Monday, January 20, 2020

ప్రపంచ దేశాలలో ప్రాచీన భారతీయ నాగరికత ఆనవాళ్లు old ancient india

ప్రస్తుతకాలంలో మన యువత సనాతన భారతీయ సంస్కృతి , గొప్పదనం తెలుసుకోవడం లేదు . మనం పాశ్చత్య సంస్కృతి మోజులో పడి మన మూలలను మర్చిపోతున్నాం . పాశ్చాత్త్యులు మాత్రం మన భారతీయ సంస్కృతి గొప్పదనం తెలుసుకుని వారు మన పద్ధతులు ఆచరిస్తున్నారు.  ఇప్పటివారికి మన సనాతన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం గురించి కొంత అయినా తెలియచేయాలి అనే సదుద్దేశంతో ఈ ఆర్టికల్ రాస్తున్నాను.

                  భారతీయ సంస్కృతి అత్యంత పురాతనం - అది ఎంత ప్రాచీనమో నేటి ఆధునిక వైజ్ఞానికుల ద్వారా తెలియచున్నది.

        సుప్రసిద్ధ భూగర్బ శాస్త్రజ్ఞుడు జూలియో టైలో పికాసో  పేరూ వద్ద జరిపిన తవ్వకాలలో ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అనగా వేలసంవత్సరాల క్రితం భారతదేశపు ఆధీనంలో ఉన్నట్లు నిర్దారణ చేశారు . "క్రిస్టఫర్ కొలంబస్ " తన రచన అయిన "ఆల్ డిస్కవర్ అమెరికా " గ్రంథంలో భారతీయ నాగరికత అత్యంత ప్రాచీనం అయినది అని పేర్కొంటూ ప్రపంచంలో అతి ప్రాచీన నాగరికతగా పేర్కొనబడుతున్న "ఉత్తర అట్లాంటిక్"శిధిలాలో కూడా భారతీయ సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది అని వర్ణించారు .

                   ప్రసిద్ధ సోవియట్ పురాతత్వ శాస్త్రవేత్త మారియా కినొవా అట్లాంటిక్ మహాసముద్రంలో  6620 అడుగుల లోతువరకు గల అవశేషాలను విశ్లేషించి భారతీయ సంస్కృతి యొక్క ధ్వంస అవశేషాలు కనిపించాయి అని తెలియచేశారు.  అదేవిధముగా చైనాకు చెందిన బౌద్ధ భిక్షువు షిన్  అనే అతను విశ్వ సంస్కృతులపై అధ్యయనాలు జరిపి మెక్సికో లోని కళాకృతులు బుద్ధునిని పోలియున్నాయి అని నిర్ధారించారు .

                  "న్యూ ఇంగ్లాండ్ యాంటిక్విటీస్ రిసెర్చ్ అసోసియేషన్ " అధ్యక్షులు రాబర్ట్ స్టోన్ నిర్దారణ ప్రకారం భారతీయ సంస్కృతి ప్రపంచంలోని అన్ని సంస్కృతుల కంటే అత్యంత ప్రాచీనం అయినది. కాలూసా అనే ప్రాచీన భారతజాతి  పిరమిడ్లను నిర్మించినది. అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినాడు. దక్షిణాఫ్రికా లోని కలహారి - రోసిస్తాన్ లోని అత్యంత ప్రాచీన ఒక మానవాకృతి ప్రతిమకు భారతీయ ప్రాచీన సాంస్కృతిక చిహ్నాలు ఉన్నవి అని పేర్కొన్నాడు. ఆఫ్రికాకు చెందిన ప్రఖ్యాత వైజ్ఞానికులు అయిన లూయి లీక్ అనే ఆయన టాన్జీనియాలో లభ్యం అవుతున్న అవశేషాలని బట్టి మానవజాతి అస్తిత్వం 20 లక్షల సంవత్సరాల నాటిది అని నిర్దారణ చేస్తూ ఈ అవశేషాలలో భారతీయ వస్తుకళ స్పష్టంగా కనిపిస్తుంది అని పేర్కొన్నాడు.

             ఈజిప్టు దేశములోని గోపురాలలో ఈనాటికి భారతీయ సంస్కృతికి సంబంధించిన శిల్పసంపద కనిపిస్తుంది. ఇదే దేశములో డైండోరా  కళాకృతులలో రాశిచక్రాలు , గ్రహ నక్షత్రాలు కనిపిస్తాయి . వైజ్ఞానికులు ఈ చిత్రాలు భారతీయుల చేత లిఖించబడ్డట్టు నిర్దారించారు. యందీస్ లోని భగవానుని కచ్చప (తాబేలు ) అవతారం ఈరోజుకి అక్కడి మందిరంలో పూజలు అందుకుంటుంది.

ఈ మధ్య రష్యాలో ఒక ప్రాచీన శ్రీచక్రం దొరికింది . దీనిపైన లిఖించబడిన సాంకేతిక తాంత్రిక విద్యను విశ్లేషించి మాస్కో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ప్రో . కులాశ్వే దాన్ని ఫార్ములాతో కంప్యుటర్లో విశ్లేషించగా దానిలోని ప్రతి లిపి భారతీయ తంత్ర విధానంలో శ్రీచక్రం వలే ఉన్నది. ప్రో.కులాశ్వే భారతదేశంలో గణితవిద్య 3000 సంవత్సరాల నాడు ఈనాటికన్నా మిన్నగా ఉండేదని దాని ప్రభావ , ప్రచారాలు విశ్వమంతటా వ్యాప్తిచెందాయని ప్రస్తుతించారు.

               2400 సంవత్సరాల క్రిందటనే భారతీయ ఆచారాలు ఈజిప్టు లో కలవు అని హెరాడోటస్ అను చరిత్రకారుడు రాశాడు. ఈజిప్టు వారు మమ్మీలపై కప్పిన వస్త్రము భారతదేశము నుండే తెప్పించుకొనుచుండిరి. ఈ వస్త్రమును " మజ్లిన్"అని పిలుస్తారు . మజ్లిన్ అనగా సింధు అని అర్థం. మృతశరీరమును భద్రపరచు విద్య మనకి ముందునుంచే ఉన్నది. రామాయణ కాలంలో కైకేయ రాజ్యము నుంచి భరతుడు వచ్చువరకు దశరథుడి శరీరం భద్రపరచబడినది. ఈజిప్టు దేశ వాసుల దేవుని పేరు "ఇసిస్ " ఇది ఈశ శబ్దం. ఇక్కడి రాజు పేరు రాంసేస్ ఇది రామ శబ్దమే . ఈ దేశపు సింహాసనానికి ఒకవైపు హనుమంతుని విగ్రహము మరొకవైపు గరుఖ్మంతుడి విగ్రహము ఉండెను . నైలునదికి నీళానది అని పేరుతో పిలిచెడివారు. ఈ నదికి సమీపములో ఒక గుహలో శ్రీదేవి , భూదేవి , నీళాదేవి , విష్ణువు విగ్రహములు ఉన్నవి. కొన్ని గుహలలో రామాయణ , భారత కథలు చిత్రించబడినవి. అగ్ని యందు హోమము చేయుట ఒక గుహలో చిత్రించబడెను.

          ఇక ఇండోనేషియా దేశపు పూర్వపు గ్రంథముల యందు "అవిఘ్నమస్తు" అని వ్రాయుట ఆచారము . డాక్టర్ రఘువీర గారు ఇండోనేషియన్ ప్రెసిడెంటుని కలిసినపుడు నా పేరు కి అర్థం ఏమిటని  సోకర్ణో అడిగెను. ఇది ఆదిలో "సుకర్ణి " అయి ఉండును. బుద్ధుని విగ్రహమునకు చెవులు పెద్దగా ఉండును. కావున బుద్దుని పేరు అయి ఉండవచ్చు అని రఘువీర గారు చెప్పారు . సోకర్ణో నవ్వి అలాకాదు నేను పుట్టినప్పటి నుండి మా తండ్రిగారు మహాభారతం చదువుతుండేవారు . భారతవీరుని పేరు ఏదైనా నాకు పెట్టవలెను అని ఆయనకు తోచెను . భారత వీరులలోకెల్లా ఆయనకు కర్ణుడు ఆయనకు హెచ్చుగా నచ్చెను . కాని భారతములోని కర్ణుడు దుష్టచతుష్టయములోని వాడు. నా కుమారుడు దుష్టకర్ణుడు కాక సుకర్ణుడుగా ఉండవలెను అని తలచి నా తండ్రి నాకు సుకర్ణుడు అని పేరు పెట్టెను అని చెప్పెను . ఇలా ఇండొనేషియన్ రాజ్యాధినేత పేరు కూడా భారతీయ సంస్కృతిని చాటుతుంది.

               థాయిలాండ్ దేశము నందు ఇప్పటికి బ్రాహ్మణ పురోహితులు రాజునకు పట్టాభిషేకం జరిపింతురు. 5 - 5 - 1950 తారీఖున పూమిపాన్ రాజు పట్టభిషేకం జరిగెను. ముందు దినాన ప్రార్ధనలు , ఉదయాన రాజునకు అఘమర్షణ స్నానం బ్రాహ్మణులే చేయించిరి . శుభసూచకంగా శంఖారావం గావింపబడెను. ఆ దేశము నందు అన్ని దిక్కుల నుండి తేబడిన పవిత్రోదకముతో రాజునకు మంగళస్నానాదికాలు చేశారు . ప్రాచీన కాలం నుండి థాయిలాండ్ లో జరుగు పట్టాభిషేక మహోత్సవాలు ఈ పద్ధతిలోనే జరుగును. దాదాపు 45 సంవత్సరాల క్రితమే అజర్ బైజాన్ లో బాక్ పట్టణం వద్ద ఒక హిందూ దేవాలయం బయటపడినది.

ప్రపంచదేశాలలో ప్రాచీన భారతీయ నాగరికత ఆనవాళ్లు  - సంపూర్ణ వివరణ  - 3 .

      బాలి ద్వీపములో నేటికి దేవాలయాలలో పూజా కర్మకలాపములు హిందూ మతాచారాల ప్రకారమే జరుగును. అపరకర్మలు కూడా భారతీయ పద్దతిలోనే జరుగును. మృతదేహాలకు దహన సంస్కారము చేయబడును . అదికూడా నదీతీరముల యందే ఎక్కువుగా జరుగును. అధిక ప్రజలు హిందువులు అవ్వడం మూలాన నాట్యములు , నాటకములు హిందూ పురాణగాధలకు సంబంధించినవే యున్నవి.

                 సుమత్రా ద్వీపములో క్రీ.శ  4 వ శతాబ్ది నాటికే శ్రీ విజయ అనే పేరుతో భారతీయ రాజ్యమున్నది అనేది ప్రసిద్ధ విషయం . అచ్చట శాలివాహన శకము వాడబడుచుండెను. నాటి శాసనములు సంస్కృతభాషలోనే ఉన్నవి. రామాయణ , మహాభారత ప్రచారాలు ఎక్కువుగా ఉండెను . కాశి హిందూ విశ్వవిద్యాలయ వేదాంతశాఖ ప్రధానాచార్యులు శ్రీ ఆత్రేయగారు జపాన్ దేశం సందర్శినప్పుడు ఆ దేశము నందు బుద్ధవిగ్రహమునకు సమీపమున శివవిగ్రహము దానికి నాగములు , కపాలములు , వ్యాఘ్ర చర్మము ఉండుట , వీణావాయుంచున్న సరస్వతివిగ్రహము , లక్ష్మి , విఘ్నేశ్వరుడు ఉండుట చూసినట్లు ఆయన వివరించారు .

                  యార్ఖండ్ కు ఆగ్నేయమున 200 మైళ్ల దూరములో ఉన్న ఖోటా దేశపు ప్రజలు తమ ఇంటి గోడలపైన బుద్ధునితో పాటు వినాయకుని బొమ్మలను వేసుకొందురు. ఇక్కడ క్రీ.శ 3 వ శతాబ్దిలో సంస్కృతం రాజభాషగా వెలిసింది. అలాగే మెసపటోమియా ప్రాంతమున కూడా హిందూమతం ఎంతగానో నాటుకొని ఉన్నట్లు తెలియచున్నది.

      యూరపు నాగరికత ప్రధానంగా గ్రీసు దేశము నుండి వివిధదేశములకు ప్రసరించింది. ఆ గ్రీస్ దేశము ఇండియా నుండి వేదాంతము , పురాణగాధలను , ఇతర సాంప్రదాయాలను గ్రహించింది అని అనుటకు ఆధారములు కలవు.

                పైథాగరస్ అను గ్రీకు దార్శనికుడు భారతదేశమునకు వచ్చి ఇచ్చట అనేక విద్యలను నేర్చుకొనెను . ఇతడు మొదట భారతీయుడేననియు ఇతని నామధేయం బుధగురు నామధేయం అని పాశ్చాత్యులే అభిప్రాయపడిరి. పునర్జన్మ కలదు అని ఇతను  గ్రీకులకు బోధించెను. కర్మ చేతనే జన్మ కలుగును అని ఇవి రెండూ కూడా భారతీయ సిద్ధాంతములు. పైథాగరస్ సిద్థాంతం రేఖా గణితము నందు ప్రసిద్ధం అయినది. భారతీయగ్రంధములలో సంస్కృత భాష లో ఉన్నది. బోధాయన మహర్షి రచించిన శుల్బ సూత్రము అను గ్రంధమున ఈ సిద్థాంతం ఉన్నది. ఇట్టి సాక్ష్యములు ఉండుటచేతనే మాక్స్ ముల్లర్ , ఎన్ ఫీల్డ్ , స్లెగిల్ , మోనియర్ విలియమ్స్ మున్నగు పాశ్చాత్త్యులు పైథాగరస్ హిందూమత వేదాంత జ్ఞానమును సంపాదించుకొన్న పిమ్మటనే గ్రీసులో ఆచార్యుడిగా వినుతికెక్కెను అని అంగీకరించారు. 

                   సోక్రటీస్ భారతీయ వేదాంతమును అధ్యయనము చేసినాడని ఇతని బోధలు స్పష్టముగా చాటుచున్నవి. ఇతని తరువాత ఇంతటివాడైన ప్లేటో కూడా హిందూ మత గ్రంధపరిచయం కలవాడు అనుటకు ఎన్నొ నిదర్శనములు ఉన్నవి. సుప్రసిద్ధులు అయిన థేల్స్ , ఎపెండికల్స్ , ఎన్గజా గొరస్ , డేమాక్రిటస్ అను గ్రీకు వేదాంతులు ప్రాక్ ఖండమునకు పోయి తత్వశాస్త్ర అధ్యయనము చేసినారని ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయ సంస్కృతాచార్యుడిగా నుండిన ఏ .ఏ . మాక్డొనెల్ తన "సంస్కృత సాహిత్యము" అను గ్రంథము నందు వివరించాడు. 

           నేటికి 2000 సంవత్సరాల క్రిందట ఆర్మినియా నందు శ్రీకృష్ణుని ఆరాధన బహుళ ప్రచారము నందు ఉండెను . జూలియస్ సీజర్ బ్రిటన్ దేశమును జయించునప్పటి సమయానికి అక్కడ డ్రుయిడ్స్ అను మతగురువులు ఉండెడివారు. వారి లక్షణములు పరిశీలించి చరిత్రలో వారి లక్షణములు పరిశీలించి చరిత్రలో వారు భారతదేశము నుంచి వెళ్లిన బ్రాహ్మణులు అని పాశ్చాత్యులే అభిప్రాయపడ్డారు. వారు గురుకులములు కలిగి ఉండి 20 సంవత్సరముల  బాలురను గురువు వద్ద ఉంచుకుని విద్య నేర్పించేవారు . వారు ప్రభుత్వానికి పన్ను చెల్లించనక్కర లేదని శాసనములు ఉండెను .

             హిందూమత చిహ్నములు అమెరికాలో నేటికి కనిపించుచుండెను. అమెరికనుల మతం హిందుమతం అనుటకు స్పష్టమైన సాక్ష్యములు విశేషముగా మెక్సికోలో లభించినవి. ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహములు అమెరికాలో లభించినవి. మరికొన్ని హిందూదేవత విగ్రహాలు అమెరికా నందు కూడా లభించినవి. సర్పపూజ కూడా ఇక్కడ ఉండెను . మృతులకు దహన సంస్కారములు చేయుట , పునర్జన్మ విశ్వాసము వీరికి ఉండెను . ఒకరాజు భార్య తన భర్త మృత శరీరంతో సహగమనము చేసినట్లు ప్రాచీన చిత్రం మెక్సికో నేషనల్ మ్యూజియంలో ఉన్నది.ఇది కేవలము భారతీయ ఆచారం . మెక్సికోలో శివాలయం , బొలివియా నందు కైలాసనాథ దేవాలయం , పేరూ దేశము నందలి విఘ్నేశ్వరుని  ఆంజనేయ స్వామి , సూర్యభగవానుని విగ్రహములు లభించినవి.  


       పైన చెప్పినవే కాకుండా మరెన్నో దేశాలలో జరుపుతున్న పురాతన తవ్వకాలలో హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఆనవాళ్లు , దేవతా విగ్రహాలు ఎన్నో లభిస్తున్నాయి .  మన భారతీయ సాంప్రదాయానికి , సనాతన ధర్మానికి ఇంత గొప్ప చరిత్ర ఉన్నాకూడా మనం మాత్రం మనం మాత్రం పాశ్చాత్య సంప్రదాయాల మోజులోపడి మనతో పాటు మన తరవాతి తరానికి కూడా మన పురాతన సంస్కృతి , విలువలను నేర్పించకుండా మనమే మన తరవాతి తరాన్ని కూడా నాశనం చేస్తున్నాం . ఇకనైనా మన పిల్లలకు మన సనాతన ధర్మం , సాంసృతిక విలువలు గురించి నేర్పి భవిష్యత్ తరాలను కాపాడుకుందాం. 

           నేటితో ప్రపంచంలో మన భారతీయ ప్రాచీన నాగరికత ఆనవాళ్లు - సంపూర్ణ వివరణ అనే పోస్టు సమాప్తం అయినది. తరువాత మరొక గొప్ప విషయాన్ని సంపూర్ణంగా మీ ముందుకు తీసుకొస్తాను. 

No comments:

Post a Comment