షుగర్ వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇది..! ఇంట్లో ఉండాల్సిందే..!
పింక్ లేదా తెలుపు రంగులో పూలు ఉండే బిళ్ల గన్నేరు మొక్క సహజంగానే చాలా మంది ఇండ్లలో ఉంటుంది. దీన్ని అలంకరణ మొక్కగా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఈ మొక్కకు పూచే పూలను అలంకరణల కోసం వాడుతారు. అయితే చాలా మందికి ఇది అలంకరణ మొక్కగా తెలుసు. కానీ ఈ మొక్కలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలను మాత్రం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఈ మొక్క ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులకు ఈ మొక్క చెక్ పెట్టగలదు. మరి ఈ మొక్క వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. గాయాలు, పుండ్లు
బిళ్ల గన్నేరు మొక్క ఆకులు కొన్ని తీసుకుని బాగా నలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని గాయాలు, పుండ్లపై రాయాలి. దీంతో అవి వెంటనే తగ్గుముఖం పడతాయి. రోజుకు 2, 3 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది.
2. మధుమేహం
బిళ్ల గన్నేరు మొక్క వేళ్లను సేకరించి నీటితో బాగా శుభ్రం చేయాలి. వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని అరగ్రాము మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనెతో కలిపి సేవించాలి. దీంతో డయాబెటిస్ అంతమవుతుంది. ఉదయం పరగడుపున, రాత్రి ఆహారం తినే ముందు రోజుకు రెండు సార్లు తింటే మధుమేహం నయమవుతుంది. అదేవిధంగా ఈ మొక్క ఆకులను లేదా పువ్వులను రెండు మూడు తీసుకుని ఉదయాన్నే పరగడుపున అలాగే నమిలి తినేయాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే వచ్చే మార్పులను మీరే గమనిస్తారు.
3. హైపర్‌టెన్షన్, బీపీ
బిళ్ల గన్నేరు ఆకులను 5 తీసుకోవాలి. వీటిని బాగా కడిగి రసం తీయాలి. దాన్ని 2 నుంచి 3 ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున, రాత్రి పడుకునే ముందు తాగాలి. దీంతో బీపీ, హైపర్‌టెన్షన్ తగ్గుతాయి.
4. రుతు సమస్యలు
రుతు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే బిళ్ల గన్నేరు ఆకులు 6 నుంచి 8 తీసుకోవాలి. వీటిని 2 కప్పుల నీటిలో వేసి మరిగించాలి. బాగా మరిగాక నీరు అరకప్పు అవుతుంది. ఆ నీటిని సేవించాల్సి ఉంటుంది. ఇలా నెలకోసారి చేసినా స్త్రీలకు రుతు సమయంలో తీవ్ర రక్తస్రావం కాకుండా ఉంటుంది.
5. ముక్కు, నోరు రక్తస్రావం
బిళ్ల గన్నేరు మొక్క పువ్వుల మొగ్గలు, దానిమ్మ పువ్వు మొగ్గలను సేకరించి వాటి నుంచి రసం తీయాలి. ఆ రసాలను కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముక్కులో వేస్తే రక్త స్రావం ఆగుతుంది. నోట్లో వేస్తే నోటి నుంచి వచ్చే రక్త స్రావం ఆగుతుంది. ఇలా చేయడం వల్ల నోటిలో ఉండే పుండ్లు తగ్గిపోతాయి.
6. పురుగులు కుడితే
పురుగులు, కీటకాలు కుట్టిన చోట ఎర్రగా కందిపోయి దద్దుర్లు వస్తాయి. దురద పెడుతుంది. అయితే ఆ ప్రాంతంపై బిళ్ల గన్నేరు ఆకుల రసం పిండితే చాలు వెంటనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పి, మంట, వాపులు తగ్గుతాయి.
7. మొటిమలు, మచ్చలు
బిళ్ల గన్నేరు మొక్క ఆకులను కొన్ని సేకరించి ఎండబెట్టాలి. వాటిని పొడి చేయాలి. ఆ పొడికి వేపాకుల పొడి, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి ముఖానికి పట్టించాలి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
8. క్యాన్సర్
బిళ్ల గన్నేరు మొక్కల ఆకుల రసంతోపాటు వేర్లను ఎండబెట్టి తయారు చేసుకున్న పొడితో డికాషన్ కాచి రోజూ తాగుతుంటే క్యాన్సర్ తగ్గుతుంది. ఎలాంటి క్యాన్సర్‌ను అయినా తగ్గించగలిగే గుణాలు ఇందులో ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిల్లో ఉండే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్‌లు తగ్గుముఖం పడతాయి.
9. డిప్రెషన్, ఆందోళన
ఈ మొక్క ఆకులు లేదా పువ్వుల రసాన్ని రోజూ తీసుకుంటే డిప్రెషన్ పోతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. మానసిక సమస్యలు పోతాయి
❣❣❣❣❣❣❣❣❣❣❣❣
No comments:
Post a Comment