాబట్టి నేలను తవ్వలేదు. ఆహరం లబించకపోతే వానపాము నేల లో తేమ ఉన్న చోటుకి వెళ్లి సుప్తావస్థలో ఉంటుంది.ఎసినో పేటిడ అలా జీవించలేదు. రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రత 54℃ ఉండే ప్రాతంలో అయినా 0℃ ఉండే హిమాలయాలలో అయినా వానపాములు నిరంతరము పనిచేస్తూనే ఉండగలవు. కాని 28℃ ఉష్ణోగ్రత దాటితే ఎసినో పేటిడ బ్రతకలేదు. ఒక వైపు దేశీ వానపాములు నేలలోని విషాన్ని తొలగిస్తే మరో వైపు ఎసినో పేటిడ కాడ్మియం,ఆరేనిక్స్,పాదరసం,సీసం వంటి ప్రమకరమైన విషయాలను నేలలో వదులుతుంది. 

 

దీనిని బట్టి వ్యవస్థలో సకల జీవరాసులకు పోషకాలను అందిచడంలో సూక్ష్మజీవులు,దేశీ వానపాముల ప్రాముక్యత గమనించగలరు.

No comments:

Post a Comment