వాతరోగం నందలి రకములు - లక్షణములు
మనిషియొక్క శరీరం నందు వాతం,పిత్తం , కఫం అనునవి కలవు. వీటిలో ఏదైనా వృద్ధిని పొంది తమ పరిధిని దాటునో అప్పుడు ఆదోష సంబంధమైన సమస్య మనిషిని పీడించును.
శరీరం నందు వాతం ప్రకోపించినప్పుడు నొప్పి , శ్లేష్మం ప్రకోపించినప్పుడు దురదయు , పైత్యం ప్రకోపించినప్పుడు అజీర్ణం మరియు జ్వరం కలుగును. అసలు వాత , పిత్త , కఫము గురించి సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకున్నప్పుడు మనకి వాటి వలన వచ్చే రోగాలపైన కూడా మనకి అవగాహన ఉంటుంది అటువంటప్పుడు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ పోస్టులో మీకు వాతరోగంలో రకాల గురించి అవగాహన రావటం కోసం కొంత విలువైన సమచారాన్ని ఇస్తున్నాను. ఈ సమాచారాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకోగలరు.
వాతరోగాలు మొత్తం 80 రకాలుగా ఉండును. ఇప్పుడు వాతరోగ లక్షణాన్ని గురించి సంపూర్ణంగా వివరిస్తాను. అసలు ముందు మనిషి శరీరంలో వాతం ప్రకోపించుటకు గలకారణాలు తెలియచేస్తాను .
వాతం ప్రకోపించుటకు గల కారణాలు -
అతివేడి , చల్లటి , తక్కువ ప్రమాణంలో అన్నము భుజించటం , ఎక్కువుగా మైధునం చేయుట , నిద్రతక్కువ పోవడం , నదుల యందు ఎక్కువసేపు ఈదుట , ఎక్కువ దూరం నడవటం , దుముకుట వంటి విరుద్ధచేష్టలు చేయడం , శరీరం నందు రసరక్తాధి ధాతువులు క్షయించుట , అతిగా బాధ,దుఃఖం చెందటం , శరీరాన్ని కృశింపచేసుకోవడం , మలమూత్రాలను ఆపుట , ఉపవాసాలు అతిగా చేయుట , గుండెమీద దెబ్బ తగలటం , ఏనుగు , గుర్రం , ఒంటె వంటి వాటిపైనుంచి భూమిమీద పడుట వంటి కారణముల వలన శరీరము నందు వాతం ప్రకోపించి బలిష్టమైన శరీరము నందలి నాడులపై ప్రభావం చూపించి అన్ని అంగముల యందు గాని లేదా ఏదైనా ఒక అంగమును ఆశ్రయించి శరీరము నందు అనేకరకములైన వాతరోగాలను కలుగచేయును .
శరీరము నందు వాతప్రకోపం చెందినపుడు కనిపించు లక్షణాలు -
జాయింట్లు కదల్చలేకపోవడం , గట్టిగా అవ్వడం , ఎముక సంధులు బలహీనపడటం , గగుర్పాటు , తడపడుతూ మాట్లాడటం , చేతులు , శిరస్సు , వీపు యందు పట్టుకోవడం , కుంటితనం , గూని , అంగముల యందు వాపు , నిద్రలో మధ్యమధ్యలో మెలుకువరావడం , గర్బము ధరించలేకపోవడం , శుక్రము , ఆర్థవం నశించుట , శరీరం వణుకుట , శరీరం మొద్దుబారినట్లు ఉండటం , వెంట్రుకల స్థానం , కణతలు స్థానం నందు పగిలినట్లు అగుట , వాసన చూసే శక్తి తగ్గుట , నేత్రదృష్టి తగ్గుట , రొమ్ములు ఎండిపొవుట , మెడ తిరగకుండా స్థంభించుట , పెదవుల ,కంఠం , దంతముల యందు పగుళ్లు రావటం , సూదులతో పొడిచినట్లు ఉండటం , వంటివన్నియు వాతలక్షణాలు . ఉదరం నందు ఉండు వాతం పెరిగిన మలమూత్రాలు అడ్డగించును.
పైన చెప్పిన లక్షణాలు కనపడుచున్నచో శరీరము నందు వాతం విపరీతముగా పెరిగినది అని అర్థం చేసుకొనవలెను . వాతనివారణకు సరైన ఔషధాలు తీసుకొనుచూ పథ్యం పాటించుచున్న వాతరోగాలు నయం అగును.
వాతరోగులు పాటించవలసిన ఆహారనియమాలు -
తినవలసిన ఆహారాలు -
పాతబియ్యపు అన్నం , గోధుమరొట్టె , గోధుమనూక జావ , మేకమాంసం , పొట్టేలు మాంసం , కందిపప్పు మరియు కట్టు , బీరకాయ , పొట్లకాయ , లేత వంకాయ , లేత మునగకాయ , వెల్లుల్లి , ఉల్లిపాయ , కొయ్యతోటకూర , గలిజేరు కూర , మునగాకు కూర , చిర్రికూర , కసివిందాకు కూర , నల్లేరు , ద్రాక్షపండు , ఖర్జూరపు పండు , మజ్జిగ , ఆవునెయ్యి , పటికబెల్లం , పాతబెల్లం , తేనె అదేవిధముగా శరీరానికి మర్దన చేయించుకోవలెను .
తినకూడని ఆహారపదార్థాలు -
కొత్తబియ్యపు అన్నం , చద్ది అన్నం , జొన్నన్నం , మొక్కజొన్నలు , అలసందలు , శెనగలు , పెసలు , మినుములు , బచ్చలికూర , చుక్కకూర , పెరుగు , పెరుగు మీద మీగడ , సామలు , పిండివంటలు , అతినూనె , కల్లు, కలి , కోడిమామాసం , కోడిగుడ్డు , ఏటినీరు , వెదురు మొలకలు , నేరేడుపండు , కాకరకాయ , మామిడిపండ్లు , మామిడికాయలు , చేపలు , పులిహార , చింతపండు , చల్లటి నీరు , టీ , కాఫీ , నూనెవేపుళ్ళు , పాతపచ్చళ్లు , తిన్నది అరగక ముందే మరలా భుజించటం , మైథునం , చన్నీటిస్నానం , ఉపవాసం , అతిశ్రమ , చల్లటిగాలి , మంచు , తడి ప్రదేశాల్లో ఉండరాదు.
పైన చెప్పిన ఆహారనియమాలు తప్పక పాటించవలెను . లేనిచో సమస్య నుంచి విముక్తి దొరకదు. ఆయుర్వేదము నందు పథ్యం అనునది కేవలం రోగము యెక్క నివారణ కొరకే కాని ఔషధముల కొరకు కాదు.
* వాతప్రకృతి -
తీసుకోవలసిన ఆహారపదార్దాలు -
ద్రాక్ష , నిమ్మ, చెర్రి , స్ట్రాబెర్రీ , పైనాపిల్ , ఖర్జురము , తియ్యటి మామిడి , బొప్పాయి , ఉల్లి , క్యారెట్ , బీట్రూట్ , లేత ముల్లంగి , గోధుమ , పాతబియ్యం , పెసర కట్టు , కంది కట్టు , నువ్వులు , జీడిపప్పు , ఆవునెయ్యి , మజ్జిగ , మేకమాంసం , బీరకాయ , పొట్లకాయ , వెల్లుల్లి , కొయ్యతోటకూర , మునగాకు కూర , నల్లేరు , పటికపంచదార , తేనె , శరీర మర్దన చేయించుకోవలెను .
తీసుకొకూడని పదార్దాలు -
కొత్తబియ్యపు అన్నం , చద్ది అన్నం , జొన్నన్నం , అలసందలు , పెసలు , మినుములు , శనగలు , బచ్చలికూర , చుక్కకూర , పెరుగు , మీగడ , సామలు , పిండివంటలు , నూనెవేపుళ్ళు , పాతపచ్చళ్లు , కోడిమాంసం , గుడ్డు , కలి , ఏటినీరు , వెదురుమొలకలు , నేరేడు పండు , చల్లటినీరు , టీ , కాఫీ , పుల్లటి మామిడి , చింతపండు , చేపలు , ఎక్కువ కారం కలిగిన పదార్దాలు , ఎక్కువుగా గాలికి తిరగకూడదు . మైధున ప్రక్రియ ( శృంగార) ఎక్కువ చేయరాదు , చేదు పదార్థాలు , చన్నీటిస్నానం చేయరాదు . అతిగా శ్రమించరాదు . మలమూత్రనిరోధం చేయరాదు . తడి ప్రదేశాలకు దూరంగా ఉండవలెను .
పైన చెప్పినటువంటి ఆహార పదార్ధ నియమాలు పాటిస్తూ ఔషధసేవన చేయుచున్న వాత సంబంధ దోషాల నుంచి విముక్తిపొంది ఆరోగ్యం చేకూరును .

No comments:
Post a Comment