Sunday, August 1, 2021

బహిష్టు నొప్పి నివారణ కొరకు నేను ప్రయోగించిన సిద్దయోగం - (menstrual pains solution

బహిష్టు నొప్పి నివారణ కొరకు నేను ప్రయోగించిన సిద్దయోగం  - 

     ముదురు చింతచెట్టు బెరడు తెచ్చుకొని ఆ బెరడును భస్మం చేసి జల్లించుకొనవలెను . భస్మం చేయుటకు వేరే కర్రపుల్లలు వాడరాదు. జల్లించగా వచ్చిన మెత్తటి భస్మమును ఒక సీసా నందు నిలువ ఉంచుకుని ఇంకో రెండు రోజుల్లో బహిష్టు అవుతారు అనగా ఒక గ్రాము మోతాదుగా ఉదయం పూట నిమ్మరసంలో కలిపి లోపలికి ఇవ్వవలెను. సాయంత్రం ఒక గ్రాము తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి . బహిష్టు మూడు రోజులు కూడా ఇలానే సేవించాలి. 

            ఈ విధంగా ప్రతినెలా బహిష్టు ముందు రెండు రోజులు , బహిష్టు మూడు రోజులు కలిపి 5 రోజులపాటు సేవించాలి .ఇలా 3 నెలలపాటు సేవించినచో స్త్రీలకు వచ్చు బహిష్టునొప్పి సంపూర్ణంగా పోవును . ఈ ఔషధాన్ని వాడు సమయంలో ఉప్పు , కారం వాడకుండా చప్పిడి పథ్యం పాటించండి. త్వరగా ఫలితం పొందుతారు. 

          

No comments:

Post a Comment