.
👨🏻⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (866)
+++++++++++++++++++
అరోగ్య మస్తు
************************
మెడనొప్పి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మెడను ఎప్పుడూ ముందుకు వంచే పనులు చేసుకునేవారికి, నిద్రలో ఎత్తు దిండు వేసుకునే వారికి, మోటారు సైకిళ్ళపై గూనిగా కూర్చుని ఎక్కువసేపు నడిపేవారికి, వ్యాయామాలు అసలు చేయనివారికి, ఇంట్లో కూడా నడుమును, మెడను ముందుకు వంచి ఎక్కువగా కూర్చునే స్త్రీలకు మొ||గు వారికి మెడనొప్పులు వస్తూ ఉంటాయి. మెడను ఎక్కువగా ముందుకు వంచియున్నందుకు మెడ పూసలు వాటి మధ్య నుండి డిస్క్లను వత్తిడికి గురిచేస్తాయి. దాంతో మెడ నొప్పిపుడుతుంది. ఒక్కోసారి మెడభాగం నుండి చేతిలోనికి వచ్చే నరాలు నొక్కుకుని చేతిలో జాలు, తిమ్మిర్లు, వ్రేళ్ళు పట్టులేనట్లుగా అవ్వటం, చేతులలో నరాలు లాగినట్లు ఉండటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అసలు సమస్య మెడలో ఉండి చేతిలోనికి ఇలా వస్తుంది.
కొందరికి మెడనొప్పి వల్ల కళ్ళుతిరగటం, తలనొప్పి రావడం, కొందరు పడిపోవడం కూడా జరుగుతుంది.
👉చిట్కాలు:-
1) ముందు తలక్రింద దిండు తీసివేయాలి.
2) ఎప్పుడు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మెడ లైనుగా ఉండేటట్లు కూర్చోవాలి.
3) మెడభాగానికి కొబ్బరినూనె రాసి వేడినీటి బ్యాగ్ లో వేడినీరు పోసి కాపడం రెండు పూటలా 10, 15 ని॥లు పెట్టుకుంటే మంచిది.
4) మెడను ముందుకు వంచే ఆసనాలు చేయకూడదు. సూర్యనమస్కారాలు కూడా మానాలి. మెడను వెనక్కి వంచే ఆసనాలు అయిన మత్స్యాసనం, ఉష్ట్రాసనం, భుజంగాసనం చేస్తే సరిపోతుంది. ఇలా 20, 25 రోజులు చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. మెడనొప్పి లేనివారు ముందునుండీ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఇక రాకుండా ఉంటుంది.
5) ఆవు నెయ్యి గోరు వెచ్చగాచేసి ముక్కులో రెండు చుక్కలు రెండు పూటలా వేయాలి.
6) చెయ్యి బొటవేలి చట్టు గట్టిగా మసాజు చేయాలి
7. సుజోక్ థెరపీ చికిత్సా విధానము లొ సర్జికల్ టేపు ఒక ఇంచ్ ది తీసుకుని దానికి మెంతులు అతికిoచి బొటనివేలు చుట్టూ టేపు అతికించి పోవాలి ఆరేడు గంటలు ఉంచుకోవాలి గంటకొకసారి దానిమీద 30 సార్లు ఒత్తిడి చేయాలి
8) ఏదైనా మసాజ్ ఆయిల్ మెడకు రాసి... కొద్దిసేపు తర్వాత దొడ్డు ఉప్పు వేడి చేసి ఒక కాటన్ బట్టలో పెట్టి కాపడం పెట్టండి లేదా వేడి నీటితో గాని కాపడం పెట్టుకోండి
9) మెడ వ్యాయామం చేయాలి
ఎడమవైపుకు కుడివైపుకు ముందుకు వెనక్కు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గాలి పీల్చుకుంటూ వదులుతూ ఎక్స్ చేయండి రోజు...
No comments:
Post a Comment