"సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రథమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం......"
"అర్క" అనగా సూర్యుడు , కోణ అనగా ప్రాయోగికంగా త్రికోణము. త్రికోణముతో గూడిన స్థలము నందు యున్న సూర్య దేవాలయమునకు "కోణార్క" అని పేరు వచ్చింది . అక్కడ యున్న దేవతా స్వరూపాన్ని బట్టి ఆ పేరు వచ్చినది కూడా.....
ఈ స్థలము ఒరిస్సా రాష్ట్రము నందు (LAT 19"51'N ; LONG 86"01'E ;) కుశభద్రానది ఒడ్డున , గుడికి నైఋతి దిక్కున 9 K.M వరకు ; త్రికోణ రూపముతో యున్నది . తూర్పున బంగాళాఖాతమున్నది.
కోణార్క సూర్య దేవాలయము ముందు యుండు మండపము నిర్మాణము :
ఈ క్షేత్రం లో సూర్యుని కిరణములు, రెండు కోణముల నుంచి గర్బగుడిలోని విగ్రహము వరకు ప్రసరించునట్లు వాస్తు శిల్పులు ఏర్పరచినారు. గుడి నిర్మాణము ఒక అంగుళములో వందోవంతు Accuracy గా ( 1/100" ) యున్నది . అంటే అంత ఖచ్చితముగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఆనాటి భారతీయ శిల్పుల ఉన్నత స్థాయి విజ్ఞానం ఇది. కాలక్రమేణా భూకంపముల వలన , పిడుగులు వలన గుడి శిథిలము చెందినప్పుడు..... తరువాత చరిత్ర కందని చాలా మంది గుడిని పునర్నిర్మాణము చేసినారు . అందువలన ఈ గుడిపై బౌద్ధుల, జైనుల సంస్కృతి ప్రభావములు యున్నవి . చరిత్ర ఆధారముగా "గంగా రాజవంశీకులు" పునర్నిర్మించినారు .
భవిష్య పురాణము, సాంబ పురాణముల ప్రకారము, శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబునికి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు ....శ్రీ కృష్ణుడు సాంబునికి యోగ విద్యతో పాటు చంద్రభాగా నది ఒడ్డున యున్న మిత్రవనములో, సర్వ వ్యాధులను తగ్గించెడి సూర్యుని కొరకు, అతని అనుగ్రహము సంపాదించుట కొరకై ప్రార్ధించమని తెలిపెను . అచ్చట సాంబుడు 12 సంవత్సరములు తపస్సు చేసిన తరువాత, కుష్ఠు వ్యాధి పూర్తిగా నివారింపబడెను .
సాంబుడు సూర్యునికి కృతజ్ఞతగా అచ్చట ఒక సూర్య దేవాలయము నిర్మాణమునకు సంకల్పించెను . సాంబునికి ఒక రోజు చంద్ర భాగా నదిలో స్నానము చేయుచున్నప్పుడు ; నదిలో ఒక సూర్య విగ్రహము లభించెను . మిత్ర వనములో ఆ విగ్రహమును ప్రతిష్ఠించి దేవాలయము నిర్మించెను . చంద్రభాగా నది సముద్రములో కలిసే చోటున ఈ దేవాలయము నిర్మించెను . ఈ దేవాలయమునకు ఎదురుగా ( తూర్పున ) సముద్రముండును . కాలక్రమేణా ఈ గుడి ముందు 3 కిలో మీటర్లు వరకు ఇసుక మేట వేసెను అందువలన సముద్రము ఇప్పుడు గుడికి 3 కిలో మీటర్ల దూరములో యున్నది .
యూరోపియన్ నావికులు ACE 1680 యందు ఈ దేవాలయాన్ని BLACK PAGODA గా పిల్చెడివారు . ప్రపంచవ్యాప్తముగా సూర్యుడు అన్ని విధములైన జబ్బులను తగ్గించును అనెడి భావముతో సూర్యదేవాలయము నిర్మింపబడినది . వేదాలలో సూర్యుని ఈ విధముగా తెల్పుచున్నారు .
▶సూర్యుడు విషనాశకుడు - ఋగ్ 1 -191 - 10
▶సూర్యుడు సామాన్యదృష్ఠికి అందని సూక్ష్మ క్రిములను ,
▶ సర్వపీడాకరములను సంహరించును , ఋగ్ 1- 191 - 8
▶ సూర్యకిరణములు తీక్షోష్ణ గుణము కలవి ; సర్వ చర్మవ్యాధులు , కుష్టు వ్యాధులు వీటి వలన తగ్గి , శరీరము ఆరోగ్యము పొందును - అధర్వః 24 - 1 .
▶"అర్క"ని ఆయుర్వేదము నందు "జిల్లేడు చెట్టు"గా పిలిచెదరు . మరల జిల్లేడు లో రకములు కలవు. దీనికి సూక్ష్మ పరిశీలన అవసరం. ▶జిల్లేడు శ్వాసకోశ వ్యాధుల యందు ; చర్మ వ్యాధుల యందు అమోఘముగా పనిచేయును ; ▶BRONCHAL ASTHMA & BRON CHITIS .
▶జిల్లేడు మూలిక కృశించిన శరీరాన్ని తిరిగి వృద్ధి చెందించి పూర్వ స్థితికి తెచ్చును. (అధర్వః 6 -72 - 1)
"కోణార్క" ను కోటి సూర్యులుగాను, లేక అనంతమైన సూర్యులు గాను భావించెదము . ఆయుర్వేదము నందు ఎన్ని ఎక్కువ పుఠములు పెట్టినచో ఆ మందు అంత శక్తి వంతమగును. కోణార్క ను కోటి పుఠములు లేక అనంత పుఠములు పెట్టిన జిల్లేడుగా భావించవచ్చును . ఎక్కువ పుఠములు పెట్టిన జిల్లేడు కుష్ఠురోగమునకు ఎంతో ఉపయోగకారి . "నాదయోగులు" ఎక్కువ మంది ఆయుర్వేద నిష్ణాతులు ;
త్యాగరాజు గూడ నాదయోగియే ; వారి కీర్తన యందు నిగూఢముగా "అర్క"ను వివరించినారు .
"ఆర్కమనుచు జిల్లేడు తరుపేరు
మర్కట బుద్ధులెట్లు లేరు
అర్కుడనుచు భాస్కరుని పేరు
తర్కమనే అంధకారము తీఱు !!"
ఈ వ్యాసము నందు తంత్రము గూర్చి కొంత అవగాహన అవసరము. కోణార్క్ దేవాలయము పూర్తిగా తాంత్రికముగా నిర్మింపబడినది . తంత్రము అనగా సాధనా శాస్త్రము . ఇందులో ఎట్టి విధమైన అభూత కల్పనలు యుండవు . ఒక నిర్ధుష్ఠమైన ధ్యేయము కొరకు సాధన చేసి ఫలితము పొంది స్వయం అనుభవముతో దానిపై నమ్మకమును పెంచుకొనుట యే తంత్రము. (PRACTICLE SCIENCE) .
ఊదా : మానసిక ఏకాగ్రత లేనివారు కొంతకాలము శాంభవి ముద్ర సాధన చేసిన యెడల ఏకాగ్రత లభ్యమగును . ఇదియే తాంత్రికము .
మానవునిలో యున్న సృజనాత్మకతశక్తియే కుండలిని. ఈ శక్తిని పెంపొందించుకొనుటకు సాధకులు "తంత్ర సాధన" అవలంబించెదరు .
ఉదా : మానసిక ఏకాగ్రత పెంచుట కొరకు .

No comments:
Post a Comment