1. సైంధవ లవణం వేడి చెయ్యదు.
2. సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించడం వల్ల పైత్య సమస్యల నుండి బయటపడవచ్చు.
3. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది.
4. గొంతులో కఫం పేరుకుని ఊపిరాడనపుడు, కొద్దిగా సైంధవ లవణం, తేనె కలిపి చప్పరిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
5. సైంధవ లవణంలో సాత్విక గుణం అధికంగా వుంటుందని, మిగిలిన సముద్రపు ఉప్పు, నల్ల ఉప్పు వంటి లవణాలలో రజోగుణం ఉంటుందని ఆయుర్వేద వైద్యకోవిదులు చెప్తారు. దాని ఫలితం ఏవిటంటే గోటితో పోయేదానికి గొడ్డలి దాకాపోయే లక్షణాన్ని మనలో పెంచుతుందీ అని. అంటే కొట్లాటలకు దెబ్బలాటలకు దూకాలనిపించడం జరుగుతుంది.
6. కనుక జీవితంలో సమశ్యలను అలోచనతో పరిష్కరించాలనుకునే వారు,
ధ్యాన సాధన చేసేవాళ్ళు చెయ్యాలనుకునే వాళ్ళు, సైంధవ లవణం వాడడం మంచిది.
7. దీనిలో ఇనుప ధాతువులు వుండడం చేత, రక్త హీనతతో బాధపడే వాళ్ళు రక్తం పెరుగుతుంది.
8. ఇది అన్ని రకాల శరీర తత్వాలకు అనుకూలమైనది మాత్రమే కాక నిర్జలీయతను సైతం తగ్గిస్తుంది.
9. .జీర్ణానికి మంచిది: రాళ్ళ ఉప్పులో ఉండే కాల్షియం,మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు ఆరోగ్యానికి మంచిది. లాలాజలం, జీర్ణరసాల సమన్వయంలో ఇది తోడ్పడుతుంది.
10. దీనికున్న లక్షణంతో కడుపులో గ్యాస్ రాకుండా చేస్తుంది. యాంటాసిడ్ కూడా ఉన్నది
11. ఆయుర్వేదంలో ఈ సైంధవ లవణాన్ని సోంఫు, కొత్తిమీర పొడి మరియు జీలకర్రతో కలిపి తీసుకుంటే అజీర్ణం తగ్గుతుంది.
12. .ఆకలిని పెంచుతుంది: ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు మిరియాలు, అల్లం, పొడుగు మిరియాలు, ఏలకులతో కలిపి వాడితే ఆకలిని పెంచుతుంది.
13. బరువు తగ్గటం: ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు కొవ్వుని కరిగిస్తుంది. ఇందులో ఉండే ఖనిజ లవణాలు తీపిపై మక్కువను ఇన్సులిన్ ను తిరిగి జీవితం చేయటంతో తగ్గించటమే కాక, కొవ్వు కణాలను కూడా తొలగిస్తాయి
14. రక్తం కారే చిగుళ్ళకు చికిత్స: రాళ్ళ ఉప్పును ప్రాచీనకాలంలో పళ్ళను తెల్లగా చేయడానికి, నోటి దుర్వాసనకి పరిష్కారంగా వాడేవారు. త్రిఫల, వేప పౌడర్లతో కలిపి దీన్ని వాడితే చిగుళ్ల సమస్యలు నివారించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇదే రాళ్ళ ఉప్పు యొక్క అత్యుత్తమ లాభం.
ఈ సైంధవ లవణం(ఉప్పు) గనులు అత్యధికంగా హిమాలయాల్లో ఉన్నాయి.
No comments:
Post a Comment