Wednesday, January 29, 2020

సన్నిపాత జ్వరం (టైఫాయిడ్ ) గురించి సంపూర్ణ వివరణ - 1 typhoid

  సన్నిపాత జ్వరం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతిగా కారం ఎక్కువకాలం పాటు తినడం వలన పిత్తం పెరుగుట , మధురపదార్ధాలను ఎక్కువ కాలం సేవించుట వలన వాతం , పులుసును ఎక్కువ కాలం సేవించుట వలన శ్లేష్మం ప్రకోపించును . మరియు ఎవైనా రెండు రకాల పదార్థాలు అతిగా సేవించుట వలన ధాతువులకు ద్వందరూపం కలిగి సన్నిపాతములు జనించును. మరియు ఋతుదోషము , గ్రహము ( సూక్ష్మజీవులు ) సోకుట , విష సంబంధ దోషములు , పాలదోషము , జన్మనక్షత్ర పీడ , సూర్యాది గ్రహపీడ , అతిపాపం , గర్భస్రావం . వీటివలన సన్నిపాతం జనించును.

  సన్నిపాత లక్షణము -

        ఇప్పుడు మీకు సన్నిపాత లక్షణాల గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.

      రాత్రి మేల్కొని ఉండటం , పగలు కృశించి ఉండటం , మూర్చ , శరీరం నందు దాహం , వాతం ప్రకోపించి ఉండటం , చలిపెట్టుట , చెమట పట్టుట , సంబంధం లేని విషయాలు మాట్లాడుట , రొమ్ములో నొప్పి , శరీరం చల్లగా ఉండటం , జ్వరం , దప్పి , తీవ్రమైన తలనొప్పి , నాలుక పిడకవలె ఉండటం , శరీరం గగుర్పొడుచుట , కీళ్లనొప్పి , నోటికి రుచిలేకపోవుట , కండ్ల నుండి నీరుకారుట , నాలుక కాలినట్టుగా , బిరుసుగా , నల్లగా ఉండటం , నేత్రముల యందు కలక , నేత్రముల యందు ఎరుపుదనం , చెవిలో శబ్దం , పోట్లు , గొంతులో ముండ్లు ఉండినట్లు అనిపించటం , శరీరం పైన పేలినట్లు ఉండటం , తలతిరుగుట , మలము కొంచం వెడలుట , స్వరం హీనంగా ఉండటం , ఆకలి లేకుండా ఉండటం , ఎక్కిళ్లు , దగ్గు , ఇటువంటి లక్షణాలు అన్ని సన్నిపాత జ్వరం నందు కనిపించును.

    సన్నిపాత జ్వరం మొత్తం 13 రకాలుగా ఉండును. అవి .

 *  తంద్రిక సన్నిపాతం .

 *  చిత్తవిభ్రమ సన్నిపాతం .

 *  జిహ్వక సన్నిపాతం .

 *  ప్రలాప సన్నిపాతం .

 *  రుగ్ధాహ సన్నిపాతం .

 *  కంఠకూర్జ సన్నిపాతం .

 *  కర్ణిక సన్నిపాతం .

 *  రక్తేష్టి సన్నిపాతం .

 *  అంతక సన్నిపాతం .

 *  భగ్ననేత్ర సన్నిపాతం .

 *  శీతాంగ సన్నిపాతం .

 *  అభిన్యాస సన్నిపాతం .

 *  తాంధ్రీక సన్నిపాతం .

           పైన  చెప్పినవిధముగా సన్నిపాతము నందు రకాలు కలవు. ఒక్కోదానికి ఒక్కోరకమైన లక్షణాలు కొన్ని సార్లు అనేక రకాల లక్షణాలు ఒకేసారి కనిపించును. వైద్యుడు ముందుగా లక్షణాన్ని సరిగ్గా అంచనావేసి రోగికి సరైన చికిత్స అందించవలెను.

No comments:

Post a Comment