Sunday, August 1, 2021

ఆహరం -వంట విధానాలు cooking styles

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (855)
++++++++++++++++++++++
అరోగ్య మస్తు
*****************************
ఆహరం -వంట విధానాలు
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మనుషులే కాదు, జీవజాలంలోని ఏ జీవికయినా బతికేందుకు, ఎదిగేందుకు ఆహారం అవసరం. అయితే ఈ ఆహారం-మనం ఏ సృష్టికర్త సృష్టించబడ్డామో అదే సృష్టికర్తచేత మనకంటే ముందే సృష్టించబడి మనకోసం ఉంచబడింది. ఈ పర్యావరణ జీవన చక్రంలో సహజ ఆహారం ఒక ముఖ్యవిభాగం. అమీబా అనే ఏక కణ జీవి ప్లాంక్టన్ అనే వృక్ష సంబంధ జీవాన్ని తింటుంది. చిన్న చేపలు పెద్దచేపలకు. ఆహారం, క్రిల్ అనే సముద్రజీవులు తిమింగలాలకు ఆహారం. ఈ విధంగా సృష్టిలోని ప్రతి జీవి తన చుట్టూవున్న ప్రకృతి, అంటే పర్యావరణం నుండే తన ఆహారాన్ని గ్రహించేటట్లుగా ప్రకృతి నిర్దేశించింది.

మీకు తెలుసా? అసలు మానవుడు వండుకునే అవసరం కూడా లేకుండా సూర్యభగవానుడు తన కిరణాలతో చెట్లమీద పండ్లు, కాయలను చక్కగా వండి, అంటే పండించి, మనిషికి, తదితర జీవజాలానికి జీర్ణమయేందుకు సిద్ధంగా తయారుచేసి అందిస్తున్నాడు. మరి మనిషికి ఈ వంటజబ్బు ఎందుకు, ఎప్పుడు.. అంటుకుంది?

పండ్లు, కాయగూరలు వాటి సహజస్థితిలో చాలా చక్కని రుచిని కలిగి వుంటాయి. ఆదిమానవుడు కొంతకాలం అవి తిని, ఏదో ఒకరోజు రాత్రిపూట, రక్షణకు, వేడిని ఇచ్చేందుకు, వెలిగించిన నెగడులో చేయిజారి పడిపోయిన ఏ దుంపనో, కాయనో ఇవతలకు తీసి, ఆ వేడికి ఉడికిపోయిన దాన్ని తినేసరికి, ఒక్కసారిగా ఓ కొత్త రుచిని ఆనందించి వుంటాడు. అలాగే కొన్ని దుంపలు, కాయలను నెగడులో ఉడికించి, తనవాళ్ళకు కూడా ఆ అద్భుతరుచిని చవి చూపి వుంటాడు. చేయిజారిన దుంప నెగడులో పడిన ప్రమాదమే. బహుశా వండే విధానానికి కారణమయి వుంటుంది. అదే జిహ్వకు ప్రమోదమయి, రుచుల ప్రపంచానికి ద్వారాలు తెరచివుంటుంది.

అలాగే మాములుగా వేటాడుతూ పచ్చి మాంసం తింటూవున్న కాలంలో రోజు గిన కార్చిచ్చులో కాలిపోయిన జంతు కళేబరాలు దొరికి, వాటికాలిన మాంసం తినేసరికి, ఆ రుచి అద్భుతంగా తోచి, ఆపైన వేటాడిన జంతువులను నెగడులో కాల్చి తినడం అలవాటుగా మారి ఉండవచ్చును.

బహుశా ఇలా మొదలయిన వంట విధానం, మనిషి ఎదుగుతున్న కొద్దీ పలు కొత్తపుంతలు తొక్కి రుచులను పెంచేందుకు మసాలాలు, సుగంధద్రవ్యాల వంటి ఎన్నో దినుసులు కలిపి, కొత్త కొత్త పరిశోధనలతో, అనేక వేల వంటకాలతో నల భీమ పాకశాస్త్రమే ఆవిష్కరించబడింది.

వంట వలన ఆహారపదార్థాలకు నష్టం వాటిల్లుతుంది అని కొందరి అభిప్రాయం. అయితే అవసరమయిన పక్వతతో తేలికపాటి వంటవిధానం వలన, ఆహారం తన సహజరుచిని, పోషకవిలువలు కోల్పోదు. అలాగే ఆహారం వండే విధానాలలో పదార్థాలకు కొన్ని మేలు చేసేవి వుంటే, కొన్ని హానిచేసేవి కూడావున్నాయి. వంట విధానంలోని ఎక్కువ వేడిమి, కాయగూరలు, పండ్లలోని ఎంతో విలువైన - ఖనిజాలను-పోషకాలను నశింపచేస్తుంది. కాబట్టి, అవసరాన్ని బట్టి వండే తెలివయిన వంటవిధానం వల్ల మనం పోషకాలను నష్టపోము, పదార్థరుచిని ఆస్వాదించ గలుగుతాం.

👉వంట విధానాలు

1. బేకింగ్ (తాపనం) : బిస్కట్లు, రొట్టెలు, కేకులు, పిజ్జాలు వగైరా.

2. స్టీమింగ్ (ఆవిరి) : ఇడ్లీ, ఆవిరికుడుములు వగైరా. 3. బాయిలింగ్ (ఉడికించడం) : అన్నం, నూడిల్స్, దుంపలు వగైరాలను నీటిలో ఉడికించడం.

4. ఫ్రైయింగ్ (వేయించడం) కొద్దిపాటి నూనెతో పదార్థాలను కొంచెంగా వేగనివ్వడం షాలో ఫ్రయింగ్ అంటారు (కట్లెట్, దోసెలు వగైరా.). బాణలిలో నూనెపోసి మరగబెట్టి, పదార్థాలను ఎర్రగా వేయించడం దీప్ ఫ్రయింగ్ అంటారు. మనం దాదాపు అన్ని పిండివంటలు, కారపుదినుసులు (బూందీ, చేగోడీలు, జిలేబీ, పకోడీ, సమోసా) ఇలా నూనెలోనే దేవుతుంటాం.

5. రోస్టింగ్ (ఎర్రగా వేయించడం): సాధారణంగా దుంపకూరలు, చికెన్, ఫిష్, మటన్ వంటి మాంసాహార వంటకాలు ఈ విధంగా వండుతారు. ఎక్కువ నూనె, ఎక్కువ వేడిమితో ఆ పదార్థాల స్వరూప స్వభావాలు మారిపోతుంటాయి
బఠాణీలు వేరుశనగ ఉప్పు శనగలు కొద్ది మార్పుతోనూనె లేకుండా ఈ విధానంలో తయారవుతాయి

అన్ని విధానాల వంటలలో, బేకింగ్(తాపనం) తో స్టీమింగ్ (అవిరీ) తో వండేపదార్థాలలో పోషకవిలువలు  నష్టపోక ఆహారం వలన సంపూర్ణంగా నా భయపడతాం. రోస్టింగ్ డీప్ ఫ్రైయింగ్ వలన పోషకాలను సంపూర్ణంగా నష్టపోతాం.
రోజు తింటే ఆరోగ్యానికి హాని కూడా ఏర్పడుతుంది
 🔸ఇప్పుడు ఈ పంట విధానాలను కొంచెం విఫులంగా పరిశీలిద్దాం.

 1. బేకింగ్ (తాపనం): నేరుగా నిప్పుల మంటలో కాక మంటద్వారా వచ్చే వేడిని ఉపయోగించి  వండే విధానాన్ని బేకింగ్ అంటారు. ఈ విధానంలో వేడికి పదార్ధంలో సహజంగా వుండే నీటితోనే ఇవి ఉడికిపోతాయి. రొట్టెలు, బిస్కెట్స్ కేకులు, పిజ్జాలువంటి యూరోపియన్ వంటకాలు, ఈ విధానంలో వండుతారు."అవెన్" అనే యంత్రం ఇందుకుఉపకరిస్తుంది. ఇందులో కట్టెలు మండేoదుకు ఒక అర ఆహారం ఉంచేందుకు ఒక అర ఉంటాయి. మంటలేని వేడివలన పదార్థాలలోని తేమతోనే ఇవి ఉడికి, మంచి పోషణతో కూడిన రుచిని సంతరించుకుంటాయి. కాబట్టి, పిల్లా, పెద్దా అందరూ ఈ పదార్థాలు తినేందుకు మక్కువ చూపుతారు. ఈ విధానంలో వండే కూరగాయలు, సంస్థలు, మాంసాహార వంటలు తమ సహజరుచులతో అందరినీ అలరిస్తాయి. ఈ రోజులలో గ్యాస్, ఎలక్ట్రిక్ ఆవెన్లు, మైక్రోవేవ్ ఆవెన్లు, గ్రిల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. భారత్ దేశంలోని పంజాబ్, ఉత్తర హిందూస్థాన్లలో ప్రజలు ఉపయోగించే కుమార్ అనబడే పొయ్యిలు దాదాపు ఇదే సాంకేతికతతో పనిచేస్తాయి.

2. స్టీమింగ్ (ఆవిరిలో ఉడికించడం): నీళ్ళలో ఉడికించడం కంటే, ఆహార పదార్థాలను ఈ పద్ధతిలో వండడం శ్రేయస్కరం. ఇడ్లీలను ఈ విధానంలోనే వండుతారు. అవిరి కుడుములను, పాలతో తయారుచేసే జున్నును, పుడ్డింగ్లను ఇలానే తపడుతారు. ఈ రోజు ప్రతి వంట ఇంటిలోను దర్శనమిస్తున్న ప్రెషర్ కుక్కర్ ఆవిరిమీద వండేందుకు ఆధునిక కాలంలో అవతరించిన అద్భుతమైన పంట పరికరం అని పేర్కొనవచ్చు. ఒక ఇంట్లోని వారందరికి సరిపడా వంటలు అన్నం, కూరగాయముక్కలు, పప్పు-వంటి వస్తువులను ఒకేసారి ఉడికించి తీసుకునే అవకాశం ఇచ్చే ఈ ప్రెషర్ కుక్కర్ ఎంతో శ్రమను, సమయాన్ని ఇంధనాన్ని ధనాన్ని కూడా అదా చేస్తుందనీ, వాడు తున్నారు కాని
ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహార పదార్థాలు... దానిలో ఉన్న పోషక విలువలు నశించిపోతాయి
 కంది పప్పుఉడికిస్తే 84% పోషక విలువలు నశించి పోతున్నాయి
మట్టి కుండలో పప్పు వండితే100% 
పోషకాలు అలానే ఉంటున్నాయి
మీకు విలుఅయే అంతవరకు ప్రెషర్ కుక్కర్ , పాన్ వాడకుండా వంట చేయడానికి ప్రయత్నం చేయండి
తక్కువ ఖర్చుతో మంచి పోషణ ఇచ్చే ఆహారాన్ని స్టీమింగ్ విధానం ద్వారా మన పొందగలుగుతాం.

8. బాయిలింగ్: ప్రెషర్ కుక్కర్ రాకముందు పదార్థాలను ఉడికించేందుకు మనకు తెలిసిన ఏకైక విధానం బాయిలింగ్. పాత్రలో సగానికి నీళ్ళుపోసి, ఏ ఆహార పదార్థమయినా బియ్యం, కూరగాయల ముక్కలు, పప్పుధాన్యాలు, ఇలా ఏవయినా వేసి పాత్రను వేడిచేస్తే అందులోని నీరు మరిగి, పదార్థాలను ఉడికిస్తుంది. అయితే ఉడుకుతున్నప్పుడు పాత్రపైన మూత ఉంచకపోతే, ఆవిరితోబాటుగా పదార్థాలలోని పోషకాలు గాలిలోకి పోయి, ఆహారంలో ఆ పోషకాలను నష్టపోతాం. అన్నం, పులుసు, చారు, కూర, జావ, పాయసం వంటి అనేక ఆహారపదార్థాలు ఈ విధానంలోనే వండుతారు.

4. రోస్టింగ్ : నిప్పుల మంటలో నేరుగా గానీ, లేదా బాగా వేడెక్కిన పెనం కళాయిలో బాగా ఎర్రగా వేయించడాన్ని రోస్టింగ్ అంటారు. వేరుశనగ కాయలను ముందుగా వేడెక్కిన ఇసుకలో వేసి వేయిస్తారు. అపరిమితమయిన వేడి వలన, అవి వేయగానే వేగిపోతాయి. దీన్ని రోస్టింగ్ అనవచ్చు. వంకాయలను ముందుగా రోస్ట్ చేసి, ఆపైన వంకాయబజ్జీ చేస్తారు. చికెన్ రోస్ట్, ఫిష్ రోస్ట్ వంటివి, రోస్టింగ్ విధానంలోనే తయారుచేస్తారు. ఇందులో నూనె చాలా తక్కువగా వుంటుంది. సాధ్యమయినంతవరకు ఆహారపదార్థాలలో ఉండే నూనె పదార్థంతోనే ఇది ఉడుకుతుంది.

5. ప్రయింగ్ (నూనెలో వేయించడం): చాలా ఎక్కువగా విరివిగా ఉపయోగించబడే వంటవిధానం, బజ్జీలు, పకోడీ, బంగాళదుంపల చిప్స్, బూందీ, చేగోడీల వంటి హాట్లు, అరిసెలు, కజ్జికాయలు, కాజా, బాదుషాలు వంటి స్వీట్లు బాండీలో బాగా వేడెక్కిన నూనె లేదా నేతిలో వేసి వేయిస్తారు. దీన్ని దీప్ ఫ్రయింగ్ అంటారు. బయట వ్యాపారపరంగా ఎక్కువ పదార్థాలు వేయిస్తారు కాబట్టి, ఎలా ఉపయోగిస్తారు. ఇదే పద్ధతి మనం ఇంట్లో చేస్తే, నూనె వృథా అవుతుంది. నిజానికి ఒకసారి వేయించిన నూనెను మరోసారి వేయించకూడదని, ఆహారశాస్త్రజ్ఞులు అంటారు. ఎందుకంటే క్యాన్సర్ కారణమయిన కార్సినోజనిక్ పదార్థం, ఇలా మరల మరల వేయిస్తూ వుండే నూనెలో పుడుతుందట. ఇలా వేయించిన పదార్థాలు ఎక్కువ నూనెను
వినియోగించినందు వలన, నూనెలలో ఉండే సహజంగా కొవ్వు పదార్థం సాంద్రత చెంది, ఈ వంటకాలు ఎక్కువగా తినేవారికి ఊబకాయం వంటి ఇబ్బంది. కలుగజేయవచ్చును. ఎప్పుడైనా ఒకసారి తింటే పరవాలేదుకానీ, రుచిగా వున్నాయంటూ ఈ విధానంలో వంటకాలు చేసుకుని రోజూ తినేవారు మాత్రం పారా హుషార్! అంతేకాదు, ఇవి జీర్ణం కావడానికి కూడా చాలా సమయం పడుతున్నందువలన అజీర్ణం, గ్యాసు, ఎసిడిటీ వంటి జీర్ణాశయ సంబంధితం వ్యాధులు అంకురించేందుకు, విస్తరించి రోగగ్రస్తులయేందుకు అవకాశం మెండు, తస్మాత్ జాగ్రత్త!
నేడు పెద్ద పెద్ద స్టార్  హోటల్స్లో
పూరి వడ పకోడీ, వంటలు చేయి నప్పు డు వాడిన నూనెను , తిరిగి అను నేను రెండవ సారి వినియోగించరు. సగం రేటు బజార్లో అమ్ముతారు. మిర్చి బండి వాళ్ళు
చిన్నచిన్న హోటల్స్ వాళ్లను తీసుకొచ్చి వాడతారు. వారు  చేసిన పదార్థాలు తిని మనం రోగాలు తీసుకుంటున్నాం. వీలైనంత వరకు బజారులో తోపుడు బండి మీద వేసే
మిర్చి పూరి పకోడీ లాంటి పదార్థాలు తినకండి.


🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

No comments:

Post a Comment