Monday, January 20, 2020

వాంతులు తగ్గుటకు సులభ ఔషధ యోగాలు - control vomit

*  వాంతులు బాగా అయ్యేప్పుడు లేత కొబ్బరినీరు త్రాగితే అవి నిశ్చయముగా ఆగిపోవును .

 *  తుంగముస్తలు , శృంగి , పిప్పళ్లు సమభాగాలుగా తెచ్చి చూర్ణము చేసుకుని తేనెతో సేవించుచున్న వాంతులు కట్టును .

 *  నిమ్మకాయ రసంలో తినేసోడా వేసి పొంగువచ్చిన వెంటనే త్రాగిన వాంతులు కట్టును .

 *  వెలగాకు రసం తాగిన వాంతి కట్టును .

 *  శొంఠి , నేలతాడి సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి కలుపుకుని ఆ చూర్ణం లోపలికి తీసుకొనుచున్న వాంతులు కట్టును .

 *  వాము , ధనియాలు , జీలకర్ర సమాన భాగాలుగా తీసుకుని వేయించి ఆ చూర్ణం కషాయంలా కాచి తీసుకొనుచున్న వాంతులు తగ్గును.

 *  పుదీనా ఆకులు పచ్చడిగా చేసి తింటున్నా వాంతులు తగ్గును. వాంతి వస్తున్న సమయంలో కొంచం నోటిలో వేసుకొనుచున్న వాంతి తగ్గును.

 *  నోట్లొ కొంచం దాల్చినచెక్క ముక్క వేసుకొని రసం మింగుచున్న వాంతులు తగ్గును.

 *  జీలకర్ర నమిలి మింగుచున్న వాంతులు తగ్గును.

 *  పూటకి ఒక మారేడు పండు తినుచున్న వాంతులు త్వరగా తగ్గును.

       పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా ఉన్నదో చూసుకుని దానిని పాటించండి.

No comments:

Post a Comment