*"మీకు డస్ట్ అలెర్జీ ఉందా"..
పడే వారికే తెలుస్తుంది బాధేంటో .. డస్ట్ అలెర్జీ కూడా అలాంటిదే మరి. కాస్త దుమ్ము వచ్చినా సరే హచీ .. హచీ అని వరుస బెట్టి తుమ్ముతుండాల్సిందే.. అంతే కాదు.. ఏం తినాలన్నా ఆలోచించాలి. అన్నీ తినకూడదు. అందరిలా ఉండకూడదు. ఆ ఏమౌతుందిలే ఒక్కసారికి అని ఆదమరచి వ్యవహరించారా అంతే అలెర్జీ ఎఫెక్ట్ దారుణంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి సత్వర ఉపశమనం అందించేందుకు కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం ..
"డస్ట్ అలర్జీకి కారణాలేంటి" ..
డస్ట్ అలర్జీ రావడానికి అసలు కారణం డస్ట్. కొందరిలో బొద్దింకలు కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. గాలిలో ఉండే ఫంగస్, దుమ్ము వల్ల అలర్జీ పెరుగుతుంది. ఇంకా కొన్ని రేణువుల నుంచి కూడా ఆలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. జంతువుల వెంట్రుకలు, పక్షుల రెక్కలు లాంటివి డస్ట్ అలర్జీకి కారకాలు. వీటి లక్షణాలు వరుసగా తుమ్ములు, ముక్కులో నుంచి నీరు, దగ్గు, దురద, కళ్లు ఎర్రబడటం, శ్వాసలో ఇబ్బంది.
👉హోం రెమెడీస్ ఇవే" ..
👉 హనీ – తేనె రెండు స్పూన్లు తీసుకోవాలి. డస్ట్ అకేర్జీని నివారించడానికి తేనె బాగా పనిచేస్తుంది అంటారు. పుప్పొడి ధాన్యాలు వల్ల కలిగే అలెర్జీలకు కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
👉 యాపిల్ సైడర్ వెనిగర్ – రెండు టీ స్పూన్ల వెనిగర్, ఓ గ్లాసు వేడి నీళ్లు కొంచెం తేనె కలిపి రోజుకు రెండు మూడుసార్లు తీడుకోవడం మంచిది. యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ సూక్ష్మ జీవుల లక్షణాలను కలిగి ఉన్నందున ఇది డస్ట్ ఎలర్జీ ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
👉 పసుపు – అరకప్పు పాలలో సగం స్పూన్ పసుపు కలుపుకుని తాగాలి. చల్లారక కాస్త తేనె వేసుకుంటే ఇంకా మంచిది. రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. పసుపు ఓ సహజ డీ కొంజేస్టెంట్, దుమ్ము అలెర్జీకి చికిత్స చేయడానికి ఉత్తమమైన సహజ నివారణ.
No comments:
Post a Comment