Sunday, August 1, 2021

liver కాలేయం

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (848)
+++++++++++++++++++++++
అరోగ్య మస్తు
*****************************
కాలేయం (లివర్)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
దీనిని మానవశరీరంలో వున్న ఏకైక అతిపెద్ద గ్రంథి (Gland) అని చెబుతారు. దిని బరువు పురుషులకు 1.500 గ్రాములు, మహిళలకు 1.250 గ్రాములు ఉంటుంది.మన శరీరంలో అతి పెద్ద అవయవం దీనినుండి వెలువడే పైత్యరసం (Bile Juice) పసుపుపచ్చరంగులో వుంటుంది. చాలా చేదుగావుండి, సంక్లిష్టమయిన రసనిర్మాణం కలిగివుంటుంది.
17 వెల రసాలు ఉత్పత్తి అవుతాయి. కొత్త సెల్స్ తయారు కావడానికి తోడ్పడతాది. ఫ్యాటీ లివర్ ను నియంత్రిస్తుంది. హెమోగ్లోబిన్ నిల్వ చేస్తుంది
మన శరీరంలో జరిగే జీవరసాయన చర్య సమర్థత, వేగం ఈ లివర్ నుండి స్రవించే పైత్యరసం నాణ్యతపైనే ఆధారపడి వుంటాయి. రసంలో ప్రధానంగా నిర్జీవ సంబంధిత లవణములు, కొలెస్టరాల్, నీరు కలిసి వుంటాయి.

జీర్ణక్రియలో ఈ రసంలోని పదార్థాలు రకరకాల జీవరసాయన చర్యలు నిర్వహిస్తుంటాయి. ఇందులోని కొన్ని పోషకాలను అత్యవసరసమయాల ఉపయోగానికి అనుగుణంగా నిలువ నిధిగా దాస్తుంటాయి. అలాగే ఆహారనాళంలో వుండే వ్యర్థ పదార్థాలు, విషపదార్థాలను వెలుపలికి పంపేస్తుంటాయి.

అంతేకాకుండా ఇది ఆహారసేవనంలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నా అంటే అనారోగ్యం కల్గించే ఆహారం తీసుకోవడం, పిండి పదార్థాలు నోటిలో సరిగా నలగకుండా, లాలాజలం సరిపడినంత దానితో కలువక, ఆహారపదార్థాల వ్యతిరేక శాస్త్రయుక్తంకాని కలయికలు, శరీరం-మనసులు వొత్తిడి వలన ఏర్పడిన, అజీర్ణం వలన సరిగా జీర్ణంకాని పదార్థాలు, ఇలాంటి దుష్ప్రయలు చాలాకాలంగా శరీరంలో జరుగుతున్నా ఇది తట్టుకుని, చాలా దృఢంగా నిలబడి, సమర్థంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. ఒక విధంగా లివర్ లేకుండా బ్రతికి ఉండే మానవశరీరాన్ని ఊహించుకోవడమే కష్టం. పైచర్యల నిర్వహణలో లివర్ చూపించే సామర్థ్యం మనం లెక్క వేయలేనంతటిది. రాత్రి ఒక గంట నుంచి మూడు గంటల మద్య ఈ సమయములో కాలేయము చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివర్ పనితనం దెబ్బతింటుంది ఆ సమయంలో కచ్చితంగా నిద్ర పోవాల్సిందే. కాలేయం సరిగ్గా పనిచేయదు మధ్యమధ్యలో విరామం ఉంటుంటే
ఫరవాలేదు కాని, నిత్యం ఇదేవిధమయిన భోజనం తంతు మనం జరుపుతున్నామంటే లివర్ను పాడుచేసుకుని, కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్లే ! లివర్ ఎక్కువగా పనిచేస్తూ పూర్తి సామర్థ్యంతో ప్రతిరోజూ మనం చేస్తున్న అకృత్యాన్ని సహించలేక, క్షీణించడం మొదలవుతుంది. సూపర్ మాన్ వంటి బలయుతమయిన ఈ లివర్ దద్దమ్మలా చచ్చుబడిపోతుంది. చివరకు సిరోసిన్ ఆఫ్ లివర్ అనే రక్తస్రావం ఏర్పడి, దాని పనిని పూర్తిగా ఆపేస్తుంది. తద్వారా మనిషికి ప్రాణహాని కూడా జరుగుతుంది.


ఈ విధంగా డియోడినమ్ జీర్ణక్రియ జరుగుతుంది. మనం తిన్న ఆహారంలోని పిండి పదార్థం, కొవ్వు పదార్థాలు విడగొట్టబడే జీర్ణప్రక్రియ ఇంతటితో సంపూర్ణమయిపోతుంది. ఇకపైన అక్కడి నుండి శరీరంలోకి పీల్చుకోబడేందుకు అనువయిన స్థితిలో ఒక ద్రవంలాగా పోషకాలు ముందుకు నెట్టబడతాయి.

👉 ఫ్యాటి లివర్ కు చికిత్స:--
నేడు చాలామంది ఫ్యాటి లివర్ సమస్యతో బాధపడుతున్నారు.
అల్లోపతి వైద్య విధానంలో సరైనటువంటి చికిత్స లేదు.
ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్స విధానం ఉంది. క్రింద చికెన్ చెప్పిన విధంగా చేయండి. ఫ్యాటీలివర్ ఏ గ్రేడ్లో ఉన్న తగ్గుతుంది. 7-10 రోజులు చేయండి
👉 కావలసిన పదార్థాలు
1. నిమ్మ పండు- 1
2. నల్ల ఉప్పు పావు చెంచా
3. పటిక బెల్లం పావు చెంచా
4. మిరియాల పొడి పావు చెంచా
5. సొంటి పావుచెంచా
సాయంత్రం నిమ్మకాయ నాలుగు ముక్కలుగా చేసి, ఒక్కొక్క ముక్క లో ఒక్కొక్క పదార్ధం వేసి ఉంచుకోవాలి. ఉదయం నిద్రలేవగానే పరగడుపున
నాలుగు ముక్కలు నిమ్మరసాన్ని పిండాలి, గింజలు లేకుండా జాగ్రత్త వహించండి.. ఆ రసాన్ని డైరెక్ట్ గా తీసుకోవాలి, నీళ్లు కాని తేనె కాని ఎలాంటి పదార్థం కలపకూడదు
గంట వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment