Sunday, August 1, 2021

ఉల్లి పాయ/ఎర్ర గడ్డ (Onion)

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (850)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
****************************
ఉల్లి పాయ/ఎర్ర గడ్డ (Onion)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!! !!!!!!!!!!!!!!!!!!!!

ఉల్లిపాయ (Onion) దీనిని నీరుల్లిపాయ అని అంటారు. వేడి. చలువచేసి అరుచ్చును' అని కొందరి నమ్మకం, పైత్యం, మేహం శాంతింప చేస్తుంది. శుద్ధిచేస్తుంది. మూలశంకకు మంచి మందు. నడుం, ఉదరంలోని నొప్పి, ఉబ్బులనుహరించి, మూత్రంలోని సుద్దను పోగొట్టి, నరములకు సత్తువను వీర్యపనీ, అలం వేపష్టిని కల్గిస్తుంది. దేహానికి శాంతినిచ్చి ఆకలి కలిగిస్తుంది. విరేచనం, మూత్రం సాఫీగా జారీ చేస్తుంది. రక్తనాళాలను శుభ్రపరచి రక్తం సరిగా ప్రసరించేలా చేస్తుంది. మూత్రంలో పడే రక్తాన్ని అరికడుతుంది. పచ్చి ఉల్లిపాయలు తింటే నిద్రవస్తుంది దీని చెవిలో పోస్తే చెవి నొప్పి తగ్గుతుంది. కూరగాయతో కలిపి వండినపుడు ఆయా కూరగాయలలో ఉండే చెడు చేసే గుణాలను విరిచి మనకు హితవుగా మారుతుంది.

👉ఉల్లిపాయలను పచ్చిగా ఉపయోగించితే అందులోని ఔషధతత్వాలు మనిషికి ఉపయోగపడతాయి.

👉దోస, టమాటా, క్యారెట్ వంటి పచ్చికూరలతో బాటు సలాడ్లో ఉపయోగించి.నందువలన దీని లాభాలు పూర్తిగా మనం పొందవచ్చు.

👉ప్రతిదినం ఉల్లిపాయను ఆహారంలో వాడినందువలన హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవు. * పళ్ళ చిగుళ్ళనుండి రక్తం కారుతుంటే, ఉల్లిపాయను మెత్తగా నూరి ఆ పేస్ట్తో
పళ్ళు, చిగుళ్ళు మాలిష్ చేస్తే తగ్గుతుంది.

👉 తేనెటీగ, తేలువంటి విషకీటకాలు కుట్టినచోట ఉల్లిపాయను సగానికి కోసి ఆ బద్దతో రుద్దితే విషం హరిస్తుంది.

👉 గజ్జి ఏర్పడిన ప్రాంతంలో ఉల్లిరసంలో పసుపుపొడి కలిపిన పేస్టును పూస్తే గుణమవుతుంది. కాళ్ళ పగుళ్ళకు ఉల్లిపాయను దంచి కట్టుకడితే మంచి

👉తలనొప్పులు, జలుబు, వికారంతో వాంతి వచ్చేటట్లుంటే ఒక ఉల్లిపాయను పగులగొట్టి వాసన చూస్తే నిదానిస్తాయి.

👉పోలీసులు ఆందోళనకారులపై ప్రయోగించే టియర్గాస్కు అద్భుతమైన విరుగుడు ఉల్లిపాయ.
👉 వేసవికాలంలో, ఉల్లిపాయలు జేబులో పెట్టుకుంటే వడదెబ్బ తగలదు.
👉ఉల్లిపాయలను బెల్లంతో కలిపి తింటే శరీరం బరువు పెరుగుతుంది.

 👉ఇందులో ఇనుము మంచి మోతాదులో ఉన్నందువలన రక్తవృద్ధి కల్గిస్తుంది.

👉ఉల్లిపాయను బాగా వాడేవారికి కంటివ్యాధులు దరిచేరవు. ఉల్లికాడలు, ఉల్లిబొందులకు కూడా ఉల్లిపాయ గుణాలే ఉన్నందువలన వంటకాలలో వీటిని కూడా విస్తారంగా చేర్చి ఉపయోగించవచ్చు. వీటిలో అదనంగా క్లోరోఫిల్, యాంటి ఆక్సిడెంట్స్ కూడా చేరివుంటాయి. కామెర్లు, మొలలు (పైల్స్), మూలవ్యాధులకు, జీర్ణక్రియ మెరుగయేందుకు ఇవి బాగా ఉపకరిస్తాయి.

👉ఉల్లిపాయకు క్రిములను నశింపజేసే శక్తి వుంది. కాబట్టి దీన్ని తరచు ఆహారంలో వాడేవారికి కలరా, టైఫాయిడ్, మశూచి, ఆటలమ్మ, డయేరియా, విరేచనాల వంటి సూక్ష్మక్రిముల వలన వ్యాపించే జబ్బులు దరిచేరవు. ఆహారంతో ఒక పచ్చి ఉల్లిపాయను ప్రతిరోజూ తినగలిగితే, నీరు-ఆహారం ద్వారాశరీరంలోకి చేరుకునే సూక్ష్మక్రిములన్నీ నశిస్తాయి. 

👉ఉల్లిపాయను కుమ్ములో పెట్టి ఉడికించి తింటే డిసెంట్రీ విరేచనాలు కట్టేస్తాయి. అజీర్ణం నివారించ బడుతుంది.

 👉పచ్చి ఉల్లిపాయను నమిలి తిన్నందువలన నోటిలోని క్రిములు నశించి దంతక్షయం అరికట్టబడుతుంది.


No comments:

Post a Comment