Saturday, August 14, 2021

పీచుపదార్థాలు fiber

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (868)
+++++++++++++++++++++++
అరోగ్య మస్తు
*****************************
పీచుపదార్థం (Fibre)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 దీనిపేరు సెల్యులోజ్ లేదా రఫేజ్. ఈ పీచు పదార్థం ఆహార పదార్థాలకు సంబంధించి శరీర ఆరోగ్యాన్ని నిర్వహించే ఒక ముఖ్య విభాగం అని ఆధునిక యుగంలో గుర్తింపు పొంది, ప్రత్యేకంగా ప్రస్తుతించబడింది. పురాతన కాలపు ఆహారగ్రంథాలలో దీని ప్రసక్తి ఎంత మాత్రం లేదు. ఎందుకో కొంచెం విశ్లేషిస్తే, పురాతన కాలంలోని ఆహారం యథాతథంగా సంపూర్ణపోషక విలువలతో ధాన్యాలు పొట్టు తీయక, పండ్లు, కాయలు చెక్కుతీయక, సంపూర్ణంగా వినియోగించబడేవి. అందువలన దీని లోపంతోగానీ, తద్వారా.. ఎదురయే
ఇబ్బందులతో కానీ వారికి పరిచయం లేదు. ఆధునికత మనకు అందించిన మరోశాపం వలన ఈ కోల్పోయిన పదార్థానికి ఓ పేరుపెట్టి, దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి దీన్ని కూడా మన ఆహారపదార్థాల పట్టికలో ఒకటిగా చేర్చుకున్నాం.

నిజానికి దీనిద్వారా మనకు ఏ పోషకమూ అందదు. కానీ జీర్ణక్రియలో ఇది తన ఊడ్చి, జీర్ణమండలం గోడలు శుభ్రపరిచే చర్యను నిర్వహించి, ఆరోగ్యరక్షణకు తోడ్పడుతుంది.

జీర్ణక్రియలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు జీర్ణమయ్యే ప్రక్రియకు ఇది తోడ్పడుతుంది. నీటిని పీల్చుకుని మలవిసర్జన సమయంలో పెద్దప్రేవులు, పురీషనాళపు గోడలను శుభ్రం చేసుకుంటూ వ్యర్థపదార్థాలు అంటుకుని, నిలువవుండిపోయి, శరీరంలో అనారోగ్యం అంకురించకుండా ఇది చక్కగా శుభ్రంచేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

గతంలోని ఆహారంలోని సంపూర్ణత్వం వలన మలబద్ధం అనే శారీరకపరమైన ఇబ్బందినెవరూ ఎరుగరు. ఆధునికత అన్ని ఆహార పదార్థాలలోనూ ఎంతో విలువయిన పోషకాలున్న పైపొరలను తీసి ఉపయోగించడం నేర్పింది. ఇలాంటి ఆహార పదార్థాల వినియోగం వలన జీర్ణక్రియ మందగించి, మలబద్ధానికి దారితీస్తుంది. ఒకసారి మలబద్ధం శరీరంలోనికి ప్రవేశించిందంటే సర్వరోగాల ప్రవేశానికి మార్గం సుగమం చేసినట్లే !

నష్టపోయిన తరువాతగానీ కోల్పోయిన వస్తువుల విలువను గుర్తించం. ఇది మానవప్రవర్తనలోని సహజ నైజం. ఆహారశాస్త్రవేత్తలు ఇప్పటికి ఈ విషయం గ్రహించి, ఆహారంలో పీచుపదార్థం ముఖ్యతను స్పష్టంగా నొక్కి వక్కాణిస్తున్నారు. కోల్పోయిన ఆరోగ్యాలను సరిచేసుకునేందుకు మంచి మార్గంగా, రిఫైన్డే ఆహార పదార్థాలు, వాటితో తయారు చేయబడిన ఉత్పత్తులు వాడినందు వలన జరిగే నష్టాన్ని తెలియపరిచి, తిరిగి పీచుగలిగిన ఆహారపు విలువను గుర్తించమని, ఉపయోగించమని చెబుతున్నారు.

పీచు, పైపొర గలిగిన పదార్థాలు ఆలస్యంగా జీర్ణమవుతాయని, జీర్ణసంబంధ వ్యాధులున్న వారికి ఇది హాని చేస్తుందని, ఇప్పటి వరకు వాటి వాడకాన్ని నిషేధించమని చెబుతూ వచ్చిన యూరోపియన్ వైద్య, ఆరోగ్యనిపుణులు కూడా తమ తప్పును తెలుసుకుని, ఇకపై పీచుగలిగిన ఆహారపదార్థాలనే వాడమని చెప్పడం మొదలు పెట్టారు. బియ్యమే ఆహారంగా ఉపయోగించిన మన దేశప్రజలు, ఆధునిక లైస్మెల్లుల ఆవిర్భావంతో పాలిష్ బియ్యం, సూపర్పైన్ సిల్కు బియ్యం వంటి ఆకర్షణీయమయిన బియ్యం వాడేందుకు మక్కువ చూపించి, తమ ఆహారసేవనపు అలవాటును మార్చేసుకుని జీవితంలోకి ఆధునికతను ఆహ్వానించారు. పిడిరాయిలా తిరుగుతూ, రాళ్ళు తిన్నా, అరిగించుకునే జీర్ణక్రియను సున్నితపరచి, సిల్కుబియ్యం మృదుత్వానికి అనుగుణంగా మలచుకున్నారు. ఇందువలన మనకు మేలు జరిగిందా? కీడు జరిగిందా ? అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మన ప్రవర్తనలోని అవివేకం బయటపడుతుంది.

ఇప్పుడు చాలామంది ఈ విషయాన్ని తెలుసుకుని ఒంటిపట్టు, ముడి, పాలిష్ చేయని బియ్యం వాడడం మొదలు పెట్టారు. కూరగాయల పైపెచ్చు తీయకుండా అలాగే వండి తినడం, ఒకవేళ బీరకాయ వంటి కాయల చర్మాన్ని తీసివేసినా ఆ పైపెచ్చులను వృథాగా పోనీయకుండా వాటితో నూరుడు పచ్చళ్ళు చేసుకుని తినే అనాది, ఆరోగ్య ఆచారాన్ని తిరిగి ఆచరణలోకి తెచ్చుకుంటున్నారు.

కొర్రలు, సామెలు, ఊ దలు, ఆరికలు, ఆండు కొర్రలు, రాగుల లో
పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి
ఆరోగ్యకరమయిన జీర్ణక్రియలో, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపేందుకు ఎంతో ఆవశ్యకమయిన ఈ పీచుపదార్థం పాత్రను, విశిష్టతను గుర్తిద్దాం.బా అనారోగ్యాన్ని పారద్రోలి, ఆరోగ్యాన్ని పునఃప్రతిష్ఠించుకోవడంలో అగ్రగాములమవుదాం.
మన ఆహరం లొ ఉన్న పీచు పదార్థం మే( Dietaryఫైబర్) మన ఆహారం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ను నియంత్రిస్తుంది. ఒకే సారిగా అధిక మొత్తంలో గ్లూకోజు విడుదల చేయాలా, లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్ధమే నిర్ణయిస్తుంది..

ప్రస్తుతం వరి, గోధుమ ఆహార పదార్థాలలో పీచు పదార్థం. 0.25 శాతం - 05%కి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాలలో గ్లూకోజ్ గా (చక్కెరగా అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ (చెక్కర) గా ఒక్క సారి గా రక్తం
లోకి వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగిన స్వీట్లు తింటే..? Biscuitలో, బర్గర్, పిజ్జాలో, మైదాతో చేసిన నాను రొట్టెలు  కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడ్తుంది. అనేక రోగాలకు దారి తీస్తుంది.

మైదాతో చేసిన పదార్థాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు కూడా మన క్లోమ గ్రంధికి ఎంతో హానికరం.

సాధారణంగా మన దేహంలోని రక్తం (మొత్తం 4 నుండి 5 లీటర్ల)లో ఉండే గ్లూకోజ్ 6 నుండి 7 గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై, చివరిగా గ్లూకోజ్ మారి, రక్తంలోకి గ్లూకోజ్ రావటం దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్క సారిగా 10 నిమిషాల్లో లేదా 30-40 నిమిషాలలో అధిక మొత్తంలో రావటం ఎవరి ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం, ఫిట్స్, మొలలు, మూలశంక, ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ, మూత్రపించాల రోగులు, హృద్రోగులు వగైరా అందరికీ) మరింత చేటు.

అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని అవి దూరం పెట్టాలి. సిరి ధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోస్ రక్తంలోకి వదులుతుంటాయి,

కొర్ర బియ్యం, అధిక బియ్యం, ఊద బియ్యం, సామె బియ్యం, అండు కొర్ర బియ్యం 8 నుండి 12 శాతం పీచు పదార్థం (Fibre) కలిగినవి. పూర్తిగా సేంద్రియ మైనవి. ఈ జడూ 'పంచరత్న సిరి ధాన్యాలుగా 'పాలిష్ చేయ బడనివి' మరింత శ్రేష్ఠమైనవి.

వీటితో అన్నం వందుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాక్ కూడా చేసుకోవచ్చు.

👉సిరిధాన్యాల విశిష్టత:
వీటి గురుంచి డాక్టర్. ఖాదర్ వలీ గారు చాల చక్కగా వివరించారు
వారి మాటల్లో నే విందాం
సిరిధాన్యాల గొప్పదనం అధికంగా ఫైబర్ కలిగి ఉండటం మాత్రమే అని అనుకోవద్దు. అసలు అధికం అనే మాట ఇక్కడ సరైనది కాదు. సమతుల్యంగా, ఆహారంలోనే ఇమిడిఉన్న సహజమైన Dietary ఫైబర్ కలిగి ఉండడం వాటి ప్రత్యేకతమూడు పూ టలతిన్నపుడు. ఆ రోజుకు మనిషికి అవసరమైన 25-30 గ్రాముల ఫైబర్ (ప్రతి మానవ రోజుకు 38 గ్రాముల ఫైబర్ కావాలి) ఈ ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాయల నుండి, ఆకుల దూరం నుండి పొందవచ్చు.

ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలనశక్తిని కలిగి ఉన్నాయి.

వరి, గోధుమలలో పీచు పదార్థం / ఫైబర్ 0.2 నుండి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలతో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రం నుండి బయటి వరకూ, పిండిపదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలను కాపాడుకోవటంలో సులువు

ఉదాహరణకి కొర్ర బియ్యం- సమతుల్యమైన ఆహారం. 8 శాతం ఫైబర్తో పాటు, 12 శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకూ సరైన ఆహారంగా సూచించవచ్చు. చదువులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా సరైన భాగ్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్ఛలు వస్తాయి. అవి రకంగా కలుస్తూ ఉంటాయి. కొన్నేళ్లు వారినీ పోగొట్టగలిగే లక్షణం, నరాం మైన we convulsions లకు సరైన ఆహారం కొర్ర బియ్యం, కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఉదర క్వార్టర్ పారిన్ రోగం, అర్హుడు (అరికెలతో పాటుగా) నివారించడంలో కూడా

మీరు తెలుసా పాశ్చాత్య దేశాల్లో, వారి ఆహారంలో ఫైబర్ లేదని గ్రహించి, 2-3 ఫైబర్ లను నీటిలో వేసుకుని సేవిస్తూ ఉంటారు. అది శాస్త్రీయమైనది కాదు. సహజంగా అపోలో ఫైబర్ ఇమిడి ఉండటం మాత్రమే రక్తంలోకి గ్లూకోజు విడుదలని సమర్థంగా నియంత్రించగలదు.

అరికలు బియ్యం రక్ష శుద్ధికీ, ఎముకల మజ్జ మరింత సమర్థవంతంగా పని చేసే లా చూసేందుక, అస్తమా వ్యాధి, మూత్ర పిండ, ప్రొస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగుల,థైరాయిడ్, గొంతు, క్లోమ గ్రంధుల, కాలేయపు క్యాన్సర్లూ తగ్గించుకోవడానికి, అధికంగా చక్కర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి, గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికలు ఏంతో మేలు చేస్తాయి. డెంగ్యు జ్వరం, టైఫాయిడ్ జ్వరం, వైరస్ జ్వరం వగైరాలు తర్వాత నీరసించిన వారి రక్త శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు.

సామె బియ్యం - మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి. ఆడవారిలో PCOd తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకణాల సంఖ్యా పెరుగుతుంది. ఇవి కాక మానవుడి లింపు మండలపు శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంధుల క్యాన్సర్లకూ కూడా సామెలు ఎంతో పనికి వస్తాయి.

బియ్య థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, గాలాడరు శుద్ధికి కూడా ఇవి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి కూడా పనిచేస్తాయి.

అందు కొర్ర బియ్యం - జీర్ణ మండలంలోని కష్టాలను తీసివేస్తాయి. మొలలూ, భగన్దరం, మూల శంక, Fissures అల్సర్లు, మెదడు, రక్త, స్తనాల, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధమైన క్యాన్సర్లు మొదలైన కష్టాలను పోగొట్టడంలో తమ పాత్రను అద్భుతంగా పోషిస్తాయి.


No comments:

Post a Comment