Monday, January 27, 2020

శిశు సంబంధ విషయాలు - సంపూర్ణ వివరణ about kids

 *  గర్భము నందు ఉండు శిశువు శిరము పైకిని ,  ముఖము తల్లి యొక్క వీపు వైపునకు ఉంచి అవయములు ముడుచుకొని సంచి వంటి మావి చేత కప్పబడి ఉండును. 

 *  ఆకలిదప్పికలను ఎరగని శిశువు పరాధీనం అయ్యి ఆహారపానీయములకు తల్లి మీద ఆధారపడి ఉండును. గర్భస్థ శిశువుకు అవయవములు అన్నియు ఏర్పడిఏర్పడక ఉండునప్పుడు తల్లిని ఆశ్రయించి పోషించబడుచుండును. 

 *  బాగుగా అవయములు ఏర్పడిన తరువాత రోమకూపములు ద్వారా గాను , నాభినాళముల ద్వారా గాను ఆహారసారము గ్రహించబడును. శిశువుకు నాభిప్రదేశమున ఒక నాళము అంటి ఉండును. ఆ నాళమును ఆయుర్వేదము నందు     " అపరా " అనబడును. ఈ అపరా నాళం తల్లిహృదయమునకు కలపబడి ఉన్నది. 

 *  పాశ్చాత్య వైద్యం గ్రంధాల ప్రకారం గర్భము నందు ఎల్లప్పుడు శిశువు శిరస్సు క్రిందివైపునకు ఉండునని తెలియచున్నది. మన గ్రంధాదుల యందు జన్మించబోవునంత వరకు శిశువు శిరస్సు పైభాగమున ఉండునని బయటకి వెడలు సమయంలో శిరస్సు క్రిందికి తిరుగునని చెప్పబడినది. 

         తరవాతి పోస్టులో మరింత విలువైన సమచారాన్ని అందిస్తాను. 

శిశు సంబంధ విషయాలు - సంపూర్ణ వివరణ .  1

 *  గర్భము నందు ఉండు శిశువు శిరము పైకిని ,  ముఖము తల్లి యొక్క వీపు వైపునకు ఉంచి అవయములు ముడుచుకొని సంచి వంటి మావి చేత కప్పబడి ఉండును. 

 *  ఆకలిదప్పికలను ఎరగని శిశువు పరాధీనం అయ్యి ఆహారపానీయములకు తల్లి మీద ఆధారపడి ఉండును. గర్భస్థ శిశువుకు అవయవములు అన్నియు ఏర్పడిఏర్పడక ఉండునప్పుడు తల్లిని ఆశ్రయించి పోషించబడుచుండును. 

 *  బాగుగా అవయములు ఏర్పడిన తరువాత రోమకూపములు ద్వారా గాను , నాభినాళముల ద్వారా గాను ఆహారసారము గ్రహించబడును. శిశువుకు నాభిప్రదేశమున ఒక నాళము అంటి ఉండును. ఆ నాళమును ఆయుర్వేదము నందు     " అపరా " అనబడును. ఈ అపరా నాళం తల్లిహృదయమునకు కలపబడి ఉన్నది. 

 *  పాశ్చాత్య వైద్యం గ్రంధాల ప్రకారం గర్భము నందు ఎల్లప్పుడు శిశువు శిరస్సు క్రిందివైపునకు ఉండునని తెలియచున్నది. మన గ్రంధాదుల యందు జన్మించబోవునంత వరకు శిశువు శిరస్సు పైభాగమున ఉండునని బయటకి వెడలు సమయంలో శిరస్సు క్రిందికి తిరుగునని చెప్పబడినది. 

         శిశు సంబంధ విషయాలు - సంపూర్ణ వివరణ 3 . 

 *  శిశువు తల్లి గర్భము నుంచి బయటకి వెడలిన వెంటనే మండూకబ్రహ్మీ , ధాతుమాక్షికము , కరక్కాయ వీనిని చక్కగా చూర్ణించి ఆవునెయ్యి , తేనె కలిపి శిశువుకు నాకించవలెను . ఆ తరువాత శిశువుకు నాభినాళం ఛేదించవలెను . ఈ కర్మని అత్యంత జాగ్రత్తగా నిర్వహించవలెను . 

 *  నాభినాళం ఛేదించుటకు శిశువునకు కలుగు మార్పులలో ఒకటి. ఈ క్రియను సక్రమముగా నిర్వహించకున్న శిశువుకు అపాయం సంభంవించును. 

 *  నాభినాళమును బాగుగా నీడ్చి ఎనిమిది అంగుళముల పైన దారమును కట్టి మిగిలిన నాళమును ఛేదించి నాళము నందు కట్టబడిన దారము యొక్క మరియొక కొనను శిశువు కంఠమునకి మెడకు చుట్టవలెను అని శుశ్రుతుడు , మాతృగర్భము నుండి వెలువడి సుఖంగా ఉండు శిశువు యొక్క నాభి నాళమును నాలుగు అంగుళముల పైన దారము కట్టి చేదించి ఆ నూలును శిశువు మెడకు చుట్టవలెను అనియు ఆ తరువాత చెంగల్వకోష్టు వేసి కాచిన తైలమును పూయవలెను అని వాగ్బాటాచార్యుల వారు తెలియచేశారు. 

 *  శిశువుయొక్క నాభి నాళమును ఎనిమిది అంగుళములు వదిలి అచ్చట ఒక గుర్తును ఉంచి చెందినచవలసిన ప్రదేశమున రెండువైపులా దారము కట్టి బంగారముతో గాని , వెండితోగాని , లోహముతోగాని చేయబడిన వాడిగల కత్తితో మొన పైకి ఉండునట్లు చేదించవలెను . వెంటనే ఛేదించిన ప్రదేశమునకు దారం కట్టి శిశువు యెక్క మెడకు వదులుగా కట్టవలెను అనియు చరకాచార్యులు వారు తెల్పి ఉన్నారు . 

         పైన చెప్పిన విధముగా అత్యంత జాగ్రత్తతో శిశువుకు బొడ్డుతాడు విచ్చేదన చేయవలెను లేనిచో నాడివ్రణం కలుగును. 

                             సమాప్తం 

No comments:

Post a Comment