జననం - క్రీ .పూ 1000 సంవత్సరం .
జన్మస్థలం - వారణాసి .
తండ్రి - విశ్వామిత్రుడు .
గురువు - ధన్వంతరి .
రచనలు - సుశ్రుత సంహిత .
ప్రాచీన వైద్య శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానుభావుడు , ప్రముఖుడు . ప్రపంచంలో సాటిలేని మేటి శస్త్రచికిత్స నిపుణుడు ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ చేయడంలో నిష్ణాతుడు . ఇతని కాలం నాటికే అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాడే వైద్యరంగంలో భారతదేశం నేటి ప్రపంచం కన్నా ఎంతో ముందు ఉన్నది. దీనికై ఎంతోమంది భారతీయ వైద్యశాస్త్రవేత్తలు ఈ వైద్యరంగానికి ఎనలేని సేవలు చేశారు .
ప్రపంచం వైద్యశాస్త్రం గురించి కళ్లు తెరవకముందే వైద్యశాస్త్రాన్ని ప్రకాశింపచేసినది భారతీయులే . శస్త్రచికిత్సా రంగంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు ఉపయోగించడంలో సుశ్రుతుడు ఆద్యుడు అని చెప్పవచ్చు. దాదాపు 101 రకాల శస్త్రచికిత్సా పరికరాలను సుశృతుడు వివిధ సందర్భాలలో ఉపయోగించేవాడు . తెగిపోయిన అవయవాలను తిరిగి వాటి స్థానంలో అతికించడంలో సుశ్రుతుడుని మించినవారు మరొకరు లేరు .
మొట్టమొదట శవపరీక్ష నిర్వహించింది కూడా ఈయనే . శవాన్ని పరిశీలించడం ఆ మరణం ఏ విధముగా సంభవించిందో నిర్ధారించడంలో సుశృతుడు కడు నిష్ణాతుడు . అదేవిధముగా చెడు రక్తాన్ని శరీరం నుండి తొలగించడంలోనూ , ఆరోగ్యవంతమైన రక్తాన్ని శరీరానికి అందించడంలోనూ , మూత్రనాళాల్లో , మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను తొలగించడంలోనూ మరియు అనేక నిగూడ మరియు భయంకర రోగాలను అనతికాలంలో అతి సునాయాసముగా నయంచేయడంలో సుశ్రుతుడుది అందవేసిన చేయి .
సుశృతుడు రాసిన సుశ్రుత సంహిత నందు శల్యతంత్రం ( శస్త్రచికిత్స , సర్జరి ) గురించి మరియు అష్టాంగ వైద్యవిధానం గురించియు మరింకెన్నో విషయాలకు సంబంధించిన పలువివరాలను క్షుణ్ణంగా ఈ గ్రంథంలో సుశృతుడు వివరించిన కారణంగా ఈ గ్రంథం ప్రమాణ గ్రంధంగా గ్రహింపబడుతుంది. సుప్రసిద్ధ రససిద్ధుడు ఆచార్య నాగార్జునుడు ఈ గ్రంథం ప్రశస్తమైనది అని ప్రస్తుతించాడు . ఈ గ్రంథాన్ని క్రీ . పూ 800 వ సంవత్సరం నందు అరబ్ భాషలోకి అనువదించుకొని వెళ్లి వారివారి ప్రాంతాలలో వైద్యశాస్త్ర అభివృద్ది చేసుకున్నారు . రోమన్లు కూడా భారతీయ మౌళిక ఔషధవిధానాన్ని అనుసరించారు.
ఇప్పుడు మీకు ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు సర్జరీ చేసే విధానం గురించి మీకు వివరిస్తాను.
ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం -
చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను.
ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.
ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభముగా చెసెడివారు .
No comments:
Post a Comment