ఆయుర్వేదము నందు పరిమళం గల ఔషధాలు -
1
అంతకు ముందు పోస్టులో ప్రాచీన కాలంలో వైద్యములో పరిమళములను యే విధముగా వాడేవారో మీకు తెలియచేశాను. ఇప్పుడు మనకి చుట్టుపక్కల లభ్యం అయ్యే కొన్ని మొక్కల యెక్క వాసనను చూడటం వలన ఏయే వ్యాధులు నయం అవుతాయో మీకు మొక్కలతో సహా వివరిస్తాను.
* చేమంతి -
ఈ చెట్టు జాతిలో అడివి చేమంతి అని మరియొక రకం కూడా కలదు. ఈ చెట్టు పూలతో అరకు తయారు చేసిన అరకు మూర్చ , శ్వాస , తాపము మరియు అరుచి ని పోగొట్టును . దీని పువ్వులు మరియు ఆకులలో చామాజులెన్ , కుమారిక్ , కాంఫర్ , బోర్నియోల్ , టర్పెనిస్ మున్నగు ముఖ్యమైన చేదు తైలాలు కలవు. వాటికి అలర్జీని అరికట్టు గుణములు ఉన్నవి. కావున జేబు రుమాలుకు దీని అత్తరును అంటించి వాసన చూచుచుండిన యెడల అలర్జీ వారికి రక్షణ కవచముగా ఉండును.
* తులసి -
దీని దళములను , పుష్పములను గుచ్చముగా కట్టి వాసన పీల్చుచుండిన యెడల తలభారం , తలనొప్పి , పడిసెము , రొమ్ము నందు జలుబు , గొంతునొప్పి , తలతిరుగుడు , పైత్యవికారం , ముక్కునందు క్రిములు నశించును.
* నీలగిరి -
దీని ఆకులను , పువ్వులను నలిపి వాసన చూచుచుండిన యెడల వగర్పు , దగ్గు , తలనొప్పి , ముక్కుదిబ్బడ , చెవులదిబ్బడ , దంతశూల , పడిసెము , ముక్కు వెంట ఆగకుండా నీరు కారుట ( పీనస రోగం ) నశించును.
* కుంకుమపువ్వు -
నాలుగైదు చుక్కలు గులాబీ అరకులో రెండు మూడు రేకుల స్వచ్చమైన కుంకుమపువ్వును అరచేతిలో తీసుకుని బాగుగా రుద్ది వాసన చూచుచుండిన యెడల తీవ్రమైన తలనొప్పులు , కంటిమంట , ముక్కు నుంచి వెలువడు దుర్గన్ధము , చిత్తచాంచల్యము , జలుబు దోషము , మూర్చవ్యాధి నశించును.
* ఉల్లిపువ్వు -
ఉల్లిపూవ్వు లేదా గడ్డను ముక్కలుగా తరిగి వాసన చూచిన యెడల తేలు , కందిరీగ , జెర్రి విషములు నశించును. దీనికి తోడుగా తాంబూలపు సున్నం , నవాసారము శనగ గింజ అంత ప్రమాణం కలిపి అరచేతిలో నలిపి వాసన చూచిన యెడల తక్షణమే బాధ తగ్గును. జలుబు , తలభారం , దంతశూల , నేత్రశూల కూడా హరించును .
* వెల్లుల్లి -
దీనిలో సల్ఫర్ ఆక్సయిడ్ , సల్ఫర్ అయొడిన్ , గార్చిసిన్ మున్నగు రసాయనాలు , A , B1 , B2 విటమిన్లు కలవు. ఇది మిక్కిలి ఘాటైన వాసన కలిగినది . ఇది ఇంత దుర్గన్ధమో అంతకంటే ఎక్కువ రెట్లు మేలు చేయును . దీనిని దంచి లేదా నలిపి వాసన చూచుచుండిన యెడల తలభారము , పడిసెము , మూర్చ వలన కలుగు పోటు , నేత్రశూల నివారణ అగును. తులసి ఆకులు అల్లముతో కలిపి ముక్కులో కలిపి పిండిన మూర్చరోగముల యందు విశేష లాభం కలుగును. దీనిని కడుపులోకి వాడిన కృమి రోగం , ఉదరశూల , గ్యాస్ , కీళ్ళపట్లు , ఆస్తమా , రక్తపోటు నివారణ అగును.
ఆయుర్వేదం నందు పరిమళం గల ఔషధాలు -2 .
అంతకు ముందు పోస్టులో మనకి అత్యంత దగ్గరలో లభించే కొన్ని రకాల మొక్కల సువాసనలు పీల్చడం ద్వారా మనకి వచ్చే కొన్ని రకాల వ్యాధులను నయం చేసుకొనే విధానాన్ని తెలియచేశాను . ఇప్పుడు మరికొన్ని సువాసన మొక్కలు మరియు మత్తును కలిగించే వాసనల గురించి తెలియచేస్తాను .
* పుదీన -
కొన్ని ఆకులను నలిపి వాసన చూసిన యెడల అరుచి , అగ్నిమాంద్యము , నోటి దుర్గంధం , శిరోభారం , దగ్గు , జలుబు నశించును. దీనిని కూరలలో , పచ్చళ్లలో వాడినయెడల రుచిని పెంచును.
* కొత్తిమీర -
దీని వాసన చూచినయెడల వాంతులు అరికట్టును. మనసుకు శాంతముగా ఉండును. తలనొప్పి నివారణ అగును.
* దాల్చినచెక్క -
శ్రీలంక యందు దీని చెట్లు ఉండును. దీని ఆకులను లేదా చెక్క నుంచి తీసిన తైలము నందు నయుజినాల్ , సిన్నామిక్ , అల్దేహైడ్ , పప్పెన్ , ఆల్కాల్సు , బెంజిల్ బెంజోయెట్ సాపరోర్ , ఫర్ ఫ్యులాల్ ఓనోవ్ మున్నగు రసాయనాలు ఉండును. ఇది వాసన చూసినను లేదా తలకు రాచుకొనుచుండిన యెడల దీర్ఘకాలంగా వేధిస్తున్న తలనొప్పి , జలుబు , పొడిదగ్గు నివారించబడును. కడుపులొకి వాడుచున్న కడుపునొప్పి , కడుపుబ్బరం , అతిసారం , రక్తపిత్తము , తెల్లకుసుమ తగ్గును. పాము కరిచినప్పుడు రక్తం పిండి దీని అరుకు అంటించిన యెడల విషము హరించును .
మత్తెక్కించే సువాసనలు -
* గోరింట పువ్వుల గుత్తులను వాసన చూచుచుండిన లేదా తలకింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .
* వెలగ చెట్టు ఆకు వాసన చూచిన యెడల వాంతులు నిలుచును . తలగడ కింద పెట్టుకుని నిద్రించిన యెడల గాడనిద్ర పట్టును .
* గసగసాలు ఒక స్పూన్ తీసుకుని నాలుగు చుక్కలు ఆవునెయ్యి వేసి ఒక ఇనప గంటెలో వేయించి పలచటి బట్టలో వేసి వాసన చూస్తున్న యెడల గాడనిద్ర పట్టును .
* దవనం , మరువం , జాజి , జాపత్రి , యాలుకలు , చందనం , కురువేరు వంటి ఔషధ తైలాలు గాడనిద్రను కలుగచేయును .
పైన చెప్పిన గాడనిద్రను కలుగచేయు యోగాలను నిద్రపట్టక ఇబ్బంది పడువారు తప్పక ఉపయోగించుకొని సమస్యల నుంచి బయటపడవచ్చు.

No comments:
Post a Comment