*మొలల వ్యాధి ఉన్నవారు తీసుకొవలసిన ఆహారం*
* మొలల వ్యాధి ఉన్నవారు ఎవరైనా వారి కడుపులో పేరుకుని ఉన్న వాతాన్ని ( గ్యాస్ ) క్రిందికి పంపగల పదార్ధాలను మరియు అన్నాశయం జట రాగ్ని వృద్ధి చేసి అగ్నిదీపనం చేయగల అన్నపానాలను భుజించాలి.
* పాతబియ్యం , పాత గోధుమలు , బార్లీ ధాన్యాలతో తయారయిన జావ గాని , మెత్తగా ఉడికించిన అన్నంగాని భుజించాలి.
* ఆ అన్నంలో నెయ్యి, మేకపాలు, లేత వంకాయ , ముల్లంగి వీటిని ఉపయొగించాలి.
* పాలకూర, బచ్చలి కూర , చక్రవర్తి కూర మొదలయిన మలమూత్రాలు జారీ చేసి అగ్నిదీపనం చేయగల కూరలు ని భుజించాలి.
* వాతాన్ని , మలపదార్ధాలని పూర్తిగా బహిష్కరింప చేయడానికి ఉప్పు కలిపిన పలుచటి మజ్జిగని పదేపదే ఉపయోగించాలి .
* మజ్జిగ వైద్యం వల్ల హరించి పోయే మొలలు మళ్లి తిరిగిరావు కాబట్టి విశేషంగా మజ్జిగని వాడాలి. మజ్జిగ సేవన వలన శ్రోతస్సులన్ని శుద్ధి చెంది అన్నరసాలు స్వేచ్చగా సంచరించి శరీరానికి తుష్టి, పుష్టి , బలము, మంచి వర్ణం కలుగుతాయి.
మొలలు నివారణా యోగాలు -
మొలలు ని సమూలంగా నిర్మూలించడం కోసం కొందరు శస్త్రచికిత్స ద్వారా , కొందరు క్షార చికిత్స ద్వారా , కొందరు అగ్ని చికిత్స ద్వారా చికిత్స చేస్తారు .
ఈ మూడు విధానాల ద్వారా చికిత్స చేసినప్పుడు ఏ మాత్రం లోపం జరిగినా నపుంసకత్వం రావడం , శరీరబాగాల్లో వేడి పుట్టడం దారుణమైన శూల పుట్టడం, కడుపుబ్బరం కలగడం రక్తస్రావం , మలం ఎక్కువ రావడం చివరికి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఎంతో అనుభవం ఉన్న వైద్యుల వద్దనే ఈ మూడు విధానాలలో చికిత్స చేసుకోవాలి. లేకుంటే క్రింద చెప్పిన సులభ యోగాల ద్వారా నివారించుకోండి.
* ముద్రబెండ ఆకులు 4 తీసుకొని శుభ్రంగా కడిగి 2 స్పూన్స్ ఆముదంలో లైట్ గా వేయించి రాత్రి సమయంలో చపాతి లొ పెట్టుకొని తిని ఆ ఆముదం తాగాలి. ఇలా 2 to 3 సార్లు చేస్తే మొలలు మాయం
* నల్ల నువ్వులు ఒక గుప్పెడు ప్రమాణం లొ తీసుకోని నొట్లో పోసుకొని బాగా నమిలి వెంటనే చల్లని నీరు తాగుతూ ఉంటే క్రమంగా మొలలు హరించి పొతాయి.
* వెన్న, నువ్వులు కలిపి ఒక్కోటి 5 గ్రాములు నుండి 10 గ్రాములు మోతాదుగా ఈ వ్యాధి తీవ్రతను బట్టి మోతాదు నిర్ణయించుకొని నమిలి తింటూ ఉంటే రక్త మొలలు శాంతిస్తాయి.
* వెన్న , పంచదార , నాగాకేసరాలు ఈ మూడు ఒక్కొక్కటి 5 గ్రా మొతాదుగా సేవిస్తూ ఉంటే రక్త మొలలలో రక్తస్రావం ఆగుతుంది.
* దొండకాయలును బద్దలుగా కోసి వెడల్పుగా చీల్చి వాటి మద్యలో కొద్దిగా ఉప్పు , చింతాకు వేసి నేతితో వేయించి ఆ దొండకాయాలని తింటూ ఉంటే మూలరోగం (మొలలు ) పొతుంది.
* కరక్కాయ బెరడు చూర్ణం , బెల్లం సమాన బాగాలుగా కలిపి దంచి ముద్ద చేసుకోని నిలువ ఉంచుకోవాలి.రొజూ రెండు పూటలా 5 గ్రా నుండి 10 గ్రా మోతాదుగా ఆ పదార్ధాన్ని తింటూ ఉంటే క్రమంగా మొలలు వుడిపోతాయి .
* ఉత్తరేణి ఆకు చూర్ణం , ఉత్తరేణి గింజల చూర్ణం సమంగా కలిపి నిలువ ఉంచుకొని రోజు పూటకు 5 గ్రా మోతాదుగా ఈ చూర్ణాన్ని పావు గ్లాస్ బియ్యం కడిగిన నీళ్లతో పుచ్చుకుంటే నిస్సందేహంగా రక్తం స్రవించే రక్తమొలలు వ్యాధి అంతరించి పొతుంది.
* ఉలవలను నీళ్లలో నానబెట్టి తరువాత మెత్తగా దంచి ముద్ద చేసి ఆ ముద్దను మొలల మీద అంటించి అది వుడిపోకుండా గోచి లాగా గుడ్డతో కట్టు కట్టుకుంటూ ఉంటే క్రమంగా మొలలు హరించి పొతాయి.
* నల్ల తుమ్మ చెట్టుకు కాచే పచ్చి తుమ్మకాయలని
తెచ్చుకొని మెత్తగా దంచి నీడలో ఎండబెట్టాలి.L తరువాత మళ్లి దంచి చూర్ణం చేసి జల్లెడ పట్టి , వస్త్రగాలితం చేసి నిలువ ఉంచుకొవాలి. రోజు పూటకు 6 గ్రా మోతాదుగా రెండు పూటలా అరకప్పు మంచి నీళ్లతో కలిపి సేవిస్తుంటే క్రమంగా మూల వ్యాధి తగ్గడమే కాదు శరీరానికి శక్తి కలుగుతాయి. అమితమైన వీర్యవ్రుద్ధి జరుగుతుంది.
* చింత చెట్టు పువ్వులు తెచ్చి నీడన ఆరబెట్టి దంచి నిలువ ఉంచుకుని రోజు పూటకు 6 గ్రా మోతాదుగా 12 గ్రా మంచి వెన్నతో కలుపుకుని తింటూ ఉంటే రక్తం కారే రక్తమొలలు హరించి పొతాయి.
* బంతి పువ్వులు పూసే బంతి చెట్టు ఆకు తెచ్చి 72 గ్రా మిరియాలు 12 గ్రా ఈ రెండు కలిపి మెత్తగా దంచి రేగుపండు సైజు లొ మాత్రలు చేసి గాలికి ఆరబెట్టి ఆ మాత్రలని నిలువ చేసుకొని రోజుకి పుటకి ఒక మాత్ర చొప్పున మంచి నీళ్లలో రెండు పూటలా వేసుకుంటే ఉంటే క్రమంగా మూల వ్యాధులు తగ్గుతాయి.
* కాకర ఆకు రసం గాని లేక కాకరకాయ రసం గాని 20 గ్రా మోతాదుగా తీసుకుని అందులొ తగినంత పంచదార లేక పటికబెల్లం పొడి కలిపి రోజుక్కొక్క మొతాదుగా సేవిస్తూ , బాగా మజ్జిగ వాడుతూ ఉంటే 40 రోజులలో అధ్బుతమైన గుణం కనిపిస్తుంది. బాగా బలహీనంగా ఉన్నవారు ఈ యోగం అనుసరించవద్దు.
* బాదంపప్పు 40 గ్రా , మిరియాల చూర్ణం 20 గ్రా ఈ రెండు పదార్దాలు కలిపి మెత్తగా దంచి తరువాత ఈ పదార్థాన్ని 200 గ్రా తేనెతో వేసి మళ్లి మెత్తగా లేహ్యంగా దంచి నిలువ చేసుకొవాలి . రోజు పుటకు 3 గ్రా మోతాదుగా మూడు పూటలా ఈ లేహ్యాన్ని తింటూ ఉంటే మొలల వ్యాధి హరించి పొతుంది. ముడ్డి తిమ్మిరి సమస్యకు కూడా ఈ ఆహార ఔషధం బాగా పనిచేస్తుంది.
* వేపపండ్లు లొ ఉండే గుజ్జు 50 గ్రా , మంచి పాతబెల్లం 20 గ్రా తీసుకుని మెత్తగా దంచి ముద్దచేసి మూడు గ్రాములు మొతాదులో మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి . రోజు రెండు పూటలా ఉదయం ఒక మాత్ర , సాయంత్రం ఒక మాత్ర పావు గ్లాస్ మంచి నీళ్లతో వేసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే సకల మొలల రోగాలు హరించి పొతాయి.
* పసుపు, వాము కలిపి కొంచం మంచినీళ్ళతో మెత్తగా నూరి మొలలపై కట్టు కడుతూ ఉంటే క్రమంగా మొలలు పిలకలు ఎండిపోయి వుడిపోతాయి.
* త్రిఫల చూర్ణం లొ సమానంగా పటికబెల్లం చూర్ణం కలిపి ఉంచుకుని రోజు రెండు పూటలా 6 గ్రా చూర్ణం మంచి నీళ్లతో సేవిస్తూ ఉంటే రక్త మొలల వ్యాధి నాలుగు నుంచి అయిదు వారాలలో పుర్తిగా అదుపులోకి వస్తుంది.
మూల వ్యాధిగ్రస్తులు తినకుడని ఆహారపదార్దాలు
* చార కంద .
* మినుములు.
* కొత్తబియ్యం.
* పెరుగు.
* చేపలు .
* మాంసం
* అతి చల్లని పదార్దాలు.
* ఆనపకాయ.
* వంకాయ.
* పిండి వంటలు.
* బచ్చలికూర
* కందిపప్పు.
* ఆవకాయ .
* ఆవపిండి.
* కటినమైన పదార్దాలు.వాడకూడదు
* వాహనాల మీద ప్రయాణం తగ్గించుకోవాలి .
No comments:
Post a Comment