మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తీసుకునే ఆహారంలో ఏదో చిన్న మార్పు సంబవిస్తే చాలు ఆరోటు కడుపులో నానా రకాల బాధలు కలుగుతాయి. మీ కడుపులో సరిగా లేకపోతే ఆరోజంతా నరకంగా అనిపిస్తుంది.ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు కాని, ఈ మలబద్దకం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు, మీకే కాకుండా అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయితే దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు..మితమైన ఆహారం తీసకుంటూ సరైన చిట్కాలు పాటిస్తే చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పీచు పదార్దములు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి,దీని వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. సామన్యముగా మనం పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం కన్నా “జంక్ ఫుడ్”నే ఎక్కువగా ఇష్టపడతాము, కానీ ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్దంతో కూడిన ఆహరం ఉండాలి.
మలబద్దకం నివారణకు చిట్కాలు :
మలబద్దకాన్ని తగ్గించడంలో తేనె శక్తి వంతంగా పని చేస్తుంది. తేనె తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సవ్యంగా ఉంటుంది. అది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజుకు మూడు సార్లు నీటిలో తేనె కలుపుకొని తాగటం వలన మలబద్దకం తగ్గిపోతుంది.
మలబద్దకానికి ముఖ్య కారణం శరీరం లో సరిపోయేంత నీరు లేకపోవడం.ప్రతి గంటకు ,భోజనం అయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తాగాలి
మనం పీచు పదార్దం ఎంత తీసుకున్నప్పటికీ, దానికి తోడు నీరు కూడా తీసుకోవాలి,లేదంటే కడుపులో ఉన్న వ్యర్ద పదార్దాలు శుబ్ర పడకుండా అధిక నొప్పితో మలబద్దకముకు దారి తీస్తుంది.పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకుంటే మంచి ప్రభావం చుపిస్తాయి.
నారింజ పండు మలబద్దకాన్ని నివారించడం లో మంచి ఔషధంగా పని చేస్తుంది. నారింజ పండులో విటమిన్ “C” , అధికంగా పైబర్ లను కలిగి ఉంటుంది. రోజు 2 నారింజ పండ్ల ను ఉదయం ,సాయంత్రం తినడం వలన మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు.
ఎండిన ద్రాక్ష పండు సహజసిద్ధమైనది. మలబద్దకం తగ్గించడం లో సహాయపడుతుంది. ఎండిన ద్రాక్షలో ఫైబర్స్ ఉండటం వలన నీటిని గ్రహిస్తాయి.ఎండిన ద్రాక్ష పండ్లు తినడం వలన మలబద్ధకం నుండి విముక్తి లభిస్తుంది.
5.ఒక గ్లాస్ నీటిలో, చిటికెడు ఉప్పు , కొన్ని చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం వలన మలబద్ధకం నుండి ఉపశమనం.నిమ్మపండు రసం పేగులను శుభ్రపరిచే సాధకంగా పనిచేస్తుంది. రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నిమ్మరసం తాగటం వల్ల మలబద్దకం నుండి తోందరగా ఉపశమనం పొందవచ్చు.
ఆముదం నూనె యాంటీ-ఇన్ ఫ్లమేటరీ , యాంటీ-బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వలన ఇది పేగులలోని పురుగులను తొలగించటమే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.
రాత్రి పూట పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే మీ జీర్ణాశయం శుబ్రపడి, మంచి ప్రబావం చుపిస్తుంది.
మీరు భోజనం చేసిన తరువాత దానిలో భాగంగనే పీచు పదార్దం తీసుకున్నట్లు అయితే అహారం త్వరగా జీర్ణం అయ్యి ఈ మలబద్దక సమస్యనుండి విముక్తి లభిస్తుంది.
No comments:
Post a Comment