👨🏻⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (880)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే
!!!!!!!!!;!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
బాగా లావున్న వారికి, సుగరున్నవారికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, రక్త నాళాలు మూసుకున్నవారికి ఈ సమస్య వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రక్త ప్రసరణలోపమే కారణం. ఇది కాకుండా 'బి' విటమిన్లు ముఖ్యంగా విటమిన్ 'బి1' లోపం ఉన్న వారిలో కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు నీరు పట్టడం జరుగుతుంది.
👉చిట్కాలు:-
1) రెండు బేసిన్లు పెట్టి అందులో ఒక దానిలో వేడి నీరు, మరొక దానిలో చల్లని నీరు పోయండి. మీరు కుర్చీలో కూర్చుని ముందు 5 నిమిషాలు వేడి నీటిలో ఉంచి, ఆ తరువాత 2 నిమిషాలు చల్లని నీటిలోకి మార్చండి. మళ్ళా పాదాలను 5 నిమిషాలు వేడిలో, 2 నిమిషాలు చల్లని వాటిలో ఇలా ఇంకొకసారి మార్చుతారు. దీనివల్ల, వేడిలో పెట్టినప్పుడు రక్తం కాళ్ళపైకి బగా నడిస్తే చల్లవాటిలో పెట్టినప్పుడు రక్తం కాళ్ళపైకి ఎక్కువగా వస్తుంది. ఇలా రక్తం పైకీ క్రిందకు బాగా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
2) ముడి బియ్యపు అన్నం తినడం వలన 'బి' విటమినుల లోపాన్ని తేలికగా సవరించుకోవచ్చు. మంటలు, తిమ్మిర్లు ఉపశమిస్తాయి.
No comments:
Post a Comment