Wednesday, August 25, 2021

కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే!!!!!!!!!;!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (880)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే
!!!!!!!!!;!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
బాగా లావున్న వారికి, సుగరున్నవారికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, రక్త నాళాలు మూసుకున్నవారికి ఈ సమస్య వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రక్త ప్రసరణలోపమే కారణం. ఇది కాకుండా 'బి' విటమిన్లు ముఖ్యంగా విటమిన్ 'బి1' లోపం ఉన్న వారిలో కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు నీరు పట్టడం జరుగుతుంది.

👉చిట్కాలు:- 
1) రెండు బేసిన్లు పెట్టి అందులో ఒక దానిలో వేడి నీరు, మరొక దానిలో చల్లని నీరు పోయండి. మీరు కుర్చీలో కూర్చుని ముందు 5 నిమిషాలు వేడి నీటిలో ఉంచి, ఆ తరువాత 2 నిమిషాలు చల్లని నీటిలోకి మార్చండి. మళ్ళా పాదాలను 5 నిమిషాలు వేడిలో, 2 నిమిషాలు చల్లని వాటిలో ఇలా ఇంకొకసారి మార్చుతారు. దీనివల్ల, వేడిలో పెట్టినప్పుడు రక్తం కాళ్ళపైకి బగా నడిస్తే చల్లవాటిలో పెట్టినప్పుడు రక్తం కాళ్ళపైకి ఎక్కువగా వస్తుంది. ఇలా రక్తం పైకీ క్రిందకు బాగా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.

2) ముడి బియ్యపు అన్నం తినడం వలన 'బి' విటమినుల లోపాన్ని తేలికగా సవరించుకోవచ్చు. మంటలు, తిమ్మిర్లు ఉపశమిస్తాయి. 


Tuesday, August 24, 2021

మాడు నొప్పి

మాడు నొప్పి

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (879)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
 మాడు నొప్పి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 తలనొప్పి వేరు మాడు నొప్పి వేరు. ఒక్క మాడుభాగంలోనే ఇది వస్తుంది. బస్సు ప్రయాణాలలో, షాపింగులలో, ఎండలో తిరిగేటప్పుడు, టెంన్షన్ వచ్చినప్పుడు ఎక్కువగా వస్తుంది. మంచినీళ్ళు తక్కువగా త్రా గి తిరిగే వారికి శరీరంలో నీరు చాలక, తలకు అందవలసిన రక్త ప్రసరణ అందక, రక్తంలో నీరు తగ్గడం వలన మాడు భాగం వేడెక్కువై మాడు నొప్పి వస్తుంది. రేడియేటర్ నీళ్ళు తగ్గితే ఇంజన్ వేడెక్కినట్లే మనకు మాడు భాగం వేడెక్కుతుంది. పైన చెప్పిన సందర్భాలలో మూత్రం వస్తుందని నీరు త్రాగక తిరిగి నందుకు మాడు నొప్పి వస్తుంది. ..

👉చిట్కాలు:- 
1) ఎప్పుడూ మాడునొప్పి అనిపించినా వెంటనే మాడుపై నీళ్ళతో తడిపి, కుదిరితే చేతిగుడ్డ తడిపి ఉంచుకోవచ్చు. 
2) పగలు మాడు నొప్పి వస్తే సాయంకాలం తలస్నానం చేయడం మంచిది. 
3) రోజూ నీరు బాగా త్రాగాలి. కూడా సీసా ఉంచుకుని కొంచెం కొంచెం పైన చెప్పిన సందర్భాలలో త్రాగితే మంచిది. మూత్రం రాదు. మాడు నొప్పి రాదు


Monday, August 23, 2021

ఫుడ్ ఎలర్జీ తగ్గాలంటే food elergy

జ్వరము దగ్గు జలుబు డెంగ్యూ ఫీవర్ అన్ని రకాల విషజ్వరాలు తగ్గడానికి viral fever

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో(878)
++++++++++++++++++++
అరోగ్య మస్తు
****************************
జ్వరము దగ్గు జలుబు డెంగ్యూ ఫీవర్ అన్ని రకాల విషజ్వరాలు తగ్గడానికి
+++++++++++++++++++++++
కావలసిన పదార్థాలు:-
1.తిప్పతీగ జానెడు పచ్చిది దొరకకపోతే పొడి రెండు చెంచాలు వేయండి
2. తులసి ఆకులు 10
3 అల్లం 5 గ్రాములు
4. మిరియాలు- 5
5. నేల వేము-2చిటి కలు
(ఇది ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది)
8.పటి క బెల్లం లేదా తాటి బెల్లం
10గ్రాములు
గ్లాసు నీళ్ళు (200ML) తీసుకొని
చిన్న మంట పై సగం అయ్యేవరకు మరిగించాలి. వడ పోసుకొని
ఆహారం సేవించడానికి ముందు
2పూట లతగ్గే వరకు వాడాలి
Note:-  నేనుఇచ్చిన ఫార్ములా అన్ని రకాల విషజ్వరాలకు పని చేస్తది
2, 3రోజులకు తగ్గుతుంది


నీరసం గా ఉంటే అశ్వగంధ లేదా చవన్ ప్రాస్ వాడండినొప్పులు ఉంటే యోగరాజ్ గుగ్గులు వాడండి
(ఆయుర్వేదిక్ స్టోర్ లో దొరుకుతాయి)
తేలికపాటి ఆహారం తీసుకోండి
డ్రై ఫ్రూట్స్ బాగా తినండి
రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగాలి
రెండు పూటలా నీటి ఆవిరి పట్టాలి

👉 ఒక గ్లాసు నీళ్లు చేతిలోకితీసుకుని, నీళ్లను చూస్తూ థాంక్యూ వాటర్ ట్యాంక్ వాటర్ అని 11సార్లు చెప్పండి, నీళ్లు తాగే ముందు, మీరు ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో
ఆ జబ్బు యొక్క సమస్య పేరు చెప్పి తగ్గినందుకు కృతజ్ఞతలు
చెప్పి నీళ్లు తాగండి ఇలా రోజూ మూడు పూటలా తాగండి
(దీనిని ఆకర్షణ సిద్ధాంతం అంటారు) ఇది అన్ని రకాల అనారోగ్య సమస్యలకు వాడవచ్చు
👉  రోజు రాత్రి నిద్రించే ముందు
తలకింద దిండు తీసివేసి, బాత్రూం లాగా నేరుగా పడుకుని, మి కూడి చెయ్యి హృదయం మీద పెట్టుకొని
ఈ వాక్యాలు  7లేదా 11 సార్లు చెప్పండి
"నేను పరమ పవిత్రమైన శక్తి శాలి ఆత్మను, నాకుఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు నేను ఆరోగ్యంగా ఉన్నాను.
👉 గొంతునొప్పిగా ఉంటే అర గ్లాసు నీళ్ళలో మెంతులు ఒక చెంచా వేసి
సగం అయ్యేవరకు మరిగించి, కొద్దిగా చల్లారిన తర్వాత, పుక్క లించి వూసివేయండి. గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతాది

Sunday, August 22, 2021

ఫుడ్ ఎలర్జీ తగ్గాలంటే food elergy

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (877)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
 ఫుడ్ ఎలర్జీ తగ్గాలంటే
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 మంచికి, చెడుకి మధ్య ఘర్షణే ఎలా అంటే. భార్యాభర్తలిద్దరూ మంచివారైతే వారిద్దరి మధ్య ఏ గొడవులు రాకుండా జీవితం సాఫీగా నడుస్తుంది. అదే మాదిరిగా అటు ఆహారము, ఇటు శరీరము రెండూ (ఆహారము ప్రకృతిసిద్ధంగా ఉండి, శరీరము కూడా సహజంగా ఉంటే ఒకే విధముగా ప్రకృతి సహజముగా ఉంటే వాటి మధ్య ఏ గొడవా (ఎలర్జీ)రాదు. భార్యాభర్తలిద్దరూ చెడ్డవారైనా వారిమధ్య ఏ గొడవులూ ఉండవు. వాళ్ళిద్దరూ బాగా కలిసిపోతారు. అలాగే, అటు ఆహారము చెడ్డదిగా ఉంది. ఇటు శరీరము కూడా చెడిపోయి అసహజంగా ఉంటే ఈ రెండూ కలిసిపోయి ఏ ఎలర్జీ రాదు. ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు అయినప్పుడే గొడవలు మొదలయ్యేది. ఈ మధ్య జనాలకు, తేనెకు, కొబ్బరికి, నిమ్మకాయలకు ఇతర పులుపులకు, ఎండకు, మంచుకు, దుమ్ముకు, కూరగాయలకు, గింజలకు (ఇవన్నీ ప్రకృతి సిద్ధమైనవి) మొ॥గు వాటితో ఎలర్జీ వస్తున్నది. ఇలాంటి వాటికి ఎలర్జీ వస్తున్నదంటే శరీరంలో అసహజమైనవి నిల్వయుండి, ఎలర్జీని కలిగించే పదార్థాలు పుట్టి, లోపల అసహజంగా మారి పైన చెప్పినలాంటివి తగిలే సరికి దురదలు, దద్దుర్లు, వాపులు, గొంతులో తేడాలు మొ||వి వచ్చేస్తాయి. అవి పడటంలేదు కాబట్టి, వాటిని పూర్తిగా మానేస్తే పోతుందిగదా అని వాటిని మానివేస్తూ ఉంటారు. లోపల అసహజత పెరుగుతూ నిదానంగా ఇతర ప్రకృతి సిద్ధమైన ఆహారాలకు కూడా ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. మాంసం పడడం. లేదని కానీ, ఆవకాయ పడడంలేదని, చాక్లెట్లు, బిస్కెట్లు పడడం లేదని డాక్టరు దగ్గరకు వెళ్ళి వీటికి నాకు ఎలర్జీ వస్తుందనే వారు ఎవరన్నా ఉన్నారా? ఇలాంటివి శరీరానికి బాగా పడుతున్నాయి. మన శరీరం చెడిపోయి ఉండేసరికి చెడులో చెడు పడే సరికి కలిసిపోతున్నాయి. రా, రా! మనమిద్దరం ఫ్రెండ్స్ అంటూ కలుస్తాయి. ఎలర్జీ పోవాలంటే వేటినీ మానడం పరిష్కారం కాదు, మనలో ఎలర్జీకి మూలాన్ని కడిగివేసి శరీరాన్ని సహజంగా మార్చుకుంటే అన్నీ మళ్ళీ పడతాయి.

👉చిట్కాలు:-
 1మంచినీరు తక్కువగా త్రాగేవారికి ఎక్కువగా ఎలర్జీలు వస్తాయి. కాబట్టి 5 లీటర్ల నీరు ప్రతిరోజూ అలవాటు చేసుకోవాలి. 
2) ముందు 2, 3రోజులపాటు తేనె నీళ్ళలో ఉపవాసం (నిమ్మపడకపోతే మానివేసి పట్టితేనె+నీళ్ళు త్రాగవచ్చు) చేస్తే మంచిది. ఉపవాసంలో అవసరమైతే కొబ్బరినీళ్ళు రెండవ, మూడవ రోజుగానీ త్రాగవచ్చు
. 3) నాల్గవ రోజు నుండీ ఏ పండ్లు పడితే, ఏ రసాలు పడితే వాటితోనే రోజుకి 5, 6సార్లుగా అందులోనే తేనె వేసుకుని త్రాగుతూ 3, 4 రోజులుంటే మంచిది. చెరుకురసం పడితే త్రాగవచ్చు.
 4) ఆ తరువాత రోజు నుండీ ఉదయం పూట 8 గం॥ లకు రసాలు, 9, 10 గంటలకు పండ్లు తిని మధ్యాహ్నం భోజనంలో పుల్కాలతో చప్పటి కూర (ఏది పడితే ఆ కూర తో తిని, సాయంకాలం 5, 6 గం॥లకు పండ్లు తిని ఆపాలి. ఇలా 5,6 రోజులు చేస్తే శరీరం లోపల శుభ్రం అయి, రక్తం మారి కొంత సహజత్వము వస్తుంది. 5) ఇలా 10, 12 రోజులు గడిచాక మీకు పడని వాటిని మెల్లగా ఒక్కొక్కటీ అలవాటు చేసుకుంటే అవే సరిపడుతుంటాయి. లేదా ఇంకో 10 రోజుల తరువాతనైనా అలవాటు చేసుకోండి. ఎవరికన్నా ఇంకా తగ్గకపోతే ఆహారము, ఉప్పు నూనెలు సొంతం మాని తింటే అప్పుడు పూర్తిగా తగ్గిపోతాయి. 


Saturday, August 21, 2021

పసుపుతో నొప్పులకు చికిత్స haldi

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (876)
+++++++++++++++++++++++
అరోగ్య మస్తు
*****************************
పసుపుతో నొప్పులకు చికిత్స
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
కాళ్ళు చేతులు వాచి పోయి, నొప్పులు పుడతాయి. సాధారణముగా వాత రోగులకు ఇలా జరుగుతుంది. పసుపులో కొద్దిగా నీటిని కలిపి, లేహ్యము చేసి, దీనిని రాచు కుంటే నొప్పులన్నీ తగ్గి పోతాయి. కాళ్ళుచేతుల యందలి నరాలు నొప్పిగా వుంటే... వేడి పాలలో పంచదార మూడు చిటికెళ్ళ పసుపును వేసి త్రాగితే నొప్పులు మటుమాయ మవు తాయి. బెణుకు నొప్పులకు కూడ ఈ మిశ్రమము మంచి ఫలితాల నిస్తుంది. మన పెద్దలు చేతులూ, కాళ్ళ వాపులకు పసుపు, సున్నము బెల్లముల మిశ్రమముతో 'పట్టీ' వేయుటను మీరు చూచే వుంటారు ఐతే దానికి మనము అంత ప్రాధాన్యత నివ్వము గానీ దాదాపు ఇది తెల్ల పిండి కట్టు అంత గట్టిగానే బిగుసుకొని పోయి, నొప్పిని తగ్గిస్తుంది. ఈ విషయములు చాల మందికి 'ఆశ్చర్యము'ను కలిగించ వచ్చును. గానీ... ఇవి అక్షర సత్యము!

👉ఆముదం ఆకులు కచ్చాపచ్చాగా దంచి రాత్రి పడుకునే ముందు వాపులు నొప్పులు పైన కట్టితే కూడా చాలా రిలీఫ్ వస్తుంది



ఆయుర్వేదం నందు మద్యము గురించి వివరణ - alcohol

ఆయుర్వేదం నందు మద్యము గురించి వివరణ -

 *  చరకాచార్యులవారు - బాహ్లీకులు , పల్లవులు , చీనీయులు , శూలికులు , యవనులు , శకులు అను ఆరుదేశములు యందు నివసించేవారు మాంసం , గోధుమలు , మద్యములు , శస్త్రచికిత్స అనునవి ఎల్లప్పుడూ ఉపయోగించుటకు తగినవారని వ్రాసిరి .

 *  కొన్నిరకాల వ్యాధుల వలన కలుగు దుఃఖం , బాధల నుండి కలిగిన శోకము తొలగి విశ్రమింపచేయుటకు మద్యమును యుక్తిగా ఉపయోగించుటను వెల్లడించిరి. వారికి కూడా కొన్ని నిబంధనలు వెల్లడించి వైద్యునికి ఆదేశాన్ని ఇచ్చిరి.

 *  మద్యమును నిత్యముగా ఇచ్చేప్పుడు మనుజుని అన్నపానములు , వయస్సు , వ్యాధి , శరీరబలం , కాలము , ఆరు రుతువులు ,వాత,పిత్త,కఫ  దోషములు , మానసిక స్థితి గమనించిగాని నిత్యం ఇవ్వరాదు అని కొన్ని ప్రత్యేక నియమాలు వైద్యునికి గ్రంథరూపంలో వెల్లడించిరి .

 *  వాత, పిత్త, కఫాలు మూడింటిని ఒకేసారి వృద్ధిని చెందించి శరీరం నందు వ్యాపించుటకు విషముకు ఎలాంటి శక్తి ఉంటుందో మద్యమునకు కూడా అవే గుణములు కలిగియున్నది. కాకుంటే మద్యము కంటే విషమునకు ఎక్కువ బలం ఉండటం వలన ప్రభావం త్వరగా ప్రభావం చూపును. మద్యం కొంచం శరీరాన్ని నాశనం చెందించుటకు కొంచం సమయం తీసుకొనును .

 *  మద్యము శరీరం నందలి రోగనిరోధక శక్తిని నాశనం చేసి శరీరాన్ని రోగాలపాలు చేయును మద్యము ఆమ్లరసం గుణములు కలిగి ఉంటుంది.

 *  మద్యము నందు మోహము , భయం , శోకము , క్రోధము , మృత్యువు ఆశ్రయించి ఉన్నవి. మద్యదోషం వలన పిచ్చి , మదము , మూర్చ , అపస్మారము కలుగును.

 *  అధిక మద్యపానం వలన వాత , పిత్త , కఫాలు వృద్దిచెంది హృదయము నందు బాధ , అరుచి , అధికంగా దప్పిక , జ్వరం , చలిజ్వరం , శిరస్సు నందు , పార్శ్వముల యందు , ఎముకల యందు , సంధుల యందు మెరుపుల వలే అప్పుడప్పుడు కలుగు బాధలు , అధికంగా , బలంగా ఆవలింతలు , శరీరం అదురుట , శరీరం నందు వణుకుట , శ్రమ , వక్షస్థలం నందు పట్టినట్లు ఉండటం , దగ్గు , ఎక్కిళ్లు , ఆయాసం , నిద్రలేకపోడం , చెవి , కళ్లు , ముఖవ్యాధులు కలుగుట , వాంతులు , విరేచనములు , వాంతి వచ్చేలా ఉండటం వంటి సమస్యలు కలుగును.

 *  ఆయుర్వేదం నందు మద్యము అతిగా తీసుకోవడం వలన కలిగే సమస్యను మదాత్యరోగం అని పిలుస్తారు . మద్యము తీసుకోవడం వలన వికారములు కలిగినపుడు వెంటనే మద్యమును మానవలెను అని సూచించడం జరిగింది.

 *  మద్యము వదులుటకు పాలను వాడమని ఆయుర్వేద శాస్త్రవేత్తలు సూచించారు. ఒక్కసారిగా మద్యపాన వ్యసనాన్ని విడవరాదు. చిన్నగా మద్యపాన మోతాదును తగ్గించుకుంటూ రావలెను. ఒక్కసారిగా మద్యాన్ని ఆపడం వలన బలహీన మనస్తతత్వం ఉన్నవారు పిచ్చివారుగా మారే ప్రమాదం ఉన్నది . కావున క్రమంగా మోతాదు తగ్గించుకుంటూ రావలెను .

 *  మద్యము వలన శరీరబలం కోల్పోయినవారికి మద్యము యొక్క మోతాదు తగ్గించుకుంటూ పాల యొక్క మోతాదు పెంచుకుంటూ పోవడం వలన క్రమమముగా శరీరబలం పెరిగి మద్యపాన దుష్ప్రభావం నుంచి మనుష్యుడు బయట పడును.

 *  మద్యమును ఆపి మరలా తిరిగి మద్యపాన సేవన ప్రారంభించిన మరియు అధికంగా సేవించుట చేసినచో శరీర ధ్వంసం , మలక్షయం మొదలయిన సమస్యలు సంభవించి చికిత్సకు లొంగని విధముగా తయారగును.

 *  సమస్త విధములైన మద్యములను విడిచిన మానవుడు జితేంద్రియుడుగా , శారీర , మానసికంగా ధైర్యము కలవాడుగా , వ్యాధుల నుంచి దూరంగా ఉండువానిగా అగును.

          

Thursday, August 19, 2021

అన్నం rice

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (874)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
అన్నం (Rice)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మన మనుగడకు ఎంతో అవసరమయిన శక్తిని సమకూర్చి పిండి. పంలో అధికశాతం మనకు అన్నం ద్వారానే లభిస్తున్నది. ఆసియా ఖండంలో శాతం ప్రజలకు ముఖ్య ఆహారం వరి అన్నం. ఉత్తర హిందూస్థానంలో గోధుమ ఉపయోగించినట్లుగా దక్షిణభారతంలో బియ్యం ఎక్కువగా వాడతారు. వారిలో గానే ఎన్నో రకాలు ఉన్నా, అధిక దిగుబడికి చాలా రకాల సంకరజాతులను గంధర్మాల, పోషకాల పెంపుదలతో అభివృద్ధిపరుస్తున్నారు.

మనం వినియోగిస్తున్న బియ్యం సాధారణంగా బాగా పాలిష్ పెట్టినదే అయివుంటుంది. అంటే సూక్ష్మస్థాయిలో ఉండే అతివిలువయిన పొర (Britannius) పకించి కేవలం పిండిపదార్థం మాత్రమే మిగులుతుంది. అందువలన ఆరోగ్యరీత్యా పాలిష్ చేయని బియ్యాన్నే ఆహారంగా ఉపయోగించడం శ్రేయస్కరం. ఆస్ట్రేలియా, అమెరికా వంటి విదేశాలలో సహజంగా దొరికే అడవిబియ్యం ఎంతఖరీదయినా ని వినియోగించి లబ్దిపొందుతున్నారు.

బియ్యానికి అంటుకుని ఉండే తవుడు (Bran) పొరను సాధ్యమయినంతవరకు తొలగించకుండా ఉండడం మంచిది. అది ఎంతో విలువయిన పోషకాల గని. బాగా పాలిష్ చేసిన బియ్యం తినడం ఆధునికకాలంలో ఫ్యాషన్ అయినందువలన సరాల బలహీనత, రక్తహీనత, బెరిబెరి, అజీర్ణం, గ్యాస్ వంటి అనారోగ్యాలు ఎక్కువయిపోయాయి. ఈ విషయం అర్థం చేసుకొని అన్నం వండే బియ్యాన్ని ఎన్నుకుంటాం..

👉  వరిఅన్నం ప్రధానగుణం : పరిధాన్యం నుండి వచ్చే బియ్యం దంచినవి లేదా పట్టుతో ఆడించినవి, పాలిష్ చేయనివి మాత్రమే సకల గుణ ది. వీటిని బాగా కడిగి చక్కగా ఉడికించింది మాత్రమే మనకు అన్నం అని మనం గ్రహించాలి. ఇటువంటి అన్నం రెండు పూటలామనిషికి ఆయురవృద్ది, వీర్యపుష్టి, బలం లభించి శరీరం కాంతిమంత కుండలిక శ్రమ తొలిగిపోతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. గాయాలు,

👉పచ్చిబియ్యం కంటే ఉడికించిన అన్నంలో పోషకాల విలువ పెరిగి, అందులోని పదార్ధం సులభంగా జీర్ణమయే స్థాయికి మారుతుంది. డాక్టర్లు జ్వరపడి చిన వారికి బియ్యపు జావ, ఇడ్లీలను ఇవ్వమనడం మనకు తెలిసిన విషయమే. వేయించిన బియ్యపుజావ చాలా తేలికగా జీర్ణమై శరీరానికి హితవు చేస్తుంది. పాత బియ్యంలో పిండి పదార్థం తేలికగా జీర్ణమయ్యే స్థితిలో వుంటుంది.

👉 కొత్త బియ్యం కన్నా, బియ్యం పాతపడుతున్న కొద్దీ దానిలోని దుర్గుణాలు హరించి పోతాయి. అందుకని బియ్యం కనీసం 6 నెలలు పాతవిగా చూసి కొనడం శ్రేయస్కరం. పాత బియ్యం కడుగుతో 'లక్ష్మీచారు కూడా చేస్తారు. ఇందులో 'బి' విటమిన్లు అత్యధిక స్థాయిలో వుంటాయి.

👉అన్నం వండి వార్చడం కంటే, అత్తెసరు పెట్టి నీరు ఇగిరిపోయేలా చేయడం మంచిది. ఒకవేళ వార్చితే, ఆ వార్చిన గంజిని పారవేయకుండా త్రాగడం, అన్నంతో కలిపి తినడం కూడా మంచిదే. పల్లెల్లో బియ్యం కడిగిన నీటిని, మిగిలిపోయిన గంజి, అన్నాలను పశువులకు పెట్టడం చూస్తుంటాం. వాటి పోషకాలు, వృథాపోకుండా మనిషికి, పశువులకు కూడా వినియోగించడం. మన సంప్రదాయరహస్యం.

👉అన్నంలో మజ్జిగ లేదా పెరుగు కలిపి వాడితే ఎంతో మంచిది. శరీరంలో అతి ఉష్ణాన్ని ఇది నివారిస్తుంది. అన్నంలో పాలు కలిపి కొంచెం మజ్జిగతో ముందురాత్రి తోడుపెట్టిన అన్నాన్ని తోడంటు అన్నం అంటారు. అందులో ఒకటి రెండు ఉల్లిపాయలు తిరిగి చేర్చితే, దాని చలువచేసే గుణం మరింత ఇనుమడిస్తుంది. మరునాటి ఉదయం దీన్ని బ్రేక్ఫాస్ట్ ఇస్తే, ఎండకాలంలో పరీక్షలకు తయారవుతూ చదువులతో తలమునకలవుతున్న పిల్లలకు ఇది అమృతంగా పనిచేసి, వారికి కావలసిన పోషణను అందిస్తుంది.

👉కొంచెం గాలింపుగింజలు, కరివేపాకు, జీలకర్రను ఒక స్పూను నేతిలో వేయించి, కొంచెం తరిగిన అల్లం, పచ్చిమిర్చి చేర్చిన పెరుగు అన్నంలో కలిపి తరిగిన
కొత్తిమీదను జల్లి వడ్డిస్తే పిల్లలేకాదు, అందరూ ఎంతో అంటారు. ఇష్టపడి ఈ బాధపడేవారు, ముందు రోజు

👉 పార్వపు తలనొప్పి (మైగ్రేన్) తో అన్నం రెండుమూడు గుప్పెళ్ళు తీసుకుని అందులో తియ్యని పెరుగు కలిపి రోజులపాటు ఉదయాన్నే తింటుంటే, సతాయిస్తున్న పార్శ్వపునొప్పి తగ్గుతుంది. బియ్యం నానబెట్టి కడిగిన నీటిని ఎండకాలంలో పారవేయకుండా చెమటకాయలు ఏర్పడిన ప్రదేశాన్ని శుభ్రపరిస్తే, చెమట గుల్లలు (ప్రిక్లీ హీట్). వండిన
రాత్రినివారణ అవుతాయి. గర్భవతులయిన కొత్తలో వేవిళ్ళతో బాధపడుతున్న వారికో మంచి చిట్కా బాగా పిసికి, కలిపి పాతబియ్యం రెండుమూడు చెంచాలు తీసుకుని రోటిలో బరకగా నలగకొట్టి, ఓ పెద్ద గ్లాసు నీళ్ళలో కలిపి ఒకపూట బాగా నానబెట్టండి.
ఆ నీటిని ఒక పాత్రలోకి వడకట్టండి. ఆ నీటిలో ఒక చిన్నస్పూను ధనియాలపొడి, కొంచెం పటికబెల్లం గుండ చేర్చి బాగా కలపండి. పటికబెల్లం కరిగి, ధనియాల పొడి ఊరేలా ఓ గంటవుంచి దాన్ని వడకట్టి ఇస్తే వేవిళ వలన వచ్చే వికారం, వాంతులు నివారిస్తాయి. పిల్లల దగ్గు, జలుబు వలన ముక్కు కారడం కూడా దీనితో నివారించవచ్చు.

ఈ వాంతులు సహజప్రక్రియ. వీటిని నివారించేందుకు వైద్యులిచ్చే అల్లోపతి మందులు సేవించడం తల్లికి, బిడ్డకు ప్రమాదం అని మరువవద్దు. సహజమయిన ఈ విధానమే దాన్ని నివారించేందుకు శ్రేష్ఠం అని తెలుసుకోవాలి.

👉వేడి అన్నంతో నుదుటిమీద కాపడం పెడితే తలనొప్పి తగ్గుతుంది.
 👉వాతరోగం, వాతజ్వరాలున్న వారికి కొంచెం చిత్రమూలం, శొంఠి కలిపిన నీటిలో వండిన అన్నం అమృతంలా పనిచేస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది.

👉కొంచెం వేయించిన బియ్యంతో వండిన అన్నం మరింత సులభంగా

జీర్ణమవుతుంది. ఒంట్లో నలతగా వున్నవారు, జబ్బుపడి లేచినవారు ఈ అన్నంతింటే ఎంతో లాభకరం.

👉సన్నని బియ్యం వండి, గంజివార్చి, ఆ అన్నంలో వేడిచేసిన ఆవుపాలు కలిపి తింటే, ఇంద్రియ పుష్టి కలిగి ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది.
👉 శరీరంలో ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు ఏర్పడినప్పుడు, వాపులు ఏర్పడినప్పుడు, వేడి వేడి అన్నంలో పసుపు వేసి ముద్దలా చేసి, రాత్రి పడుకునేటప్పుడు కాటన్ బట్టతో కట్టుకట్టాలి.
👉 మధుమేహం ఉన్నవాళ్లు తెల్లటి పాలు బియ్యం తినకండి, మధుమేహం కి ఈనాడు ప్రత్యేకంగా కొన్ని రకాల బియ్యం మార్కెట్లో లభ్యమవుతోంది.
👉 మధు మెహం ఉన్నవాళ్లు అన్నం బదులు (మిల్లెట్స్) సిరి ధాన్యాలు తినడం ఉత్తమం.


గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు heart weak

గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు  -

 *  తవాక్షరి చూర్ణంని తేనెతో సేవించుచున్న గుండెకు మంచి బలం కలిగి గుండె బలహీనత తొలగును .

 *  కోడిగుడ్డు సొన పాలతో బాగుగా కలియునట్లు చేసి దానిలో మిరియాల చూర్ణం , చక్కెర కలిపి ఉదయమే సేవించుచున్న బలహీనత తగ్గును. గుండెకు సత్తువ ఇచ్చును.

 *  బెల్లపు పానకం లో మద్దిచెక్క చూర్ణంని కలిపి తాగిన గుండెజబ్బులు పోవును . దీర్గాయువుని ఇచ్చును.

 *  గోధుమలు , మద్దిచెక్క చూర్ణములను ఆవునెయ్యి మేకపాలలో వేసి పక్వముగా చేసి దానిలో చక్కర చేర్చి సేవించుచున్న గుండెజబ్బులు తొలగును . గుండె బలహీనత పొవును .

 *  మద్దిచెక్క చూర్ణం, నెయ్యి, పాలు కలిపి తాగుచున్న గుండె బలహీనత తగ్గును.

 *  పెద్ద ముత్తువపులాగ చూర్ణంని పాలతో కలిపి తాగుచున్న గుండెబలహీనత , గుండెజబ్బు తగ్గును.

 *  12 గ్రాముల స్వచ్ఛమైన తేనెను నీళ్లతో కలిపి ఉదయాన్నే తాగుచున్న గుండెజబ్బు నయం అగును.

 *  మద్దిచెక్క చూర్ణంని పంచదారతో కలిపి తాగిన గుండెజబ్బు నయం అగును.

 *  కటుకరోహిణి గంధమును గుండెకు పట్టువేసిన గుండెజబ్బు తొలగును .

 *  మారేడు వేరును కషాయంగా చేసి తాగుచున్న గుండెదడ హరించును .

 *  ఇంగువ 10 గ్రాములు , హారతి కర్పూరం 10 గ్రాములు  ఇవి రెండు నీళ్లతో నూరి గురిగింజలు అంత మాత్రలు చేసి పూటకి ఒకమాత్ర చొప్పున రోజూ రెండుపూటలా వేసుకొని అనుపానంగా 40 గ్రాములు జటామాంసి కషాయం తాగుచున్న యెడల గుండెదడ , ఆయాసం హరించిపోవును .

 *  మూసామ్బారం నీళ్లతో నూరి గుండెలకు పట్టువేసిన యెడల గుండెలాగుట , పీకుట , ఆయాసం తగ్గును.

 *  గుండెల్లో మంట గా ఉంటే పుచ్చగింజలు 20 గ్రాములు నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయమున ఆ నీటిలో ఆ గింజలను బాగా పిసికి పటికబెల్లం పొడి కొద్దిగా కలిపి ఆ తరువాత దానిని వడపోసి ఆ ద్రవమును తాగవలెను .

 *  రావి ఆకులను నీళ్లలో నానబెట్టి మరునాడు ఉదయము దానిని వడబోసి తెల్లటి సీసాలో నిలువ ఉంచవలెను. ఆ ద్రావకం రోజుకి మూడుమార్లు 50ml చొప్పున తాగుచున్న గుండెదడ తగ్గును.

            పైన చెప్పిన వాటిలో కొలతలు లేకున్నచో 3 నుంచి 5 గ్రాములు చూర్ణపు మోతాదు తీసుకోవచ్చు . ద్రవపదార్థం 100 ml నుంచి 150 ml వరకు తీసుకోవచ్చు . 

 

Wednesday, August 18, 2021

పిక్కల నొప్పులు పోవాలంటే? thigh pain

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (873)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*************************"***
 పిక్కల నొప్పులు పోవాలంటే?
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 బలహీనత వల్ల ఎక్కువగా పిక్కల నొప్పులు వస్తుంటాయి. ఆహారం మంచిగా తినకుండా ఎక్కువ పని చేసుకొనే వారికి ఆ నీరసంలో ముందు పిక్కలు లాగుతాయి. ఎక్కువగా నడిచే వారికి ఆ కండరాలు శ్రమను తట్టుకోలేక వస్తుంటాయి. శరీరంలో ఉప్పు, మెగ్నీషియం లాంటి లవణాలు తక్కువగా ఉన్నా పిక్కలు పట్టేస్తూవుంటాయి. ఉప్పును పూర్తిగా మాసిన వారికి క్రొత్తలో వారం, పది రోజులు వచ్చి ఆ తరువాత తగ్గుతుంటాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే మనంచేసేపనికి శరీరం తట్టుకునేట్లు మంచి ఆహారాన్ని తింటే సరిపోతుంది.

👉 చిట్కాలు:-
 1. తెల్లటి అన్నం మాని ముడి బియ్యం అన్నాన్ని వండుకొని రెండు పూటలా సరిపడాతింటే 15, 20 రోజులలో తగ్గుతాయి. ఎక్కువ పని వలన వచ్చే పిక్కల నొప్పులు ముడి బియ్యం అన్నానికి తగ్గిపోతాయి.
 2. ప్రతి రోజు మధ్యాహ్నం భోజనంలో ఆకు కూరలను ముఖ్యంగా పాల కూరలాంటి వాటిని రోజు వండుకుని బాగా తింటే లవణాల లోపం తగ్గుతుంది. 
3. పిక్కలు పట్టేస్తూ వుంటే లేదా ప్రయాణాలలో నడక ఎక్కువగా నడిచినందుకు నొప్పిగా వుంటే కొద్దిగా కొబ్బరి నూనె పిక్కలకు రాసి మర్దన చేసి వేడి నీటి కాపడం పది
నిమిషాలు పాటు పెట్టు కుంటే ఆ బడలిక అంతా పోతుంది.


Tuesday, August 17, 2021

చుండ్రు తగ్గడానికి సులభమైన మార్గాలు dandruff

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (872)
+++++++++++++++++++++++
అరోగ్య మస్తు
*****************************
చుండ్రు తగ్గడానికి సులభమైన మార్గాలు
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
చుండ్రు తగ్గాలంటే:- మన పెద్దలకు చుండ్రు అనే సమస్య తెలియదు. ఈ రోజుల్లో చుండ్రు అంటే తెలియని వారు ఉండరు. సహజంగా మన చర్మం వాతావరణాన్నుండి రక్షించుకోవడానికి ఒక రకమైన జిగురులాగా ఉండే కొన్ని పదార్థాన్ని వదులుతూ ఉంటుంది. దీనివలన చర్మం మెత్తగా ఉంచబడుతుంది. తలలో ఈ జిగురు గాలి సరిగా తగలక పేరుగా కట్టి పెచ్చులు పెచ్చులుగా ఊడుతూ ఉంటుంది. స్నానం రోజు శరీరం వరకే చేసి తల మనది కాదన్నట్లుగా కొందరు వదిలేస్తారు. దాని వలన తల శుభ్రం కాక చుండ్రు వస్తుంది. షాంపూలు తరచుగా వాడేవారికి కూడా అందులో కెమికల్స్ చర్మం పై పొరను పాడు చేసి ఎక్కువ పొట్టు రాలేట్లు చేస్తాయి. షాంపు పెట్టిన రోజున బాగానే వుండవచ్చు కాని తరువాత రోజునుండి వాటి నష్టం బయటపడుతుంది. చుండ్రును పోగొట్టే షాంపూ అని మనం మోసపోతున్నాము. కేవలం తల స్నానం చేయనందువల్ల వచ్చే సమస్యను పరిష్కరించుకోవటానికి ఎంత డబ్బు వృధా చేస్తున్నారు. దీనికోసం ఏ మందులు వాడవద్దు.

👉చిట్కాలు:- 
1. ప్రతిరోజు చన్నీళ్ళ తల స్నానం చేయండి, వేడినీళ్ళు తలకు పోయకూడదు. నీళ్ళు మరీ చల్లగా వుంటే కొద్దిగా వేడి నీరు కలిపి (బావిలో నీటిలాగా) ఆ నీళ్ళు పోసుకోండి. 
2. వారానికి, పది రోజులకొకసారి కుంకుడు కాయ రసంతో తలంటుకోండి. చుండ్రు మరీ ఎక్కువగా వున్నప్పుడు పొడి తలకు ఆ రసం బాగా పట్టించి 5, 10 నిమిషములు అలా వుంచి అప్పుడు చన్నీటి స్నానం చేయండి. ప్రతి రోజు ఇలా కుంకుడు రసంతో ఏడు, ఎనిమిది రోజులు చేయవచ్చు (సమస్య ఎక్కువగా వున్నవారే ప్రతిరోజు కుంకుడు రసం వాడండి). 3. తల ఆరిన తరువాత కొబ్బరి నూనె రాసుకోండి. నూనె రాస్తే చుండ్రు ఎక్కువ అవుతుందనుకుంటారు. రోజు తల స్నానం చేసేవారికిఏమికాదు. చలికాలంలో చర్మం తెల్లగా పొట్టు లేస్తున్నప్పుడు మనం కొబ్బరి నూనె రాస్తే అది కరుచుకుపోయి సమస్య తగ్గినట్లే. చుండ్రుకు కూడా నూనె రాయవచ్చు. మన పెద్దలు నూనె బాగా రాసుకున్నందుకే చుండ్రు రాలేదు. 
4. తల నూనె జిడ్డుగా వుంటే ప్రతి రోజు (ఒక చెక్క లేదా కాయ) నిమ్మరసాన్ని తలకు (తలపై చర్మానికి) రాసుకొని తల స్నానం చేస్తే జిడ్డు పోతుంది. తలలో జిగురు  గ్రంధులు ఊరించే ఎక్కువ జిగురును శుభ్రం చేయడానికి నిమ్మరసం. బాగా పనికొస్తుంది.
5. వేప నూనె కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు పెట్టి, రెండు మూడు గంటలు ఆగి తలస్నానం చేయాలి.
6. చుండ్రు తైలం
 తయారుచేసుకోండి
కొబ్బరి నూనె ఒక గ్లాస్ తీసుకోండి
ఒక గ్లాసు నిమ్మరసం తీసుకోండి
రెండు కలిపి ఒక పాత్రలో చిన్న మంట మీద వేడి చేయాలి
సగం మిగలాలి దానిని నిల్వ చేసుకోండి మీరు జుట్టుకు మర్దన చేస్తూ ఉండండి... మీ అలవాటు బట్టి ఆయన జుట్టుకు పెట్టినప్పుడల్లా ఇదే తైలాన్ని పెట్టండి
7. చుండ్రు తగ్గే వరకు అరటిపండు అసలు తినకండి


Monday, August 16, 2021

* రసం దోషం పొందిన కలుగు వ్యాధులు - chemical disease

శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ  - 

 *  రసం దోషం పొందిన కలుగు వ్యాధులు - 

    అన్నం మీద ఇష్టం లేకపోవుట, రుచి తెలియకపోవటం, ఆహారం జీర్ణం కాకపోవడం , శరీరం నొప్పులు , జ్వరం, గుండెపీకుట , వాంతి వచ్చునట్లు ఉండటం, ఆహారం తినకపోయినను తినినట్లు ఉండటం , శరీరం బరువు, హృదయ సంబంధ వ్యాధులు , పాండురోగం , శరీరం కృశించటం, అవయవములు కృశించుట, అకాలంలో శరీరం ముడుతలు పడుట, అకాలం నందు జుట్టు నెరియుట వంటి వ్యాధులు కలుగును.

 *  రక్తం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

     కుష్టు , విసర్ప, పిడక ,మశక ,నీలిక , తిలకాలకా, నశ్చ , వ్యంగ అను చర్మవ్యాధులు ,  పేనుకొరుకుడు, ప్లీహ సంబంధ సమాస్యలు , విద్రది అను వ్రణం , గుల్మవాతం, శోణిత, క్యాన్సర్ , రక్తపిత్తం వంటి వ్యాధులు సంభంవించును.

 *  మాంసం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

     ఆసనము , నోరు , నాలిక పుండ్లు పడుట, మాంసం వృద్ధినొందుట, క్యాన్సర్ కణుతులు, మొలలు , కొండనాలుక వాచుట, ఇగుళ్ళు నొప్పులు , గలగండిక ( టాన్సిల్స్ ) , పెదవులు పుండ్లు పడుట, గొంతు చుట్టూ కణుతులు వచ్చుట, గొంతు వాచుట మొదలైన వ్యాధులు సంభంవించును.

 *  మేథస్సు అనగా కొవ్వు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

     శరీరంపై గ్రంథులు లేచుట , అండవృద్ధి, గొంతు వ్రణాలు , క్యాన్సర్ , మధుమేహం , శరీరం లావెక్కుట , అధికమైన చెమట  మొదలయిన రోగాలు సంభంవించును.

 *  ఎముకలు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

      ఎముకపై ఎముక పెరుగుట, దంతముల పై దంతము పెరుగుట, ఎముకలపై సూదులతో పొడిచినట్లు అగుట, పిప్పిగొళ్ళు మొలుచుట మెదలైనవి ఎముకలలో దోషం పొందుట వలన కలుగు వ్యాధులు . 

 *  మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

        అజ్ఞానము కలుగుట, మూర్చ వచ్చుట, శరీరం తిరిగినట్లు అనిపించటం, జాయింట్లలో వాపులు , బాధ కలుగుట, కళ్ళకలక మొదలైనవి శరీరంలో మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు . 

 *  శుక్రం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

       నపుంసకత్వం ,సంతోషం లేకపోవటం , రోగంతో ఉన్న నపుంసకునకు అల్ప ఆయుర్దాయం , వికృత రూపం కలిగిన సంతానం కలుగుట, గర్భస్రావం మెదలైనవి శరీరంలో శుక్రం దోషం పొందుట వలన కలుగును.

 *  మలము దొషం పొందట వలన కలుగు వ్యాధులు  - 

       మలము వెలువరించుటకు అవరోధం కలుగుట, లేదా అధికంగా వెలువడుట, సకాలంలో విరేచనం అవ్వకపోవుట, కడుపులో వికారాలు, చర్మవ్యాదులు సంభవించుట జరుగును.

        పైన చెప్పిన విధముగా ఆయా శరీరంలోని ముఖ్య భాగాలకు దోషాలు సంభవించినప్పుడు అయా వ్యాధులు కలుగును.

           

Sunday, August 15, 2021

భుక్తాయాసం తగ్గాలంటే

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (870)
+++++++++++++++++++++++
అరోగ్య మస్తు
***************************
*భుక్తాయాసం తగ్గాలంటే

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 భుక్తాయాసం అంటే.. కడుపు నిండుగా ఫుల్ గా తిని తర్వాత
వచ్చే ఆయాసాన్ని అంటారు.
మనము నడిచితే విపరీతమైన ఆయాసం వస్తుంది. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఫుల్గా లాగిస్తా o. లేదా ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసినప్పుడు, ఫుల్ గా తింటాము.... తర్వాత కొద్దిసేపు తర్వాత అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది....
వెలితిగా భోజనం చేస్తే సరిపోతుంది కదా! అనిపించవచ్చు కానీ కంచం దగ్గర కూర్చున్నాక అలా మాత్రం లేవలేక పోతున్నా మని చాలా మంది అంటారు. భోజనం నిండుగా తింటూ దానికి తోడు మంచి నీటిని కూడా త్రాగుతారు. దీనితో పొట్ట ఫుల్గా నిండి ఈ బరువంతా వెళ్ళి ఊపిరితిత్తులు చివరి భాగాలపై పడి, వాటిని సుమారుగా 25, 30 శాతంనొక్కి వేస్తుంది. భోజనాన్ని అరిగించడానికి శరీరానికి ఎక్కువగాలి అవసరం. ఉంటుంది. దానికి తోడు ఊపిరితిత్తులు మూసుకుని పోయేసరికి శరీరానికి పూర్తిగా గాలి సరిగ్గా చాలక, భోజనం అయిన దగ్గర్నుండీ భుక్తాయాసం వస్తుంది.

👉చిట్కాలు:- 
1) భోజనాన్ని తినేటప్పుడు టేబుల్పై కాకుండా క్రింద కూర్చుని తింటే మంచిది. క్రింద కూర్చునే సరికి పొట్ట పావు వంతు మూసుకుంటుంది. మీరు పూర్తిగా నిండుగా తిని లేచేసరికి, మీకు తెలియకుండా కొంత ఖాళీ వచ్చి ఆయాసం ఉండదు.
 2) తినేటప్పుడు నీరు త్రాగకుండా, తినడానికి అరగంట ముందువరకు త్రాగి, తిన్న రెండు గంటల తరువాత అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాసు త్రాగుతూ ఉంటే భుక్తాయాసం రాదు. 
3) పొట్టను 80 శాతం కంటే నింపేటట్లు తినకుండా జాగ్రత్త పడటం మంచిది.
4) ఆహారం సేవించిన తర్వాత కనీసం 100 అడుగుల దూరమైనా నడవండి.
5) భోజనం చేయడానికి గంట ముందు గాని  తర్వాత గాని ఎటువంటి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు
6) వాము 100 గ్రాములు
మిరియాలు 50 గ్రాములు
దొడ్డు ఉప్పు లేదా నల్ల ఉప్పు 25 గ్రాములు
మూడు కలిపి దోరగా వేయించి పొడిచేసి నిల్వచేసుకోవాలి.
ఆహారం సేవించిన పావుగంట తర్వాత అరచెంచా గోరువెచ్చని నీళ్లతో సేవించాలి. దీనివల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది గ్యాస్ సమస్య ఉండదు.. కడుపు ఉబ్బరం కడుపు నొప్పి, తగ్గిపోతుంది
7)  వజ్రాసనంలో కూర్చుని వాయు ముద్ర వేయాలి.
8) వాము లేదా సోంపు వేసి కషాయం చేసుకుని తాగితే తగ్గుతుంది.


Saturday, August 14, 2021

మధుమేహం diabetic

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (869)
+++++++++++++++++++++++
అరోగ్య మస్తు
*********"*******************
మధుమేహం- వాస్తవాలు
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మధుమేహానికి బానిసలు కానక్కర లేదు అన్ని కాపాడుకోండి! 
నేడు భారతదేశంలో 7 నుండి 10 కోట్ల ప్రజలకు Diabetes-2 సోకింది. (కొందరు నిపుణులు దీనికి రెండింతల సంఖ్యను చెప్తారు ప్రీ-Diabetics ని కూడా చేర్చి) వీరంతా నెల నెల మందులపై ఎంత ఖర్చు పెడతారో ఊహించండి.

 మధుమేహము గురించి వాస్తవాలు
"""""""""""""""""""""'''''"""""""""""''''"""""""""""""
"Putting people on insulin is
ABig Scam"

Now the US doctotrs admit that HbA1C Should between
7 to8 is Normal this mean that if the Sugar Level is 250
Thenit is normal. Mean of PP
And Fasting is 250 then you
Are nomore Diabetic 

👉2019 ఇంగ్లీష్ పత్రికలో ఈ వార్త ప్రచురితమైంది. నేను చెప్పింది కాదు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను,గ్రహించండి
నేడు తినడానికి ముందు 120 ఉంటేనే మధుమేహము ఉంది అని, టెస్ట్ రిపోర్ట్ లో చూసి మందులు అంటగడుతున్నారు. అంటే ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది వివరించి చెబుతున్నారా? పేషెంట్ ఎవరైనా డాక్టర్స్ ఆడుగుతున్నారా? 
వీరమాచినేనిరామ కృష్ణ గారు, మధుమేహం పెద్ద బోగస్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అల్లోపతిలో పూర్తిగా ఎవరైనా డయాబెటిక్ తగ్గిస్తే రెండు కోట్లు ఇస్తాననీ, బహిరంగంగా టీవీ చానల్స్ లో డిబేట్స్  లో చాలెంజ్ చేశారు ఇంతవరకు ఏ అల్లోపతి డాక్టర్ చాలెంజ్ ను స్వీకరించలేదు డైట్ ద్వారా సంపూర్ణంగా కొన్ని లక్షల మంది, మధుమేహాన్ని తగ్గించుకున్నారు. దీనివల్ల ఫార్మా కంపెనీలకు కొన్ని కోట్ల నష్టం వచ్చింది. అల్లో పతి డాక్టర్ ల ద్వారా, టీవీ చానల్స్ లో డాక్టర్ కూర్చోబెట్టి, వీరమాచినేని గారి మీద ఎదురు దాడి చేశారు.
ప్రజలు వాస్తవాన్ని గ్రహించారు.
👉అసలు  మూత్రం టెస్ట్  చేపించాలి. మూత్రంలో షుగర్ ఉంటే ఉన్నట్లు, లేకుంటే లేదు. 
 నా అభిప్రాయం రక్తము లో షుగర్ 300  ఉన్న గాని అసలు ఉన్నట్లు కాదు. యూరిన్ లో ఉంటే ఉన్నట్టు. 
 కొందరు, డాక్టర్లు ల్యాబ్ లో వచ్చే టెస్ట్ ఆధారంగా, మధుమేహం ఉన్నట్లు నిర్ధారిస్తున్నారు. అసలు మధుమేహం యొక్క రోగ లక్షణాలు ఏమిటి, అనేది మీకు చెబుతున్నారా? మీరు డాక్టర్ గారిని ప్రశ్నిస్తున్నార?  కేవలం ల్యాబ్ టెస్ట్ ఆధారంగా, అమాయక ప్రజలను డయాబెటిక్ పేషెంట్ గా తయారు చేస్తున్నారుపేషంట్ గా తయారు చేస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే. ఇప్పుడు మధుమేహంతో బాధపడుతున్న వారిలో 90% లేని జబ్బుకు మందులు వాడుతున్నారు. 
 ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ లో వీటి గురించి చాలా వీడియోలు  చేశాను చూడండి

కాల క్రమేణా మందులు దాటి ఇన్సులిన్ ఇంజక్షన్ల వైపు, ఇంకా అదీ దాటి కిడ్నీ సంబంధ సర్జరీలకు లక్షల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది.

👉 డాక్టర్ ఖాదర్ వల్లి గారు, సిరిధాన్యాల ద్వారా ఏ విధంగా తగ్గించుకోవచ్చు.. చాలా క్లుప్తంగా వివరించారు చదవండి...

👉మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు :

మైదా, రిఫైన్డ్ చక్కెర పదార్థాల వాడకం, పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారంగా సేవించడం, అధికంగా తెల్ల చక్కెర పదార్థాలు వేసిన డ్రింకులూ, ఆహారం తినటం. పీచు పదార్థం లేనిదైన మాంసం, ఆల్కహాల్ల సేవనం. వందల కొద్దీరసాయనాలు వేసిన - ప్యాక్ చేసిన ఆహారం కొనుక్కొని తినడం తీవ్ర వత్తిడితో కూడినజీవన శైలి, ఉద్రేకాలు, ఉద్వేగాలు, ఎమోషన్స్, వ్యాపారంలో నష్టాలూ, ప్రేమ వైఫల్యాలు,క్లోమ గ్రంధిని ఆవహించిన ఇన్ఫెక్షన్లూ, యాంటి బయాటిక్ల విపరీత ఫలితాలు ఇందుకుచెప్పుకోదగ్గ కొన్ని కారణాలు.

గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే "మధుమేహం' మరో పది రోగాలను ఆహ్వానిస్తుంది. ఇది కళ్ళకూ, మూత్ర పిండాలకూ, ఎముకలకూ, హృదయానికి, పునరుత్పత్తి మండలాలకు, మెదదుకూ కూడా రోగాలు తెచ్చి పెళ్తుంది.

👉‘మధుమేహం 2 రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికీ, దాన్ని దూరంగా ఉంచేందుకు పది సూత్రాలు:

1. 8 నుండి 12.5% పీచు పదార్థం లేదా ఫైబర్ కలిగిన సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా స్వీకరించడం, వరి, గోధుమలతో పీచు పదార్థం / ఫైబర్ 0.2 నుండి 1.2% మాత్రమే ఉండటమే కాక అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పోలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచుపదార్ధం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రం నుండి బయటి వరకూ, పిండిపదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటంలో సులువు తెలిసినట్లే.

రోజుకొకటే సిరిధాన్యాన్ని బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలి. ఇలా 5 ధాన్యాలనూ రోజుకొకటి తినాలి. కుటుంబంలో అందరికీ చిన్న నాటి నుండే అవగాహన పెంచాలి.

2 రోజు 50 నుండి 70 నిముషాలు నడవటం అవసరం.
 3. అధికంగా ఆకూ కూరలూ, సేంద్రియ ఆహారం సహజ రూపంలో తినడం.

4. మునగ ఆకు, మునగ కాయలూ, మెంతులూ, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామ కాయల వాడకం పెంచుకోవాలి, జామ, మామిడి ఆకుల
కషాయాన్ని ఉదయాన్నే త్రాగాలి. 
5. పాల వాడకం మానివేయాలి. పెరుగు, మజ్జిగల రూపంలోనే స్వీకరించటం, కొనితినేప్యాకెడ్ 
ఆహారాలను దూరం పెట్టాలి.
 6. మైదా, మైదా వేసిన ఆహారాలూ, రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి, కట్టె గానుగ నూనెలు గాని, organic cold-pressed నూనెలు వాడుకోవాలి.
7. మన ఉద్రేకాలు, ఆదేశాలను అదుపులో ఉంచుకోవాలి.

8. వరి అన్నం, గోధుములు, మైదాతో కూడిన పదార్థాలూ అతి తక్కువ వాడటం లేదా పూర్తిగా దూరంగా ఉంచాలి.

8. HFCS పై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, తెల్ల చక్కెరలు చేసిన రెడీ మేడ్ ఆహారాల నుండిమనలను రక్షించుకోవాలి.

10. మధు మేహం 2- అందరికి వచ్చేదే కదా అనే అల్ప ధోరణి' లేకుండా ఈ వ్యాధిని శాశ్వతంగా దూరంగా ఉంచే మార్గాలు పాటించడం వ్యాధి వస్తే సరైన ఆహారం, మారిన జీవనశైలితో పోరాడటం, ఆహారానికి ముందూ, ఆహారం తిన్న గంటకీ రక్త పరీక్షలు కాకుండా HbA1C రీడింగ్ 4 నెలలకూ లేదా 6 నెలలకూ తీసుకుని. మధుమేహాన్ని శాస్త్రీయంగా సరైన పద్ధతిలో తెలుసుకోవాలి.

-మాననవుడికి ఆనందం స్వేచ్ఛ నుండి లభిస్తుంది. స్వేచ్ఛ రోగాల నుండి, ఆరోగ్యసంబంధమైన కష్టాల నుండి పొందాల్సి ఉంది. మన దేశాన్ని, పరిసరాల్ని, మన
కుటుంబాన్ని ప్రేమిస్తూ, శ్రమ జీవి అయిన ప్రతీ మానవుడికి డబ్బు సంపాదన కష్టంకాదు. తద్వారా ఆనందమూ సాధ్యమే

కానీ రోగాలు ముఖ్యంగా దీర్ఘ వ్యాధులు మన ఆనందాలను హరిస్తాయి. ఎందుకంటే వైద్యానికి పోయి మరిన్ని పరీక్షలూ, మరింత సంక్లిష్టమైన అర్థంకాని రోగాల విషవలయంలో ఇరుక్కొని వ్యాధి నివారణ కనుచూపు మేరలో లేకుండా పోతున్నది. అశాంతికి కారణమవుతోంది.

అందుకే మన ఆరోగ్యాన్ని మేలైన ఆహారం ద్వారా మనమే పట్టు బిగించి సాధించుకోవాలి.

పోలిష్ చేయని సిరి ధాన్యాలు మనకు శక్తిని ప్రసాదిస్తాయి. పోలిష్ చేయని సిరి ధాన్యాల ద్వారా మనకు ఆరోగ్యమూ సిద్ధిస్తుంది. రోగాలను దూరం పెట్టగలుగుతాం, అన్ని విధాలా మన బలాన్ని పెంచుకోగలుగుతాం.

అతి సామాన్యంగా ఈనాటి ఆహార వ్యవహారాల వల్ల వచ్చేది డయాబెటిస్/ చక్కెర/ మధుమేహం వ్యాధి. ఇది ఒక లేదు "ఆరంభం' మాత్రమే. క్రమంగా మన నేత్రాలు, మూత్ర పిండాలు, ఎముకలు, రక్త పీడనం (బీ.పి.), పునరుత్పత్తి మండలం, హృదయఆరోగ్యం - అన్నింటిపై దీని ప్రభావం ఉంటుంది. పలు రోగాలకు కారణమౌతుంది.


పీచుపదార్థాలు fiber

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (868)
+++++++++++++++++++++++
అరోగ్య మస్తు
*****************************
పీచుపదార్థం (Fibre)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 దీనిపేరు సెల్యులోజ్ లేదా రఫేజ్. ఈ పీచు పదార్థం ఆహార పదార్థాలకు సంబంధించి శరీర ఆరోగ్యాన్ని నిర్వహించే ఒక ముఖ్య విభాగం అని ఆధునిక యుగంలో గుర్తింపు పొంది, ప్రత్యేకంగా ప్రస్తుతించబడింది. పురాతన కాలపు ఆహారగ్రంథాలలో దీని ప్రసక్తి ఎంత మాత్రం లేదు. ఎందుకో కొంచెం విశ్లేషిస్తే, పురాతన కాలంలోని ఆహారం యథాతథంగా సంపూర్ణపోషక విలువలతో ధాన్యాలు పొట్టు తీయక, పండ్లు, కాయలు చెక్కుతీయక, సంపూర్ణంగా వినియోగించబడేవి. అందువలన దీని లోపంతోగానీ, తద్వారా.. ఎదురయే
ఇబ్బందులతో కానీ వారికి పరిచయం లేదు. ఆధునికత మనకు అందించిన మరోశాపం వలన ఈ కోల్పోయిన పదార్థానికి ఓ పేరుపెట్టి, దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి దీన్ని కూడా మన ఆహారపదార్థాల పట్టికలో ఒకటిగా చేర్చుకున్నాం.

నిజానికి దీనిద్వారా మనకు ఏ పోషకమూ అందదు. కానీ జీర్ణక్రియలో ఇది తన ఊడ్చి, జీర్ణమండలం గోడలు శుభ్రపరిచే చర్యను నిర్వహించి, ఆరోగ్యరక్షణకు తోడ్పడుతుంది.

జీర్ణక్రియలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు జీర్ణమయ్యే ప్రక్రియకు ఇది తోడ్పడుతుంది. నీటిని పీల్చుకుని మలవిసర్జన సమయంలో పెద్దప్రేవులు, పురీషనాళపు గోడలను శుభ్రం చేసుకుంటూ వ్యర్థపదార్థాలు అంటుకుని, నిలువవుండిపోయి, శరీరంలో అనారోగ్యం అంకురించకుండా ఇది చక్కగా శుభ్రంచేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

గతంలోని ఆహారంలోని సంపూర్ణత్వం వలన మలబద్ధం అనే శారీరకపరమైన ఇబ్బందినెవరూ ఎరుగరు. ఆధునికత అన్ని ఆహార పదార్థాలలోనూ ఎంతో విలువయిన పోషకాలున్న పైపొరలను తీసి ఉపయోగించడం నేర్పింది. ఇలాంటి ఆహార పదార్థాల వినియోగం వలన జీర్ణక్రియ మందగించి, మలబద్ధానికి దారితీస్తుంది. ఒకసారి మలబద్ధం శరీరంలోనికి ప్రవేశించిందంటే సర్వరోగాల ప్రవేశానికి మార్గం సుగమం చేసినట్లే !

నష్టపోయిన తరువాతగానీ కోల్పోయిన వస్తువుల విలువను గుర్తించం. ఇది మానవప్రవర్తనలోని సహజ నైజం. ఆహారశాస్త్రవేత్తలు ఇప్పటికి ఈ విషయం గ్రహించి, ఆహారంలో పీచుపదార్థం ముఖ్యతను స్పష్టంగా నొక్కి వక్కాణిస్తున్నారు. కోల్పోయిన ఆరోగ్యాలను సరిచేసుకునేందుకు మంచి మార్గంగా, రిఫైన్డే ఆహార పదార్థాలు, వాటితో తయారు చేయబడిన ఉత్పత్తులు వాడినందు వలన జరిగే నష్టాన్ని తెలియపరిచి, తిరిగి పీచుగలిగిన ఆహారపు విలువను గుర్తించమని, ఉపయోగించమని చెబుతున్నారు.

పీచు, పైపొర గలిగిన పదార్థాలు ఆలస్యంగా జీర్ణమవుతాయని, జీర్ణసంబంధ వ్యాధులున్న వారికి ఇది హాని చేస్తుందని, ఇప్పటి వరకు వాటి వాడకాన్ని నిషేధించమని చెబుతూ వచ్చిన యూరోపియన్ వైద్య, ఆరోగ్యనిపుణులు కూడా తమ తప్పును తెలుసుకుని, ఇకపై పీచుగలిగిన ఆహారపదార్థాలనే వాడమని చెప్పడం మొదలు పెట్టారు. బియ్యమే ఆహారంగా ఉపయోగించిన మన దేశప్రజలు, ఆధునిక లైస్మెల్లుల ఆవిర్భావంతో పాలిష్ బియ్యం, సూపర్పైన్ సిల్కు బియ్యం వంటి ఆకర్షణీయమయిన బియ్యం వాడేందుకు మక్కువ చూపించి, తమ ఆహారసేవనపు అలవాటును మార్చేసుకుని జీవితంలోకి ఆధునికతను ఆహ్వానించారు. పిడిరాయిలా తిరుగుతూ, రాళ్ళు తిన్నా, అరిగించుకునే జీర్ణక్రియను సున్నితపరచి, సిల్కుబియ్యం మృదుత్వానికి అనుగుణంగా మలచుకున్నారు. ఇందువలన మనకు మేలు జరిగిందా? కీడు జరిగిందా ? అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మన ప్రవర్తనలోని అవివేకం బయటపడుతుంది.

ఇప్పుడు చాలామంది ఈ విషయాన్ని తెలుసుకుని ఒంటిపట్టు, ముడి, పాలిష్ చేయని బియ్యం వాడడం మొదలు పెట్టారు. కూరగాయల పైపెచ్చు తీయకుండా అలాగే వండి తినడం, ఒకవేళ బీరకాయ వంటి కాయల చర్మాన్ని తీసివేసినా ఆ పైపెచ్చులను వృథాగా పోనీయకుండా వాటితో నూరుడు పచ్చళ్ళు చేసుకుని తినే అనాది, ఆరోగ్య ఆచారాన్ని తిరిగి ఆచరణలోకి తెచ్చుకుంటున్నారు.

కొర్రలు, సామెలు, ఊ దలు, ఆరికలు, ఆండు కొర్రలు, రాగుల లో
పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి
ఆరోగ్యకరమయిన జీర్ణక్రియలో, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపేందుకు ఎంతో ఆవశ్యకమయిన ఈ పీచుపదార్థం పాత్రను, విశిష్టతను గుర్తిద్దాం.బా అనారోగ్యాన్ని పారద్రోలి, ఆరోగ్యాన్ని పునఃప్రతిష్ఠించుకోవడంలో అగ్రగాములమవుదాం.
మన ఆహరం లొ ఉన్న పీచు పదార్థం మే( Dietaryఫైబర్) మన ఆహారం నుండి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ను నియంత్రిస్తుంది. ఒకే సారిగా అధిక మొత్తంలో గ్లూకోజు విడుదల చేయాలా, లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్ధమే నిర్ణయిస్తుంది..

ప్రస్తుతం వరి, గోధుమ ఆహార పదార్థాలలో పీచు పదార్థం. 0.25 శాతం - 05%కి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాలలో గ్లూకోజ్ గా (చక్కెరగా అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ (చెక్కర) గా ఒక్క సారి గా రక్తం
లోకి వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగిన స్వీట్లు తింటే..? Biscuitలో, బర్గర్, పిజ్జాలో, మైదాతో చేసిన నాను రొట్టెలు  కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడ్తుంది. అనేక రోగాలకు దారి తీస్తుంది.

మైదాతో చేసిన పదార్థాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు కూడా మన క్లోమ గ్రంధికి ఎంతో హానికరం.

సాధారణంగా మన దేహంలోని రక్తం (మొత్తం 4 నుండి 5 లీటర్ల)లో ఉండే గ్లూకోజ్ 6 నుండి 7 గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై, చివరిగా గ్లూకోజ్ మారి, రక్తంలోకి గ్లూకోజ్ రావటం దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్క సారిగా 10 నిమిషాల్లో లేదా 30-40 నిమిషాలలో అధిక మొత్తంలో రావటం ఎవరి ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం, ఫిట్స్, మొలలు, మూలశంక, ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ, మూత్రపించాల రోగులు, హృద్రోగులు వగైరా అందరికీ) మరింత చేటు.

అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని అవి దూరం పెట్టాలి. సిరి ధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోస్ రక్తంలోకి వదులుతుంటాయి,

కొర్ర బియ్యం, అధిక బియ్యం, ఊద బియ్యం, సామె బియ్యం, అండు కొర్ర బియ్యం 8 నుండి 12 శాతం పీచు పదార్థం (Fibre) కలిగినవి. పూర్తిగా సేంద్రియ మైనవి. ఈ జడూ 'పంచరత్న సిరి ధాన్యాలుగా 'పాలిష్ చేయ బడనివి' మరింత శ్రేష్ఠమైనవి.

వీటితో అన్నం వందుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాక్ కూడా చేసుకోవచ్చు.

👉సిరిధాన్యాల విశిష్టత:
వీటి గురుంచి డాక్టర్. ఖాదర్ వలీ గారు చాల చక్కగా వివరించారు
వారి మాటల్లో నే విందాం
సిరిధాన్యాల గొప్పదనం అధికంగా ఫైబర్ కలిగి ఉండటం మాత్రమే అని అనుకోవద్దు. అసలు అధికం అనే మాట ఇక్కడ సరైనది కాదు. సమతుల్యంగా, ఆహారంలోనే ఇమిడిఉన్న సహజమైన Dietary ఫైబర్ కలిగి ఉండడం వాటి ప్రత్యేకతమూడు పూ టలతిన్నపుడు. ఆ రోజుకు మనిషికి అవసరమైన 25-30 గ్రాముల ఫైబర్ (ప్రతి మానవ రోజుకు 38 గ్రాముల ఫైబర్ కావాలి) ఈ ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాయల నుండి, ఆకుల దూరం నుండి పొందవచ్చు.

ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలనశక్తిని కలిగి ఉన్నాయి.

వరి, గోధుమలలో పీచు పదార్థం / ఫైబర్ 0.2 నుండి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలతో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రం నుండి బయటి వరకూ, పిండిపదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలను కాపాడుకోవటంలో సులువు

ఉదాహరణకి కొర్ర బియ్యం- సమతుల్యమైన ఆహారం. 8 శాతం ఫైబర్తో పాటు, 12 శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకూ సరైన ఆహారంగా సూచించవచ్చు. చదువులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా సరైన భాగ్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్ఛలు వస్తాయి. అవి రకంగా కలుస్తూ ఉంటాయి. కొన్నేళ్లు వారినీ పోగొట్టగలిగే లక్షణం, నరాం మైన we convulsions లకు సరైన ఆహారం కొర్ర బియ్యం, కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఉదర క్వార్టర్ పారిన్ రోగం, అర్హుడు (అరికెలతో పాటుగా) నివారించడంలో కూడా

మీరు తెలుసా పాశ్చాత్య దేశాల్లో, వారి ఆహారంలో ఫైబర్ లేదని గ్రహించి, 2-3 ఫైబర్ లను నీటిలో వేసుకుని సేవిస్తూ ఉంటారు. అది శాస్త్రీయమైనది కాదు. సహజంగా అపోలో ఫైబర్ ఇమిడి ఉండటం మాత్రమే రక్తంలోకి గ్లూకోజు విడుదలని సమర్థంగా నియంత్రించగలదు.

అరికలు బియ్యం రక్ష శుద్ధికీ, ఎముకల మజ్జ మరింత సమర్థవంతంగా పని చేసే లా చూసేందుక, అస్తమా వ్యాధి, మూత్ర పిండ, ప్రొస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగుల,థైరాయిడ్, గొంతు, క్లోమ గ్రంధుల, కాలేయపు క్యాన్సర్లూ తగ్గించుకోవడానికి, అధికంగా చక్కర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి, గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికలు ఏంతో మేలు చేస్తాయి. డెంగ్యు జ్వరం, టైఫాయిడ్ జ్వరం, వైరస్ జ్వరం వగైరాలు తర్వాత నీరసించిన వారి రక్త శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు.

సామె బియ్యం - మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి. ఆడవారిలో PCOd తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకణాల సంఖ్యా పెరుగుతుంది. ఇవి కాక మానవుడి లింపు మండలపు శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంధుల క్యాన్సర్లకూ కూడా సామెలు ఎంతో పనికి వస్తాయి.

బియ్య థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, గాలాడరు శుద్ధికి కూడా ఇవి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి కూడా పనిచేస్తాయి.

అందు కొర్ర బియ్యం - జీర్ణ మండలంలోని కష్టాలను తీసివేస్తాయి. మొలలూ, భగన్దరం, మూల శంక, Fissures అల్సర్లు, మెదడు, రక్త, స్తనాల, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధమైన క్యాన్సర్లు మొదలైన కష్టాలను పోగొట్టడంలో తమ పాత్రను అద్భుతంగా పోషిస్తాయి.


Thursday, August 12, 2021

గాయాలు త్వరగా మానాలంటే woonde cure

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (867)
+++++++++++++++++++++++
 అరోగ్య మస్తు.
*****************************
గాయాలు త్వరగా మానాలంటే
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 కొంతమందికి పుండ్లు పడినా, తెగినా, గాయమైనా త్వరగా మానదు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలోనూ, విటమిన్ 'సి' తక్కువగా ఉన్నవారిలోను త్వరగా మానే గుణం తక్కువగా ఉంటుంది.

చిట్కాలు:- 1) పుల్లటి పండ్ల రసాలను తేనె వేసుకుని త్రాగితే మంచిది. 
2) నిమ్మరసాన్ని అన్నం తినేటప్పుడు 1, 2 కాయల రసాన్ని కొద్దికొద్దిగా పిండుకుని తింటే మంచిది. ఇలా రెండు పూటలా చేయవచ్చు. ఎప్పటికీ ఇది మానాల్సిన పనిలేదు.
 3) జామకాయలు చౌకగా దొరుకుతాయి కాబట్టి ప్రతిరోజూ 1, 2 కాయలను ముందు నుండి అందరూ తింటూ ఉంటే ఎంతో మంచిది. నమలలేని వారు జామపండ్లను తినవచ్చు.


మెడనొప్పి

.

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (866)
+++++++++++++++++++
అరోగ్య మస్తు
************************
 మెడనొప్పి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 మెడను ఎప్పుడూ ముందుకు వంచే పనులు చేసుకునేవారికి, నిద్రలో ఎత్తు దిండు వేసుకునే వారికి, మోటారు సైకిళ్ళపై గూనిగా కూర్చుని ఎక్కువసేపు నడిపేవారికి, వ్యాయామాలు అసలు చేయనివారికి, ఇంట్లో కూడా నడుమును, మెడను ముందుకు వంచి ఎక్కువగా కూర్చునే స్త్రీలకు మొ||గు వారికి మెడనొప్పులు వస్తూ ఉంటాయి. మెడను ఎక్కువగా ముందుకు వంచియున్నందుకు మెడ పూసలు వాటి మధ్య నుండి డిస్క్లను వత్తిడికి గురిచేస్తాయి. దాంతో మెడ నొప్పిపుడుతుంది. ఒక్కోసారి మెడభాగం నుండి చేతిలోనికి వచ్చే నరాలు నొక్కుకుని చేతిలో జాలు, తిమ్మిర్లు, వ్రేళ్ళు పట్టులేనట్లుగా అవ్వటం, చేతులలో నరాలు లాగినట్లు ఉండటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అసలు సమస్య మెడలో ఉండి చేతిలోనికి ఇలా వస్తుంది.
కొందరికి మెడనొప్పి వల్ల కళ్ళుతిరగటం, తలనొప్పి రావడం, కొందరు పడిపోవడం కూడా జరుగుతుంది.

👉చిట్కాలు:-
 1) ముందు తలక్రింద దిండు తీసివేయాలి.
 2) ఎప్పుడు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మెడ లైనుగా ఉండేటట్లు కూర్చోవాలి.
 3) మెడభాగానికి కొబ్బరినూనె రాసి వేడినీటి బ్యాగ్ లో వేడినీరు పోసి కాపడం రెండు పూటలా 10, 15 ని॥లు పెట్టుకుంటే మంచిది. 
4) మెడను ముందుకు వంచే ఆసనాలు చేయకూడదు. సూర్యనమస్కారాలు కూడా మానాలి. మెడను వెనక్కి వంచే ఆసనాలు అయిన మత్స్యాసనం, ఉష్ట్రాసనం, భుజంగాసనం చేస్తే సరిపోతుంది. ఇలా 20, 25 రోజులు చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. మెడనొప్పి లేనివారు ముందునుండీ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఇక రాకుండా ఉంటుంది.
5) ఆవు నెయ్యి గోరు వెచ్చగాచేసి ముక్కులో రెండు చుక్కలు రెండు పూటలా వేయాలి.
6) చెయ్యి బొటవేలి చట్టు గట్టిగా మసాజు చేయాలి
7.  సుజోక్ థెరపీ చికిత్సా విధానము లొ సర్జికల్ టేపు ఒక ఇంచ్ ది తీసుకుని దానికి మెంతులు అతికిoచి బొటనివేలు చుట్టూ టేపు అతికించి పోవాలి ఆరేడు గంటలు ఉంచుకోవాలి గంటకొకసారి దానిమీద 30 సార్లు ఒత్తిడి చేయాలి
8) ఏదైనా మసాజ్ ఆయిల్ మెడకు రాసి... కొద్దిసేపు తర్వాత దొడ్డు ఉప్పు వేడి చేసి ఒక కాటన్ బట్టలో పెట్టి కాపడం పెట్టండి లేదా వేడి నీటితో గాని కాపడం పెట్టుకోండి
9) మెడ వ్యాయామం చేయాలి
ఎడమవైపుకు కుడివైపుకు ముందుకు వెనక్కు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గాలి పీల్చుకుంటూ వదులుతూ ఎక్స్ చేయండి రోజు...


మధుమేహం ( diabetic

మధుమేహం గురించి సంపూర్ణ వివరణ - 

        మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును.  ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 

              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర  మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 

              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ  గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 

     
         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 

      1 - సహజము .

      2 - అపథ్య నిమిత్తజము . 

 *  సహజము  - 

        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 

 *   అపథ్య నిమిత్తజము  - 

        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 

                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 

       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు    గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును. 

                  మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 

   తినవలసిన ఆహారపదార్ధాలు  - 

       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 

  తినకూడని ఆహార పదార్దాలు  - 

      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు.  అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర  వేగాలను నియంత్రించరాదు.   

        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను.  శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను . ప్రతి ఇంటి నందు ఉండవలసిన గ్రంధములు . తప్పక చదవగలరు.

                       * సంపూర్ణం *
  
 

Wednesday, August 11, 2021

మెడనొప్పి

.

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (866)
+++++++++++++++++++
అరోగ్య మస్తు
************************
 మెడనొప్పి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 మెడను ఎప్పుడూ ముందుకు వంచే పనులు చేసుకునేవారికి, నిద్రలో ఎత్తు దిండు వేసుకునే వారికి, మోటారు సైకిళ్ళపై గూనిగా కూర్చుని ఎక్కువసేపు నడిపేవారికి, వ్యాయామాలు అసలు చేయనివారికి, ఇంట్లో కూడా నడుమును, మెడను ముందుకు వంచి ఎక్కువగా కూర్చునే స్త్రీలకు మొ||గు వారికి మెడనొప్పులు వస్తూ ఉంటాయి. మెడను ఎక్కువగా ముందుకు వంచియున్నందుకు మెడ పూసలు వాటి మధ్య నుండి డిస్క్లను వత్తిడికి గురిచేస్తాయి. దాంతో మెడ నొప్పిపుడుతుంది. ఒక్కోసారి మెడభాగం నుండి చేతిలోనికి వచ్చే నరాలు నొక్కుకుని చేతిలో జాలు, తిమ్మిర్లు, వ్రేళ్ళు పట్టులేనట్లుగా అవ్వటం, చేతులలో నరాలు లాగినట్లు ఉండటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అసలు సమస్య మెడలో ఉండి చేతిలోనికి ఇలా వస్తుంది.
కొందరికి మెడనొప్పి వల్ల కళ్ళుతిరగటం, తలనొప్పి రావడం, కొందరు పడిపోవడం కూడా జరుగుతుంది.

👉చిట్కాలు:-
 1) ముందు తలక్రింద దిండు తీసివేయాలి.
 2) ఎప్పుడు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మెడ లైనుగా ఉండేటట్లు కూర్చోవాలి.
 3) మెడభాగానికి కొబ్బరినూనె రాసి వేడినీటి బ్యాగ్ లో వేడినీరు పోసి కాపడం రెండు పూటలా 10, 15 ని॥లు పెట్టుకుంటే మంచిది. 
4) మెడను ముందుకు వంచే ఆసనాలు చేయకూడదు. సూర్యనమస్కారాలు కూడా మానాలి. మెడను వెనక్కి వంచే ఆసనాలు అయిన మత్స్యాసనం, ఉష్ట్రాసనం, భుజంగాసనం చేస్తే సరిపోతుంది. ఇలా 20, 25 రోజులు చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. మెడనొప్పి లేనివారు ముందునుండీ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఇక రాకుండా ఉంటుంది.
5) ఆవు నెయ్యి గోరు వెచ్చగాచేసి ముక్కులో రెండు చుక్కలు రెండు పూటలా వేయాలి.
6) చెయ్యి బొటవేలి చట్టు గట్టిగా మసాజు చేయాలి
7.  సుజోక్ థెరపీ చికిత్సా విధానము లొ సర్జికల్ టేపు ఒక ఇంచ్ ది తీసుకుని దానికి మెంతులు అతికిoచి బొటనివేలు చుట్టూ టేపు అతికించి పోవాలి ఆరేడు గంటలు ఉంచుకోవాలి గంటకొకసారి దానిమీద 30 సార్లు ఒత్తిడి చేయాలి
8) ఏదైనా మసాజ్ ఆయిల్ మెడకు రాసి... కొద్దిసేపు తర్వాత దొడ్డు ఉప్పు వేడి చేసి ఒక కాటన్ బట్టలో పెట్టి కాపడం పెట్టండి లేదా వేడి నీటితో గాని కాపడం పెట్టుకోండి
9) మెడ వ్యాయామం చేయాలి
ఎడమవైపుకు కుడివైపుకు ముందుకు వెనక్కు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గాలి పీల్చుకుంటూ వదులుతూ ఎక్స్ చేయండి రోజు...


తెలుగు గొప్పతనం

తెలుగు భాష గొప్ప తనం. 

✍🏻మూడింటినీ నిలువుగానూ, అడ్డంగానూ చదివి చూడండి. ఎట్లా చదివినా అవే పదాలు వస్తున్నాయి చూడండి!✍🏻

స మ త
మ జ్జి గ
త గ ము

కం చ ము
చ క్కె ర
ము ర ళి

క్షీ ర ము
ర వ్వ లు
ము లు కు

కా ను పు
ను వ్వు లు
పు లు లు

కా ర ము
ర గ డ
ము డ త

స మ త
మ ర ల
త ల పు

త మ కం
మ ర్యా ద
కం ద కం

పొ ల ము
ల లి త
ము త క

ధ న ము
న వ్య త
ము త క

వ ర స
ర వి క
స క లం

హి మ జ
మ న ము
జ ము న

క వి త
వి న ల
త ల క

కో వె ల
వె న్నె ల
ల ల న

మ న సు
న య నం
సు నం ద

ది న ము
న గ రి
ము రి కి

టో క రా
క వ్వ ము
రా ము డు

చ దు వు
దు ర ద
వు ద కం

ప్ర వే శం
వే ది క
శం క రం 

తెలుగు భాష గొప్పదనం చూశారా...!

Tuesday, August 10, 2021

నేరేడు (Jamun) తో లాభాలు

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (865)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
నేరేడు (Jamun) తో లాభాలు
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
నేరేడు దీని పండు వగరు, తీపి, పులుపు రుచి కలిగివుంటుంది. చలువ చేస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. మేహశాంతి, పైత్యశాంతి చేస్తుంది. శిరస్సులోని పైత్య, మేహములను అణుస్తుంది. వేడిచేసిన విరేచనాలను కడుతుంది. గుండె, రక్తంలోని ఉష్ణాన్ని పోగొడుతుంది. కడుపులోని వాతం పెరగకుండా అదుపు చేస్తుంది. గొంతుకకు, రొమ్ముకు, గర్భిణులకు చెరుపుచేస్తుంది. దీనికి విరుగుళ్ళు శొంఠిచూర్ణం, ఉసిరిక పప్పు. తీయని పండ్లను బాగా కడిగి కొంచెం ఉప్పుతో నంచుకుతింటే మంచిది.
👉కడుపులో ప్రేవులలో ప్రమాదవశాత్తూ చేరుకున్న తలవెంట్రుకలు, లోహపు ముక్కలను కూడా నేరేడు పండ్లు కరిగించివేస్తాయి. ఇంతటి శక్తిమంతమయినదీ పండు రసం.

👉దీని మాను చెక్కనుండి తీసిన కషాయం గ్రహణి, అతిసారం, నీళ్ళ విరేచనాలు, జ్వరాలను నివారిస్తుంది.

👉దీని కషాయం పుక్కిలించిన గొంతు, నోరుపూత పోతాయి. దీని ఆకులు నూరి తేలు కుట్టిన చోట కడితే, విషాన్ని హరిస్తుంది..

 👉దీని పండ్లు తింటే రక్తగ్రహణి, నీళ్ళ విరేచనాలు కడతాయి.

👉 మూత్రపు సంచిలో రాళ్ళు ఏర్పడకుండా దీని పండ్లు నివారిస్తాయి. 
👉 విత్తనాలు ఎండబెట్టి చేసిన చూర్ణం తీసుకుంటే, అతిమూత్రం కడుతుంది. మధుమేహం నివారిస్తుంది.
👉 నేరేడు గింజల చూర్ణం 75 గ్రాములు, 25 గ్రాములు పసుపు కలపాలి. గ్లాసు నీళ్ళలో ఒక చెంచా నెయ్యి వేసి సగం అయ్యే వరకు మరిగించి కొన్ని  రెండు పూటలా ఆహారానికి ఒక గంట ముందు సేవించాలి ఈ విధంగా మూడు నెలలు వాడితే మధుమేహం తగ్గుతుంది
 👉దీని ఆకులు ఎండించిన చూర్ణంలో కొంచెం ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటే.. పళ్ళు గట్టిపడతాయి..

👉నేరేడు జీర్ణక్రియకు మంచిది. లివర్కు మేలు చేస్తుంది. దాహాన్ని అరికడుతుంది. 
👉దీని రసంలో కొంచెం చక్కెర కలిపి తాగితే నీళ్ళ విరేచనాలు కడతాయి. 
👉పంచదారకు బదులు తేనె కలిపి తాగితే అరికాళ్ళు-అరిచేతుల మంటలు, కళ్ళ మంటలు, మూలవ్యాధి నివారిస్తాయి. 
👉మూత్రం సాఫీగా జారీ చేస్తుంది. నిద్రలేమి (Insomnia) గలవారికి మేలు చేసి, నిద్రవచ్చేలా చేస్తుంది.

👉. నేరేడు చిగుర్లతో కషాయం కాయండి. రోజుకు 3 సార్లు నాలుగైదు టేబుల్ స్పూన్ల కషాయం తాగుతుంటే డిసెంట్రీ, డయేరియా, మొలలు తగ్గుతాయి.

👉 నేరేడు ఆకులు నూరిన పేస్టును కాలిన గాయాలకు పూస్తే గాయాలు త్వరగా నివారణ అవుతాయి. శరీరంపై కాలిన మచ్చలు కూడా ఏర్పడవు.

👉 నేరేడు పుల్లతో పళ్ళు తోమితే పళ్ళు, చిగుళ్ళు ఆరోగ్యంగా వుంటాయి. నమిలిన రసం చిగుళ్ళ నుండి రక్తస్రావం నిలుపుతుంది. నోటి దుర్వాసన నివారిస్తుంది. చిగుళ్ళను దృఢపరుస్తుంది.
👉 ఆకులను ఎండబెట్టి పొడి చేసి  100 గ్రాములు చూర్ణం లో ఒక చెంచా ఉప్పు కలుపుకొని పళ్లు రుద్దుకుంటే, కదిలి దంతాలు కూడా గట్టిపడతాయి ఇది ఒక అద్భుతమైన  పళ్ళపొడిలాగా పనిచేస్తుంది నోటి దుర్వాసన కూడా పోతుంది

👉నేరేడు అధికంగా తింటే గొంతు నొప్పి, దగ్గు తెస్తుంది. ఇందుకు విరుగుడుగా వాటిపై కొంచెం ఉప్పు, మిరియాలపొడి జల్లాలి..


మలబద్దకం నివారణకు చిట్కాలు :

మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తీసుకునే ఆహారంలో ఏదో చిన్న మార్పు సంబవిస్తే చాలు ఆరోటు కడుపులో నానా రకాల బాధలు కలుగుతాయి.  మీ కడుపులో సరిగా లేకపోతే ఆరోజంతా నరకంగా అనిపిస్తుంది.ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు కాని, ఈ మలబద్దకం వల్ల నలుగురిలో ఉన్నప్పుడు, మీకే కాకుండా అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయితే దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు..మితమైన ఆహారం తీసకుంటూ సరైన చిట్కాలు పాటిస్తే చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పీచు పదార్దములు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి,దీని వల్ల ఈ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. సామన్యముగా మనం పౌశ్టికమైన ఆహారం తీసుకోవడం కన్నా “జంక్ ఫుడ్”నే ఎక్కువగా ఇష్టపడతాము, కానీ ప్రతీ రోజూ మనం తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్దంతో కూడిన ఆహరం ఉండాలి.


మలబద్దకం నివారణకు చిట్కాలు :


మలబద్దకాన్ని తగ్గించడంలో తేనె శక్తి వంతంగా పని చేస్తుంది. తేనె తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సవ్యంగా ఉంటుంది. అది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజుకు మూడు సార్లు నీటిలో తేనె కలుపుకొని తాగటం వలన మలబద్దకం తగ్గిపోతుంది.

మలబద్దకానికి ముఖ్య కారణం శరీరం లో సరిపోయేంత నీరు లేకపోవడం.ప్రతి గంటకు ,భోజనం అయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తాగాలి

మనం పీచు పదార్దం ఎంత తీసుకున్నప్పటికీ, దానికి తోడు నీరు కూడా తీసుకోవాలి,లేదంటే కడుపులో ఉన్న వ్యర్ద పదార్దాలు శుబ్ర పడకుండా అధిక నొప్పితో మలబద్దకముకు దారి తీస్తుంది.పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకుంటే  మంచి ప్రభావం చుపిస్తాయి.

నారింజ పండు మలబద్దకాన్ని నివారించడం లో మంచి ఔషధంగా పని చేస్తుంది. నారింజ పండులో విటమిన్ “C” , అధికంగా పైబర్ లను కలిగి ఉంటుంది. రోజు 2 నారింజ పండ్ల ను ఉదయం ,సాయంత్రం తినడం వలన మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు.

ఎండిన ద్రాక్ష పండు సహజసిద్ధమైనది. మలబద్దకం తగ్గించడం లో సహాయపడుతుంది. ఎండిన ద్రాక్షలో ఫైబర్స్ ఉండటం వలన నీటిని గ్రహిస్తాయి.ఎండిన ద్రాక్ష పండ్లు తినడం వలన మలబద్ధకం నుండి విముక్తి లభిస్తుంది.

5.ఒక గ్లాస్ నీటిలో, చిటికెడు ఉప్పు , కొన్ని చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం వలన మలబద్ధకం నుండి ఉపశమనం.నిమ్మపండు రసం పేగులను శుభ్రపరిచే సాధకంగా పనిచేస్తుంది. రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ నిమ్మరసం తాగటం వల్ల మలబద్దకం నుండి తోందరగా ఉపశమనం పొందవచ్చు.

ఆముదం నూనె యాంటీ-ఇన్ ఫ్లమేటరీ , యాంటీ-బాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వలన ఇది పేగులలోని పురుగులను తొలగించటమే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.

రాత్రి పూట పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే మీ జీర్ణాశయం శుబ్రపడి, మంచి ప్రబావం చుపిస్తుంది.

మీరు భోజనం చేసిన తరువాత దానిలో భాగంగనే పీచు పదార్దం తీసుకున్నట్లు అయితే అహారం త్వరగా జీర్ణం అయ్యి ఈ మలబద్దక సమస్యనుండి విముక్తి లభిస్తుంది.

Monday, August 9, 2021

శ్వాస విజ్ఞానము

శ్వాస విజ్ఞానము:-

 శ్వాసతో పుట్టిన మనం, శ్వాస విడిచి వెళ్లిపోయేలోపు అసలా శ్వాసనే గుర్తించకపోవడం, పట్టించుకోకపోవడం ఓ విచిత్రము. అట్టి శ్వాసను మనం గుర్తించకపోయినా, దాని శక్తిని మనం పట్టించుకోకపోయినా -- మనం మనకు తెలియకుండానే దాన్ని మనం ఉపయోగించుకొంటాము.  ఉదాహరణకు, ఏదైనా బరువు ఎత్తేటప్పుడు కానీ, కాలువలు దాటవలసి వచ్చినప్పుడు కానీ అసంకల్పితంగానే మనం శ్వాసను బిగిస్తాము.  కొన్ని సెకన్లు మాత్రమే జీవించే ప్రాణి నుండి బ్రహ్మం వరకు అందరూ శ్వాసిస్తారు. అలాగే శిలలు, పర్వతాలు, కొండలే కాకుండా ఆకాశం కూడా శ్వాసిస్తుంటుంది. సెకనుకు 18 కి.మీ.ల చొప్పున ఆకాశం వ్యాకోచిస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

❇️ శ్వాస - సోహం:-
మనం శ్వాస తీసుకున్నప్పుడు 'సో' అనే శబ్దం, వదిలేటప్పుడు 'హం' అనే శబ్దం వచ్చును.  'సో'లో 'ఓ' అనే శబ్దం, 'హం'లో 'మ్' అన్న శబ్దం అంతర్లీనంగా ఉన్నది.  ఈ రెండు కలిపి 'ఓం' అవుతుంది. ఓం అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి అనగా ఆదిపరాశక్తి. ఈ వివరణ మనకు తెలియక పోయినా, ఒక్కసారి మనము శ్వాస తీసుకుని వదిలినచో, ఆ ఆదిపరాశక్తి యొక్క ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉండి తీరుతుంది అని ఋషుల వాక్కు.

 శ్వాస ఎంత వరకు లోపలికి తీసుకుంటామో,  అక్కడి నుండే మళ్ళీ వదలిపెడుతున్నాము.  ఈ ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్యన ఉండు బిందువు 'శక్తి' యొక్క స్థానం అని తెలుసుకుని,  ఆ బిందువు మధ్య ఖాళీ జాగాపై దృష్టి ఉంచగలిగితే అదే 'ప్రాణాయామము' అనబడుతుంది.

❇️ శ్వాస - ఆయుష్షు:-
ప్రాణికోటికి భగవంతుడు ఆయుష్షును శ్వాస లెక్కలో ఇవ్వడం జరిగింది. నిమిషానికి ఎక్కువ శ్వాసలు ఖర్చుపెట్టినచో- తక్కువ ఆయుష్షు., మరి నిమిషానికి తక్కువ శ్వాసలు తీసుకున్నచో - ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు.  సాధారణ మానవుడు సాధారణ కాలంలో నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. పరుగెత్తినపుడు, కోపంగా ఉన్నప్పుడు 18-24 సార్లు శ్వాసిస్తాడు.  . మనిషి సరాసరిన రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు.
➡️ కోతి నిమిషానికి 32 సార్లు శ్వాసించి 20 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ కుక్క నిమిషానికి 38 సార్లు శ్వాసించి 13 సంవత్సరాలు జీవిస్తుంది. 
➡️ గుర్రం 19 సార్లు శ్వాసించి 35 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ తాబేలు నిమిషానికి 5 సార్లు శ్వాసించి 200 సంవత్సరాలు జీవిస్తుంది.

❇️ శ్వాస - నాడులు:-
మన శరీరములో 272000 నాడులున్నాయి.  నాడులనగా ప్రాణవాయువు (శ్వాస) యొక్క రాకపోకలకు మార్గములు,  నరములు కావు.  ఈ 272000 నాడులలో 10 నాడులు ప్రధానమైనవి. వీటిని దశ నాడులు అని పిలుస్తారు. అవి..

1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
4. గాంధారి నాడి - కుడి నేత్రం
5. అస్తిని నాడి - ఎడమ నేత్రం
6. పూష నాడి - కుడి చెవి
7. యశస్విని నాడి - ఎడమ చెవి
8. ఆలంబన నాడి - నోరు
9. లకుహా నాడి - శిశ్నము
10. శంభని నాడి - గుదము

మరణం సంభవించినప్పుడు పైన ఉదహరించిన 10 ద్వారాలలో ఏదో ఒక ద్వారం గుండా ప్రాణం బయటకు  పోవును.

 వీటిల్లో అత్యంత ప్రధానమైనది 3 నాడులు. అవి
1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
  మనం తీసుకుంటున్న శ్వాస కుడి ముక్కు ద్వారా ఎక్కువగా బయటకి ప్రవేశిస్తే సూర్యనాడి పనిచేస్తుందని, ఎడమ ముక్కు ద్వారా ఎక్కువగా బయటకు వస్తే చంద్ర నాడి పనిచేస్తుందని తెలుసుకోవలెను. సుషుమ్న నాడి యందు శ్వాస ఆడుతున్నప్పుడు రెండు ముక్కు రంధ్రాల గుండా శ్వాస బయటకు వస్తుంటుంది.  ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు శ్వాస మార్చుకుంటున్నప్పుడు కొన్ని సెకన్లు మాత్రమే సుషుమ్న నాడి యందు శ్వాస నడుస్తుంది. ఈ సమయంలో మనం ఏమి ఆశించిన అవి సిద్దించును.
 సూర్యనాడి ఉష్ణ శక్తికి, చంద్రనాడి శీతల శక్తికి ప్రతీకలు. అందువలన శీతల వ్యాధులకు సూర్యనాడి, ఉష్ణ సంబంధిత వ్యాధులకు చంద్రనాడి ఉపయోగకరము. మరి సూర్యనాడి నడుస్తున్నప్పుడు ఘన పదార్థాలు,  చంద్రనాడి నడుస్తున్నప్పుడు ద్రవపదార్థాలు తీసుకోవడం ఉత్తమం.  కొద్దిసేపు ఎడమ చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేదా ఎడమ వైపు తిరిగి పడుకున్నా కుడి శ్వాస ఆడడం ప్రారంభమవుతుంది., అలాగే ఎడమ శ్వాసను నడపాలంటే కుడి చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేక కుడి వైపు తిరిగి పడుకున్నా కొద్దిసేపట్లో ఎడమవైపుకు మారుతుంది.
 

❇️ శ్వాస - పంచప్రాణాలు:-
శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--
1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.
2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.
3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.
4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.
5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

❇️ శ్వాస - చక్రాలు:-
ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 
➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు
➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు
➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు
➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
➡️ ఆజ్ఞా చక్రము నందు  - 1000 సార్లు
➡️ సహస్రారము నందు - 1000 సార్లు 
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.

❇️ శ్వాస - అంగుళాలు:-
సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు.  శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.
➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.
➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.
➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే -  బ్రహ్మానందం కలుగుతుంది.
➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.
➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.
➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.
➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.
➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే -  అదృశ్యం అవ్వగలరు.
   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు.  అలాంటి వారు అమరులు అవుతారు.

❇️ శ్వాస - సృష్టి వయస్సు:-
 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన
➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.
➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.
➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.
➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) -  43,20,000 సంవత్సరాలు.

❇️ శ్వాస - సాధన:-
సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు.  ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.  దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.
     84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.

శరీరానికి అత్యవసరమైన ధాతువులు లభించు ఆహారపదార్ధాలు -

శరీరానికి అత్యవసరమైన ధాతువులు లభించు ఆహారపదార్ధాలు  -

  స్వాభావిక విటమిన్ "A" ను అందజేయు   "కెరొటిన్ " అనే పదార్థం అతి ఎక్కువుగా లభించు ఆహారపదార్ధములు  -

 కెరోటిన్  -

     ఆకుకూరలు  - 240 మై . గ్రా .

   పేనికులెటన్  అనబడే తోటకూర  - 14 ,000 మై .గ్రా .

  చామాకులు  - 10 ,000 మై .గ్రా .

  కొత్తిమీర  - 6 , 000 మై .గ్రా .

  మునగాకు  - 6 , 700 మై .గ్రా .

  గేన్జేటికన్ అనబడే తోటకూర లేక లేత తోటకూర  5 ,500 మై .గ్రా .

 *  C విటమిన్ లేక ఆన్ కార్మిక ఆమ్లం  -

      ఉశిరికలో ఈ విటమిన్ కు ప్రతికూలమైన ఆక్సాలిక్ అమ్లం ఉండటం వలన లభించవలసినంత విటమిన్ లభించదు.

       మునగాకు  - ౨౨0 మి .గ్రా .

       నాటు జామపండు  - 212 మి.గ్రా .

      కుప్పా కు ఆలిపాకు  - 169 మి.గ్రా . దీనిని అమరన్తాన్ విరిడిన్ అని పిలుస్తారు .

 * క్యాల్షియం  -

        అవిసె ఆకు - 1100 మి.గ్రా .

        ముండ్ల తోటకూర  - 800 మి.గ్రా .

        కాలిఫ్లవర్  -  626 మి.గ్రా .

        పొన్నగంటి ఆకు  - 570 మి.గ్రా .

 *  మెగ్నీషియం  -

        పింక్ రాడిష్  - 196 మి.గ్రా .

       చుక్కకూర  -  123 మి.గ్రా .

       లేత తోటకూర  - 1౨౨ మి.గ్రా .

 *  పొటాషియం -

        అడవి తమ్మ  - 1800 మి.గ్రా .

        లేత తోటకూర  - 340 మి.గ్రా .

        మునగాకులు  - 259 మి.గ్రా .

         కొత్తిమిర  -  256 మి.గ్రా .

         పాలకూర  -  206 మి.గ్రా .

     మూసామ్బా అనే నిమ్మజాతి  పండు. 490 మి.గ్రా .

       అరటి పండు  - 348 మి.గ్రా .

 *  ఇనుము  -

        కాలిఫ్లవర్  -  40 మి.గ్రా .

        చిర్రికూర  -  38 మి.గ్రా .

        లేత తోటకూర  -  27 మి.గ్రా .

        ముళ్ళ తోటకూర  -  22 మి.గ్రా .

        ఎండ్రకాయ మాంసం  - 21 మి.గ్రా .

     ఎండ్రకాయ మాంసం సులభముగా జీర్ణం అయ్యి దాదాపు అంతా ఇనుమును శరీరమునకు అందించును.

 *  సూక్ష్మ ఖనిజాలు  -

         జింక్ , మాంగనీస్ , రాగి , మాలీబ్డ్ నం , క్రోమియం .

 *  జింక్  -

        పుదీనాలో , పెద్ద ఎర్రగడ్డలో , మెంతికూర , కొత్తిమీర , గెనుసుగడ్డ , పాలకూర లో జింక్ లభించును.

 *  మాంగనీసు  -

         పుదీనా , పాలు , కొత్తిమీర , చుక్కకూర , లేతతోటకూర , కరివేపాకులో మాంగనీసు లభించును.

 *  రాగి  -

        పొన్నగంటి ఆకు , పుదీనా , పెద్ద ఎర్రగడ్డ , కొత్తిమీర , కరివేపాకులలో ఈ రాగి ధాతువు ఎక్కువుగా లభించును.

 *  మాలీబ్డ్ నం -

         కొత్తిమీర , పొన్నగంటి ఆకు , పెద్ద ఎర్రగడ్డ , లేత తోటకూర లో లభించును.

 *  క్రోమియం  - 

        పొన్నగంటి ఆకు , కొత్తిమీర లలో లభించును.

       పైన చెప్పిన సూక్ష్మ ధాతువులు , జీవప్రక్రియలకు చాలా అవసరమైన ధాతువులు కాబట్టి  ప్రతిదినం పుదీనా , కొత్తిమీర , మెంతికూర , పెద్ద సైజు ఉల్లిపాయలు పదార్దాలను , పచ్చళ్లు రూపములోను , పాలకూర , చుక్కకూర వగైరాలను , పప్పు పదార్థములతోటి కలిపి వంట పదార్దాలను వాడితే ఆరోగ్యమునకు చాలా శ్రేష్టం .

         కొత్తిమీర , పెద్ద ఉల్లిపాయకాడలతో చేసిన పచ్చడి తీసుకోవడం వలన ఐదు రకాల ధాతువులను అందజేయును . కరివేపాకు పొడి అధిక శాతములో సున్నపు ధాతువును మరియు మెగ్నీషియం , జింక్ , మాంగనీసు ధాతువులను లభింపచేయును .

                          సమాప్తం   
  
 
          

బరువు తగ్గడానికి weight reduce

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (864)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
బరువు తగ్గడానికి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
బరువు తగ్గాలంటే అందరూ బరువు తగ్గాలని తిండి తగ్గించి నీరసపడి పోతారు తప్ప బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే చెత్త తిండిని పూర్తిగా మాని నుంచి తిండిని పెంచితే బరువు తగ్గి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

చిట్కాలు:- 1) బరువున్న వారికి రక్తం తక్కువగా ఉంటుంది. పచ్చికూరల రసాన్ని గ్లాసుడు త్రాగితే బరువు పెరగకుండా రక్తం పడుతుంది
. 2) ఉదయం టిఫిన్ క్రింద ఇడ్లీ, దోసెలను 1, 2 తినడం మాని మొలకెత్తిన విత్తనాలను బాగా ఎక్కువగా పెట్టుకుని తింటే పోషకాహార లోపాలు పోతాయి. నీరసం కూడా తగ్గుతుంది. కొబ్బరి, వేరుశెనగ పప్పులు లేకుండా మిగతా గింజలుతినవచ్చు.
 3) మధ్యాహ్నం భోజనంతో అన్నాన్ని పూర్తిగా మాని రొట్టెలను 3, 4 పెట్టుకుని అందులో కూరను (ఉప్పు, నూనె లేకుండా చప్పుగా) బాగా ఎక్కువగా పెట్టుకుని తినాలి. ఎంత తింటే అంత క్రొవ్వు కరుగుతుంది. కూరలలో పీచు పదార్థాలు ఉండడంవల్ల బరువు పెరగకుండా క్రొవ్వు కరుగుతుంది. రొట్టె తిన్నాక కొంచెం పెరుగు తినవచ్చు. ఇక అన్నం వద్దు. 
4) సాయంకాలం 5 గంటలకు ఒక గ్లాసుడు పండ్ల రసం త్రాగితే మంచి రక్తం పడుతుంది. ఆరోగ్యానికి మంచిది. పండ్లవల్ల బరువు పెరగరు.
 5) సాయంకాలం 6 6.30 గంటలకల్లా భోజనం ముగించాలి. ప్రొద్దుపోయి తింటే తిన్నది క్రొవ్వుగా మారుతుంది. పెందలకడనే తింటే నిల్వఉన్న క్రొవ్వు కరుగుతుంది
. 6) భోజనంలో 2, 3 రొట్టెలు ఎక్కువ కూరతో పెట్టుకుని సరిపెట్టాలి. పెరుగు వద్దు. అన్నం వద్దు. 
7) బరువు తగ్గడానికి రోజూ ఆసనాలు వేస్తే ఏ భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుంటే ఆ భాగంలో క్రొవ్వు కరగడానికి ప్రత్యేకంగా ఆసనాలు ఉంటాయి. 
8)తొడలు, పిరుదలు లొ కొవ్వు తగ్గుటకు సూపు:-
కిరాదోసకాయ, బీట్ రూట్, బీన్స్, చిక్కుళ్ళ కారెట్, కాబేజి, టమోటాలు తీసుకుని సరిపడా నీళ్ళ పోసి ఉడికించాలి. దీనికి కొత్తమీర పాదినా, కరివేపాకు, మరియా ల పొడి  అరస్పూన్ సైంధవలవణం తగినంత అల్లం ముక్క వేసి దించి,  మధ్యా హ్నం తీసుకోవాలి. ఇలా చేస్తుంటే, తొడలలో పిరుదులలొ పేరు కు పోయిన కొవ్వు తగ్గిపోతుంది.
9) రోజు కనీసం ఒక గంట సేపు వేగంగా నడవాలి. చెమటలు రావాలి
10) రo. బీజాక్షరం ఉచ్చరించండి రోజుకు 90 సార్లు, 90 రోజులు
మణిపూరక చక్రం యాక్టివేట్ అయి పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది.
11) భోజనం చేయగానే రోజు రాత్రి ఒక చెంచా నువ్వులు నమిలి నమిలి తినండి .
12) మీరు ఎప్పుడూ తాగిన గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి.
గోరు వెచ్చని నీళ్లు తాగే దానివల్ల నెలకు మూడు నుంచి నాలుగు కిలోల బరువు తగ్గుతారు.
13) బరువు తగ్గుతున్న ట్లు పాజిటివ్ థింకింగ్ చేయండి .
14) చిన్న కొత్తిమీర కట్ట నీళ్లలో వేసి మిక్సీలో జ్యూస్ లాగా చేసి దానిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి


బరువు తగ్గడానికి weight reduce

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (864)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
బరువు తగ్గడానికి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
బరువు తగ్గాలంటే అందరూ బరువు తగ్గాలని తిండి తగ్గించి నీరసపడి పోతారు తప్ప బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే చెత్త తిండిని పూర్తిగా మాని నుంచి తిండిని పెంచితే బరువు తగ్గి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

చిట్కాలు:- 1) బరువున్న వారికి రక్తం తక్కువగా ఉంటుంది. పచ్చికూరల రసాన్ని గ్లాసుడు త్రాగితే బరువు పెరగకుండా రక్తం పడుతుంది
. 2) ఉదయం టిఫిన్ క్రింద ఇడ్లీ, దోసెలను 1, 2 తినడం మాని మొలకెత్తిన విత్తనాలను బాగా ఎక్కువగా పెట్టుకుని తింటే పోషకాహార లోపాలు పోతాయి. నీరసం కూడా తగ్గుతుంది. కొబ్బరి, వేరుశెనగ పప్పులు లేకుండా మిగతా గింజలుతినవచ్చు.
 3) మధ్యాహ్నం భోజనంతో అన్నాన్ని పూర్తిగా మాని రొట్టెలను 3, 4 పెట్టుకుని అందులో కూరను (ఉప్పు, నూనె లేకుండా చప్పుగా) బాగా ఎక్కువగా పెట్టుకుని తినాలి. ఎంత తింటే అంత క్రొవ్వు కరుగుతుంది. కూరలలో పీచు పదార్థాలు ఉండడంవల్ల బరువు పెరగకుండా క్రొవ్వు కరుగుతుంది. రొట్టె తిన్నాక కొంచెం పెరుగు తినవచ్చు. ఇక అన్నం వద్దు. 
4) సాయంకాలం 5 గంటలకు ఒక గ్లాసుడు పండ్ల రసం త్రాగితే మంచి రక్తం పడుతుంది. ఆరోగ్యానికి మంచిది. పండ్లవల్ల బరువు పెరగరు.
 5) సాయంకాలం 6 6.30 గంటలకల్లా భోజనం ముగించాలి. ప్రొద్దుపోయి తింటే తిన్నది క్రొవ్వుగా మారుతుంది. పెందలకడనే తింటే నిల్వఉన్న క్రొవ్వు కరుగుతుంది
. 6) భోజనంలో 2, 3 రొట్టెలు ఎక్కువ కూరతో పెట్టుకుని సరిపెట్టాలి. పెరుగు వద్దు. అన్నం వద్దు. 
7) బరువు తగ్గడానికి రోజూ ఆసనాలు వేస్తే ఏ భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుంటే ఆ భాగంలో క్రొవ్వు కరగడానికి ప్రత్యేకంగా ఆసనాలు ఉంటాయి. 
8)తొడలు, పిరుదలు లొ కొవ్వు తగ్గుటకు సూపు:-
కిరాదోసకాయ, బీట్ రూట్, బీన్స్, చిక్కుళ్ళ కారెట్, కాబేజి, టమోటాలు తీసుకుని సరిపడా నీళ్ళ పోసి ఉడికించాలి. దీనికి కొత్తమీర పాదినా, కరివేపాకు, మరియా ల పొడి  అరస్పూన్ సైంధవలవణం తగినంత అల్లం ముక్క వేసి దించి,  మధ్యా హ్నం తీసుకోవాలి. ఇలా చేస్తుంటే, తొడలలో పిరుదులలొ పేరు కు పోయిన కొవ్వు తగ్గిపోతుంది.
9) రోజు కనీసం ఒక గంట సేపు వేగంగా నడవాలి. చెమటలు రావాలి
10) రo. బీజాక్షరం ఉచ్చరించండి రోజుకు 90 సార్లు, 90 రోజులు
మణిపూరక చక్రం యాక్టివేట్ అయి పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది.
11) భోజనం చేయగానే రోజు రాత్రి ఒక చెంచా నువ్వులు నమిలి నమిలి తినండి .
12) మీరు ఎప్పుడూ తాగిన గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి.
గోరు వెచ్చని నీళ్లు తాగే దానివల్ల నెలకు మూడు నుంచి నాలుగు కిలోల బరువు తగ్గుతారు.
13) బరువు తగ్గుతున్న ట్లు పాజిటివ్ థింకింగ్ చేయండి .
14) చిన్న కొత్తిమీర కట్ట నీళ్లలో వేసి మిక్సీలో జ్యూస్ లాగా చేసి దానిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి


శరీరానికి అత్యవసరమైన ధాతువులు లభించు ఆహారపదార్ధాలు -

శరీరానికి అత్యవసరమైన ధాతువులు లభించు ఆహారపదార్ధాలు  -

  స్వాభావిక విటమిన్ "A" ను అందజేయు   "కెరొటిన్ " అనే పదార్థం అతి ఎక్కువుగా లభించు ఆహారపదార్ధములు  -

 కెరోటిన్  -

     ఆకుకూరలు  - 240 మై . గ్రా .

   పేనికులెటన్  అనబడే తోటకూర  - 14 ,000 మై .గ్రా .

  చామాకులు  - 10 ,000 మై .గ్రా .

  కొత్తిమీర  - 6 , 000 మై .గ్రా .

  మునగాకు  - 6 , 700 మై .గ్రా .

  గేన్జేటికన్ అనబడే తోటకూర లేక లేత తోటకూర  5 ,500 మై .గ్రా .

 *  C విటమిన్ లేక ఆన్ కార్మిక ఆమ్లం  -

      ఉశిరికలో ఈ విటమిన్ కు ప్రతికూలమైన ఆక్సాలిక్ అమ్లం ఉండటం వలన లభించవలసినంత విటమిన్ లభించదు.

       మునగాకు  - ౨౨0 మి .గ్రా .

       నాటు జామపండు  - 212 మి.గ్రా .

      కుప్పా కు ఆలిపాకు  - 169 మి.గ్రా . దీనిని అమరన్తాన్ విరిడిన్ అని పిలుస్తారు .

 * క్యాల్షియం  -

        అవిసె ఆకు - 1100 మి.గ్రా .

        ముండ్ల తోటకూర  - 800 మి.గ్రా .

        కాలిఫ్లవర్  -  626 మి.గ్రా .

        పొన్నగంటి ఆకు  - 570 మి.గ్రా .

 *  మెగ్నీషియం  -

        పింక్ రాడిష్  - 196 మి.గ్రా .

       చుక్కకూర  -  123 మి.గ్రా .

       లేత తోటకూర  - 1౨౨ మి.గ్రా .

 *  పొటాషియం -

        అడవి తమ్మ  - 1800 మి.గ్రా .

        లేత తోటకూర  - 340 మి.గ్రా .

        మునగాకులు  - 259 మి.గ్రా .

         కొత్తిమిర  -  256 మి.గ్రా .

         పాలకూర  -  206 మి.గ్రా .

     మూసామ్బా అనే నిమ్మజాతి  పండు. 490 మి.గ్రా .

       అరటి పండు  - 348 మి.గ్రా .

 *  ఇనుము  -

        కాలిఫ్లవర్  -  40 మి.గ్రా .

        చిర్రికూర  -  38 మి.గ్రా .

        లేత తోటకూర  -  27 మి.గ్రా .

        ముళ్ళ తోటకూర  -  22 మి.గ్రా .

        ఎండ్రకాయ మాంసం  - 21 మి.గ్రా .

     ఎండ్రకాయ మాంసం సులభముగా జీర్ణం అయ్యి దాదాపు అంతా ఇనుమును శరీరమునకు అందించును.

 *  సూక్ష్మ ఖనిజాలు  -

         జింక్ , మాంగనీస్ , రాగి , మాలీబ్డ్ నం , క్రోమియం .

 *  జింక్  -

        పుదీనాలో , పెద్ద ఎర్రగడ్డలో , మెంతికూర , కొత్తిమీర , గెనుసుగడ్డ , పాలకూర లో జింక్ లభించును.

 *  మాంగనీసు  -

         పుదీనా , పాలు , కొత్తిమీర , చుక్కకూర , లేతతోటకూర , కరివేపాకులో మాంగనీసు లభించును.

 *  రాగి  -

        పొన్నగంటి ఆకు , పుదీనా , పెద్ద ఎర్రగడ్డ , కొత్తిమీర , కరివేపాకులలో ఈ రాగి ధాతువు ఎక్కువుగా లభించును.

 *  మాలీబ్డ్ నం -

         కొత్తిమీర , పొన్నగంటి ఆకు , పెద్ద ఎర్రగడ్డ , లేత తోటకూర లో లభించును.

 *  క్రోమియం  - 

        పొన్నగంటి ఆకు , కొత్తిమీర లలో లభించును.

       పైన చెప్పిన సూక్ష్మ ధాతువులు , జీవప్రక్రియలకు చాలా అవసరమైన ధాతువులు కాబట్టి  ప్రతిదినం పుదీనా , కొత్తిమీర , మెంతికూర , పెద్ద సైజు ఉల్లిపాయలు పదార్దాలను , పచ్చళ్లు రూపములోను , పాలకూర , చుక్కకూర వగైరాలను , పప్పు పదార్థములతోటి కలిపి వంట పదార్దాలను వాడితే ఆరోగ్యమునకు చాలా శ్రేష్టం .

         కొత్తిమీర , పెద్ద ఉల్లిపాయకాడలతో చేసిన పచ్చడి తీసుకోవడం వలన ఐదు రకాల ధాతువులను అందజేయును . కరివేపాకు పొడి అధిక శాతములో సున్నపు ధాతువును మరియు మెగ్నీషియం , జింక్ , మాంగనీసు ధాతువులను లభింపచేయును .

                          సమాప్తం   
  
 
          

శయన నియమాలు - sleeping rules

శయన నియమాలు

1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు ( మనుస్మృతి)

2పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు ( విష్ణుస్మృతి)

3. విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును ( చాణక్య నీతి)

4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి( దేవీ భాగవతము).
పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు (పద్మ పురాణము)

5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది( అత్రి స్మృతి)
 విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం ( మహాభారతం)

6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు( గౌతమ ధర్మ సూత్రం)

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు.ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది( ఆచార మయూఖ్ )

8. పగటిపూటఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసం లో  1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది.

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు( బ్రహ్మా వైవర్తపురాణం)

10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి.

11.ఎడమవైపు పడుకోవడం వలన  స్వస్థత లభిస్తుంది.

12.దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహముల  నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.

13.గుండెపై చేయి వేసుకుని, చెట్టు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14.పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.

15. పడుకొని పుస్తక పఠనం  చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)

ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు

Sunday, August 8, 2021

మూత్రములో మంటను నివారించుటకు సులభయోగాలు -( urine burning

మూత్రములో మంటను నివారించుటకు సులభయోగాలు  -

 *  వేపపండ్లు దొరికే కాలంలో వాటిని విరివిగా వాడుతున్న మూత్రవిసర్జనలో మంట తగ్గును.

 *  దువ్వెన ఆకుల కషాయం పూటకు పావుకప్పు మోతాదులో ప్రతిపూటా తీసుకొంటుంటే త్వరగా తగ్గును. రోజుకు రెండుసార్లు శుభ్రమైన తుమ్మజిగురు చింతగింజ అంత ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగుచున్న త్వరగా తగ్గును.

 *  ఒక కప్పు పాలలో పచ్చి గరిక ముక్కలు రెండుచెంచాలు వేసి మరిగించి తాగాలి . అలా రోజుకు రెండుసార్లు చేస్తుంటే బాధ తగ్గును.

 *  ప్రతినిత్యం రెండుపూటలా గుప్పెడు చింతచిగుళ్ళు తింటుంటే మంట త్వరగా తగ్గును. చింతాకు రసం రెండు చెంచాలు రెండుపూటలా తీసుకొనుచున్న మంట అద్భుతంగా తగ్గును.

 *  కర్బుజా పండు గింజలను నూరి చెంచాడు తినాలి. ఉదయం , సాయంత్రం అలా చేస్తుంటే బాధ సులువుగా తగ్గును.

 *  మామిడి జీడి చూర్ణాన్ని అర చెంచా అరకప్పు పెరుగుతో కలిపి తినాలి. అలా ప్రతిపూటా తింటుంటే మూత్రవిసర్జనలోని మంట త్వరగా తగ్గును.

 *  బెండకాయను చిన్న ముక్కలుగా కోసి గ్లాసుడు నీళ్లలో గుప్పెడు ముక్కలు వేసి అరగంట పాటు మరిగించాలి. తీపికోసం కొంచం పంచదార కలిపి పూటకు అరకప్పు ఆ నీరు తాగాలి. అలా ప్రతిరోజూ తయారుచేసుకొని దానిని మూడుపూటలా తాగాలి. అలా రెండురోజులు చేసేసరికి మూత్రవిసర్జనతో ఏ బాధా ఉండదు. చాలా సులువుగా మూత్రం పోతుంది . లింగ , వృషణాలు , యోని , శరీరంలో అన్ని రకాల బాధలు అతి త్వరగా తగ్గును.

        

Friday, August 6, 2021

వాణాపాముల ప్రత్యేకత

వానపాముల ప్రాముఖ్యత;

దేశీ వానపాములు నేలలో పైకి క్రిందకి పయనిస్తూ కోట్ల కొలది చిల్లులు చేస్తుంది. వీటి వల్ల వర్షపు నీరంతా భూమిలోకి చేరుతుంది. ఒక్క చుక్క కూడా నేలపై ప్రవహించదు. 

దేశీ వానపాములు నేల లోపలి పొరల్లోని పోషకాలను ఆహారంగా తీసుకోని పై పొరల్లో విసర్జించి మొక్కల వేర్లకు అందుబాటులో ఉంచుతుంది. 

 

భూమి లోపలి పొరల్లో ప్రాణవాయివు పై ఆధారపడని కొన్ని రకాల సూక్ష్మజీవుల నిరంతర క్రియా శీలత వల్ల కార్బన్ డై ఆక్సెడ్ ,అమోనియా,మిథేన్ వంటి విషవాయువులు వెలువడుతూ వుంటాయి అవి అన్నీ ఈ రంద్రముల ద్వారా పైకి ఆవిరి అవుతాయి.వీటి ద్వారా స్వచ్ఛమైన గాలి లోనికి చేరి మేలు చేసే ప్రాణ వాయువు ఆధారిత సూక్ష్మజీవులకు ఉపయోగపడుతుంది. 

 

కుండపోతగా రోజుకు రెండు వందల మిల్లీ లీటర్ల వరకు cloud burst వంటి వర్షం పడినా కూడా ఆ నీరంతా భూగర్భ జలాశయానికి చేరుతుంది. ఈ విధంగా ఇది ఉచిత వాటర్ షెడ్ మేనేజ్మెంట్. 

ఈ దేశీ వానపాములు ఎంతో చక్కగా 15 అడుగుల లోతుగా కూడా ఉచితంగా నేలను దున్నిగుల్లగా చేస్తాయి. ఋతుపవనాలు ముగుసిన తరువాత ఈ రంద్రాలగుండా భూగర్భ జలాశయంలోని నీరు కేశాకర్షణ శక్తి ద్వారా పైపొరలకు చేరుతూ మన పండ్ల తోటలకు తీవ్ర కరువు పరిస్థితులలో కూడా తేమ అందుబాటులో ఉండేలా చేస్తుంది. 

 

తవ్వే క్రమములో దేశీ వానపాములు ఆహారంగా మట్టిని,ముడి రాతిని,ఇసుకను,సున్నపు రాయిని , ప్రమాదకర సూక్ష్మజీవులని తింటా దీనితో పాటు పోషకాల బాండగారమయిన నేల లోపలి పొరల్లోని మట్టిని కూడా తింటాయి. ఇలా తినే క్రమంలో అవి పంటలకు హాని చేసే ప్రమాదకర సూక్ష్మజీవులని ఆహరంగా తీసుకుని తమ ప్రెగులలో అంతం చేస్తాయి. ఇలా మట్టిని తినే క్రమములో ఇవి నేలలోని బలహీనమైన మేలు చేసే సూక్ష్మజీవులని తిని కడుపులో వాటిని బలోపేతం చేసి నెల పై పొరలలో విసర్జిస్తాయి. వాటి కడుపులో వుండే పిండి మర వంటి బయో రియాక్టర్ లో ఇలా తీసుకున్న వాటి అన్నిటిని పిప్పిగా చేసి నేలపై విసర్జిస్తాయి. ఈ విధంగా ఇది మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే పోషకార బండాగారం. 

 

ఈ వానపాముల మలము లో నేలలో కంటే 7 రెట్లు ఎక్కువగా నత్రజని ఉంటుంది,9 రెట్లు ఫోస్పాట్ ఉంటుంది,4 రెట్లుపొటాషియం ఉంటుంది,6 రెట్లు కాల్షియమ్,8 రెట్లు మేగ్నిషియం,10 రెట్ల గదంకం(సల్ఫర్) నేలలో కంటే వానపాము మలములో ఎక్కువగా ఉంటాయి. దీని తో పాటు మొక్క ఎదుగుదలకు కావాల్సిన సూక్ష్మపోషకాలు కూడా ఎన్నో రెట్లు నేలలో కంటే ఎక్కువగా ఉంటాయి. 

 

మొక్క మీద పోషకాల బాండాగారామయిన ఈ వానపాము మలము నుంచి మీ పంటలకు తోటి మొక్కలకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి గనుక పై పాటి ఎరువులు అవసరమే లేదు. 

 

నేలను దున్ని పోషకాలను ,నీటిని అందించే నేలను వాతావరణాన్ని శుద్ది చేసి ఉచితంగా ఇవన్నీ చేస్తున్న దేశీ వానపాము రైతుకు ఆప్తమిత్రుడు. 

 

పంటలకు పోషకాలను అంధించే దేశవాళి వానపాము లేకుంటే త్రాగు,సాగు నీరు లబించేది కాదు.అడవులు మోలిచేవి కావు. 

 

వానపాము అంటే varmi compost తయారికి ఉపయోగించే (ఎసినో పేటిడ) కాదు. వానపాము అంటే మన దేశీ వానపాము. 

 

ఎందుకంటే దేశీ వాన పాములో ఉండే 16 ప్రతేక లక్షణాలలో ఒక్కటి కూడా ఎసినో పేటిడలో లేదు. ఎసినో పేటిడ నేల పై పనిచేసే ఒక ప్రమాదకర కీటకం. వానపాములో ఈ వేరు మట్టిని తినడం వల్ల దానికి ఎర్త్ వార్మ్ అని పేరు వచ్చింది.ఎసినో పేటిడ మట్టిని తినదు అది పేడను తింటుంది అందువల్ల దానిని ఎర్త్ వార్మ్ అని పిలవలేము. వానపాము నేలను 15 అడుగులవరకు తవ్వగలదు.ఎసినో పేటిడ నేల ఉపరితలం పైనే ఉంటుంది కాబట్టి నేలను తవ్వలేదు. ఆహరం లబించకపోతే వానపాము నేల లో తేమ ఉన్న చోటుకి వెళ్లి సుప్తావస్థలో ఉంటుంది.ఎసినో పేటిడ అలా జీవించలేదు. రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రత 54℃ ఉండే ప్రాతంలో అయినా 0℃ ఉండే హిమాలయాలలో అయినా వానపాములు నిరంతరము పనిచేస్తూనే ఉండగలవు. కాని 28℃ ఉష్ణోగ్రత దాటితే ఎసినో పేటిడ బ్రతకలేదు. ఒక వైపు దేశీ వానపాములు నేలలోని విషాన్ని తొలగిస్తే మరో వైపు ఎసినో పేటిడ కాడ్మియం,ఆరేనిక్స్,పాదరసం,సీసం వంటి ప్రమకరమైన విషయాలను నేలలో వదులుతుంది. 

 

దీనిని బట్టి వ్యవస్థలో సకల జీవరాసులకు పోషకాలను అందిచడంలో సూక్ష్మజీవులు,దేశీ వానపాముల ప్రాముక్యత గమనించగలరు.

Thursday, August 5, 2021

చింతగింజల ఉపయోగాలు

*సాధారణంగా చింతపండును తీసి చింతగింజలని పడేస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఈ చింతగింజల బెనిఫిట్స్ గురించి తెలియదు. చింత గింజల వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే మరి ఎలాంటి అనారోగ్య సమస్యల నుండి చింత గింజలతో బయటపడవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.*

*'పళ్ళు శుభ్రంగా ఉంటాయి":*

*చింత గింజల పొడితో పళ్లు తోముకోవడం వల్ల పళ్ళు అందంగా తెల్లగా ఉంటాయి. ముఖ్యంగా స్మోక్ చేసేవాళ్లు మరియు ఎక్కువ డ్రింక్స్ తాగే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు బ్రష్ చేసేటప్పుడు టూత్ పేస్ట్ తో పాటు చింతగింజల పొడి కూడా వేసుకొని బ్రష్ చేస్తే పళ్ళు అందంగా మెరుస్తూ ఉంటాయి.*

*"అజీర్తి సమస్యలు":*

*జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళకి చింత గింజలు బాగా ఉపయోగపడతాయి. చింత గింజల రసం తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు పోతాయి. అలానే ఈ జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి.*

*"ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది":*

*వీటిలో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతే కాదండీ చింతగింజలు యూరినరీ ట్రాక్ట్ లో సమస్యలు లేకుండ చూసుకుంటాయి.*

*"డయాబెటిస్ రిస్కు తగ్గుతుంది":*

*చింతగింజల పొడి లో నీళ్ళు కలుపుకుని తాగడం వల్ల డయాబెటిస్ తగ్గుతుంది. ఎక్కువమంది డయాబెటిస్ తో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకు ఇది నిజంగా ఉపశమనాన్ని ఇస్తుంది.*

*"హృదయ సమస్యలు":*

*చింత గింజల లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది దీంతో ఇది హృదయ సంబంధిత సమస్యలు కూడా చెక్ పెడుతుంది. ఇలా ఈ విధంగా చింత గింజలతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.*

అతిరథమహారధులు

అతిరథ మహారథులు..అంటే..ఎవరు..!
(సేకరణ )
అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.
అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం
మనకు అర్థమవుతుంది.
అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.
మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.
ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
ఇందులో 5 స్థాయులున్నాయి. అవి..

రథి,
అతిరథి,
మహారథి,
అతి మహారథి,
మహామహారథి.

1) రథి..💐
ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.
సోమదత్తుడు,
సుదక్షిణ,
శకుని,
శిశుపాల,
ఉత్తర,
కౌరవుల్లో 96మంది,
శిఖండి,
ఉత్తమౌజులు,
ద్రౌపది కొడుకులు -
వీరంతా..రథులు.

2) అతి రథి (రథికి 12రెట్లు)..💐
60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
లవకుశులు,
కృతవర్మ,
శల్య,
కృపాచార్య,
భూరిశ్రవ,
ద్రుపద,
యుయుత్సు,
విరాట,
అకంపన,
సాత్యకి,
దృష్టద్యుమ్న,
కుంతిభోజ,
ఘటోత్కచ,
ప్రహస్త,
అంగద,
దుర్యోధన,
జయద్రథ,
దుశ్శాసన,
వికర్ణ,
విరాట,
యుధిష్ఠిర,
నకుల,
సహదేవ,
ప్రద్యుమ్నులు
వీరంతా..అతిరథులు.

3) మహారథి (అతిరథికి 12రెట్లు).💐
7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
రాముడు,
కృష్ణుడు,
అభిమన్యుడు,
వాలి,
అంగద,
అశ్వత్థామ,
అతికాయ,
భీమ,
కర్ణ,
అర్జున,
భీష్మ,
ద్రోణ,
కుంభకర్ణ,
సుగ్రీవ,
జాంబవంత,
రావణ,
భగదత్త,
నరకాసుర,
లక్ష్మణ,
బలరామ,
జరాసంధులు
వీరంతా..మహారథులు.
4) అతి మహారథి (మహారథికి 12రెట్లు).💐
86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.
ఇంద్రజిత్తు,
పరశురాముడు,
ఆంజనేయుడు,
వీరభద్రుడు,
భైరవుడు -
వీరు..అతి మహారథులు.
రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,
అటు ఇంద్రజిత్తు -
ఇటు ఆంజనేయుడు.
రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .💐
ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,
దుర్గా దేవి,
గణపతి మరియు
సుబ్రహ్మణ్య స్వామి,
వీరంతా..మహామహారథులు.
మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం
హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.
అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు

Wednesday, August 4, 2021

నిమ్మకాయతో చికిత్స - lemon treatment

నిమ్మకాయతో చికిత్స  - 

  అజీర్ణం  ( Dyspepsia ) - 

   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 

  మలాశయం బాధ  ( Bowel Trouble ) - 

    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.

 స్థూలకాయం  ( Obesity ) - 

    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు     ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.

 ముఖ సౌందర్యం  ( cosmetic ) - 

   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు         ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 

  చలి జ్వరం  - ( Maleria ) 

     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు        ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 

   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.

 రక్తస్రావం  - 

    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను.  ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 

    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 

  దంతశుద్ధి  - 

     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.