Wednesday, January 29, 2020

పొద్దుతిరుగుడు మొక్కతో ఉపయోగాలు

* పొద్దుతిరుగుడు మొక్కల్ని పీకేసిన తరువాత ఎండించి , శుభ్రం చేసుకుని మెత్తగా దంచి ఆ చూర్ణం ఒక చెంచా మోతాదు రోజూ రెండుపూటలా తీసుకొంటే చర్మవ్యాధుల మీద బాగా పనిచేస్తుంది .

 * మొక్క సమూలంగా దంచిన ఈ చూర్ణానికి అమీబియాసిస్ వ్యాధిని తగ్గించే గుణం ఉంది.

 *  కడుపులో క్రిములను పొగొట్టును.

 *  పొద్దుతిరుగుడు మొక్కని సమూలంగా ఎండించి దంచిన పొడిని గాని , పచ్చి మొక్కని దంచి పిండిన రసాన్ని గాని కొద్దిగా తీసుకొంటే దగ్గు తగ్గుతుంది . మూత్రవ్యాధులలో కూడా బాగా పనిచేస్తుంది .

 *  దీని గింజలు ప్రొటీన్లకు పుట్టిల్లు. నేతిలో ఈ గింజల్ని వేయించి పైపొట్టు ఒలిచి మెత్తగా దంచి ఆ పొడిని పాలలో కలిపి తాగితే మీకు అంతకు మించిన బలకరమైన ఆహారం మరొక్కటి ఉండదు.

 *  ఇందులో 50 % కొవ్వు పదార్దాలు ఉన్నాయి. అందుకని ఈ గింజల్ని సన్నగా చిక్కి పొతున్నవారికి పెట్టినట్లు అయితే మంచి ఒళ్ళు చేస్తారు .

 *  ఎప్పుడూ నీరసం , అలసట కలిగి ఉండి ఏ పనిచేయలేని అశక్తత ఉన్నవారు పొద్దుతిరుగుడు గింజల్ని తీసుకోవడం వలన శరీరంలో నీరసం , అలసటని తగ్గించి శక్తిని పెంచును.

 *  పొద్దుతిరుగుడు గింజలలో "లైనోలిక్ యాసిడ్ " అనే రసాయన పదార్థం ఉన్నది. ఇది కొలెస్ట్రాల్ ని రక్తంలో పెరగకుండా చూస్తుంది. అందుకని వేరుశెనగ నూనె కంటే పొద్దుతిరుగుడు నూనెని ఆహారంలో వాడుకోవడం మంచిది .

 *  B విటమిన్ ఇందులో ఎక్కువుగా ఉండును. అందుకని నీరసం మీద బాగుగా పనిచేస్తుంది . పొద్దుతిరుగుడు నూనె వాడటం మాత్రమే కాదు పొద్దుతిరుగుడు గింజలని తినవలెను .

 *  రక్తక్షీణత , ఉపిరితిత్తుల జబ్బులలో కూడా పొద్దుతిరుగుడు గింజలు ఎక్కువ మేలు చేస్తాయి 

No comments:

Post a Comment