మూత్రములో మంటను నివారించుటకు సులభయోగాలు -
* వేపపండ్లు దొరికే కాలంలో వాటిని విరివిగా వాడుతున్న మూత్రవిసర్జనలో మంట తగ్గును.
* దువ్వెన ఆకుల కషాయం పూటకు పావుకప్పు మోతాదులో ప్రతిపూటా తీసుకొంటుంటే త్వరగా తగ్గును. రోజుకు రెండుసార్లు శుభ్రమైన తుమ్మజిగురు చింతగింజ అంత ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగుచున్న త్వరగా తగ్గును.
* ఒక కప్పు పాలలో పచ్చి గరిక ముక్కలు రెండుచెంచాలు వేసి మరిగించి తాగాలి . అలా రోజుకు రెండుసార్లు చేస్తుంటే బాధ తగ్గును.
* ప్రతినిత్యం రెండుపూటలా గుప్పెడు చింతచిగుళ్ళు తింటుంటే మంట త్వరగా తగ్గును. చింతాకు రసం రెండు చెంచాలు రెండుపూటలా తీసుకొనుచున్న మంట అద్భుతంగా తగ్గును.
* కర్బుజా పండు గింజలను నూరి చెంచాడు తినాలి. ఉదయం , సాయంత్రం అలా చేస్తుంటే బాధ సులువుగా తగ్గును.
* మామిడి జీడి చూర్ణాన్ని అర చెంచా అరకప్పు పెరుగుతో కలిపి తినాలి. అలా ప్రతిపూటా తింటుంటే మూత్రవిసర్జనలోని మంట త్వరగా తగ్గును.
* బెండకాయను చిన్న ముక్కలుగా కోసి గ్లాసుడు నీళ్లలో గుప్పెడు ముక్కలు వేసి అరగంట పాటు మరిగించాలి. తీపికోసం కొంచం పంచదార కలిపి పూటకు అరకప్పు ఆ నీరు తాగాలి. అలా ప్రతిరోజూ తయారుచేసుకొని దానిని మూడుపూటలా తాగాలి. అలా రెండురోజులు చేసేసరికి మూత్రవిసర్జనతో ఏ బాధా ఉండదు. చాలా సులువుగా మూత్రం పోతుంది . లింగ , వృషణాలు , యోని , శరీరంలో అన్ని రకాల బాధలు అతి త్వరగా తగ్గును.
No comments:
Post a Comment