+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
వంట పాత్రల విశిష్టత
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
నేడు మనం రకరకాల పద్ధతుల్లో వంట చేస్తున్నాము. పూర్వకాలంలో మట్టి పాత్రలు ఇత్తడి, కంచు మొదలుగా పాత్రలో వంట చేసే వాళ్ళు.... కానీ ఎక్కువ అల్యూమినియం ప్రెజర్ కుక్కర్ లో
వంట చేసి, రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకోండి
ఆహారపు తయారీకి వాడే పాత్రలు-అవి తయారు చేయబడే పదార్థాలు వాడి గుణాలు, వంటకాలపై వాటి ప్రభావం కూడా తెలుసుకోవాలి కద, వాటి
బా గోగులు ఏమిటి? అని ఇప్పుడు కొంచెం వివరంగా పరిశీలిద్దాం.
వంట పాత్రలు:
భారతీయ అనేక రకాల పదార్ధాలను కలిపి, స్వాదిష్టత రుచి-పౌష్టికత) కలిగిన అనేక వంటకాలను వండడం ఒక సంప్రదాయం. ఇలా వండేందుకు సనాతనంగా ప్రకృతిలో సహజంగా, అపరిమితంగా దొరికే మట్టికో తయారు చేయబడిన కుండలు, చట్లు లేదా చాకలు, నీళ్ళకు కుండలు, కూజాలు, భానలు ఇలా అనేకపాత్రలను ప్రకృతికి, పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి హాని జరగని విధంగా తయారుచేసి వాడడం జరిగేది.
ఆధునికత అన్నింటిలో వికృతి తెచ్చినట్లుగా వంటపాత్రలను రకరకాలలోపాలతో తయారుచేసి నవీన లోహయుగాన్ని మన జీవితాలలోకి తెచ్చింది. వీటివలన
వండే విధానం తేలిక పరచబడినా, లోహపాత్రల వాడకం మనిషికి అనేక ఆరోగ్యసమస్యలను తెచ్చిపెట్టింది. సుఖం కావాలనుకునేవారు. ఆ సమస్యలనుఅల్పమయినవిగా భావించి ప్రక్కకు నెట్టిపారేసి, బ్రతుకు బండి లాగించేస్తున్నారు.
ఇంకా మట్టిపాత్రలనువాడుతున్న కుటుంబాలున్నాయంటే మీరు నమ్ముతారా? ఆశ్చర్యమే అయినా ఇది నిజం! ఇప్పుడు మళ్ళీ 'ప్రతి పురాతన సనాతన ఆచారం మానవ హితమే' అంటూ ఆధునిక శాస్త్రవేత్తలు, మన విధానాలను శోధించి, సత్యమే అంటూ తిరిగి ఖితాబు ఇస్తున్నారు.
ఎండలో తిరిగి వచ్చినవారు, మట్టికుండలో నీరుతాగితే సేదదీరడం, ఆ నీటి చల్లదనం ఏంతో ఆహ్లాదంగా వుండడం మరువగలరా? ఫ్రిజ్లో చల్లబరచబడిన కృత్రిమ చల్లదనం గురించి ఆలోచిస్తే, శరీరానికి ఎంత అసౌకర్యమో అనుభవం మీదే తెలుస్తుంది. అలాగే మట్టిపాత్రలలో వండే వంటకాలకు ఒక విలక్షణరుచి అబ్బుతుంది. మట్టిపాత్రలో తోడుబెట్టిన పెరుగు, లస్సీ, ఏది తీసుకున్నా ఆ రుచి, ఆ హాయిని మనం ఎన్నటికీ మరచిపోలేం.
లోహపాత్రలలో ఉత్తమం రాగి. రాగిలో వున్న ధన విద్యుత్తు, ఆ పాత్రలలో నిలువ ఉంచిన నీటి ద్వారా, తాగిన వారికి అందుతుంది. అందువలన శరీర ఆరోగ్య పరిరక్షణలో ఈ లోహపాత్రలకు గణనీయమైన స్థానం వుంది. రాగి తరువాత, ఇత్తడి పాత్రలు వంటకు, నిలువ ఉంచేందుకు ముఖ్యస్థానం పొందాయి.
ఇత్తడి పాత్రల లోపలి భాగం తగరపు పూత పూయబడుతుంది. అందువలన ఇందులోని ఆహారపదార్థాలు నేరుగా ఇత్తడితో కలువవు! తగరం వలన మన ఆరోగ్యానికి ఏర్పడే హాని పెద్దగా ఏదీలేదు, అయితే కొంత కాలానికి ఈ పూత అక్కడక్కడా తొలగి ఆమ్ల, క్షార గుణాలున్న ఆహారపదార్థాలు వండినప్పుడు ఇత్తడితో ప్రతిచర్య జరిగి కొంత విషపూరితం కావచ్చు. కాబట్టి తగరపు పూతను జాగ్రత్తగా గమనించి, నియమిత సమయంలో ఆ పూతను తిరిగి వేయించుకుని ఉపయోగిస్తే, ఈ ఇబ్బంది కలగదు.
రాగి, ఇత్తడి తరువాత అత్యధికంగా వాడబడే లోహాలు ఇనుము, అల్యూమినియం, ఇనుముతో చేయబడిన పెనాలు, కడాయీలు, బాండీలు వంటలకు విస్తారంగా వాడబడుతున్నాయి. అయితే వీటిలో వండిన వాటిని వెంటనే వేరే పాత్రలలోకి మార్చేయాలి. వీటిలోనే నిలువ ఉంచినందువలన పదార్థాలు ఇనుముతో రియాక్ట్ అయి, ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం వుంటుంది. దీనిని శుభ్రంచేసి తయారుచేసిన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వంటలకు కొద్దిగానూ, వడ్డనలకు విస్తృతంగానూ వినియోగించబడుతున్నాయి.
తరువాత వంటకు ఉపరించక పోయినా పదార్థాలను వడ్డించేందుకు వాడబడే సిరమిక్ పింగాణీ గాజు సామగ్రి కూడా ఒక విధమయిన మట్టితోనే చేయబడినందున, ఇవి కూడా మనం నిర్భయంగా వాడవచ్చును. తెలిసినంత మేర, ఇవి వాడినందువలన ఏవిధమయిన హానీ మానవశరీరానికి జరుగదు. అలాగే గాజు సీసాలు, గ్లాసులు కూడా మనకు హాని చేయని వస్తువులే. ఇవి పగిలి మనకు గాయంకావచ్చు గానీ, రసాయనికంగా ఏ ప్రతిచర్య జరగదు.
రాజులు-మహారాజులు వారి కాలంలో వెండి, బంగారు పాత్రలు వడ్డనకు ఉపయోగించేవారు. ఇవి రెండూ ఉత్తమజాతి లోహాలయినందువలన వీటి ఉపయోగం శరీరానికి మేలు చేస్తుంది. నేటికి కొంత మంది ధనవంతుల ఇళ్ళలో వెండి పాత్రలు-పళ్ళాలు-గ్లాసులు వినియోగించడం జరుగుతున్నది.
👉రాగి
చిరకాలంనుండి వంటపాత్రలకు విస్తారంగా వాడబడుతున్న లోహం ఇది. వేడిని త్వరగా తీసుకొని, చాలాసేపు వుంచుతుంది కాబట్టి, వంటపాత్రల తయారీకి ఈ లోహం చాలా అనువైనది. రాగి కాగులు, బిందెలు, గంగాళాలు, దబరా గిన్నెలు, దేగిషాలు - ఇలా ఎన్నోరకాల వంటపాత్రలు ఇదివరకు వుండేవి.
విందులు, వినోదాలకు, సంతర్పణల వంటి భారీ ఎత్తు వంటకాలకు వాడే పాత్రలు సాధారణంగా రాగితోనే చేయబడివుండేవి. అయితే జాగ్రత్త వహించ వలసిందేమంటే, పులుపు ఈ లోహానికి తగల కూడదు. దానికి ఉప్పు కూడా కలిస్తే ఆహార పదార్థం విషపూరితం అయిపోతుంది. ఈ ఆహారం తిన్నవారికి కడుపులో తిప్పుట, వాంతులు, విరేచనాలు, మైకం వంటి దుష్ఫలితాలు కలుగవచ్చు కాబట్టి వంటకువాడే రాగిపాత్రలు తగరపు పూత (కళాయి) వేయించుకుని వాడవలసి వుంటుంది.
👉అల్యూమినియం
మన భారత దేశాన్ని పరిపాలించిన అని వచ్చినప్పుడు, ఇంగ్లాండు పార్లమెంటులో ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి భారతదేశంలో జైల్లో ప్రవేశపెట్టారు.. అల్యూమినియం పాత్రలో వంట చేసి అదే పాత్రలో ఆహారం సేవించుటవలన తొందరగా మధుమేహం క్యాన్సర్ బీపీ అనేక రకాల జబ్బులు వస్తాయి.
భారతీయులను బలహీన పరచవచ్చు, స్వాతంత్రం కోసం పోరాడే స్వతంత్ర యోధులను
బల హినా పర్చాలని దురుద్దేశంతో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోయినారు... కానీ నేటికీ జైల్లోకి కాకుండా ప్రతి ఒక్క కుటుంబం లోని ఓ అల్యూమినియం పాత్రలు ఆక్రమించాయి. అల్యూమినియం పాత్రలలో వంట చేయకండి బయటపడేయండి
జర్మన్ సిల్వర్గా పిలువబడే ఈ లోహం, వంటకు వాడే పాత్రల స్వరూప స్వభావాలనే మార్చేసిందని చెప్పవచ్చు. చిన్న స్పూనుల నుండి, పెద్ద దబరా గిన్నెల ఎంత సైజులలోని పాత్రలయినా అతి తేలికగా తయారుచేసేందుకు అనువయిన తదనం కలది. రకరకాల మందాలలోకి రేకులుగాను, కరిగించి మూసలలో పోసేందుకు కూడా అనువైన లోహం ఇది. అయితే ఇంత విస్తృతమైన ఉపయోగం
ఉన్న ఈ లోహ పాత్రలో ఆహారం వాడితే ఆరోగ్యానికి హాని లేదా అనే ప్రశ్న వేస్తే హాని ఉంది అని నేను చెపితే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇంత విస్తృతంగా పారిశ్రామికంగా పాత్రలు ఉత్పత్తిచేయబడుతున్న ఈ లోహపాత్రలో వండిన ఆహారంలో క్షార పదార్థాలు వేడిచేయబడినపుడు ప్రతిక్రియ జరిగి, అల్యూమినియం ఆక్సైడ్, తదితర కాంపౌండ్లలు తయారవుతాయి. ఇవి గాఢత కలిగిన విషాలు కావు గాని, దీర్ఘకాలం ఉపయోగం వలన ఈ రసాయనాలు శరీరంలో పేరుకుని ఆరోగ్యానికి చేటు కల్గించడం తథ్యం.
ఆధునికయుగం-కొత్త ఐరన్ యుగం! ఈ యుగంలో ఇనుము (కలికి సంబంధించిన లోహం) విస్తృతంగా వినియోగించబడుతున్నది. అందుకేనేమో దీనిని కలియుగం అని అంటున్నారు. అయితే తుప్పు అనే అడ్డంకి ఉన్నందువలన, దీనిని అన్ని రంగాలలో ముఖ్యంగా వంటలకు ఉపయోగించడం కుదరక పోయేసరికి, ఇనుములో నికెల్, క్రోమియం కలిపి స్టీలు, స్టెయిన్లెస్ స్టీలులను రూపొందించారు. ఇనుప బాండీలు, చిన్నసైజు కళాయిలు ఇప్పటికీ అందరిఇళ్ళల్లో వాడుతున్నారు. పిండివంటలకు వాడే భారీసైజు బాండీలు ఇనుపరేకుతోగానీ, ఇనుమును పోతపోసి గానీ తయారుచేస్తారు. బ్రిటిషువారి కాలంలో ఇనుప పాత్రలకు ఎనామిల్ కోటింగ్ వేసి రకరకాల వంటపాత్రలు, వడ్డన పాత్రలు తయారుచేసి వాడారు.
👉స్టెయిన్లెస్ స్టీలు
మన ఇంట్లోని పాత్రలలో దాదాపు 90 శాతం స్థానాన్ని అందిపుచ్చుకుంది. . నికెల్ కలిపిన స్టీల్ ఉపయోగించినందువలన మన ఆరోగ్యానికి నష్టం ఏమీలేదు. నాణ్యతగల పాత్రల తయారీలో నికెల్ను వాడతారు, అందువలన ఈ పాత్రల వెల అధికం. క్రోమియం కలిపిన స్టీలు చవుక. ఎక్కువ శాతం పలుచని, తక్కువ ఖరీదుగల పాత్రలనే మనం మార్కెట్లో చూస్తుంటాం. అయితే తక్కువ ఖరీదుగల ఈ స్టీలు వినియోగం ఆరోగ్యానికి హానికరం. కొన్ని స్టెయిన్లెస్ స్టీలు పాత్రలు తుప్పు పట్టడం. కూడా చూస్తుంటాం. కాబట్టి స్టీలు పాత్రలు కొనే ముందు నాణ్యతా ప్రమాణాలు
పాటిస్తున్న ఉత్పత్తులనే కొంటే మన ఆరోగ్యం పదిలం అని అర్థంచేసుకోండి. వంటలు వండేందుకు కానీ, నిలువ వుంచేందుకు కాని ఎంతో అనువయిన హానిలేని (మంచి నాణ్యత గలదయితే) ఏకైకలోహం ఈ స్టెయిన్లెస్ స్టీలు. దీనితో
తయారుచేయబడిన పాత్రలకు టెఫ్లాన్ కోటింగులు, కాపర్ బాటమ్లు ఇలా రకరకాల అదనపు సౌకర్యాలను జత చేస్తున్నారు. కాబట్టి, మన బడ్జెట్కు అనుగుణంగా, ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని, అది ఆరోగ్యానికి పెట్టుబడిగా భావించి నాణ్యతగల పాత్రలను కొనడంలోనే విజ్ఞత వుంది అని అర్థంచేసుకోండి, ఈ జ్ఞానాన్ని ఆచరణలోకి తెండి.
ప్లాస్టిక్ లు, ఫైబర్ లు, ఇతర రసాయనిక పాలిమర్లు కూడా వంటలకు కాకుండా ఆహారపదార్థాలు నిలువ ఉంచేందుకుపకరించే పాత్రల తయారీలో విస్తృతంగా వినియోగింపబడుతున్నాయి. ఇవి చాలా ఆకర్షణీయమైన రంగులలో తయారవుతూ వినియోగదారులను మురిపిస్తూ, కొనేలా చేస్తాయి.
ఆహారధాన్యాలను, పొడి వస్తువులను ఇటువంటి పాత్రలలో లేదా సీసాలలో భద్రపర్చుకుంటే వీటి వలన పెద్దనష్టమేమీ వుండదు. వండిన పదార్థాలు, ద్రవ ఆహారాలు మాత్రం వీటిలో నిలువ వుంచకూడదు. ఎందుకంటే ఇవన్నీ రసాయనిక పదార్థాల కలయికతో కృత్రిమంగా తయారు చేయబడిన ఉత్పత్తులు. ఇందులోని రసాయనాలు అయాన్ల రూపంలో చాలా నెమ్మదిగా, మనకు తెలియనంతటి సూక్ష్మపరిమాణంలో ఆహార పదార్థాలలోనికి విడుదల చేయబడుతుంటాయి. చాలా కాలం ఈ పాత్రలలో ఆహారపదార్థాలు నిలువ వుంచడం లేదా నిలువ వుంచిన పదార్థాలను వాడుతూ ఉండటం వలన శరీరంలోనికి వీటి తాలుకు విషపదార్థాలు నెమ్మదిగా పేరుకుంటాయి. శరీరం భరించలేనంతటి పరిమాణానికి ఇవి చేరుకోగానే వీటి బలాన్ని ప్రదర్శిస్తాయి. ఆనారోగ్యాన్ని మనకు మనంగా శరీరంలోకి ఆహ్వానించడం అంటే ఇదే మరి.
ప్లాస్టిక్ తయారీలో వినియోగించబడే పాలీ వినైల్ క్లోరైడ్ (పివిసి) అనే పెట్రోలియం ఉత్పత్తి శరీరంపై విషప్రభావాన్ని చూపుతుంది. గర్భవతులు గర్భాశయంలో పెరుగుతున్న పిండాలపై ఈ విషప్రభావం వలన పుట్టే పిల్లలకు అంగవైకల్యం, పుట్టుకతోనే ఆనారోగ్యం వంటి దుష్ఫలితాలు ఏర్పడవచ్చు. కొన్ని ప్లాస్టిక్లలో వుండే థాలయిడ్స్ వలన మనిషి నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా కండ్లకు హాని జరుగుతుంది. మనకు తెలియనంతకాలం జరిగిపోయిన హానిగురించి ఆలోచించడం మాని, ఇప్పటి నుండి అయినా వండిన పదార్థాలు ప్లాస్టిక్ పాత్రలలో నిలువ వుంచడం
ముఖ్యమైన విషయం ఏమంటే మన పిల్లలకు లంచ్ బాక్స్లుగా ఎట్టిపరిస్థితుల్లోను ప్లాస్టిక్ అనుబంధ ఉత్పత్తులు వాడకండి. వారు ఇది ఫుడ్ గ్రేడ్
ప్లాస్టిక్ అని చెప్పినా దానిని మనం నమ్మేందుకు లేదు. వ్యాపారంలో నీతి అనేదిచాలా తక్కువ. ఉత్పత్తిని అమ్ముకొని సొమ్ముచేసుకొనే ఏకైకలక్ష్యంతోనే పలురకాల
కాబట్టి, మనమే దృష్టిని కొంచెం తేటపరచుకుని, విషయాలు తెలుసుకొని ఆచరిద్దాం. మనకు తెలిసి మన కుటుంబానికి హాని కలిగే పరిస్థితిని ఆహ్వానించకుండా వుందాం. ముఖ్యంగా మినరల్ వాటర్ గురించి, ఒక ముఖ్య పరిశీలన ఏమంటే, నీరు శాతం శుభ్రపడింది, ఏం మినరల్స్ అందులో కలిపారు - అనేది ప్రశ్నార్థకమే.. కొన్ని స్టాండర్డ్ ప్లాంట్లలో మాత్రం 7 దఫాల వడపోత తప్పని సరిగా ఉంటుంది. భూమినుండి నేరుగా తీయబడిన భూగర్భజలాలలో మాత్రం సహజసిద్ధమయిన మినరల్స్, సాల్ట్స్ ఉంటాయి. ఫిల్టర్ వాటర్, మనం ఉపయోగించడానికి అనువయిన సీసాలలో రెడీమెడ్గా దొరుకుతుంది అనే ఆధునిక సౌలభ్యాన్ని మాత్రం మనం అంగీరించాలి.
ఆకర్షణలతో, స్కీములతో పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను అమ్ముకుంటారు.
అయితే, చాలా మంది చేస్తున్న తప్పు ఏమంటే మినరల్ వాటర్ బాటిల్ను మళ్ళీ మళ్ళీ నింపుకోవడం, ఫ్రిజ్లో నీరు దాచుకునేందుకు కంటెయినర్స్ గా వాడుతూండడం. ఆ సీసాలు కొత్తవి మాత్రం ఏ హానికర రసాయనాలు విడుదల చేయవు కానీ, మరల మరల వాడుతున్న కొద్దీ వాటి నుండి సూక్ష్మస్థాయిలో రసాయనిక అయాన్లు విడుదలవుతాయి. కాబట్టి వాటిని మరల, మరల ఉపయోగించకుండా. తాగిన వెంటనే వాటర్ బాటిల్ను నలిపి పారేయండి.
నీళ్ళను ఫ్రిజ్లలో దాచుకునేందుకు PET బాటిల్స్ మాత్రం (వాటర్ లేదా ఫుడ్ గ్రేడు) ఉపయోగించండి, మినరల్ వాటర్, కూల్డ్రింక్ల ఖాళీ సీసాలను మరల మరల ఉపయోగించడం ఇప్పటినుండి పర్యావరణానికి జరిగే నష్టం కొంతయినా నివారిద్దాం. మనకు అయినాకొత్తగా తయారయే ప్లాస్టిక్ బాటిల్స్ లోనుండి మానవ శరీరానికి హాని కల్గించే రసాయనాల విడుదల కొంచెం తక్కువగా వుంటుంది. కానీ మన దేశంలో తయారయే ప్లాస్టిక్ బాటిల్స్ 90 శాతం రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్తోనే తెలిసినా, పారిశ్రామికరంగ పరిరక్షణ ప్రధానధ్యేయంగా కల ప్రభుత్వం తయారుచేయబడతాయి. ప్రజలకు జరిగే హాని గురించి. ఈ విషయంలో ఏమీ చేయలేదు. కాబట్టి మనమే మనల్ని రక్షించుకోవాలి.
పిల్లల కూడా స్కూల్ కాలేజీ కి వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్ నీళ్ల బాటలు ఇవ్వండి. రాగి బాటిల్ లేదా స్టీల్ బాటిల్ లో మాత్రమే నీళ్లు ఇవ్వండి... మీరుఆఫీసు కూడా ఇవే పట్టుకెళ్ళండి..
ప్లాస్టిక్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడడం తగ్గించండి పర్యావరణాన్ని కాపాడుదాం..
యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని హెల్త్ టిప్స్ చూడండి
https://youtu.be/33K5HTD121E
డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి
సికింద్రాబాద్
8500204522
🥄🍴🍽️🥄🍴🍽️🥄🍴🍽️🥄🍴🍽️
No comments:
Post a Comment