Bhattacharya:
ప్రాణాయామం :
I. ప్రాణాయామ విశేషాలు
II. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు
III. తీసుకోవలసిన జాగ్రత్తలు
IV. వివిధ ప్రాణాయామ విధానాలు
1. నాడీ శోధన ప్రాణాయామం
2. భస్త్రిక ప్రాణాయామం
a. చంద్రాంగ భస్త్రిక
b. సూర్యాంగ భస్త్రిక
c. సుషుమ్న భస్త్రిక
d. చంద్రాంగ సూర్యాంగ భస్త్రిక
3. భ్రామరి ప్రాణాయామం
4. శీతలి ప్రాణాయామం
5. శీతకారి ప్రాణాయామం
6. సూర్య భేది ప్రాణాయామం
7. చంద్ర భేది ప్రాణాయామం
8. ఉజ్జయి ప్రాణాయామం
9. మూర్చప్రాణాయామం
10. ప్లావని ప్రాణాయామం
11. కపాలభాతి ప్రాణాయామం
I.ప్రాణాయామ విశేషాలు:
ప్రాణం + ఆయామం = ప్రాణాయామం, ప్రాణం వుంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుటలేక నియంత్రించియుంచుట అని అర్థం. ఇఃకో అర్థంలో ప్రాణాయామం అంటే ప్రాణాన్ని కష్ట పెట్టడం అని కూడా అర్థం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్రాల ప్రకారం శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించి యుంచడమే ప్రాణాయామం అని తీర్మానించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు. శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్ధం చేయడం ద్వారా అంతర్గత ప్రాణాన్ని కూడా అదుపులో వుంచవచ్చు.
నాడీ మండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచరిస్తూ వుంటుంది. ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ లభిస్తాయి. కనుకనే “ప్రాణాయామేన యుత్తేన సర్వరోగ క్షయం భవేత్ ” అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచారం అయింది.
ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములను 5 రూపాలు వున్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్మానం గుదం, సమానానికి స్మానం నాభి, ఉదానానికి స్మానం కంఠం, వ్యానానికి స్థానం శరీరమంతా, శ్వాస క్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్త ప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి.
శ్వాసను బయటికి వదిలే క్రియను రేచకం అని, లోపలికి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని నిలిపి వుంచడాన్ని అంతర్ కుంభకం అని, తిరిగి బయటికి వదిలి ఆపివుంచడాన్ని బాహ్య కుంభకం అని అంటారు. యీ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.
మెడికల్ సైన్సు ప్రకారం రెండు ముక్కు రంధాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు యీ రెండిటికి మధ్య గల భేదం గ్రహించారు. వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందువల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్ర ప్రభావం చల్లని దనం, అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. యీ రెండిటికి మధ్య సమన్వయం సాధించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం యివ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ఠ అను అక్షరం సూర్యుడికి గుర్తులుగా నిర్మారించారు. అందువల్ల హఠయోగం వెలువడింది. హఠయోగమంటే చంద్రసూర్యనాడులకు సంబంధించిన విజున మన్నమాట. హఠం అనగా బలవంతం అని కాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర సూర్య స్వరాలకు (స్వరము అంటే శ్వాస) సంబంధించినదే.
II. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు:
1) ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి.
2) శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
3) రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా బయటికి వెళ్ళి సత్తువ లభిస్తుంది.
5) మెదడు చురుగ్గా పని చేస్తుంది.
6) పేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
7) జఠరాగ్ని పెరుగుతుంది.
8) శరీరం ఆరోగ్యంగా వుంటుంది.
9) ఆయువు పెరుగుతుంది. యిది అన్నిటి కంటే మించిన విశేషం.
III. తీసుకోవలసిన జాగ్రత్తలు:
1) మైదానంలో గాని, తోటలో గాని, తలుపులు తెరిచి యున్న గదిలో గాని, కంబళీ లేక బట్టలేక ఏదేని ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
2) గాలి విపరీతంగా వీస్తూ వుంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
3) మురికిగా వున్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం ప్రాణాయామం చేయకూడదు.
4) సిగరెట్టు, బీడీ, చుట్ట పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
5) పొట్ట నిండుగా వున్నప్పుడు ప్రాణాయామం చేయకూడదు.
6) ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా యితర యోగాసనాలు చేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
7) ప్రాణాయామం చేస్తున్నప్పడు బట్టలు తక్కువగాను, వదులుగాను ధరించాలి.
8) పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువైన ఆసనాలు. నేల మీద కూర్చో లేని వాళ్లు కుర్చీ మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
9) నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా వుంచి ప్రాణాయామం చేయాలి.
10) ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఒక సారి కుడి ముక్కు రంధాన్ని మరో సారి ఎడమ ముక్కు రంధాన్ని మూయ వలసి వస్తుంది. కుడి ముక్కు రంధాన్ని కుడి చేతి బొటన ప్రేలితోను, ఎడమ ముక్కు రంధాన్ని కుడి చేతి ఉంగరం ప్రేలితోను మూయాలి.
11) ముక్కు రంధాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనే తి క్రియులు సక్రమంగా చేయూలి. అలా చేస్తే ప్రాణాయామం చేస్తున్నప్పడు శ్వాస సరిగా
ఆడుతుంది.
12) ప్రాణాయామ క్రియలు చేసూ వున్నప్పడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస ప్రక్రియలపై కేంద్రీకరించాలి. వేరే యోచనలకు తావుయీయ కూడదు.
IV. వివిధ ప్రాణాయామ విధానాలు:
పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి యొక్క శ్వాస ప్రశ్వాసలు అడుతూనే వుంటాయి. వీటిని మనస్సు గ్రహించగలగడమే ప్రాణాయామం అన్నమాట. యోగాభ్యాసం చేస్తున్నప్పడు శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం జరుగుతుంది.
అందువల్ల ప్రతి ఆసనం ప్రాణాయనామంతో పరిణతి సాధిస్తుంది. ప్రాణాయామాల్ని ప్రత్యేకించి 108 విధాలుగా విభజించారు. అయితే వాటిల్లో 8–10 ముఖ్యమైనవి.
1) నాడీ శోధన ప్రాణాయామం,
2) భస్త్రిక ప్రాణాయామం,
3) భ్రామరి ప్రాణాయామం,
4) శీతలీ ప్రాణాయామం,
5) శీతకారి ప్రాణాయామం,
6) సూర్యభేది ప్రాణాయామం,
7) చంద్రభేది ప్రాణాయామం,
8) ఉజ్జయీ ప్రాణాయామం,
9) మూర్చప్రాణాయామం,
10) ప్లావని ప్రాణాయామం,
11) కపాలభాతి ప్రాణాయామం.
1. నాడీశోధన ప్రాణాయామం:
దీన్ని సరళ ప్రాణాయామం లేక అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు.
విధానం :
నిటారుగా కూర్చొని, కండు మూసుకొని, రెండు కనుబొమల మధ్య గల భృకుటి మీద కొద్దిసేపు దృష్టి సారించాలి. ఆ తరువాత కుడి చేతి బోటన ప్రేలితో కుడి ముక్కు రంధాన్ని మూసి, ఎడమ ముక్కు రంధాన్నుంచి, మొదట లోపలి గాలిని మెల్లగా బయటికి వదలాలి. తరువాత ఎడమ రంధ్రం నుంచి గాలిని లోనికి పీల్చాలి. లోపల గాలి నిండిన తరువాత ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉంగరం ప్రేలితోమూసి కుడి ముక్కు రంధాన్నుంచి నెమ్మదిగా వదలాలి. తిరిగి కుడి ముక్కు రంధాన్నుంచి గాలిని పీల్చాలి. దీనితో ప్రాణాయామ క్రమం ఒకటి పూర్తి అవుతుంది. మొదట మూడు క్రమాలు, తరువాత వీలును బట్టి ఎన్ని క్రమాలైనా చేయవచ్చు.
ప్రారంభంలో రేచకం, తరువాత పూరకం చేయాలి. కొద్ది రోజులు అభ్యాసం అయిన తరువాత అంతర్ కుంభకం చేయాలి. అది అభ్యాసం అయిన కొద్ది రోజుల తరువాత బాహ్య కుంభకం కూడా చేయాలి. కొద్ది రోజుల అభ్యాసం తరువాత వీటిని చేయు సమయం క్రింది విధంగా నిర్ణయించాలి.
1) రేచకం 10 సెకండు
2) బాహ్యకుంభకం 5 సెకండు
3) పూరకం 5 సెకండు
4) అంతర్ కుంభకం 20 సెకండు
అనగా 2/1/1/4 మాత్రల సమయ విధానమన్నమాట. బాగా ప్రాక్టీసు అయిన తరువాత రేచకం 64 సెకండు, బాహ్యకుంభకం 2 సెకండు, పూరకం 2 సెకండు, అంతర్ కుంభకం 128 సెకండ్ల సేపు చేయవచ్చు సెకండ్లు తెలిపే గడియారం ఎదురుగా పెట్టుకొని జాగ్రత్తగా యీ క్రియలు చేయాలి.
లాభాలు :
యీ ప్రాణాయామం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి తగుతాయి. టెన్షను వుండదు. మనస్సుకు శాంతి లభిస్తుంది. ముక్కు రంధ్రాలు, నరాలు శుభపడతాయి.
2. భస్త్రిక ప్రాణాయామం:
భస్త్రిక అంటే కొలిమి తిత్తి అని అర్ధం. కొలిమితిత్తి కొలిమికి గాలి అందజేస్తుంది. యీ క్రియ యందు ముక్కుతో పీల్చే గాలి కొలిమి తిత్తి గాలిలా ధ్వని చేస్తుంది.
విధానం :
ఇది నాలుగు రకాలు
(1) చంద్రాంగ భస్త్రిక,
(2) సూర్యాంగ భస్త్రిక,
(3) సుషుమ్న భస్త్రిక,
(4) చంద్రాంగ సూర్యాంగ భస్త్రిక.
a. చంద్రాంగ భస్త్రిక:
కూర్చొని లేక నిలబడి కూడా యీ క్రియ చేయవచ్చు. నడుము, వీపు, వెన్నెముక, మెడను నిటారుగా వుంచి కుడి ముక్కు రంధాన్ని కుడి చేతి బొటన ప్రేలుతో మూయాలి. ఎడమ ముక్కు రంధ్రాన్నుంచి ఫోర్సుగా గాలిని వదిలి వెంటనే గాలిని ఫోర్సుగా పీల్చాలి, వరుసగా 10 సార్లు గాని లేక సాధ్యమైనంత వరకు గాని యీ క్రియ చేసూ వుండాలి. కొలిమి తిత్తితో వూదినట్లు గాలి స్వరూపం ఉండాలి. రేచకంతో బాటు నాభిని లోనికి ముడవాలి. పూరకంతో బాటు నాభిని, పొట్టను ఉబ్చిసూ వుండాలి. ఈ క్రియను రక్తపు పోటు, ఉష్ణం వున్నవాళ్లు ఎక్కువగా చేయాలి. ఉబ్బసం వున్నవాళ్లు తక్కువగా చేయాలి.
b. సూర్యాంగ భస్త్రిక:
ఎడమ ముక్కు రంధాన్ని ఉంగరం ప్రేలితో మూసి కుడి ముక్కు రంధ్రంతో పై విధంగా ఫోర్చుతో చేయాలి. శరీరంలో శీతలం ఎక్కువగా వున్న వాళ్లు, శ్వాస బాధ వున్న వాళ్లు యీ క్రియ ఎక్కువగా చేయాలి. రక్తపుపోటు, ఉష్ణం వున్నవాళ్లు తక్కువగా చేయాలి.
c. సుషుమ్న భస్త్రిక:
కుడి ముక్కు రంధాన్ని కుడి బొటన ప్రేలితో మూసి ఫోర్సుతో ఎడమ ముక్కు రంథాన్నుంచి గాలిని వదలాలి. ఎడమ ముక్కు రంథాన్నుంచి ఫోర్సుగా గాలిని పీల్చి ఉంగరం ప్రేలితో ఎడమ ముక్కు రంధాన్ని మూసి కుడి ముక్కు రంధాన్నుంచి ఫోర్సుగా వదలాలి. వెంటనే కుడి రంథ్రాన్నుంచి పీల్చాలి. యీ విధంగా కుడి, ఎడమ ముక్కు రంధ్రాల ద్వారా గాలిని మాటిమాటికీ సాధ్యమైనంత సేపు వదులుతూ పీలుస్తూ ఉండాలి. పొట్టను త్వరత్వరగా వెనుకకు ముందుకూ కదుపుతూ ఉండాలి. నాడీ శోధన ప్రాణాయామం వలె ఇది త్వరగా జరిపే శ్వాస ప్రశ్వాసల ప్రక్రియ. దీనివల్ల పొట్ట యందలి పెద్ద చిన్న పేగులకు, లివరు, స్త్రీను, మూత్రపిండాలు, పేంక్రియాస్ గ్రంధులకు స్ఫూర్తి లభిస్తుంది.
d. చంద్రాంగ సూర్యాంగ భస్త్రిక:
రెండు ముక్కు రంధాల నుంచి గాలిని ఫోర్చుగా వదిలి తిరిగి పీలుసూ వదులుతూ వుండాలి. నాభిని లోనికి గుంజుతూ, ఉబ్బిస మెల్ల మొల్లగా గాలిపేగం పెంచాలి. కొలిమితిత్తి నుంచి వెలువడే విధంగా గాలిపేగం వుండాలి. శక్త్యానుసారం యీ క్రియను చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవాలి. పొట్ట యం
దు ఉష్ణం పెంచుటపై ధ్యానం నిలపాలి. ఆరోగ్యంగా వున్న వాళ్లు భస్త్రిక ప్రాణాయామం చేయాలి. గుండె జబ్బు, రక్తపువోటు, అల్సరు, కళ్లు త్రిప్పట వున్నవాళ్లు యీ క్రియ చేయకూడదు. యీ క్రియ చేయు వారు వెన్న పాలు, నెయ్యి వాడుతూ వుండాలి.
లాభాలు :
భస్త్రిక ప్రాణాయామం వల్ల కొవ్వు, స్థూలకాయం తగ్గుతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. శ్లేష్మం తగ్గి ఉష్ణం పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. ఆస్తమా” తగుతుంది. శారీరిక మానసిక శక్తి పెరిగి మెదడు చురుగా పని చేస్తుంది.
3. భ్రామరి ప్రాణాయామం:
భ్రమరం అంటే తుమ్మెద, తుమ్మెద ఝంకారంలా ధ్వని వచ్చే ప్రాణాయామం కనుక దీనికి (భామరి ప్రాణాయామం అని పేరు వచ్చింది.)
విధానం:
నిటారుగా కూర్చొని, రెండు చెవుల్లో రెండు బొటన వ్రేళ్లు పెట్టి వుంచాలి. మోచేతుల్ని భుజాలతో సమానంగా ఎత్తి పూరకం చేసి గాలిని కుంభకం చేయాలి. తరువాత లోపలి గాలిని తుమ్మెద రంకారంలా చేస్తూ నోరు మూసి వుంచి, ముక్కు రంధ్రాల ద్వారా రేచకం చేయాలి. నాలుకను సామాన్య స్థితిలోనే వుంచాలి. ప్రారంభంలో ఒక్క పర్యాయం చేసి, తరువాత ఇరవై సార్ల వరకు చేయవచ్చు. ఏకాంతంలో ప్రశాంతంగా కండ్లు మూసి యీ ప్రాణాయామ క్రియ చేయాలి.
లాభాలు :
ఈ ప్రాణాయామం వల్ల కంఠం తీయగా, కోమలంగా, లయబద్ధంగా వుంటుంది. గొంతుకు సంబంధించిన జబ్బులు రావు, వచ్చిన జబ్బులు నయమవుతాయి. మెదడు శుద్ధి అవుతుంది. టెన్షను తగుతుంది.
సూచన :
మనస్సును ధ్యానంలో లీనం చేసి, భ్రామరీ ప్రాణాయామ క్రియ కావించి, తరువాత మనస్సును సామాన్య స్థితికి తీసుకొని రావాలి.
శిశువు జన్మించగానే రోదిస్తాడు. అదే ప్రధమ భ్రామరీ క్రియ.
4. శీతలి ప్రాణాయామం:
విధానం :
నాలికను ముందుకు చాపి, గొట్టంలా మడిచి నెమ్మదిగా ధ్వని చేస్తూ, నోటి ద్వారా గాలిని లోనికి పీల్చి, గాలిని ముక్కు రంధాల నుంచి రేచకం చేయాలి. నాలికను అంగిడికి అంటించి ధ్వని చేస్తూ నాలిక మధ్య నుంచి గాలి పీల్చి నోరు మూయాలి. తిరిగి ముక్కునుంచి వదిలివేయాలి. మొదట మూడు సార్లు, తరువాత పదిహేను సార్లు చేయవచ్చు. వేసవి కాలంలో చేయాలి. చలికాలంలో ఎక్కువగా చేయకూడదు. దాహంవేస్తే, త్రాగుటకు మంచి నీళ్లు దొరక్కపోతే యీ ప్రాణాయామ క్రియ చేస్తే నీరు లేకుండానే దాహం తీరుతుంది.
లాభాలు :
రక్తపు పోటు వున్నవారికి ఎంతో ప్రయోజనకారి. నోరు, గొంతు, నోటిలో బొబ్బలు, టాన్సిళ్లు, చర్మరోగాలు, కండ్ల వేడి యీ ప్రాణాయామ క్రియ వల్ల తగుతాయి.
5. శీతకారి ప్రాణాయామం:
విధానం :
కూర్చొని రెండు పళ్ల వరసలు నొక్కి పట్టి, నాలుక కొసను పళ్ల లోపలి భాగానికి ఆనించి, నాలుక మిగతా భాగాన్ని నోటి లోపలి భాగానికి అన్చాలి. పెదవులు తెరచి వుంచి గాలిని పళ్ల మధ్య నుంచి లోనికి పీల్చాలి.
గాలిని లోనికి పీల్చిన తరువాత పెదవుల్ని మూసివేయాలి. పీల్చిన గాలిని కొద్దిసేపు లోపల ఆపి, తరువాత ముక్కు రంధాల నుంచి బయటికి వదిలి వేయాలి. ప్రారంభంలో మూడు సార్లు, తరువాత పదిహేను లేక ఇరవై సార్లు ప్రాణాయామ క్రియను చేయాలి.
సూచన :
యీ క్రియను చలికాలంలో చేయకూడదు. వేసవి కాలంలో చేయాలి. శ్లేష్మం ఎక్కువగా వున్న వాళ్లు యి” క్రియను చేయకూడదు.
లాభాలు :
శీతలి ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలన్నీయీ ప్రాణాయామం వల్ల కలుగుతాయి. నోరు పూర్తిగా చల్ల బడుతుంది.
6. సూర్య భేది ప్రాణాయామం:
విధానం :
కుడి ముక్కు రంధ్రాన్ని సూర్యనాడి లేక సూర్య స్వరం అని, ఎడమ ముక్కు రంథాన్ని చంద్ర నాడి లేక చంద్ర స్వరం అని పేర్కొన్నాము. యీ క్రియ యందు ప్రతి పర్యాయం సూర్యనాడి నుంచి అనగా కుడి ముక్కు రంధాన్నుంచి గట్టిగా నెమ్మదిగా గాలి పీల్చి చంద్రనాడి నుంచి అనగా ఎడమ ముక్కు రంధ్రాన్నుంచి వదలాలి. ప్రారంభంలో రెండు సార్లు తరువాత పది పదిహేను సార్లు చేయవచ్చు. ఉష్ణం పెంచుతుంది గనుక యీ క్రియను వేసవి కాలంలో చేయకూడదు.
లాభాలు :
దీని వల్ల కఫం, దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. శరీరబలం పెరుగుతుంది.
సూచన :
ఉష్ణం ఎక్కువగా వున్నవాళ్లు, హెచ్చు రక్తపుపోటు వున్న వాళ్లు జాగ్రత్తగా కొద్దిసేపు చేయాలి.
7. చంద్ర భేది ప్రాణాయామం:
విధానం :
యీ క్రియ యందు ప్రతి పర్యాయం చంద్రనాడి నుంచి అనగా ఎడమ ముక్కు రంధాన్నుంచి గాలి గట్టిగా నెమ్మదిగా పీల్చి, సూర్యనాడి నుంచి అనగా కుడి ముక్కు రం(ధాన్నుంచి వదలాలి. దీన్నివేసవి కాలంలో చేయాలి.
లాభాలు :
దీని వల్ల శరీరానికి చల్లదనం వస్తుంది. పెట్టాబ్లడ్ (పెషరు, కోపం తగ్గుతాయి.
సూచన
ఆస్తమా రోగులు యీ ప్రాణాయామం చేయకూడదు.
8. ఉజ్జాయి ప్రాణాయామం :
విధానం :
ఈ ప్రాణాయామం చేయునప్పుడు గొంతు నుంచి పెద్దగా ధ్వని రావాలి. పూరకం చేసి కుంభకం చేయాలి, పూరకం, రేచకం రెండూ, నాసికా రంధాల రెండిటి ద్వారా చేయాలి. యిందు గొంతును కొంచెం ముడిచి, నాలుకను మడిచి నోటి లోపలి అంగిడికి అంటించి, ముక్కు రంధాలనుంచి గాలిని లోనికి పీల్చాలి. తరువాత అదే విధంగా లోపలి గాలిని చేస్తూ ముక్కు రంధ్రాల ద్వారా బయటికి వదలాలి.
లాభాలు :
ఉజ్జయీ ప్రాణాయామం వల్ల కంఠం, ఊపిరితిత్తులు, గుండెపై మంచి ప్రభావం పడుతుంది. ముక్కు- చెవి, గొంతుకు సంబంధించిన జబ్బులు దగు, ఆస్తమా, బ్లడ్ ప్రషర్, తగ్గుతాయి
.
9. మూర్చ ప్రాణాయామం :
విధానం :
రెండు ముక్కు రంధాల నుంచి గాలిని లోనికి పీల్చి చుబుకాన్ని ఛాతీకి ఆనించి అంటే జాలంధర బంధం చేసి సాధ్యమైనంత సేపు గాలిని లోపల ఆపాలి. తల తిరిగినట్లు అనిపిస్తుంది. అప్పడు మెల్లగా గాలిని ముక్కు రంధాల నుంచి వదలాలి. ఇది కొంచెం కఠినమైన క్రియ. మొదట జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో ఈ క్రియ చేయడం మంచిది.
లాభాలు :
దీని వల్ల మెదడుకు శాంతి లభించి చురుకుదనం లభిస్తుంది.
సూచన :
పిచ్చి వున్నవాళ్లు యీ క్రియ చేయకూడదు.
10. ప్లావనీ ప్రాణాయామం :
విధానం
నిటారుగా కూర్చొని నోటితో శ్వాసను ఒక్కొక్క గుక్కగా లోపలికి పీల్చాలి. పొట్టను ఉబ్చిస్తూ వుండాలి. ఆ గాలిని లోపల ఆపి కొద్దిసేపు కుంభకం చేయాలి. తరువాత వంగి నాలుకను బయటకు పెట్టి గాలిని నెమ్మదిగా పూర్తిగా వదిలి పేయాలి. మొదట ఒకటి రెండు సార్లు చేయాలి.
లాభాలు
యీ క్రియవల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. పని చేయుటకు ఉత్సాహం పెరుగుతుంది. మెదడుకు సంబంధించిన వ్యాధులకు యిది పని చేస్తుంది. బాగా అభ్యాసం చేసిన తరువాత యీ ప్రాణాయామం చేస్తూ నీళ్లపై నావవలె తేలుతూ ఉండవచ్చు.
9. కపాలభాతి ప్రాణాయామం:
దీనికి కపాల శుద్ధి అని అర్థం. యీ క్రియ వల్ల మెదడు చురుగ్గా వుంటుంది. జ్ఞానం పెరుగుతుంది. నాభి వరకు గాలిని లోపలికి బాగా పీల్చాలి. తరువాత ఆ గాలిని ఫోర్సుగా బయటికి వదలాలి. బయటికి వదిలివేసే గాలికి వత్తిడితో కూడిన గట్టి ఫోర్సు వస్తుందన్నమాట. శక్తిని బట్టి మూడు నాలుగు నిమిషాలు వరకు యీ క్రియను చేయవచ్చు. శ్వాస సహజంగా లోనికి వస్తుంది. యీ క్రియ చేయునప్పుడు ముక్కు ద్వారా ధ్వని రావాలి.
వీలును, సమయాన్ని అవసరాన్ని బట్టి పైన తెలిపిన వివిధ ప్రాణాయామ క్రియలు ప్రశాంత హృదయంతో చేసి సాధకులు లాభం పొందాలి.
ఔత్సహికుల అవగాహన కోసం కొన్ని ప్రాణాయామ పద్ధతులు అవగాహన కోసము ఇచ్చాము. వీటిని నిష్ణాతుడైన ఆచార్యుని వద్ద నేర్చుకొని practice చేయుట ఉత్తమము. శుభం భూయాత్.

No comments:
Post a Comment