Tuesday, August 10, 2021

నేరేడు (Jamun) తో లాభాలు

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (865)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
నేరేడు (Jamun) తో లాభాలు
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
నేరేడు దీని పండు వగరు, తీపి, పులుపు రుచి కలిగివుంటుంది. చలువ చేస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. మేహశాంతి, పైత్యశాంతి చేస్తుంది. శిరస్సులోని పైత్య, మేహములను అణుస్తుంది. వేడిచేసిన విరేచనాలను కడుతుంది. గుండె, రక్తంలోని ఉష్ణాన్ని పోగొడుతుంది. కడుపులోని వాతం పెరగకుండా అదుపు చేస్తుంది. గొంతుకకు, రొమ్ముకు, గర్భిణులకు చెరుపుచేస్తుంది. దీనికి విరుగుళ్ళు శొంఠిచూర్ణం, ఉసిరిక పప్పు. తీయని పండ్లను బాగా కడిగి కొంచెం ఉప్పుతో నంచుకుతింటే మంచిది.
👉కడుపులో ప్రేవులలో ప్రమాదవశాత్తూ చేరుకున్న తలవెంట్రుకలు, లోహపు ముక్కలను కూడా నేరేడు పండ్లు కరిగించివేస్తాయి. ఇంతటి శక్తిమంతమయినదీ పండు రసం.

👉దీని మాను చెక్కనుండి తీసిన కషాయం గ్రహణి, అతిసారం, నీళ్ళ విరేచనాలు, జ్వరాలను నివారిస్తుంది.

👉దీని కషాయం పుక్కిలించిన గొంతు, నోరుపూత పోతాయి. దీని ఆకులు నూరి తేలు కుట్టిన చోట కడితే, విషాన్ని హరిస్తుంది..

 👉దీని పండ్లు తింటే రక్తగ్రహణి, నీళ్ళ విరేచనాలు కడతాయి.

👉 మూత్రపు సంచిలో రాళ్ళు ఏర్పడకుండా దీని పండ్లు నివారిస్తాయి. 
👉 విత్తనాలు ఎండబెట్టి చేసిన చూర్ణం తీసుకుంటే, అతిమూత్రం కడుతుంది. మధుమేహం నివారిస్తుంది.
👉 నేరేడు గింజల చూర్ణం 75 గ్రాములు, 25 గ్రాములు పసుపు కలపాలి. గ్లాసు నీళ్ళలో ఒక చెంచా నెయ్యి వేసి సగం అయ్యే వరకు మరిగించి కొన్ని  రెండు పూటలా ఆహారానికి ఒక గంట ముందు సేవించాలి ఈ విధంగా మూడు నెలలు వాడితే మధుమేహం తగ్గుతుంది
 👉దీని ఆకులు ఎండించిన చూర్ణంలో కొంచెం ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటే.. పళ్ళు గట్టిపడతాయి..

👉నేరేడు జీర్ణక్రియకు మంచిది. లివర్కు మేలు చేస్తుంది. దాహాన్ని అరికడుతుంది. 
👉దీని రసంలో కొంచెం చక్కెర కలిపి తాగితే నీళ్ళ విరేచనాలు కడతాయి. 
👉పంచదారకు బదులు తేనె కలిపి తాగితే అరికాళ్ళు-అరిచేతుల మంటలు, కళ్ళ మంటలు, మూలవ్యాధి నివారిస్తాయి. 
👉మూత్రం సాఫీగా జారీ చేస్తుంది. నిద్రలేమి (Insomnia) గలవారికి మేలు చేసి, నిద్రవచ్చేలా చేస్తుంది.

👉. నేరేడు చిగుర్లతో కషాయం కాయండి. రోజుకు 3 సార్లు నాలుగైదు టేబుల్ స్పూన్ల కషాయం తాగుతుంటే డిసెంట్రీ, డయేరియా, మొలలు తగ్గుతాయి.

👉 నేరేడు ఆకులు నూరిన పేస్టును కాలిన గాయాలకు పూస్తే గాయాలు త్వరగా నివారణ అవుతాయి. శరీరంపై కాలిన మచ్చలు కూడా ఏర్పడవు.

👉 నేరేడు పుల్లతో పళ్ళు తోమితే పళ్ళు, చిగుళ్ళు ఆరోగ్యంగా వుంటాయి. నమిలిన రసం చిగుళ్ళ నుండి రక్తస్రావం నిలుపుతుంది. నోటి దుర్వాసన నివారిస్తుంది. చిగుళ్ళను దృఢపరుస్తుంది.
👉 ఆకులను ఎండబెట్టి పొడి చేసి  100 గ్రాములు చూర్ణం లో ఒక చెంచా ఉప్పు కలుపుకొని పళ్లు రుద్దుకుంటే, కదిలి దంతాలు కూడా గట్టిపడతాయి ఇది ఒక అద్భుతమైన  పళ్ళపొడిలాగా పనిచేస్తుంది నోటి దుర్వాసన కూడా పోతుంది

👉నేరేడు అధికంగా తింటే గొంతు నొప్పి, దగ్గు తెస్తుంది. ఇందుకు విరుగుడుగా వాటిపై కొంచెం ఉప్పు, మిరియాలపొడి జల్లాలి..


No comments:

Post a Comment