Monday, January 20, 2020

different types of food

భగవద్గీత నుండి సంగ్రహించిన సూత్రం
ఆయు:సత్త్వ బలారోగ్య సుఖప్రీతివివర్ధనా:
రస్య: స్నిగ్ధ: స్థిరా హృద్యా ఆహారా: సాత్వికప్రియ:
ఆధారంగా మనం నిత్యం తీసుకోవలసిన ఆహారం యొక్క గుణగణాలును శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు.

ఆయువు, బుద్ది,బలము,ఆరోగ్యం, సుఖము,ప్రీతి,మొదలైన వాటిని అభివృద్ధి పరిచినవి ఇంకా పాలు,చక్కెర మొదలైన రస పదార్దాలు, వెన్న, నెయ్యి నూనె వంటి స్నిగ్ధ పదార్థాలు, ఓజస్సు పరుచు స్థిర పదార్థాలు, సాత్విక స్వభావం పెంచు హృద్య పదార్థాలను సాత్వికులకు ఇష్టమైనవి.
ఇక్కడ ఆహార: అంటే బక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములు
భక్ష్య:- దంతములతో నమిలి తినే అన్నము వంటివి
భోజ్య:- పాలు, పెరుగు, మొదలగు ద్రవపదార్ధములు
లేహ్య:- నాలుకతో నాకే తేనె, పచ్చడి లాంటివి
చోహ్య:- పండ్లు,చెరుకు మొదలగు పీల్చు పదార్థాలు

No comments:

Post a Comment