-
* ప్రతినిత్యం రెండు అమృతపాణి అరటిపండ్లు తినుచున్న మంచి దేహపుష్టి , బలము కలుగును.
* ఉదయము మరియు మధ్యాహ్న సమయములో మినుములతో చేసిన గారెలు రెండు నుంచి నాలుగు తినుచున్న మంచి దేహపుష్టి కలుగును.
* ఆవునెయ్యిలో మినుములు వేయించి దానిని పిండిచేసి దానిలో బెల్లం మరియు నెయ్యి కలిపి పూటకు రెండు చెంచాల చొప్పున తీసుకొనుచున్న దేహబలం కలుగును.
* బూరుగ జిగురును చింతగింజ అంత మోతాదులో ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగుచున్న శరీరానికి మంచిబలం కలుగును.
* ఒక కప్పు వేడినీటిలో తేనె కలిపి సేవించుచున్న మంచి దేహపుష్టి కలుగును.
* పెద్ద పల్లేరు కాయలను ఆవుపాలలో ఉడికించి ఆ తరువాత చూర్ణం చేసి పంచదారలో కలిపి పూటకు పదిగ్రాముల చొప్పున సేవించుచున్న మంచి దేహపుష్టి కలుగును.
* నేలగుమ్మడి చూర్ణమును ఒక స్పూన్ పాలతో కలిపి సేవించుచున్న మంచిదేహపుష్టి కలుగును.
దేహపుష్టి కొరకు కొన్ని పదార్దాలు కూడా నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోండి .అవి ఏమిటో మీకు వివరిస్తాను.
అల్లము , ఉత్తరేణి చెట్టు బియ్యం , ఉశిరికాయ , కొబ్బరి కురిడి , కొబ్బరిపాలు , చేపనూనె , జీడిపండు , జీడిమామిడి , పటికపంచదార , తియ్యటి దానిమ్మ , బాదంపప్పు , ఆవుపాలు , కర్పూర శిలాజిత్ , కుందేలు మాంసం , కర్బుజాపండు , తాటికల్లు , నీరుల్లిపాయ , పచ్చకర్పూరం , బూడిద గుమ్మడికాయ , శనగలు , మెంతికూర , వెన్న .
దేహాన్ని పుష్టిగా ఉంచుకోవాలి అనుకునేవారు శరీరం నందు వేడిపెరగకుండా చూసుకోవాలి వీలైనంత వరకు శరీరానికి వేడిచేయు పదార్దాలను భుజించకపోవడం మంచిది .
No comments:
Post a Comment