మన భారతీయ పురాణం అయినటువంటి రామాయణంలో సంతానం లేని దశరధ మహారాజు సంతానం లేకపోవటం వలన సద్గతులు ఉండవని , రాజ్యపాలన కొరకు పుత్రసంతానం ఉండవలెను అని "పుత్రకామేష్టి " యాగం చేసి సంతానం పొందినట్లు ఉన్నది. అది పురాణకాలం ఋషులు , తపోసంపన్నులు వారు నిర్వర్తించే యజ్ఞప్రక్రియలో అటువంటి శక్తి ఉండేది.
మానవ జీవితం సాహసోపేతమైన యాత్రను దృష్టిలో ఉంచుకుని కొన్ని సంస్కారములను రూపొందించి ఉన్నారు . మానవ జీవితం సంపూర్ణముగా ఫలవంతం అగుటకు వాటిని తప్పక ఆచరించవలెను. మహాభారతములో మనం పాండవ వంశానుక్రమము గురించి చదువుకొన్నాము . కుంతీదేవి రహస్య సంతానం దేవతల వరానుగ్రహము వలన కన్య రాకుమారి ప్రతిభావంతులు ఐన ప్రసవించగలిగినది. వారే యమ , ఇంద్ర, సూర్య , అశ్వని దేవతలు .
జెనెటిక్ ఇంజనీరింగ్ కు మరొక అద్భుత ఉదాహరణ భాగవత పురాణములో ఒకరి పిండాన్ని మరొక స్త్రీ గర్భములో మార్చడం జరిగింది. ఈ ప్రక్రియ లోకోత్తర బిషగర్వుడు యోగరాజు శ్రీకృష్ణ భగవానుల మార్గదర్శకత్వములో యోగమాయ , దేవకీ గర్బము నుండి పిండమును తీసుకొనిపోయి రోహిణి గర్బము నందు ప్రవేశపెట్టినది. ఆ మాయ ఒక గొప్ప మహిళా శస్త్రచికిత్సా నిపుణురాలు . మహాభారతములో మరొక జెనెటిక్ ఇంజనీరింగ్ కేసు మనకి గోచరిస్తుంది. ద్రోణాచార్యుల వారి వీరపుత్రుడు అశ్వత్థమ, బ్రహ్మస్త్రం ప్రయోగించి తల్లిగర్భము నందు ఉన్న పరీక్షిత్ పిండమును చంపివేయుట ద్వారా పాండవ వంశాన్ని సమూలం తుడిచివేయవలెను అన్న తలంపుతో బ్రహ్మస్త్రమును ప్రయోగించెను. కాని శ్రీకృష్ణ భగవానుడు తన చక్రాయుధముతో ఆ పిండాన్ని కాపాడెను. ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే బ్రహ్మస్త్రం అణ్వాయుధం , అదేవిధముగా శ్రీకృష్ణ భగవానులవారి చక్రము కూడా ఒక రకమైన అణ్వాయుధమే అక్కడ అణుశక్తి న్యూట్రలైజ్ అయ్యి పిండం కాపాడబడినది. అదేవిధంగా మనము అనేక పురాణపురుషులు అగు కమలసంభవుడు , కుంభసంభవుడు , అంజనీపుత్రుడు , ద్రోణుడు మరియు మత్స్యగర్భుడు మున్నగు వారి వింతజననము గురించి మన పురాణాల ద్వారా తెలియచున్నది. ఒకప్పుడు ఇవి కవుల కల్పితగాధలుగా కొట్టివేయడం జరిగింది . ఇప్పుడు అదే మనమధ్య టెస్ట్ ట్యూబ్ బేబీగా మనం చూస్తున్నాం.
No comments:
Post a Comment