విజ్ఞానము - వేదాంతము
(దేహో దేవాలయ ప్రోక్తః)
గ్రంథులు - చక్రాలు 4 :
ఆధునిక విజ్ఞానం నేడు వేటినైతే ఊహలు అనుకుంటుందో, యోగులు అక్కడి నుంచే మొదలు పెడతారు. సిద్ధాంతాన్ని గుప్తంగా ఇలా చెప్పవచ్చు.
1. శక్తి తప్ప మరి ఇంకేది లేదు. ఇది అన్ని పదార్థాలలోనూ వ్యాపించి సర్వత్రా ఉండి అన్ని రూపాలకి చేతనత్వాన్ని కలిగిస్తుంది. దీనిని modern science చెబుతున్న "ఈథర్" తో పోల్చవచ్చు. పదార్ధము శక్తి యొక్క లేదా ఆత్మ యొక్క స్థూల స్వరూపము. శక్తి లేక ఆత్మ పదార్థం యొక్క రూపాంతరం చెందిన స్థితి.
2. ఈ ఈథర్ అన్ని ఆకృతుల లోనికి చొచ్చుకొని పోయి ఉంటుంది .కనుక ప్రతి రూపానికి ఒక ఈథరిక్ శరీరం ఉంటుంది.
3. ఏ విధంగా పరమాణువులో ధనాత్మక , ఋణాత్మక కేంద్రాలు ఉంటాయో... అలాగే ప్రతి ఈథరిక్ శరీరంలో ఋణాత్మక పదార్ధానికి మధ్య ధనాత్మక శక్తి కేంద్రాలు ఉంటాయి. మనిషి కూడా ఒక ఈథరిక్ శరీరం ఉంటుంది. ఇది అతని యొక్క ఋణాత్మక భౌతిక శరీరానికి ధనాత్మకంగా ఉంటుంది. ఈ ధనాత్మక మైన ఏ ఈథరిక్ శరీరమే శరీరాన్ని సక్రియ గా ఉంచుతుంది. అంతేకాక, దానిని ఒక పరిపూర్ణమైన సువ్యవస్థ గల శరీరంగా ఉంచగలుగుతుంది. దీనినే యోగులు "ప్రాణమయ శరీరము" అన్నారు.
4. మనిషి యొక్క ఈథరిక్ శరీరము లేదా ప్రాణమయకోశం లేక భౌతిక శరీరానికి ధనాత్మకంగా ఉన్న శరీరము 7 ముఖ్యమైన శక్తి కేంద్రాల ద్వారా విభిన్న రకములైన శక్తులు ప్రవహింపజేస్తూ అతని యొక్క చేతనత్వమును క్రియాన్వితము చేస్తుంది.
ఈ కేంద్రాలు సెరిబ్రోస్పైనల్ (cerebro spinal)వ్యవస్థకు సంబంధించి ఉంటాయి. ఈ చేతనత్వ సక్రియత లేక భౌతిక మరియు మానసిక సక్రియతకు ఆధారం...మస్తిష్కములో స్థితమై ఉన్నది. ఇది మానవ శరీరము యొక్క క్రియాకలాపాలను నియంత్రించి,వ్యవస్థీకృతం చేస్తుంది. కనుక నియంత్రణా శక్తి శిరస్సులో ఉంది. శిరస్సులో ఉన్న ఈ కేంద్రము నుండే మొత్తం పరికరము (mechanism లేదా శరీరము) నియంత్రించబడాలి. (పీనియల్ గ్రంథి- మిగతా ఆరు చక్రాలకు ధనాత్మకం)
5. ఈనాడు కొన్ని కేంద్రాలే మనిషిలో సక్రియంగా ఉన్నాయి. మిగిలినవి నిష్క్రియ గా ఉన్నాయి .ఒక పరిపూర్ణమైన వ్యక్తిలో అన్ని కేంద్రాలూ పూర్తిగా పనిచేస్తూ... పరిపూర్ణమైన మానసిక వికాసానికి దోహదం చేసే పరిపూర్ణ శరీరం గా రూపొందుతుంది.

No comments:
Post a Comment